చందమామను చూడమంటే..


Tue,July 29, 2014 05:08 PM


మూడు రోజుల క్రితం ఒక అధికారి కలిసి చానెళ్ల పంచాయతీని పరిష్కరిస్తే మంచిదేమో అన్నారు. నిజమే...ఇంకా సాగదీయడం అనవసరం అనిపించింది. ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా అపవాదు వచ్చేది ప్రభుత్వానికే. ప్రభుత్వమే చొరవతీసుకుని ఒకసారి ఆపరేటర్లను పిలిచి చెబితే పరిష్కారమవుతుందనిపించింది.

వాస్తవానికి ఆ చానెళ్ల ప్రసారాలు తిరిగి ప్రారంభించాలని తెలంగాణ సమాజం నుంచి డిమాండేమీ లేదు. పైగా పీడాపోయిందని సంతోషించే వాళ్లే ఎక్కువగా తారసపడుతున్నారు. ఎంఎస్‌ఓల ఆగ్రహం సమంజసమేనని వాదిస్తున్నవాళ్లు కూడా ఎక్కువే. కానీ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ, ప్రసార స్వేచ్ఛను ఎంతయినా అంగీకరించి తీరాలి. ఆ చానెళ్లు ప్రదర్శించే వంకరబుద్ధులను ప్రజలు సహించడం లేదు. తెలంగాణ సమాజానికి ఆ చైతన్యం వచ్చింది.

తెలంగా ణ ఉద్యమానికి వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర కోసం ఆ చానెళ్లు వేసిన వెర్రి మొర్రి వేషాలన్నీ ప్రజలకు తెలుసు. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోయా యి. కేసీఆర్ జైత్రయాత్రను నిలువరించలేకపోయాయి. రేపయినా అదే జరుగుతుంది. శుక్రవారం నాడు సత్తుపల్లి నుంచి ఒక తెలంగాణవాది ఫోను చేశారు. సార్. అక్కడ నిలిచిపోయిన చానెల్ ఒకటి ఇక్కడ వస్తున్నది. కేసీఆర్‌ను తుగ్లక్ అని చంద్రబాబు విమర్శించడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని ప్రశ్న వేశారు.

ఆ ప్రశ్నకు సమాధానంగా 54 శాతం మంది సబబే అని సమాధానం ఇచ్చారట. 44 శాతం మంది కాదు అని సమాధానం ఇచ్చారట. అలాగని ఆ టీవీలో వస్తోంది. టీవీ పగలగొట్టబుద్ధవుతోంది అని ఆవేశంగా చెప్పారు. ఆ చానెల్ చూడడం ఎందుకు? ఆరోగ్యం పాడుచేసుకోవడం ఎందుకు? వేరే చానెల్ పెట్టుకోండి అని సమాధానపర్చాల్సి వచ్చింది. సాయంత్రం మరో మిత్రుడు బుల్లెట్ న్యూస్‌కు సంబంధించిన మరో విడియో క్లిప్ పట్టుకొచ్చాడు. అది జూన్ ఆరున ప్రసారం అయిందట.

అప్పటికి ప్రభుత్వం ఏర్పడి నాలుగవ రోజు. వివాదం చెలరేగింది జూన్ 10న ప్రసారం అయిన బుల్లెట్ న్యూస్‌పైన. ఎందుకోగానీ జూన్ ఆరు క్లిప్ ఎవరూ పెద్దగా గమనించినట్టు లేరు. అది చూస్తే రక్తం సలసల కాగిపోయింది. న్యూస్ రూములను ఇంత కుంచిత, రోగగ్రస్థ, అథమ స్వభావం ఉన్న మనుషులు ఆక్రమించేశారా అనిపించింది. కనీస అవగాహన, పరిమితులు, విలువలు తెలియని మనుషులు ఎడిటర్లయ్యారా అనిపిస్తుంది. నిజానికి యజమానిగా ఉన్నవాళ్లను ఈ తప్పులన్నింటికీ బాధ్యులుగా భావిస్తుంటారు. కానీ వారు ఇవన్నీ చూసే అవకాశం ఎంతమాత్రం లేదు.

ఇవన్నీ రవిప్రకాశ్‌కు తెలిసి జరిగే అవకాశం లేదు. కానీ బాధ్యత ఆయనపైనే పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వాస్తవికతను జీర్ణించుకోలేని అహంకారపూరిత సంకుచిత మానవులు ఇంకా పాత బుద్ధులనే ప్రదర్శిస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ప్రజాస్వామిక వాదనకు అవకాశం లేకుండా చేస్తున్నారు. పత్రికాస్వేచ్ఛకోసం మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రజలు తిరస్కరించి, బహిష్కరించి, చీత్కరించిన శక్తుల పక్షాన నిలబడి వారు వికృత వ్యాఖ్యావిన్యాసాలు చేస్తున్నారు.

తెలంగాణ సమాజంలో వెల్లువెత్తిన ఆనందాన్ని పంచుకోవడానికి బదులు ఇక్కడ ఇంకా విషపు విత్తనాలను నాటడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం జరిగిన రోజు తెలంగాణ సమాజం అంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఐదున్నరగంటలపాటు ఓపికగా చర్చించి, అంతే ఓపికగా 69 నిమిషాలపాటు పాత్రికేయులకు వివరించారు.

మంత్రివర్గంలో కూడా ప్రతి అంశంపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారని సమాచారం. అధికారుల అభిప్రాయాలు కూడా విన్నారట. అందుకే సమావేశం అన్ని గంటలపాటు జరిగింది. అంత ఆలస్యమయినా రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఏక బిగిన 43 అంశాలపై నిర్ణయాలు ప్రకటించారు. ఆయన బలహీనుడని, పరిపాలించలేడని ఊదరగొట్టిన సీమాంధ్ర మీడియా, ఆధిపత్య శక్తులు చేసిన ప్రచారంలో కొట్టుకుపోయిన వారికి ఆయన ఎనర్జీ ఆశ్చర్యపరిచింది.

ఏ మాత్రం తొట్రుపడకుండా, తడుముకోకుండా, సాధికారికంగా ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం పండుగ చేసుకుంది. కనీసం ఇంటికొక్కరికి మేలు జరిగే నిర్ణయాలు ఉన్నాయి. ప్రత్యర్థులతో సైతం ఔరా అనిపించే విధంగా ఆయన సంచలనాత్మకంగా నిర్ణయాలు ప్రకటించారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్టు, అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునే కార్యాచరణను ప్రకటించారు.

ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేసేందుకు నిర్ణయించారు. ఉద్యోగులకు ఇస్తానన్న ఇంక్రిమెంటు ప్రకటించారు. తండాలను పంచాయతీలుగా మార్చారు... ఎన్నికల ప్రణాళికను కేబినెట్ ఎజెండాగా పెట్టి, పరిష్కరించిన తొలి ప్రభుత్వం ఇదే కావచ్చు. తెలంగాణ ముద్రకోసం, తెలంగాణ ఆత్మను ప్రతిష్టించడంకోసం ఆయన ప్రయత్నించారు. పాత చిహ్నాల స్థానంలో కొత్త చిహ్నాలను ఆవిష్కరించే నిర్ణయాలు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంగా, పశువైద్య విశ్వవిద్యాలయం పీవీ నరసింహారావు విశ్వవిద్యాలయంగా మారనుండడం తెలంగాణలో సీమాంధ్ర ప్రతీకలను తొలగించే దిశగా పడిన తొలి అడుగులు.

తెలంగాణ చరిత్ర, సంస్కృ తి, సాహితీ వైభవాలను గుర్తుకుతెచ్చే తెలంగాణ వైతాళికుల పేర్లు, విగ్రహాలు తెలంగాణ అంతటా కనిపించాలి. కేసీఆర్ నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమయింది. తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలూ బాహాటంగానే కేబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశాయి.

ఒక్క చంద్రబాబుకు, ఆయన తాబేదార్లకు మాత్రం ఎప్పటిలాగే కేసీఆర్ తుగ్లక్‌లాగా కనిపించాడు. ఎందుకు కనిపిస్తున్నాడంటే రెండు అంశాలు ఆయనకు కంటగింపుగా ఉన్నాయి. మొదటిది ఫీజు రీయింబర్సుమెంటు. రెండవది హైదరాబాద్ లో భూ ఆక్రమణలపై, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం కూడా చంద్రబాబుతోపాటే రాగాలు తీస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్‌లో భూఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు పితామహుడు చంద్రబాబే.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య,కిరణ్‌కుమార్‌రెడ్డి దానిని పతాకస్థాయికి తీసుకెళ్లారు.

భూములు ఆక్రమించడం, వాటిని క్రమబద్ధీకరించడం, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం వాటిని క్రమబద్ధీకరించడం గత రెండు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తూ వచ్చారు. గృహనిర్మాణ క్రమశిక్షణను నాశనం చేసిన మహానుభావులు వీళ్లు. ఇష్టం వచ్చినట్టు కట్టుకుని తర్వాత రెగ్యులరైజ్ చేయించుకోవచ్చుననే మనస్తత్వాన్ని పెంచి పోషించింది వీళ్లే. ఈ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల పర్యవసానమే ఇవ్వాళ హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారడానికి, చినుకుపడితే స్తంభించిపోవడానికి కారణం. భూమి రికార్డులు మాయమవుతాయి.

కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. అసలు మండల రెవెన్యూ కార్యాలయాలు అదేపనిగా తగులపడడం, ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడంలోని మతలబు ఏమిటి? ముఖ్యంగా షేక్‌పేట, బాలానగర్ మండల కార్యాలయాలు ఎన్నిసార్లు తగులబడ్డాయి? ఎందుకు తగులబడ్డాయి? ఎప్పుడయినా శోధించారా? సీమాం ధ్ర నాయకత్వం హైదరాబాద్‌ను కొల్లగొట్టే విషయంలో ఔరంగజేబుల్లా వ్యవహరించారు. ఇప్పుడు కేసీఆర్ వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. నగరపాలనలో ఒక క్రమశిక్షణను పాదుకొల్పేందుకు కృషిచేస్తున్నారు.

ఇక ఫీజు రీయింబర్సుమెంటు విషయం. మొన్నీ మధ్య ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ఓ ప్రముఖ వైద్యుడు కలిశారు. ఆయన చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత ఏ ఏ ప్రైవేటు ఆస్పత్రికి ప్రభు త్వం ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో ఆయన వివరించారు. అందులో పదిశాతం డబ్బులిస్తే మేము అంతకంటే గొప్ప సేవలు అందించేవాళ్లం అన్నారు. మేము ఒక ఎక్స్‌రే మెషిన్ కొనాలంటే కూడా అదేదో కార్పొరేషన్ అనుమతినివ్వాలి.

వారికి లంచాలివ్వాలి. కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన సొమ్ముతోనే తలా ఒక వైద్య కళాశాలను ప్రారంభించాయని కూడా ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీని తెచ్చి ప్రభుత్వాసుపత్రులను నిర్లక్ష్యం చేశారు. అక్కడ ఫినాయిల్ కొనాలంటే కూడా లక్ష రూల్స్. ఫీజురీయింబర్సుమెంటుకు దీనికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఫీజు రీయింబర్సుమెంటు నిధులతోనే ఇవ్వాళ ఒక్క ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల పది ఇంజనీరింగ్ కళాశాలలయ్యాయి.

మనం విద్యార్థులకు ఇస్తున్నాం అనుకుంటున్నాం. కానీ చేరుతున్నది ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల బొక్కసాల్లోకి. ఒక లెక్కా పత్రం లేదు. ఎవరు అర్హులో ఎవరు అనర్హులో లేదు. గుండుగుత్తగా సంవత్సరానికి ఇంతమందికి ఇన్ని వేల కోట్లు? విచ్చలవిడిగా ఇంజనీరిం గ్ కళాశాలల ఏర్పాటే ఒక కుంభకోణం. ఫీజు రీయింబర్సుమెంటు మరో కుంభకోణం.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ విధానా న్ని సమీక్షించి తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్) పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ సీమాంధ్ర నాయకత్వానికి ఏజెంటుగిరీ చేస్తున్న నాయకులు ఇందులో రంధ్రాన్వేణ చేస్తున్నారు. బీసీలకే దో అన్యాయం జరిగిపోతుందని ఒక నాయకుడు వాపోయారు.

తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలవల్ల అత్యధికంగా ప్రయోజనాలు పొందేది బీసీ సామాజిక వర్గమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ఆర్థిక మంత్రి అయ్యారు. ఒక బీసీ స్పీకర్ అయ్యారు. మరో బీసీ మండలి చైర్మన్ అయ్యారు. మరో ఇద్దరు బీసీలు కీలక మంత్రి పదవుల్లో ఉన్నారు. మచ్చలను మాత్రమే చూడదల్చుకున్నవారికి చందమామ అందం కనిపించదు. అటువంటి వారు తెలంగాణకు భారం.


1201

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా