చెప్పుకోండి చూద్దాం!


Fri,October 21, 2011 11:58 PM

babu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఆయన మహామాటకారి
కానీ ఆ మాటలన్నీ చంద్రబాబువి!
ఆయన కత్తిలాంటివాడు
కానీ ఆయన ఎప్పుడూ
చంద్రబాబు చేతిలో ఉంటాడు!
వంచనకొక వంచనకొక వంచకుడాయన!
చెంచాకొక చెంచాకొక చెంచా ఆయన!
అబద్ధానికి ప్రబల మిత్రుడు
నిబద్ధతకు బద్ధ శత్రువు!
మోకాలును బోడిగుండును ముడివేయాలని తాపత్రయం
నమస్తే తెలంగాణను పోలవరంలో కలిపేయాలని కుతంత్రం!
ఆయన ఏడుపు పోలవరం కదిలిందని కాదు
పసుపుచొక్కాలకు ఆ కాంట్రాక్టు దక్కలేదని!
ఆయన అసలు లక్ష్యం పోలవరం కాదు
తెలంగాణ ఉద్యమాన్ని బద్నాం చేయడం!
ఆయన ఆరాటం పోలవరం ఆపాలని కాదు
ఉరుకుతున్న ఉద్యమ శ్రేణులను గందరగోళపర్చాలని!
ఫేసు లేక, డిఫెన్సు లేక అఫెన్సుకు దిగినవారెవరు!
ఉద్యమం ఛీకొడితే ఉక్రోషం వెళ్లగక్కుతున్నదెవరు?
ఎవరా శల్యుడు? ఎవరా సైంధవుడు?
చెప్పుకోండి చూద్దాం!

లేస్తే మనిషి కాదు
లేస్తే మనిషిని కాదని హూంకరిస్తుంటాడు
లేచాడు, బొక్కబోర్లాపడ్డాడు, పాతగూటికి చేరాడు!
‘సీమాంధ్రుల మోచేతి నీళ్లు
ఇంకెన్నాళ్లు తాగాలని’ పులిలా గర్జించాడు!
రెండేళ్లు తిరగకుండానే పిల్లిలా అదే
మోచేతి నీళ్లను వెదుక్కుంటూ వెళ్లాడు!
నవ తెలంగాణ నా హక్కన్నాడు
చివరకు నయ్ తెలంగాణ జట్టులో చేరిపోయాడు!
తెలంగాణను ఇంకెంతకాలం దోచుకుంటారని ప్రశ్నించాడు
వాటాదక్కితే చాలని దోచుకునేవారి సరసన చేరిపోయాడు!
దొరతనంపై గర్జిస్తుంటాడు
పెద్ద దొరలా ప్రవర్తిస్తుంటాడు!
తెలంగాణ సెంటిమెంటుపై
ఊరేగుదామని ఎగురుకుంటూ వచ్చాడు!
జనం ఛీపొమ్మంటే చీదరించుకుంటూ వెళ్ల్లిపోయాడు!
సర్వం కోల్పోయిన చోట వెదుక్కుంటున్నవారెవరు?
తమ్ముళ్లకు ద్వేషం నూరిపోసి దోషం దాచుకుంటున్నదెవరు?
చెప్పుకోండి చూద్దాం!

కంఠశోష ఆవేశం
manmohan-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅపార్థం చేసుకోవద్దని చెబుతూ
ఎవరికీ అర్థం కాకుండా
మాట్లాడేదెవరు?
మహానాయకుడు కావాలనుకుంటాడు
మామూలు నాయకునిగా కూడా స్పందించడు!
వత్తగూడని చోట వత్తివత్తి మాట్లాడతాడు!
వత్తిచెప్పాల్సిన చోట మెత్తబడిపోతాడు!
ఆవేశంగా మాట్లాడాలనుకుంటాడు
కంఠశోష తప్ప కదిలించే మాట ఒక్కటీ ఉండదు!
భాషను అష్టవంకరలూ తిప్పి తిప్పి
అరివీర భయంకరంగా వేధించునదెవరు?
త్యాగాలను గురించి ఎక్కువగా మాట్లాడి
స్వార్థం చుట్టూ పరిభ్రమించునదెవరు?
శ్రేణులు పోరాడుతుంటే
అస్త్ర సన్యాసం గురించి బోధలు చేసినదెవరు?
చెప్పుకోండి చూద్దాం!

ధృతరాష్ట్రుల సంతతి
మాటతప్పినవాడితో
ఏకాభిప్రాయం ఎలాసాధ్యం?
బుకాయించేవాడితో
చర్చల ప్రయోజనం ఏమిటి?
మృత్యుమేఘాలను నిలువరించే
కాలపరిమితి ఎక్కడ?
అన్యాయాన్ని ఎదిరించలేని
పుత్రవాత్సల్యం ఎవరిది?
అధర్మమమని తెలిసీ
కళ్లు మూసుకున్నదెవరు?
నిజం తెలిసీ నిష్క్రియను
ఆశ్రయించినవారెవరు?
చేతనయ్యీ చేష్టలుడిగిన
ఆధునిక ధృతరాష్ట్రులెవరు?
చెప్పుకోండి చూద్దాం!

ఎవరు ఎక్కువ సంతోషపెడతారు?
ఒక మిత్రుడు ఈ కింది మెయిల్ పంపాడు. ఆ మెయిల్ సారాం శం ఏమంటే- ఒక ప్రధాని, ఇద్దరు సీనియర్ కేంద్ర మంత్రులు విమానంలో ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం వెళ్లాక ప్రధా ని వంద రూపాయల నోటు విమానం నుంచి కిందకు వదిలి ‘నేను ఈ రోజు ఒక పేదవాడిని సంతోష పెట్టగలిగాను’ అన్నారు. ఇది చూసి ఒక సీనియర్ మంత్రి రెండు యాభై రూపాయల నోట్లు విమానంలోంచి కిందికి వదిలాడు. ‘నేను ఇద్దరు పేద వాళ్ల ను సంతోష పెట్టగలిగాను’ అని సంతోష పడ్డాడట. చివరి మంత్రి మరో అడుగు ముందుకు వేసి రూపాయి నాణాలు వంద తీసు కుని కిందికి విసిరాడు. ‘నేను ఈ రోజు వంద మందిని సంతోష పెట్టగలిగాను’ అని సంబురపడిపోయాడు. ఇవన్నీ వింటున్న పైల ట్‌కు చిరాకు పుట్టింది. ‘మిమ్మల్ని ముగ్గుర్ని కింది కు వదిలేస్తే నాలుగు కోట్ల మంది సంతోష పడతారు’ అన్నాడట? ఆ మంత్రు లెవరు? ఆ పైలట్ ఎవరు? ఇది జరగాలని, జరుగుతుందని ఎవరూ కోరుకోరు కానీ తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి ప్రతీక ఈ మెయిల్. కేంద్రం నిష్క్రియా పరత్వం, నిశ్చేష్టలపై ఈ ప్రాంతానికి చెందిన యువకుల్లో ఏళ్ల తరబడి మస లుతున్న మానసిక సంక్షోభానికి ప్రతిబింబం ఈ మెయిల్.

383

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా