కేసీఆర్- చారిత్రక అనివార్యత


Tue,July 1, 2014 07:01 PM

ప్రజలు ప్రకృతి వేర్వేరు కాదేమో. సహజ న్యాయం, సామాజిక న్యా యం పక్కపక్కనే ఉంటాయేమో. ప్రకృతిని, ప్రపంచాన్ని శాసించగలం అని విర్ర వీగినప్పుడు అదే ప్రకతి విరుచుకుపడి మనలను ముంచేయడం చూశాం. భూమిని మింగాలని చూసినప్పుడు భూమి మనలను మింగేయడం చూశాం. ప్రజలకంటే నేనే గొప్ప అనుకున్నవాళ్లను అదే ప్రజలు పాతాళంలోకి తొక్క డం చూశాం. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయించడంలో ఆంతర్యం ఇదేనేమో. అక్కడ చంద్రబాబు గెలిచి, ఇక్కడ కేసీఆర్ గెలవకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటి? అని ఒక మిత్రుడు యథాలాపంగా ప్రశ్నించాడు. కానీ ఆ ప్రశ్నలో భయం ఉంది. ఆందోళన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాటల్లో ఇంకా ఆధిపత్య మనస్తత్వం పోలేదు. ఆ అహంకారం నశించలేదు. కేసీఆర్ తన వద్ద పనిచేసిన వాడంటారు. 2019లోనో, ఇంకా ముందేనో తెలంగాణలో అధికారంలోకి వస్తానంటాడు. తెలుగు ప్రజలను తిరిగి ఏకం చేస్తానంటాడు. ఇక్కడ అక్కడ తానే అభివద్ధి చేస్తానంటాడు. కేసీఆర్‌కు అభినందనలు చెప్పడానికి కూడా ఆయనకు మనస్కరించలేదు.

ఆయన జాతీయ పార్టీ నాయకుడిననుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఒక విధంగా తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి. చంద్రబాబు కత్తి అలా తెలంగాణపై వేలాడుతూ ఉండాలి. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని అది సజీవంగా ఉంచుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాల్సిన అవసరాన్ని ఎప్పటికప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. తెలంగాణకు కేసీఆర్ ఎం దుకు అవసరమో, ఎంత అవసరమో తెలియజే స్తూ ఉంటుంది.

చంద్రబాబు పెద్ద షో మాస్టర్. ఆయన షోను 70ఎంఎం డీటీఎస్‌లో చూపించడానికి ఒక పెద్ద ప్రసార, ప్రచార యంత్రాగం రెడీగా ఉంటుంది. అభివద్ధికి ఆయనను నమూనాగా చూపించే ప్రయ త్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. హైదరాబాద్‌లో మొదటి ఎస్‌టీపీఐని 1991లోనే హైదరా బాద్‌లోని మైత్రివనంలో ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎవరూ గుర్తు చేయరు. మరో ఎస్‌టీపీఐకి 1992లో నే మాదాపూర్‌లో శంకుస్థాపన జరిగిందని ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా చరిత్రను కమ్మేయడంలో చంద్రబాబు, ఆయన మీడియా బ్యాండు సిద్ధహస్తులు.సీమాంధ్ర ఆధిపత్య నీడలు తెలంగాణలో కొనసాగినంతకాలం కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంటుంది. బీహార్ నుంచి విడివడిన తర్వాత జార్ఖండులో లాలూప్రసాద్, నితీశ్‌కుమార్‌ల పార్టీలు అంతరించడానికి ఐదేళ్లు పట్టింది.తెలంగాణవాదులు తప్పులు చేయకపోతే ఇక్కడా అదే జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్‌లోనూ, దేశంలోని మరో పద్నాలు గు నగరాల్లోనూ ఐటి అభివద్ధికి పునాదులు వేసిం ది ఎస్‌టిపిఐ విధానమేనని ఇవ్వాళ చాల కొద్ది మందికి తెలుసు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఈ దేశంలో, రాష్ట్రంలో సీఎంసీ అనే సంస్థ కంప్యూటర్ సేవలు అందిస్తున్నదన్న సంగతి చాలామందికి తెలియదు. చెప్పుకునే తెలివి తేటలూ, చెపితే ప్రచారం చేసే యంత్రాగం కాంగ్రెస్ కు లేవు. చంద్రబాబు వచ్చిన తరువాత పెద్ద ఎత్తున ఐటి కంపెనీలకు భూములిచ్చి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన మాట నిజం. కానీ కంప్యూటర్ కనుగొన్నది ఆయనే అన్నట్టుగా జరిగిన ప్రచారం చరిత్రకు మసి పూసింది. అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఆయన ఒక కొత్త రాష్ర్టానికి ముఖ్యమంత్రి. ఇక్కడ తెలంగాణకు ఆయన వద్ద పనిచేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి. ఎవరు ఏమి చేయబోతున్నారన్న అంశాన్ని ప్రజలు వేయికళ్లతో కనిపెడుతుంటారు.

1999లో తన పార్టీ మద్దతు తప్పని సరిగా అవసరమైనప్పుడు చంద్రబాబు ఎన్‌డిఏ ప్రభుత్వంలో చేరలేదు. ఐదేళ్లు టీడీపీ ఎంపీలను ప్రభుత్వానికి దూరం గా ఉంచారు. ఇప్పుడు ఎన్‌డీఏకు చంద్రబాబు మద్దతు అవసరం లేదు. అయినా అందరికంటే ముం దుగా ప్రభుత్వంలో చేరతానని ప్రకటించారు. ఈ ఉత్సాహమే తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. ఎన్‌డిఏను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏమయినా సమస్యలు సష్టిస్తారేమోనన్న అనుమానం తెలంగాణవాదుల్లో ఉంది. ఇటువంటి పరిణామ దశలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడం చారిత్రక అనివార్యత. తెలంగాణ ఎలా దెబ్బతిన్నదో, ఎందుకు దెబ్బతిన్నదో, ఏమి చేస్తే తెలంగాణ బాగుపడుతుందో తెలిసినవారు కేసీఆర్. పద్నాలుగేళ్లు అన్ని రాజకీయ తుపాన్లను తొణకక బెణకక ఎదుర్కొనే ైస్థెర్యం ఉన్నవారు ఆయన. ఎక్కడ నిలబడాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినవారాయన.

కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకపోవడం ఎంత సమంజసమో ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. కాంగ్రెస్ నెత్తిన ఎంత పాపభారం ఉందో ఆ పార్టీ అపజయం చెప్పకనే చెబుతున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన పుణ్యం కూడా జయించలేనంత అప్రతిష్టను ఆ పార్టీ మూటగట్టుకున్నది. కేసీఆర్ ఒక వేళ కాంగ్రెస్‌తో విలీనం అయితే తెలంగాణలో బీజేపీ-టీడీపీలు అధికారంలోకి రాకపోయినా బలమైన ప్రతిపక్షంగా బలపడి ఉండేవి. కాంగ్రెస్ వ్యతిరేక గాలి ఇంకా గట్టిగా కొడితే బీజేపీ-టీడీపీలు అధికారంలోకి కూడా వచ్చి ఉండేవి. విలీనాన్ని, పొత్తులను తోసిపుచ్చి కేసీఆర్ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ కాంక్షను కాపాడారు. పద్నాలుగేళ్లు అవిశ్రాంతపోరాటం చేసిన తెలంగాణవాదుల ఆత్మకు శాంతిని, ఊరటను చేకూర్చారు. కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టా రు. రాష్ట్రం.. రాష్ట్రం అన్నారు.

ఏం సాధించారు? ఉపన్యాసం ఇవ్వకుండా సూటిగా చెప్పండి అని ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటిరోజు పదవీ విరమణ చేసిన ఒక సీనియర్ అధికారి నిలదీశారు. ఇంకా ఇటువంటివారు చాలామందే ఉండి ఉంటా రు. హైదరాబాద్‌లో ఇంకా చాలా మందికి తెలంగాణ ఎందుకు అవసరమో అర్థం కానట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తున్నది. అవును... వంద మాటలు అనవసరం. 119 ఎమ్మెల్యేలు, 17మంది ఎంపీల్లో సుమారు సగం మంది కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. అందునా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నుంచి ఎక్కువమంది కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది పేద, మధ్యతరగతివాళ్లు ఉన్నారు. రాజకీయాధికారం సమాజంలోని దిగువ వర్గాలకు ప్రసరిస్తున్నదనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? 1983 తర్వాత రాజకీయాల్లోకి కొత్తనీరును తీసుకువచ్చిన ఘనత తెలంగాణది, కేసీఆర్‌దే అని చెబితే ఆయన సమాధానపడ్డారు.

ఇలా ఒక్క రాజకీయాల్లోనే కాదు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మన పనులు మనం చేసుకోవడం మొదలు పెడితే, ఏడాదిలోపే ఫలితాలు చూపించగలిగితే పరిస్థితిలో ఎంత మార్పు కనిపిస్తుంది? తదుపరి జరుగబోయే సివిల్ సర్వీసు పరీక్షల్లో, గ్రూప్స్ లో తెలంగాణకు సొంత కేడర్ అధికారులు వస్తే పరిస్థితి ఎంత సానుకూలంగా మారుతుంది? సీమాం ధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ నిర్వాకాల కారణంగా చిన్నచిన్న బడ్జెట్‌లు కూడా కేటాయింపులు జరుగక ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తిచేసి ఏడాదిలోపు కొన్ని వందల చెరువులకు నీరివ్వగలిగితే ఎలా ఉంటుం ది? సీమాం ధ్ర నుంచి విడివడడం వల్ల తెలంగాణ ప్రభుత్వ విభాగాల కేంద్ర కార్యాలయాల్లో, సచివాలయంలో తలెత్తే ఖాళీలకు, విద్యాసంస్థల్లో ఏర్పడే ఖాళీలకు ఏకకాలంలో భారీగా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది? తెలంగాణలో రైతులు కరెంటుకోసం, సాగునీటికోసం లక్షలాదిరూపాయల పెట్టుబడులు పెట్టనవసరంలేని విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలిగితే, తెలంగాణను విత్తనోత్పత్తి రాష్ట్రంగా అభివద్ధి చేస్తే పల్లెల్లో ఎన్ని గుణాత్మకమైన మార్పులు వస్తాయి? తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా ప్రయోజనాలు పొందుతామని ఇక్కడి ప్రజల్లో భారీ ఆకాంక్షలు ఉన్నాయి. స్వేచ్ఛా ఫలాలు అందరికీ దక్కుతాయని ఆశలు పెంచుకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు తెలంగాణ ప్రజలకు అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి తగినవిధంగా మసలుకోవడం చాలా కష్టంతో కూడిన పని. ఉద్యమాలు నడపడం కంటే ప్రభుత్వాలు నడుపడం చాలా క్లిష్టమైన పని. ఉద్యమకాలంలో మాట లు ఎక్కువగా చెబుతాం, చేతలు తక్కువగా ఉంటా యి. ఇక్కడ మాటలు తక్కువగా చెప్పి చేతల్లో ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆ పనిచేయగలరని తెలంగాణవాదులు నమ్ముతున్నారు.

తెలంగాణ అభివద్ధికి సంబంధించి ఆయనకు ఒక స్పష్టమైన దక్పథం, ఎజెండా ఉన్నాయి. ఆయన కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదని తెలంగాణవాదులు భావిస్తున్నారు. సీమాంధ్ర ఆధిపత్య నీడలు తెలంగాణలో కొనసాగినంతకాలం కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంటుంది. బీహార్ నుంచి విడివడిన తర్వాత జార్ఖండులో లాలూప్రసాద్, నితీశ్‌కుమార్‌ల పార్టీలు అంతరించడానికి ఐదేళ్లు పట్టింది. తెలంగాణవాదులు తప్పులు చేయకపోతే ఇక్కడా అదే జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

1207

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా