యథాగతం తథా వర్తమానం


Sat,May 10, 2014 01:16 AM

విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఏదో ప్రళయం పుట్టిస్తాడనుకున్న జగన్ కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితమయ్యాడు. విభజన అనివార్యతను గుర్తించి మసలుకున్నాడు. చంద్రబాబు మాత్రం బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన రోజునుంచి కంటికి కునుకు లేకుండా కాలికి బలపం కట్టుకుని చెన్నయ్ నుంచి కోలకత్తా దాకా, బొంబాయి నుంచి చండీగఢ్, ఢిల్లీ, లక్నో దాకా వెళ్లి తెలంగాణ ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.

చంద్రబాబును తెలంగాణ మేధావులు ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? అని నా మిత్రుడు చాలాయేళ్ల తర్వాత నన్ను కొంచెం కటువుగానే అడిగారు. అభ్యుదయ వాదులయిన వాళ్లు కూడా సీమాంధ్రలో కూడా చంద్రబాబును వ్యతిరేకించడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆయన నన్నడిగిన ప్రశ్న నేను చాలా మందిని అడిగాను. అవును జగన్‌ను ఎలా సమర్థిస్తారు? చంద్రబాబును ఎందుకు వ్యతిరేకిస్తారు? అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. మీకో విషయం తెలుసా? ఆంధ్రా పొలిటికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంతా తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవాలని, కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నట్టే, తెలంగాణవాదులు అక్కడ చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలవాలని కోరుకున్నారు.

ఎందుకంటే ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ప్రతినిధి చంద్రబాబు. చివరి నిమిషం వరకు తెలంగాణపై యుద్ధం కొనసాగించినవాడు చంద్రబాబు.తెలంగాణను ఓడించడానికి అన్ని కుట్ర లు చేసినవాడు చంద్రబాబు. జగన్ ఎప్పుడో తెలంగాణ రాజకీయ రంగాన్ని వదలిపోయాడు. తెలంగాణలో అతనికి స్టేక్స్ లేవు. ఒకటో రెండో వచ్చినా అవి నిలిచేవికాదు. కానీ చంద్రబాబు తెలంగాణను వదిలిపెట్టలేదు. తెలంగాణ సమాజాన్ని కెలకడం, కల్లోలపర్చడం మానుకోలేదు. అందుకే తెలంగాణవాదులకు అతనే ప్రత్యర్థిగా, ప్రమాదకారిగా కనిపిస్తాడు అని ఒక జర్నలిస్టు మిత్రుడు వ్యాఖ్యానించారు. అక్కడ చంద్రబాబు గెలిస్తే తెలంగాణకు సమస్యలు సష్టిస్తాడన్న భయం ఇంకా ఇక్కడి ప్రజ ల్లో, తెలంగాణవాదుల్లో ఉంది. చంద్రబాబు సూటి గా రాజకీయాలు చేయడం ఎప్పుడూ లేదు. సమాజాన్ని విభజించి పాలించాలని చూస్తాడు. ఎప్పుడూ అడ్డదారులు, దొడ్డిదారులు వెతుక్కోవడమే. అందు కే అతనంటే ఇక్కడ వ్యతిరేకత అని మరో విశ్లేషకుడు చెప్పారు.

మరి సీమాంధ్ర ప్రజలకు మంచి నాయకుడు అవసరం లేదా? వాళ్లేమైపోయినా ఫర్వాలేదా? అని నా మిత్రుడు ప్రశ్నించాడు. ఏది మం చి, ఏది చెడు నిర్ణయించుకోవడంలో ప్రజల సామూహిక విజ్ఞత తర్వాతనే ఎవరైనా. ప్రజలు మోసపోతారని, ప్రలోభాలకు గురవుతారని, తప్పు చేస్తారని, లొంగిపోతారని ఎవరయినా అనుకుంటే అది ముమ్మాటికీ దుస్సాహసమే. తెలంగాణవాదు లు, తెలంగాణ మేధావుల అభిప్రాయాలతో నిమి త్తం లేకుండా ఇక్కడి ప్రజలు, అక్కడి ప్రజలు తీర్పు ఇస్తారు.ఎవరు గెలిస్తే వారు మంచి నాయకుడని ప్రజలు గుర్తించినట్టు. ఇక్కడ కేసీఆర్ అయినా, పొన్నాల అయినా, అక్కడ జగన్ గెలిచినా, చంద్రబాబు గెలిచినా..ఆ తీర్పును గౌరవించవలసిందే. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే కొలమానం లేదు.

ఇద్దరిలో ఒకరు తెలిసిన దయ్యం (నోన్ డెవిల్). ఒకరు తెలియని దయ్యం(అన్ నోన్ డెవిల్). చంద్రబాబు గురించి ప్రజలకు తెలుసు. ఆయన విధానా లు తెలుసు. ఆయన రాజకీయాలు తెలుసు. ఆయ న ఎత్తులు జిత్తులు తెలుసు. ఆయన పాలనా సమర్థత తెలుసు. ఆయనకున్న దక్పథమూ తెలుసు. ఆయన అనైతిక పోకడలూ తెలుసు. ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లకాలంలో ఏమి చేశాడో జనం ఇంకా మర్చిపోలేదు. ఆయన ఆ తర్వాత పదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా గతాన్ని మరిపించలేకపోయాడు. కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయకపోగా మరిం త విశ్వసనీయతను కోల్పోయే పనులు చేశారు. మాటలు మార్చడం, మనుషులను మార్చడం, మిత్రులను మార్చడం...చంద్రబాబు నైజంగా మారిపోయింది.

చంద్రబాబు తన గీతను పెద్దది చేసుకోలేకపోయాడు. ఇతరుల గీతను చెరిపేసి, దులిపేసి, చిన్నది చేసి ఎదగాలని చూశాడు. ఈ కుట్రపూరితమైన స్వభావం చాలా మందిలో ఏహ్యభావం పుట్టించింది. చంద్రబాబుది న ఘర్‌కా న ఘాట్‌కా పరిస్థితి. చంద్రబాబు ఇక్కడ లేఖ ఇచ్చింది తెలంగా ణ తెచ్చింది నేనేనంటాడు. అక్కడ తెలంగాణను నిలువరించడానికి ప్రయత్నించింది నేనేనంటాడు. విభజన దుర్మార్గంగా జరిగిందంటాడు. జగన్ విభజన ఖాయమైన తర్వాత తెలంగాణ జోలికి రావడం మానేశాడు. విభజనకు అనుకూలంగా తన రాజకీ య జీవితం మల్చుకున్నాడు. తెలంగాణలో మొత్తం పార్టీ జారిపోతున్నా ఆయన పట్టించుకోలేదు.

తెలంగాణ నాది కాదన్నట్టుగానే వ్యవహరించాడు. విభజ న వ్యతిరేక నినాదాలు చేసినా అవి ఉద్యమ రూపం తీసుకోలేదు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఏదో ప్రళయం పుట్టిస్తాడనుకున్న జగన్ కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితమయ్యాడు. విభజన అనివార్యతను గుర్తించి మసలుకున్నాడు. చంద్రబాబు మాత్రం బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన రోజునుంచి కంటికి కునుకు లేకుండా కాలికి బలపం కట్టుకుని చెన్నయ్ నుంచి కోలకత్తా దాకా, బొంబాయి నుంచి చండీగఢ్, ఢిల్లీ, లక్నో దాకా వెళ్లి తెలంగాణ ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. విభజన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణ వాదులను, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడులకు పాల్పడ్డాడు. జగన్ తెలంగాణవాదుల జోలికిరాలే దు.

తెలంగాణ పార్టీల జోలికి రాలేదు. చంద్రబాబును తెలంగాణవాదులు వ్యతిరేకించడానికి వెనుక ఒక తరం అనుభవించిన క్షోభ ఉంది. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉంటే తెలంగాణపై దాష్టీకం చెలాయించే విషయంలో బహుశా చంద్రబాబు స్థానాన్ని ఆయన తీసుకుని ఉండేవారేమో కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన స్థానాన్ని ఆయన తనయు డు తీసుకోలేదు. చంద్రబాబే తీసుకున్నాడు. 2009 డిసెంబరులో మొదలైన ఆయన ఆటలు విభజన పూర్తయ్యేదాకా కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును తెలంగాణవాదులు ఎంతకీ జీర్ణించుకోలేకపోవడానికి ఇంత నేపథ్యం ఉంది.

అయినా ఎన్నికల ఫలితాలు అనేక తీర్పులు చెబుతాయి. పాతను కడిగేసి కొత్తకు శ్రీకారం చుడతాయి. నాయకులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తా యి. పాత ముద్రలు తొలగిపోయి కొత్త పేరు ప్రతిష్టలు వస్తాయి. కాపాడుకుంటే ఉన్నత శిఖరాలకు సోపానం అవుతాయి. తప్పులు చేస్తే పాతాళం చూపిస్తాయి. సర్వేలు, అంచనాలు మనిషి ఆసక్తిని తప్తి పర్చుకోవడం కోసమే. అవి నిజం కావాలని లేదు. పూర్తిగా అబద్ధం కూడా కాకపోవచ్చు. టీడీ పీ-బీజేపీ, దాని అనుకూల మీడియా సంస్థలు సీమాంధ్రలో తమ కూటమికి అధికారం వస్తుందని నమ్ముతున్నాయి. చంద్రబాబు 120కి పైగా అసెంబ్లీ స్థానా లు, 20కి పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా ప్రకటించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా దాదాపు అదే లెవెల్లో మాట్లాడుతున్నారు.

స్వతంత్ర విశ్లేషకులు మాత్రం స్వల్ప ఆధిక్యంతో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, టీడీపీ- బీజేపీలు జగన్‌ను బాగా నిలువరించగలిగాయని చెబుతున్నారు. లోక్‌సభ స్థానాల్లో కూడా జగన్‌కు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పోలింగ్ శాతం బాగా పెరగడం వల్ల టీడీపీ లాభం పొందుతోందని లగడపాటి వంటివారు చెబుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతా ల్లో పోలింగ్ శాతం పెరగడం జగన్‌కు బాగా ఉపకరిస్తుందని, పట్టణ ప్రాంతాల ఓటింగ్ పెరిగితే తెలుగుదేశానికి ఉపకరిస్తుంద ని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. పత్తిపాడు వంటి నియోజకవర్గాల్లో 90 శాతం పోలింగ్ జరిగింది. అటువంటి నియోజక వర్గాలు చాలా ఉన్నాయి. పోటీ ఎంత బీభత్సంగా ఉందో పోలింగ్ శాతం చూస్తే అర్థమవుతుంది.

అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమం సమైక్యాంధ్ర పార్టీలు సోదిలో లేకుం డా పోవడం. అసలు ఎన్నికల ప్రచారంలో సమైక్యాంధ్ర అన్న వాదమే వినిపించకపోవడం. భస్మా సురుని కథ, కిరణ్‌కుమార్‌రెడ్డి కథ చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన ఏదో చేసేద్దామనుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తును, కాంగ్రెస్ భవిష్యత్తును కోలుకోలేనంతగా దెబ్బతీశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం అంటే ఇలాగే ఉంటుందే మో. ఆయన ఒక్కరు కాదు...లగడపాటి రాజగో పాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమా ర్, సబ్బంహరి...ఇంకా చాలా మంది సమైక్యాంధ్ర అనే ఎండమావి వెంట స్వారీ చేసి చివరికి అడ్రసులేకుండా పోయారు. రాష్ట్ర విభజన రెండు ప్రాంతాల కు కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుంది. పాత నాయకులనే కొత్త పాత్రల్లో చూపిస్తుంది.

[email protected]

1087

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా