ప్రార్థన


Fri,October 14, 2011 11:06 PM

తల్లీ! ఈ నేల
రక్తమోడుతున్నది
రకరకాల రాజకీయ విభ్రమల మధ్య
దిక్కులు చూస్తున్న నేతల నిశ్చేష్టల మధ్య
మా పిల్లల తలలు తెగిపడుతున్నాయి!
మా ఆ ఆశల ఉచ్చ్వాసనిశ్వాసాలు
తడబడుతున్నాయి
జనగళాలు స్వరంస్వరం కలిపి కదులుతున్నా
జెండాలు ఎజెండాలు ఏకం కావడం లేదు
ఐక్యతా పతాకాలు ఎగరడం లేదు!
జననీ! ఇక్కడి నేతలు
చెట్టుకొకకడు పుట్టకొకడు-
వీళ్లను ఏకోన్ముఖం చేసే వరమివ్వు!

హిరణ్యాక్షుల కండకావరం
భూమిని చాపగా చుట్టిన హిరణ్యాక్షుడు
వరాహమూర్తిని చూసి దెప్పిపొడుస్తున్నాడు!
సూట్‌కేసులతో ప్రజాస్వామ్యాన్ని తూకం వేసేవాడు
గాంధీయిజం గురించి బోధలు చేస్తున్నాడు!
వందలాది ఎకరాల్లో సెజ్ సామ్రాజ్యాలు పరచినవాడు
ఆధునిక దొరస్వామ్యానికి తెరచాపపూత్తినవాడు
పదేళ్లలో పదుల వేల కోట్లు కూడబెట్టినవాడు
తెలంగాణ బక్క దొరలను చూపి భయపెడుతున్నాడు!
తాతలనాడే పోరుజెండాలను ఎగరేసిన తెలంగాణకు
కొత్త బిచ్చగాడు దగ్గులు నేర్పుతున్నాడు-
మేకవన్నె పులుల అసలు రూపం ఇది!
తల్లీ! నీ బిడ్డలకు
నిజస్వరూపాలు తెలుసుకునే శక్తినివ్వు!

మొసలి ప్రేమ
కోతి గుండెకోసం మొసలి
స్నేహ వచనాలు పలకడం పంచతంత్రం!
తెలంగాణ పిల్లల చదువులపై చంద్రబాబు
బాధపడిపోవడం కుతంత్రం!
జారిపోయిన అధికారంకోసం
రాష్ట్రాన్ని దిగ్బంధం చేయవచ్చు!
పాలనను స్తంభింపజేయవచ్చు!
అది ప్రజాస్వామిక ఉద్యమం!
అస్తిత్వం కోసం ఉద్యమాలు చేయడం మాత్రం
అరాచకం, అప్రజాస్వామికం!
బాబూ! రేపు తెలంగాణ ప్రకటిస్తే...
రైళ్లూ, బళ్లూ బందు చేయబోమని రాసిస్తావా?
వీధి పోరాటాలకు దిగబోమని హామీ ఇస్తావా?
ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించనని ప్రకటిస్తావా?
అమ్మా! తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు
బహురూపుల నైజం తెలుసుకునే వివేకాన్నివ్వు!
మాటమార్చే, మనుషులను ఏమార్చే
కుట్రలను బట్టబయలు చేసే ధైర్యాన్వివ్వు!

ఒంటికాలి ధర్మం
పోలీసుదొరలకు చట్టాలు సడన్‌గా గుర్తొస్తాయి!
సమయానుకూలంగా సెక్షన్లు దొరుకుతాయి!
రైళ్లను పేల్చేస్తామని చెప్పినవాడు మనవాడే
ఆత్మాహుతి దాడులు చేస్తామన్నవాడూ మనవాడే
సేనలను ఏర్పాటు చేసేవాడితోనూ ఇబ్బంది లేదు!
రైలు పట్టాలపై తలలు పెట్టినవాడు
మండుటెండలో నిరసనవూవతం పట్టినవాడు మాత్రం
జైలు కెళతాడు!
ఇక్కడ ధర్మం నాలుగుపాదాలపై కాదు
ఒంటికాలిపై నడుస్తున్నది!
జననీ!
నావాళ్లకు అధర్మంపై పోరాడే బలాన్నివ్వు!

జయచంధ్రలతో జాగ్రత్త!
scan1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతల్లీ! ఇక్కడ
పురుషోత్తములే కాదు
జయచంవూదులూ ఉన్నారు
రామలక్ష్మణులే కాదు
మారీచ సుబాహులూ ఉన్నారు
అభిమన్యులు బలిపీఠం ఎక్కుతున్నది ఇక్కడే!
నీతిలేని సైంధవ సంతతి చెలరేగుతున్నదీ ఇక్కడే!
శల్యులు యోధులను వేధిస్తున్నదీ ఇక్కడే!
క్రీస్తు సిలువ మోసిన చోటే
శాంతిబోధలు వినిపించిన నేలపైనే
ఆయన హంతకులూ తిరిగాడారు!
ఊసర కిరాయి మూకలు
సొంత సైన్యంపైనే బాకులు దూస్తున్నాయి!
విద్రోహ సర్పాలు నలుదిక్కులా
బుసలు కొడుతున్నాయి!
గోతికాడి నక్కల్లా సమైక్య టీవీగళాలు
సంబురంగా ఊళలు వేస్తున్నాయి!
జీతాలు, జీవితాలు పణంగా పెట్టి
పోరాడుతున్న శ్రేణుల్లో
కల్లోలం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నాయి!
ఇప్పుడు ఇంటా బయటా యుద్ధమే!
జననీ! నీ బిడ్డలకు
ఈ కల్లోలాన్ని ఎదుర్కొనే ఓర్పునివ్వు!
ఇంటి దొంగలను కాచుకునే నేర్పునివ్వు!
ద్రోహులను తెగటార్చే సై్థర్యాన్నివ్వు!

చైతన్యజ్వాల
తెలంగాణ ఉద్యమం ఎన్నో రణతంవూతాలు నేర్పింది. ఎన్నో హృదయతంవూతులను మీటింది. ఇంకెన్నో భావావేశాలను మండించింది. అలాంటి ఒక మెయిల్‌లో దిగువ ఇచ్చిన కవితావేశం వచ్చింది. ఎ.జనార్దన్ పేరుతో వచ్చిన ఆ భావాల చైతన్య జ్వాల మీకోసం:

అరణ్యంలో తిరిగే ఆరుద్ర పురుగులన్నీ ఒక్కటై రేపటి పొద్దు పొడుపుకు పురుడుపోస్తనంటున్నయ్!
చిమ్మచీకటిలో ఎగిరే మిణుగురులన్నీ కొమ్మ కొమ్మన చేరి చీకటిని తరిమేస్తమంటున్నయి!
ఇక్కడి నేలకు పోరాటాల పురిటి వాసన పోలేదు. ఇక్కడి మట్టి కణాలతో ఏ వీరుడి రక్తకణాలో పెనవేసుకొని నిత్యం కణకణమండుతున్నయి. లోకం కోసం తనలో తాను రగిలే సూర్యుడిలా మండే ధీరుల శ్వాసలు పిల్లగాలులై ప్రసరిస్తాయిక్కడ. ఈ నేలను ఓపికగా తవ్వుకుం టూ పోతే ఊరికో దధీచి ఎముక దొరుకుతుంది.

పొద్దు పొడుపును పొత్తి కడుపులో దాచుకుని పురిటి నొప్పులు పడుతున్న తల్లులు గంభీరంగా ఊపిరి బిగబడతారిక్కడ...ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లు నిండుతుంటే...కొత్త చేతులు మొలుస్తాయిక్కడ... గన్నేరు... మందారం... మోదుగుపూలు ఒక్కటై వీర మాలలల్లుతాయి....ఎన్ని తరాలు అంతరించినా త్యాగంలోనే తరించే జాతి మాది...ఇది తెలంగాణ. రుద్రావేశంతో పెఠీల్మని ఎద తంత్రులు తెంచుకున్న కోటి రతనాల వీణ.

392

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా