గులాబీ సంకేతాలు


Sat,May 3, 2014 01:25 AM

గత మూడు రోజులుగా ఒకటే లెక్క... ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికె న్ని సీట్లు వస్తాయి? ఎడతెగని చర్చ లు...విశ్లేషణలు...బెట్టింగ్‌లు, చాలెంజ్‌లు. పదహారో తేదీ వరకు ఆగక తప్పదు. కనీసం ఏడో తేదీ ఎగ్జిట్‌పోల్స్ దాకా వేచి చూడాలి. అయినా తిట్టేవాళ్లను బట్టి, పొగిడేవాళ్లను బట్టి, కాడిపారేసిన వాళ్లను చూసి, ముఖం చాటేసిన వాళ్లను చూసి ఎవరు గెలుస్తారో కాస్తంత అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్‌నే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఆయన పేరు చెప్పే అక్కడ ఎందుకు ఓట్లు అడుక్కొంటున్నా రు? అక్కడ (తెలంగాణలో) కేసీఆర్ వస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని గెలిపించకపోతే మీ ఇష్టం అని సీమాంధ్ర ప్రజలను బెదిరించడానికి. భావోద్వేగాలు రెచ్చగొట్టి బ్లాక్‌మెయిల్ చేయడానికి. పవన్ కల్యాణ్ అద్దెమైకులాగా అదేపనిగా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు.

అది తెలంగాణలో కేసీఆర్ విజయ సూచన. ఇక్కడ మా వళ్లే తెలంగాణ వచ్చింది అని చెప్పిన బీజేపీ నేతలు, టీడీపీ నేతలు అక్కడికి వెళ్లగా నే జగన్ వల్లే రాష్ట్రం చీలిపోయింది అని జనాన్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర విభజనపై తమ అజీర్తిని బయటపెట్టుకుంటున్నారు. ఇది కూడా తెలంగాణ విజయమే. ఈసారి నిర్వహించినన్ని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ జరగలేదేమో. అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించాయి. రాష్ట్ర విభజన జరిగిన సంధికాలంలో జరుగుతున్న తొలి చారిత్రక ఎన్నికలు కావడం వల్ల అన్ని మీడి యా సంస్థలు ఈ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాయి. ప్రాంతీయ మీడియా సంస్థలు, పత్రికలు అన్నీ కూడా టీఆరెస్‌కు 55 నుంచి 65 దాకా రావచ్చని అంచనాలకు వచ్చాయి.

ఎంత ఉదారంగా అంచనా వేసినా కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్య 40 దాటడం లేదు. టీడీపీ-బీజేపీలకు 12-20 స్థానాల దాకా అంచనే వేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రసారం పై ఆంక్షలు ఉండడం వల్ల ఏ ఒక్కరూ ప్రసారానికి, ప్రచురణకు సిద్ధపడలేదు. రెండో దశ పోలింగ్ అయిపోయిన తర్వాత అంటే ఏడో తేదీ సాయంత్రం కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలుగుచూసే అవకాశం ఉంది. తెలంగాణలో టీఆరెస్ అనుకూల గాలి వీచిందని, అసెంబ్లీలో ఆ పార్టీ 70స్థానాలకుపైగా గెల్చుకుంటుందని అంచనా వేసే వారూ ఉన్నారు.

లోక్‌సభ స్థానాలకు వచ్చే సరికి అంచనాల్లో తేడా కనిపిస్తున్నది. వేర్వేరు మీడియా సంస్థలు టీఆరెస్‌కు 6నుంచి 10 స్థానాల వరకు అంచనాలు వేశాయి. కాంగ్రెస్‌కు 4 నుంచి 6 స్థానాలు, బీజేపీకి 2 నుంచి మూడు స్థానాలు, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎంలకు ఒక్కొక్కటి చొప్పున అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల అసెంబ్లీకి టీఆరెస్ అభ్యర్థులకు వేసి, లోక్‌సభకు కాంగ్రెస్‌కో లేక బీజేపీకో వేశారని విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే క్రాస్ ఓటింగ్ గెలిపించేంత మోతాదులో జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకం. 2009 ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగానే తెలంగాణలో కేవలం 53 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ 12 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. సమఉజ్జీల మధ్య ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు ఒక శాతం ఓటు క్రాస్ అయినా ఫలితాలను తారుమారు చేస్తాయి. కానీ త్రిముఖ పోటీలు, చతుర్ముఖ పోటీలు ఉన్నప్పుడు క్రాస్ ఓటింగ్ గెలిపించేంత భారీగా ఉండడం అనుమానమే. అంతేగాక క్రాస్ ఓటింగ్ ఏదో ఒక్క పార్టీకి జరిగితే ఫలితాలు తారుమారవుతాయి.

అలాగాక కాంగ్రెస్‌కు కొన్ని, బిజెపికి కొన్ని క్రాస్ ఓటింగ్ జరిగి తే ప్రధాన అభ్యర్థికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏది ఏమైనా తెలంగాణ లో టీఆరెస్ వర్సెస్ ఆల్ అన్నట్టుగా ఎన్నికల సమరం జరిగిందని ఈ విశ్లేషణలన్నీ తెలియజేస్తున్నాయి. బెట్టింగ్‌లు, చాలెంజ్ లు అన్నీ టీఆరెస్‌కు ఎన్ని స్థానాలు వస్తాయి ? ప్రభుత్వా న్ని సొంతంగా ఏర్పా టు చేస్తుందా? ఎవరి మద్దతుతోనైనా చేస్తుందా? వంటి అంశాలపైనే జరుగుతున్నా యి. పొగడ్తలు తెగడ్తలు అన్నీ టీఆరెస్‌కే లభిస్తున్నా యి. కాంగ్రెస్ నాయకులు టీవీ తెరల ముందుకు రావడం తగ్గిపోయింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎందుకు ఇటువంటి ఆత్మరక్షణ ధోరణిలో ఉండిపోయింది? ఎందుకు ప్రజాభిమానాన్ని కూడగట్టలేకపోయింది?

కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజలు పధ్నాలుగేళ్లుగా తెలంగాణకోసం పోరాడుతున్నారు. ప్రజలు వీధుల్లో ఉంటే, కాంగ్రెస్ నాయకు లు పదవుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి, ఎంతగా హింసపెట్టాలో అం తగా హింసపెట్టి రాష్ట్రం ఇచ్చింది. చివరి నాలుగేళ్లలో తెలంగాణ సమాజం ఎంత క్షోభ అనుభవించిందో! కమిటీలు వేసి, ఇన్‌చార్జిలను మార్చి, కుప్పుస్వామి అయ్యర్ మేడిట్ డిఫికల్టీ లాగా రాష్ట్ర విభజనను రోజురోజుకు జఠిలంగా మార్చి, ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో విభజనను పూర్తి చేసింది. 2009 డిసెంబరు9 ప్రకటనకు కట్టుబడి ఏడాది లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఉంటే కాంగ్రెస్‌కు ఇలా పీకలమీదికి వచ్చి ఉండేది కాదు.

తెలంగాణలో ఇంతమం ది పిల్లలు మరణించి ఉండేవారు కాదు. కాంగ్రెస్‌పై ఇంత వ్యతిరేకత బలపడి ఉండేది కాదు. సీమాంధ్ర లో కూడా ఇంత రచ్చ జరిగి ఉండేదికాదు. భావోద్వేగాలు కూడా ఎన్నికల నాటికి కొంత సర్దుకుని ఉండే వి. తెలంగాణ సమస్యను చివరి నిమిషం దాకా సాగదీయడం, తమ సొంత ఇంటిని సరిదిద్దుకోలేకపోవడమే ఇవ్వాళ అక్కడా ఇక్కడా ఆ పార్టీ ఇబ్బందులపాలు కావడానికి కారణం. కాంగ్రెస్‌కు కాంగ్రెసే ప్రతిపక్షంలాగా వ్యవహరించింది. కిరణ్‌కుమార్‌రెడ్డిలాం టి వాళ్ల నిర్వాకం వల్ల కాంగ్రెస్ అక్కడా ఇక్కడా ప్రజ ల దష్టిలో విలన్‌గా నిలబడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఏం జరిగినా అది ముమ్మాటికీ కాంగ్రెస్ మేనేజర్ల చేతగానితనమే.

ఇక బీజేపీ-టీడీపీల కూటమి పరిస్థితి కూడా అటువంటిదే. బీజేపీ తెలంగాణ బిల్లుకు బాహాటం గా మద్దతు ఇచ్చింది. బిజేపి సహకారం వల్లనే బిల్లు ఆమోదం పొందిందన్నది వాస్తవం. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బయట మద్దతు ఇచ్చి, లోప ల కుట్రలు చేసిన చంద్రబాబుతో కలవడమే తెలంగాణలో బీజేపీకి శాపంగా పరిణమించింది. తెలంగాణ ఏర్పాటుపై తన దుఃఖాన్ని దాచుకోలేని పవన్ కల్యాణ్ అనే వైరుధ్యాల పుట్టను పక్కన పెట్టుకోవడం ఇంకా ఇక్కట్లపాలు చేసింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నరేంద్రమోడీ ఒక్కరే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి దిగి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండే ది. టీడీపీ ఖాళీ అయి ఉండేది. చాలా శక్తులు బీజేపీతో కలిసి వచ్చి ఉండేవి. సొంతంగా బలపడి ఉండేది. టీడీపీ ఊపిరి పోతుందనుకున్న ప్రతిసారీ చంద్రబా బు ఇటువంటి పొత్తుల మిత్తర ఏదో ఒకటి ముందు కు తెచ్చి చర్మరక్షణ చేసుకోవడం అలవాటుగా మారింది. గత ఎన్నికల్లో టీఆరెస్‌ను అలాగే గత్తర పట్టించారు. ఈసారి బీజేపీని గత్తర పట్టించారు.

నరేంద్రమోడీ రాజకీయ భావాలతో విభేదించవచ్చు, కానీ ఆయన వస్తారు, రావాలి అన్న భావన ఒకటి జనంలో ప్రబలింది. అదికాస్తా ఈ ప్రతీపశక్తుల ప్రభావానికి కుదేలయింది. టీడీపీ-బీజేపీలు కొన్ని సీట్లు గెలిస్తే గెలవవచ్చు. కానీ బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయింది. ఎన్నికల ఫలితాలు వస్తే కానీ ఎవరు ఎంత లాభపడిందీ, ఎవరు ఎంత నష్టపోయిందీ మరింత స్పష్టంగా బోధపడుతుంది.

1656

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన