ఇంటిపార్టీ సొంత టీమ్


Sat,April 5, 2014 01:53 AM

ఎన్నికల ముఖ చిత్రం స్పష్టపడిం ది. ఇక ఏ పార్టీతోనూ పొత్తులు, చిత్తు లు ఉండవని తేలిపోయింది. ఇక జరగాల్సింది సమరమే. టీఆరెస్ అధ్యక్షు డు కేసీఆర్ తొలిజాబితాపై సర్వత్రా సానుకూలత వ్యక్తమయింది. వివాదాలకు తావులేని 69 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో అత్యధికులు ఆది నుంచి తెలంగాణ ఉద్యమంతో ఉన్నవారే. ఒకటి రెండు చోట్ల తప్ప తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన స్ఫూర్తిని ఎన్నికల్లో కూడా కొనసాగించాలన్న ప్రయత్నం అభ్యర్థుల ఎంపికలో వ్యక్తమయింది. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవి, సాంస్కతిక ఉద్యమకారుడు రసమయి బాల్‌కిషన్, మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మలను అభ్యర్థులుగా ఎంపికచేసి తెలంగాణ శ్రేణులకు సరైన సంకేతాలను పంపారు.

రెండవ జాబితా రూపకల్పనలో కూడా ఇంతే నిగ్ర హం, విశాలదష్టితో అభ్యర్థుల ఎంపిక జరగాలని తెలంగాణవాదులు ఆశిస్తున్నారు. తొలి జాబితా అభ్యర్థులు అత్యధిక మంది తెలంగాణవాదుల్లో జనాదరణ కలిగిన నాయకులే. తెలంగాణ తొలి అసెంబ్లీ కొత్త నాయకత్వానికి, కొత్త రాజకీయాలకు, నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలంటే పాత పార్టీలకు, పాత నాయకత్వాలకు వీడ్కోలు పలకాలి. తెలంగాణకు సొంతదైన రాజకీయ నాయకత్వం ఎదిగిరావాలి. ఎవరో పెడితే పార్టీ అధ్యక్షుడు అయ్యేవాడు, ఎవడో కరుణిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. తమ రాతను, తమ చేతను, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే పార్టీలు కావాలి. ఒక్క టీఆరెస్సే కాదు, ఎన్ని పార్టీలు వచ్చి నా పర్వాలేదు. తెలంగాణకు ఇంటి పార్టీలు కావాలి. ఇంటి నాయకులు కావాలి.

పొరుగింటి పార్టీలు, పరాయి నాయకులు కాదు. టీడీపీ ఎప్పటికీ ఇంటి పార్టీ కాలేదు. కాంగ్రెస్ సీమాంధ్ర భవబంధాలను ఇంకా తెంచుకోలేదు. కానీ ఇప్పటికీ టీడీపీ అబద్ధాలు ప్రచారం చేయడంలో బలమైన శక్తి. దానికి ఉన్న ప్రచార పటాటోపం చాలా పెద్దది. తాను గెలవలేకపోయినా, ఎదుటివారిని బద్నాం చేయడంలో దిట్ట. అందుకే అటువంటి శక్తులకు అవకాశం ఇవ్వకుండా టీఆరెస్ అడుగులు వేయాలి.

తెలుగుదేశం ఏమాటకూ నిలబడని పార్టీ. తెలంగాణకోసం ఏరోజూ కొట్లాడని పార్టీ. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు సగం మంది తెలుగుదేశం నాయకులపేర్లు, కాంగ్రెస్ నాయకుల పేర్లే రాసిపెట్టి చనిపోయారు. చంద్రబాబు చేసిన కుట్రలవల్ల తెలుగుదేశం ఎన్నోసార్లు వెనుకకుపోయింది. తెలంగాణ ఉద్యమంపై చంద్రబాబు నాయుడు చేయించినంత దాడి మరే పార్టీ, మరే నాయకుడూ చేయించలేదు. పోలవరానికి, తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి, సకలజనుల సమ్మె ను అమ్ముకున్నారని ఆరోపించి, ఉద్యమాన్ని నాశ నం పట్టించాలని చూసిన ఆషాఢభూతి చంద్రబాబు. అమరవీరులకు సహాయం పేరిట కొందరు 420లను ప్రోత్సహించి, ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్‌కు పిలిపించి ఛీకొట్టించిన నికష్ట చరిత్ర తెలుగుదేశం తెలంగాణ నాయకులది. వారు ఇప్పుడు శంకరమ్మ గురించి చాలా చాలా మాట్లాడుతున్నారు.

టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నిజాయితీ ఉంటే శంకరమ్మపై ఎవరినీ పోటీపెట్టవద్దు. తొలి తెలంగా ణ రాష్ట్ర శాసనసభలో ఒక అమరవీరుడి తల్లిని అడుగుపెట్టనిద్దాం. శంకరమ్మను ఏకపక్షంగా గెలిపించి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు పెట్టిన శాపాల నుంచి విముక్తిని పొందండి. పాలకుర్తి నుంచి ఎందుకు పోటీకి పెట్టలేదు అని ప్రశ్నిస్తున్నా వు కదా, నువ్వు కాకతీయ ముందు నిలువునా దహించుకున్న భోజ్యానాయక్ తండ్రికో తల్లికో పాలకుర్తి సీటు ఇవ్వకూడదా ఎర్రబెల్లీ!

తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ సాధన అంత ముఖ్యం. మనరాష్ట్రం మనకు వచ్చినా మనపై మరొకరెవరో పెత్తనం చేసే పరిస్థితి ఉంటే మనం సాధించుకోగలిగింది తక్కువ. తెలంగాణ తొలినాళ్లు రాజకీయ సుస్థిరత చాలా అవసరం. చంద్రబాబు ఆడిస్తే ఆడే మనుషులో, ఢిల్లీ పెద్దలు నడిపిస్తే నడిచే మనుషులోఅయితే తెలంగాణ గుణాత్మకమైన మార్పును సాధించలేదు. బహునాయకత్వం తెలంగాణకు అరి ష్టం. తెలంగాణకు ఒక బలమైన సొంత రాజకీయ బలగం అవసరం. టీఆరెస్ ఆ పాత్రను నిర్వర్తించగలదన్న నమ్మకం తెలంగాణవాదుల్లో ఉంది. ఈ నమ్మకాన్ని దెబ్బతీయడానికి శత్రువులు కూడా గట్టిగానే కాచుకుని ఉన్నారు. రాష్ర్టాన్ని, రాష్ట్రంలోని సహజవనరులను, భూములను ప్రపంచంలో ఎవరికయినా తాకట్టు పెట్టడానికి వెనుకాడని పెద్దమనుషులు టీఆరెస్ టిక్కెట్లు అమ్ముకుంటోందని ప్రచా రం చేస్తున్నారు. టిక్కెట్లు, అమ్మడం కొనడంలో కాంగ్రెస్, టీడీపీలను మించిన పార్టీలులేవు. యూరో లాటరీ మోసగాడు కోలా కష్ణమోహన్, నాదర్‌గుల్ కబ్జాదారు సూర్యప్రకాశ్‌రావు, స్టాంపుల కుంభకోణం సూత్రధారులతో సహవాసం చేసిన ఘనత చంద్రబాబుది. ఎమ్మెల్యే టిక్కెట్ల సంగతి దేవుడెరుగు. పార్టీకి పెట్టుబడులు పెట్టినవారికి బార్ట ర్ సిస్టం కింద రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చిన పార్టీ ఏదో రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం లో ఉండి ప్రతి చిన్న పనినీ పైసకూ పరకకూ అమ్ముకున్న చిల్లర నాయకులెవరో కూడా ప్రజలకు బాగా తెలుసు. అయినా వీరి దాడులను తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. వీరి ప్రచారంపై అప్రమత్తంగా ఉం డాల్సిన బాధ్యత తెలంగాణవాదులపై ఉంది.
[email protected]

910

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా