ఇజం కాదు, హజం


Sat,March 29, 2014 12:38 AM

ఏ విలువకూ కట్టుబడనివాడు అనేక విలువల గురించి మాట్లాడాడు. ఈయన ఇచ్చిన మాటకు నిలబడ్డాడా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థి స్తూ 2009 ఎన్నికల్లో శివమెత్తి ప్రసంగించిన పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు ఆ మాట గుర్తున్నదా? ఆయన అన్న చిరంజీవి ఎప్పుడో మాట తప్పాడు. కానీ ఆయన పార్టీ నిర్ణయానికయినా కట్టుబడి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈయన ఇంతకాలం మాట్లాడలేదు. బహుశా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడేమో అనుకున్నారు అంతా. కానీ తెలంగాణ ఇస్తుంటే ఆయన ఎంత కుమిలిపోయాడో, ఎంత కుళ్లుకున్నా డో ఆయనే తన ప్రసంగంలో వివరించాడు.
ఇది ఇజం కాదు. నిజమూ కాదు. ఒక అస్తిత్వ ప్రకటనను, ఒక స్వేచ్ఛా ఉద్యమాన్ని, స్వయంపాలనాధికారా న్ని, ప్రజాస్వామిక ప్రక్రియను గుర్తిం చ నిరాకరించే హజం. దుగ్ధ, దుఃఖం, ఉక్రోషం. ఏడుపుల్లో తేడా లేదు గమనించండి. కిరణ్‌బాబు ఏడిచిందే చంద్రబాబు, జగన్‌బాబులు ఏడిచారు. వారందరూ ఏడిచిందే ఇప్పుడు పవన్ కల్యా ణ్ ఏడిచాడు. అందరి ఏడుపు సారం ఒక్కటే. తెలంగాణ ఇవ్వడం వారికి నచ్చలేదు.
తెలంగాణ ఏర్పాటు తెలుగుజాతికి ద్రోహం. జాతి సమగ్రతకు ద్రోహం. వారి తెలుగుజాతిలో తెలంగాణ ప్రజలు ఉండరు. వారి జాతిసమగ్రతలో తెలంగాణ సమగ్రత ఉండ దు. వారి ఆత్మగౌరవంలో తెలంగాణ ఆత్మగౌరవం, ఆకాంక్షలు, ఆశయాలు ఉండవు. ఇచ్చిన తీరు నచ్చలేదన్నది ఒక సాకు మాత్రమే. అసలు ఇవ్వడమే నచ్చలేదన్నది వారి కడుపుమంట ను చూస్తే అర్థమవుతుంది. మనుషులను దూరంగా చూసి అభిప్రాయాలు ఏర్పరచుకోగూడదు.
ఒక్కోసారి దగ్గరగా చూసినా తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు. ఆయనకేమైంది సార్ పిచ్చివాడిలా అలా ఊగిపోతున్నాడు అని టీవీ చూస్తున్న మిత్రు డు ప్రశ్నించాడు. నిజమే ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా కదలకుండా ఉండలేడని ఆయన సినిమాలు చూసినా, ఆయన ప్రసంగాలు చూసినా అర్థమవుతుంది. రాసుకొచ్చింది స్క్రిప్టే అయినా ఆయన నాయకుడి పాత్రలో ఎంతబాగా జీవిస్తున్నా రో చూడండి అని మరో జర్నలిస్టు మిత్రుడి విసురు. నాకు మాత్రం ఎందుకో ఇవన్నీ జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.
ఆయన చేగువేరాను అభిమానిస్తాడని, గద్దర్ పాటలు ఇష్టపడతాడని, పుస్తకాలు బాగా చదువుతాడని చెబుతుంటే ఒకింత అభిమా నం కలిగింది. అలనాడు అన్నపార్టీ సభల్లో ఆవేశం గా ప్రసంగిస్తుంటే మనిషిలో ఏదో శక్తి ఉంది అనిపించేది. సినిమాల్లో నటిస్తుంటే జీవిస్తున్నాడనిపించేది. అలా మొదలైన భావన...ఎక్కడి నుంచి ఎక్కడి దాకా.
చేగువేరా నుంచి జగ్గారెడ్డిదాకా, గద్దర్, గాంధీ ల నుంచి నరేంద్రమోడీ దాకా.... పొట్టవిప్పి చూసే దాకా తెలియదు...ఆకాశంబున నుండి శంబుని శిరంబందుండి..పవనాంధోలోకమున్ దాకా ఆయ నే కనిపించాడు.పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్ అని భర్తహరి రాస్తే ఏమో అనుకున్నాం. ఇప్పుడు అనుభవం అవుతున్నది. పరీక్షా సమయం వచ్చినప్పుడే మనుషుల నిజస్వరూపాలు బట్టబయలవుతా యి.
ఏ విలువకూ కట్టుబడనివాడు అనేక విలువల గురించి మాట్లాడాడు.
ఈయన ఇచ్చిన మాటకు నిలబడ్డాడా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థి స్తూ 2009 ఎన్నికల్లో శివమెత్తి ప్రసంగించిన పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు ఆ మాట గుర్తున్నదా? ఆయన అన్న చిరంజీవి ఎప్పుడో మాట తప్పాడు. కానీ ఆయన పార్టీ నిర్ణయానికయినా కట్టుబడి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈయన ఇంతకాలం మాట్లాడలేదు. బహుశా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడేమో అనుకున్నారు అంతా. కానీ తెలంగాణ ఇస్తుంటే ఆయన ఎంత కుమిలిపోయాడో, ఎంత కుళ్లుకున్నా డో ఆయనే తన ప్రసంగంలో వివరించాడు. నమ్మిన విలువలకోసం శ్వాస ఉన్నంతవరకు పోరాడతాడట.
నిజమా? తెలంగాణ ఇస్తామని చెప్పింది-నమ్మి ఇచ్చిన విలువ కాదా సామీ? మీ అన్న తెలంగాణపై మాట మార్చినప్పుడు, పార్టీని కాంగ్రెస్ గంగలో కలుపుతున్నప్పుడు విలువలు ఏ షూటింగులో కమ్మేశావు సామీ? తమరు అప్పుడెప్పుడూ ఎందు కు మాట్లాడలేదు సామీ? తమకు అప్పుడప్పుడే ఎందుకు పూనకం వస్తుంది సామీ? తమరు తెలుగు ప్రజలను విడదీశారని నిజంగానే బాధపడుతున్నారా? బంధాలు, అనుబంధాల మీద మీకు నమ్మకం ఉందా సామీ? ఏ బంధాలను కాపాడారు సామీ మీరు? కనీసం మీ అన్నతమ్ముల అనుబంధాన్ని కాపాడావా సామీ? పాపం గాంధీగారు... నరేంద్ర మోడీయే మహాత్మాగాంధీగారిని వదిలేసి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఎత్తుకున్నారు.
జాతి గుండెల్లో మహాత్ముడి స్థానాన్ని ఎలాగూ తగ్గించలేము కాబట్టి, పటేల్ స్థానాన్ని పెంచుదామని ఆయన కంకణం కట్టుకున్నాడు. దేశం లో ఏ నాయకుడికీ లేని మహోన్నత ఉక్కు విగ్రహాన్ని స్థాపించడానికి ఇనుపముక్క లు సేకరిస్తున్నాడు. గాంధీయిజంపై ఎంతమాత్రం నమ్మకంలేని నరేంద్రమోడీని కీర్తిస్తూ అదే నోటితో గాంధీయిజం గురించి మాట్లాడాడు ఈ బాబు. పరస్పర విఘాత, విరుద్ధ, వికల భావాల పుట్టగా దొరికిపోయాడు పవన్ కల్యాణ్. అర్థం అయ్యీ కాకుం డా ఉండడం కంటే పూర్తిగా అర్థం అయితే అందరికీ మంచిది.
పవన్ కల్యాణ్ ఉపన్యాసం-2 విన్న తర్వాత మరోసారి అర్థం అయింది ఏమంటే, తెలంగాణ సాధించాల్సింది చాలా ఉంది. కొట్లాడాల్సింది మిగి లే ఉంది. పవన్ కల్యాణ్ ప్రసంగానికి రెండు రోజుల ముందు శ్రీమాన్ చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌లో మహోపన్యాసం చేశారు. తెలంగాణలో బీసీ రామబాణం వేశానని దానికి తిరుగులేదని ప్రకటించాడు. తెలంగాణను తానే అభివద్ధి చేస్తానని కూడా చెప్పాడు. అక్కడ శ్రీకాకుళం వెళ్లి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టారని రొదపెట్టాడు. అంటే తెలంగాణ ఇప్పటికీ చంద్రబాబు చేతిలో విల్లుగానే ఉంది.
తెలంగాణ నాయకులను ఇప్పటికీ తన అంబులపొదిలోని బాణాలుగానే భావిస్తున్నారు. ఆయన పార్టీకే చెందిన గాలి ముద్దుకష్ణమ వంటి నాయకులు తమకు మళ్లీ అధికారం ఇస్తే తెలుగు ప్రజలను కలుపుతామని ప్రకటనలు చేస్తున్నారు. తనకు తాను చాల ఊహించుకుని జైసపా-జైసమైక్యాంధ్ర పార్టీ (జైసఫా అనకూడదు సుమా)ని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తెలుగు ప్రజలు తిరిగి ఒక్కటవుతారని చెబుతున్నాడు. తెలుగు ప్రజలు ఒక్కటి కావడం సంగతి దే వుడెరుగు... ఎవరయినా మిగులుతారో లేదో చెప్పే పరిస్థితిలో ఆయన లేరు.
నిన్నమొన్నటి దాకా ఆయన పక్కన నిలబడి పోట్లెద్దుల్లా కాలుదువ్విన వీర సమైక్యాంధ్ర వాదులంతా చంద్రబాబు గూటికి చేరిపోతున్నారు. చివరికి ఈయన కూడా చంద్రబాబు మద్దతు కోరవలసి వస్తుందేమో తెలియదు. పవన్ కల్యాణ్ కూడా దాదాపు అలాగే మాట్లాడారు. ఇరవై యేళ్ల తర్వాత మళ్లీ వేర్పాటు ఉద్యమాలు రావని నమ్మకం ఏమిటి? అని ప్రశ్నించారు. సీమాంధ్ర రాజకీయ నాయకత్వం ఎంతగా కకావికలైపోయారో, ఎంతగా కలత చెందారో వారి స్పందనలు చూస్తే అర్థమవుతుంది.
ఇది వారు తీసుకున్న గొయ్యే. వారు సష్టించుకున్న భావ దారిద్య్రమే. ఇచ్చినమాటకు నిలబడలేని దివాలాకోరుతనం పర్యవసానమే. రాష్ట్ర విభజన అనివార్యతను సీమాంధ్ర ప్రజలకు వివరించి
ప్రజాస్వామ్యబద్ధంగా వారికి నమ్మకం కలిగించలేకపోయిన చేతగానితనమే. అయినా తెలంగాణపై వారికి కక్ష ఉంది. తెలంగాణను ఆగం పట్టించే ఉద్దేశం ఉంది.
తెలంగాణను తిరిగి చేజిక్కించుకోవాలన్న తపన ఉంది. తెలంగాణ ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా నిలబడకుండా చూసే కుట్ర ఉంది. అందుకు వారు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఆ విషయంలో అంద రూ ఒక్కటవుతారు. వారిని ప్రతిఘటించే తెలంగాణ రాజకీయ శక్తి ఒకటి ఇక్కడ బలంగా నిలబడి ఉండాలి. తెలంగాణ ఎజెండాను అమలు చేయగల దమ్మున్న రాజకీయ శక్తులు బలపడాలి. అందుకు నిరంతర అప్రమత్తత అవసరం.
[email protected]

711

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా