గెలవాల్సింది చాలా ఉంది


Sat,March 22, 2014 12:22 AM

చంద్రబాబు, బిజెపిలు కలిసినా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్ల. అయినా తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలి. మీలో మీరు ఎంతయినా
కలహించుకోండి. విమర్శించుకోండి. ఎన్నికల్లో పోరాడండి. ప్రజల విశ్వాసాన్ని పొందండి. కానీ మరోసారి సీమాంధ్ర ఆధిపత్య శక్తులకు మాత్రం మన జుట్టును అందించే కుట్రలో భాగస్వాములు కాకండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి.


తెలంగాణ విముక్తి పూర్తికాలేదు. సీమాంధ్ర ఆధిపత్యం నశించనంతవరకు తెలంగాణ విముక్తి కాలేదనే అర్థం. తెలంగాణ వచ్చిందంటున్నారు సరే- ఏం మారింది? ఆ నాయకుల పెత్తనం పోలేదు. ఆ నాయకుల ఎత్తులు ఆగలేదు. ఆ పార్టీలు ఇంకా కొనసాగుతున్నాయి . ఆ చానె ళ్లు మోగుతున్నాయి. ఆ పత్రికల రాతలు సాగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాకు పెద్దగా మార్పు ఏమీ కనిపించడం లేదు. చంద్రబాబునాయుడు నుంచి, ఆయన కుట్రల నుంచి తెలంగాణ విముక్తి కాలేదు. ఆయన పార్టీ నుంచి తెలంగాణ స్వేచ్ఛను పొందలేదు.
ఆధిపత్య చానెళ్ల దాడి ఆగిపోలేదు. ఆ పత్రికల థాట్ పోలీసింగ్ ఆగిపోలేదు...వీళ్లెవరూ కనిపించని ఉదయాన్ని చూడాలనుకుంటున్నా...అప్పటిదాకా తెలంగాణ రానట్టే- ఇది ఒక తెలంగాణవాది ఆక్రోషం. ఈ అభిప్రాయం తీవ్రంగా, అప్రజాస్వామికంగా అనిపించింది. అదేమాట అంటే వాళ్లకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదు సార్. ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటుగా చిత్రీకరించగలరు. వెన్నుపోటును ప్రజాస్వామ్యంగా మల్చగలరు.
వాళ్లు పక్కన ఉన్నంతకాలం ఎవరినీ నిమ్మళంగా బతకనీయరు అని ఆయన ఇంకా గట్టిగా వాదించారు. అతని అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒకటి మాత్రం నిజం-తెలంగాణ అన్ని ఆధిపత్యాలనుంచి విముక్తి కావలసిన అవసరం అయితే ఉంది. రాజకీయాధిపత్యం, భావజాల ఆధిపత్యం, వ్యాపారాధిపత్యం....ఇవి వదిలించుకోనంతవరకు ఆధిపత్య భూతం తెలంగాణ సమాజాన్ని వేధిస్తూనే ఉంటుం ది. అనేక రూపాల్లో శాసిస్తూనే ఉంటుంది. వీటన్నింటిలో ఇప్పటికీ వారే శక్తి మంతులు. తిమ్మిని బమ్మిని చేయగల చాతుర్యం వారికి ఉంది.
ప్రసార, ప్రచార ఆయుధ వ్యవస్థలు వారి చేతుల్లో ఉన్నాయి. తమవారి తప్పులను దాచిపెట్టి, ఎదుటివారి తప్పులను గోరంతలు కొండంతలు చేయగల అనకొండలు అవి. వారితో యుద్ధం చేయగల పూర్తిస్థాయి వ్యవస్థలు, తెలివితేటలు తెలంగాణ రాజకీయ పార్టీలకు ఇంకా అలవడలేదు. భావజాల యుద్ధంలో గెలవకుండా రాజకీయ యుద్ధాల్లో గెలవడం కష్టం. ఇతిహాసమూ, చరిత్ర చెప్పింది కూడా ఇదే. యుద్ధం ప్రారంభానికి ముందు దేశమంతా చాటింపులు వేయిస్తారు. తమ సైన్యం ఎంత పెద్దదో, ఎంత శక్తివంతమైనదో ప్రచారంలో పెడతారు. సింహనాదా లు చేస్తారు. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే రకరకాల నాదాలతో హోరుపుట్టిస్తారు. అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇవన్నీ ప్రత్యర్థులను మానసికం గా గెలవడానికి. మానసిక యుద్ధంలో గెలవగల నేర్పును, వ్యవస్థలను తెలంగాణ ఆవిష్కరించుకోవాలి. అప్పటిదాకా సంపూర్ణ తెలంగాణ రానికిందే లెక్క.
చంద్రబాబునాయుడు గత కొద్దిరోజులుగా మాట్లాడుతున్న విషయాలను గమనిస్తే తెలంగాణ విముక్తి కాలేదని ఎవరికయినా అర్థమవుతుంది. హైదరాబాద్‌ను ఆయనే అభివద్ధి చేశాడట. హైదరాబాద్‌ను ఎవరినీ దోచుకోనివ్వడట. హైదరాబాద్‌ను అభివద్ధి చేసింది కేసీఆర్ కుటుంబం కోసం కాదట. మహిళలను ఆయనే రక్షిస్తాడట. చింతచచ్చినా పులుపు చావలేదనడానికి ఆయన మాటలు నిదర్శనం. అభివద్ధికి ఒక పార్శం గురించి మాత్ర మే మాట్లాడుతున్నాడు.
ఆయన చేసిన విధ్వంసం గురించి మరచిపోతున్నాడు. హైదరాబాద్‌లో 17 ప్రభుత్వ రంగ సంస్థలను మూయించింది చంద్రబాబే. ఆ కంపెనీల భూములను తేరగా అనుచరులకు కట్టబెట్టిందీ చంద్రబాబే. వేలాది మంది ఉద్యోగులను వీధుల పాలు చేసిందీ చంద్రబాబే. హైదరాబాద్‌ను వలస కాలనీగా మార్చిందీ చంద్రబాబే. హైదరాబాద్‌ను పరాయీకరణ చేసింది చంద్రబాబే. లక్షల ఎకరాల భూమిని మాయం చేసిందీ చంద్రబాబే.
అసైన్‌మెంట్ భూములు, భూదాన్ భూములు, వక్ఫ్ భూములు, పాయిగా భూములు, సర్ఫెఖాస్ భూములు, పాకిస్థాన్‌కు పారిపోయినవారి భూములు అన్యాక్రాంతం అవుతుంటే వారికి సర్టిఫికెట్లు ఇస్తూ వచ్చిందీ చంద్రబాబు ప్రభుత్వమే. ఆక్రమించుకో క్రమబద్దీకరించుకో అన్న నినాదాన్ని అమలు చేసిన మహానుభావుడు ఆయన. ఆయన స్వయంగా ఉత్తచేతులతో హైదరాబాద్ వచ్చి హెరిటేజ్‌లకు, ఎస్టేట్‌లకు అధిపతి అయ్యాడు. అదేసమయంలో తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రపంచం దష్టిని ఆకర్షించిందీ బాబుగారి పాలనలోనే.
మహిళలపై అత్యాచారాలలో దేశంలో నాలుగవస్థానంలో ఉన్నాం ఆయన హయాంలోనే. ప్రత్యూష కేసు అప్పుడే మరచిపోతామా? బెల్లి లలితను చంపి ముక్కలు ముక్కలు చేసి ఏడు బావుల్లో వేసిన విషయం జరిగిందీ బాబు రాజ్యంలోనే. విద్యుత్ ఉద్యమకారులపై జరిగిన కాల్పులు మరచిపోగలమా? చంద్రబాబును తెలంగాణ ఎప్పుడూ మరచిపోదు. మరచిపోకూడదు.
చంద్రబాబు కూడా తెలంగాణను మరచిపోవడానికి సిద్ధంగా లేడు. తెలంగాణను వదిలే సమస్యే లేదట. ఈరోజు ఒక మిత్రుడు చెప్పిన వాదన వింటే భయమేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఇంకా ముప్పు తొలగిపోలేదని ఆ మిత్రుడు చెప్పిన వాదన సారాంశం. రెండు ప్రాంతాల్లో తెలుగుదేశానికి, బిజెపికి కలిపి 150కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఫలితాలు వస్తాయి.
జూన్ రెండు విభజన తేదీలోపే రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి తేవాలని వారి ఎత్తుగడ. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రం లో బిజెపి వస్తే విభజన న్యాయంగా జరగలేదని, న్యాయపరమైన సమస్యలు లేవనెత్తి విభజనపై స్టే తేవాలని, విభజనను వాయిదా వేయించాలని వారు ఆలోచిస్తున్నారు. జూన్ రెండు విభజన తేదీలోపే కోర్టు స్టే ఇస్తే విభజనను ఆపేయవచ్చునని వారు ఆశిస్తున్నారు. ఒకసారి విభజన ఆగిపోతే ఇక ఆ తర్వాత తమకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకోవచ్చునని వారు అనుకుంటున్నారు అని ఆ మిత్రుడు వివరించారు.
ఇది సాధ్యమా కాదా అన్న విషయం పక్కనబెడితే ఇలా ఆలోచించగలగడమే ఆశ్చర్యం వేసింది. అంతా అయిపోందనుకుంటున్నవారికి ఇటువంటి ఒక అవకాశం ఉందన్న విషయమే విస్మయం కలిగిస్తుంది. కానీ తెలుగుదేశం కలలు ఫలించే అవకాశమే లేదు. చంద్రబాబు, బిజెపిలు కలిసినా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్ల. అయినా తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలి. మీలో మీరు ఎంతయినా కలహించుకోం డి. విమర్శించుకోండి. ఎన్నికల్లో పోరాడండి. ప్రజల విశ్వాసాన్ని పొందండి. కానీ మరోసారి సీమాంధ్ర ఆధిపత్య శక్తులకు మాత్రం మన జుట్టును అందించే కుట్రలో భాగస్వాములు కాకండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి.
[email protected]

523

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా