పొత్తు చేటు, పోరు లాభం


Sat,March 8, 2014 12:59 AM

తెలంగాణ ఉద్యమం తెలంగాణ సమాజాన్ని మునుపెన్నడూ లేనంత జాగతం చేసింది. ప్రజలకు మాట్లాడే ైస్థెర్యాన్ని, పోట్లాడే ధైర్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వారి మనసును తెలుసుకుని, అందుకు అనుగుణం గా రాజకీయ వ్యవస్థలను నిర్మించుకోవలసిన బాధ్య త నాయకులదే. తెలంగాణను సమున్నతంగా నిలబెట్టినా, నగుబాటు చేసినా అది నాయకుల మీదనే ఆధారపడి ఉంటుంది.

ఇది కల కావచ్చు. ఆశ కావచ్చు. ఆశయమూ కావచ్చు. కానీ చాలా మందిలో వ్యక్తమవుతున్న భావన. తెలంగాణను సగౌరవంగా నిలబెట్టుకుంటామా? నవ్వుల పాలవుతామా? ఎవరు ఎన్ని చెప్పినా ఇది కేవలం నాయకుల చేతుల్లోనే ఉన్నది. నాయకుడిని బట్టే సమాజానికి, ప్రాం తానికి గౌరవం, గుర్తింపు. ఆలోచించుకునే సమ యం లేదు.ఎన్నికలు మీదికొచ్చాయి. నాయకుల మంచితనం,దీక్షాదక్షతలకు వెంటనే ఒకపరీక్ష వచ్చిం ది.నాయకత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డపేరు వచ్చినా అభ్యర్థుల ఎంపిక సమయంలోనే. ఈ పధ్నాలుగేళ్ల తెలంగాణ పోరాటం ప్రజల్లో చాలా ఆకాంక్షలను పెంచింది. చాలా మంది నాయకులను తయా రు చేసింది. ఉద్యమకారులను తయారు చేసింది. తెలంగాణ ఉద్యమం న్యాయమైన వాటా (ఫెయిర్ షేర్)దక్కకపోవడం నుంచి మొదలయింది. అది రాజకీయ పదవుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, పాలనలో కావచ్చు, నిధుల కేటాయింపులో కావ చ్చు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి, అదే ఫెయిర్ షేర్ సూత్రాన్ని మన రాజకీయాలకూ వర్తింప జేయాలి. తెలంగాణలో కొత్త రాజకీయాలకు బాటలు వేయాలి. గుణాత్మకమైన మార్పులకు పునాదులు వేయాలి. ముతక రాజకీయ శక్తులను పక్కనబెట్టి నవయువ పురోగామి రాజకీయ శక్తులను ప్రోత్సహించాలి. టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలూ ఆ దిశగా ఆలోచన చేయాలి.

ముఖ్యంగా టీఆరెస్‌పై ఎక్కువ భారమూ, బాధ్యత ఉన్నాయి. పధ్నాలుగేళ్లుగా ఉద్యమాన్ని అంటిపెట్టుకుని పోరాడినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. రెండు ప్రాంతాలలో పార్టీ ఉన్నా సీపీఐ నాయకత్వం నిక్కచ్చిగా నిలబడి పోరాడింది. న్యూడెమోక్రసీ నాయకులు అన్ని ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమాలలో ముందుండి పోరాడి, జీతభత్యాలను కోల్పోయిన వివిధ సంఘాల, జేఏ సీల నాయకులూ ఉన్నారు. అన్ని కుల సంఘాలు, సామాజిక వర్గాలు ఉద్యమానికి అనేక సందర్భాల్లో అండదండగా నిలబడ్డాయి. వీరు సహజంగానే రాజకీయాల్లో ప్రాతినిథ్యం ఆశిస్తారు. అది వాంఛనీయం కూడా. పొత్తులు, ఐక్యతలు వీళ్లకు పరిమితం చేస్తే మేలు.ఐక్యతా యత్నాల్లో, అభ్యర్థుల ఎంపికలో అం దరి ఆకాంక్షలూ ప్రతిఫలించాలి. అన్ని వర్గాలకూ ఫెయిర్ షేర్ లభించాలి. బయటివాడు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల పోరాటానికి వెళ్లాలి.
కాంగ్రెస్, బీజేపీలదీ ఇదే పరిస్థితి. ఈ సంఘాలు, వర్గాలు ఆ పార్టీల నుంచి కూడా రాజకీయ భవిష్యత్తును ఆశిస్తున్నాయి. బీజేపీలోకి కొత్త రక్తం చాలా వస్తున్నది. పొత్తును కోరడమంటే బీజేపీ తన గొయ్యి ని తాను తవ్వుకోవడమే. 1998లో 18 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 1999లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని ఎలా పతనమయిందో ఆ పార్టీకి గుర్తుండి ఉండాలి. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తెలంగాణలో భవిష్యత్తు లేని పార్టీలు. సీమాంధ్ర నాయకత్వంలో నడిచే ఆపార్టీలను తెలంగాణ ప్రజలు ఇక ఎన్నటికీ ఆదరించరు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తికి ఆ పార్టీల మనుగడ వ్యతిరేకం. అక్కడో ఇక్కడో నాయకుల వ్యక్తిగత బలంతో కొంతమంది నెగ్గుకు రావచ్చు, కానీ దీర్ఘకాలికంగా అవి మనలేవు. ఇవన్నీ జరగాలం ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించడం మానా లి. పొత్తులు ఎవరికీ మేలు చేయవు. పొత్తులతో గతంలో తెలంగాణవాదులకు చాలా నష్టం జరిగిం ది. టీఆరెస్ పదేపదే మోసపోయింది. ఈ పొత్తులే కొత్త రాజకీయాలు ఆవిర్భవించకుండా, కొత్త శక్తులు ఎదగకుండా అడ్డుకున్నాయి. పొత్తులు యథాతథస్థితిని కొనసాగిస్తాయి. రాజకీయాల్లోకి కొత్తనీరు రాదు.

రెండు పెద్ద పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఒక పార్టీ ఓట్లు మరోపార్టీకి బదిలీ కావు. ఒకవేళ వేద్దామనుకున్నా నాయకులు వేయనివ్వరు. 2009 ఎన్నిక ల్లో టీడీపీ కావాలని పొత్తు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం టీఆరెస్ అభ్యర్థులను ఓడించడానికి పనిచేసింది. టీఆరెస్ అభ్యర్థులకు ఓట్లు పడకుండా చూడడానికి ఎన్‌టిఆర్ భవన్ నుంచి ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్‌లో కూడాఅటువంటి ఘనులు ఉన్నారు. ఆ పార్టీలోనే ప్రతి జిల్లాకు రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. ఒకరి కాళ్లు ఒకరు నరుక్కోవడానికి వాళ్లు చాలాకాలంగా కాచుకుని కూర్చున్నా రు. అది కాంగ్రెస్ సమస్య. తెలంగాణలో నిలబడాలంటే ఆ పార్టీ కూడా ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడక తప్పదు. కానీ అది కూడా స్వతంత్రం గా ఎన్నికలకు వెళ్లినప్పుడే సాధ్యం. తెలంగాణ కాం గ్రెస్‌కు ఒక సమర్థ నాయకత్వం ఎదగలేదు. ఎదిగే అవకాశం రాలేదు. అందరూ గుంపులోగోవిందయ్య ల్లాగే ఉండిపోయారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎవరో ఒకరు నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి.


పొత్తుల వల్ల తెలంగాణకు మరో నష్టం కూడా ఉండే అవకాశం ఉంది.ఇక్కడ కాంగ్రెస్-టీఆరెస్ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ఎన్డీఏ వస్తే తెలంగాణ ప్రతిపక్ష రాష్ట్రమైపోతుంది. తెలంగాణకు ఏదైనా సాధించుకోవడం కష్టమవుతుం ది. పొత్తు సోనియాగాంధీ రుణం తీర్చుకోవడం కోసమే అయితే టీఆరెస్ ఎన్నికల తర్వాత కూడా తీర్చుకోవచ్చు. రాహుల్‌గాంధీ అధికారంలోకి రావడానికి టీఆరెస్ మద్దతు అవసరమయితే అప్పుడు తప్పనిసరిగా సమర్థించవచ్చు. కానీ ఇప్పుడు రెండు పెద్ద పార్టీల మధ్య పొత్తులు తెలంగాణకు ఏవిధంగా నూ మేలు చేయవు. తెలంగాణలో బహుముఖ పోటీలు జరగనీయండి. పెద్ద పార్టీలు పొత్తులు పెట్టుకుని వారిన్ని, వీరిన్ని సీట్లు తెచ్చుకుని తొలి అసెంబ్లీ నే కప్పల తక్కెడగా మార్చకుండా ఉంటే మంచిది. తెలంగాణలో ఏప్రభుత్వం వచ్చినా చేయాల్సింది చాలా ఉన్నది. తెలంగాణ నుంచి సీమాంధ్ర ఆధిపత్య మూలాలను సమూలంగా తొలగించడానికి చాలా సమయం పడుతుంది. ఇవన్నీ జరగాలంటే ఉద్యమస్ఫూర్తిని మరో పదేళ్లయినా పుణికి పుచ్చుకుని పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలు ఆశిస్తున్నవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.

ఏదైనా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలంటే ఏదో ఒక పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావాలి. అందుకోసమైనా టీఆరెస్, కాంగ్రెస్,బీజేపీ లు వేర్వేరుగానే ప్రజల తీర్పును కోరడం తెలంగాణ భవిష్యత్తుకు మంచిది. తమకు ఎవరు కావాలో ప్రజలను నిర్ణయించుకోనిద్దాం. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి అన్ని పార్టీలూ తమ ఎజెండాలను ప్రకటించాలి. మనకు ఏయే అన్యాయాలు జరిగాయని చెప్పి ఇంతకాలం పోరాడామో, ఆ అన్యాయాలను సరిదిద్దడానికి ఏమి చేస్తారో, ఎప్పటిలోగా చేస్తారో అన్ని పార్టీలూ మేనిఫెస్టోల్లో ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ సమాజాన్ని మునుపెన్నడూ లేనంత జాగతం చేసింది. ప్రజలకు మాట్లాడే ైస్థెర్యా న్ని, పోట్లాడే ధైర్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వారి మనసును తెలుసుకుని, అందుకు అనుగుణం గా రాజకీయ వ్యవస్థలను నిర్మించుకోవలసిన బాధ్య త నాయకులదే. తెలంగాణను సమున్నతంగా నిలబెట్టినా, నగుబాటు చేసినా అది నాయకుల మీదనే ఆధారపడి ఉంటుంది.
[email protected]

727

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా