విలీనమా? స్వాధీనమా?


Sat,March 1, 2014 12:25 AM

తెలంగాణ సమస్య రాష్ట్రం ఏర్పాటుతో పూర్తి కాదు. చేయవలసిందంతా రాష్ట్రం వచ్చిన తర్వాతనే. మన అస్తిత్వాన్ని మనం ప్రకటించుకోవాలి. మన చరిత్ర మనం రాసుకోవాలి. మన సాంస్కతిక మూలాల ను తిరిగి ప్రతిష్టించుకోవాలి. మనపై రుద్దిన ఆధిపత్య సాంస్కతిక మూలాలను కడిగెయ్యాలి. మన నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు దక్కేందుకు కంకణం కట్టుకుని పనిచేయకపోతే తెలంగాణ ప్రజలు త్వరలోనే ప్రత్యేక రాష్ట్రంపై భ్రమలు కోల్పోయే ప్రమాదం ఉంది.

తెలంగాణ సాధించాము, సరే. అది ఎలా ఉండాలి? ఏమి చెయ్యా లి? ఎవరు చెయ్యాలి? చాలామంది ని ఈ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. తెలంగాణ వచ్చిన ఆనందం టీఆరెస్, కాంగ్రెస్ విలీనం ఊహాగానాలతో ఆవిరయింది. తెలంగాణ దేని కోసం తెచ్చుకున్నాం? రాష్ర్టాన్ని వానపాముల చేతిలో పెట్టడానికా? సోనియాగాంధీకి రుణపడి ఉండాలి సరే... తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎందుకు రుణపడి ఉండా లి? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టీఆరెస్‌తో దీటుగా నిలబడి కొట్లాడి ఉంటే మరో ఐదారేళ్లు ముందుగా తెలంగాణ వచ్చి ఉండేది. ఇంతమంది పిల్లలు చనిపోయి ఉండేవారు కాదు-ఇది ఒక తెలంగాణవాది ఆక్రోశం. నిజమే తెలంగాణ దేనికోసం? ఆత్మగౌరవం కోసం, స్వయంపాలనాధికారం కోసం. సీమాంధ్ర ఆధిపత్య శక్తుల నుంచి విముక్తి కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వీటన్నింటినీ పునరుద్ధరించుకునే అవకాశం ఇచ్చింది.

ఈ అవకాశాన్ని మళ్లీ ఢిల్లీకి తాకట్టు పెట్టాలా? ఢిల్లీ నేతలు మాట్లాడుతున్న ఆధిపత్య భాష ఏమైనా భాగున్న దా? తెలంగాణ రాజకీయాలతో వారు ఆడుతున్న ఆటలు సీమాంధ్ర నాయకులు ఆడిన ఆటలకు భిన్నంగా ఉన్నాయా? ఒకనాడు తెలంగాణకు వ్యతిరేకంగా రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు చేసిన ఎత్తుగడలకు ఇప్పుడు ఏఐసీసీ నేతలు వేస్తున్న ఎత్తుగడల కు ఏమైనా తేడా ఉన్నదా? పదమూళ్లుగా అనేక ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకుని రాజకీయం గా నిలదొక్కుకున్న ఒక రాజకీయశక్తిని కేవలం ఫిరాయింపులు ప్రోత్సహించి, ఒత్తిడి పెంచి లొంగదీసుకోవడం సాధ్యమేనా? అది సాధ్యమైతే తెలంగాణ ఎందుకు? సాధించుకుని ఏమి ప్రయోజనం? సోనియాగాంధీ తల్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు సాధ్యమయ్యేది కాదన్నది వాస్తవం. ఆమెకు తెలంగాణ రుణపడి ఉండాలన్నది న్యాయమే. అందుకు ఆమె విగ్రహాలు పెట్టుకుందాం. ఆమెకు ఆపద వచ్చినప్పుడు అండగా ఉందాం. ఆమె కుమారుడు తెలంగాణ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుందాం. కానీ రాజకీయ స్వాతంత్య్రాన్ని స్వాధీనపర్చడం తెలివైన పనికాదు.

టీఆరెస్, కాంగ్రెస్ విలీనం వల్ల తెలంగాణకు రెండు రకాల ప్రమాదాలున్నాయి. కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణ ప్రజలు ఇన్నేళ్లు ఏ స్వయంపాలనాధికారంకోసం పోరాడారో అది తెలంగాణకు దక్కదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కొద్ది మం ది ఎంపీలకు తప్ప చాలా మందికి తెలంగాణవాదానికి సంబంధించిన మూలాల గురించి అవగాహన ఎంతమాత్రం లేదు. వారంతా రాజకీయావసరాలకోసం తెలంగాణవాదం ఎత్తుకున్నవారే తప్ప, తెలంగాణవాదాన్ని నమ్మి, ఆకళింపు చేసుకుని జైకొట్టినవారు కాదు. వారిది పెట్టు తెలంగాణవాదమే తప్ప పుట్టు తెలంగాణవాదం కాదు. తెలంగాణవాదులు ఆశించిన లక్ష్యాలను అమలు చేయడానికి వారిలో ఏ ఒక్కరికీ నిబద్ధత లేదు. ఒకవేళ టీఆరెస్ కాంగ్రెస్‌లో కలిస్తే నిజమైన తెలంగాణవాదులకు అక్కడ పెత్తనం దక్కుతుందన్న నమ్మకం లేదు. అదొక మహాసముద్రం. వీళ్లూ అక్కడ గుంపులో గోవిందయ్యలు అయిపోతారు. తెలంగాణ ఎజెం డా పలుచనయిపోతుంది. పైగా ఢిల్లీ పెద్దలు ఆడించినట్టల్లా ఆడాల్సి ఉంటుంది.

వనరుల పంపిణీ, నదీ జలాల వంటి వివాదాలు తలెత్తినప్పుడు అధిష్ఠానం చెప్పినట్టల్లా ఆడవలసి వస్తుంది. సీమాంధ్ర ఆధిపత్య శక్తుల ప్రభావాన్ని తెలంగాణ నుంచి కడిగేయడం సాధ్యం కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది సీమాంధ్ర ఆధిపత్య శక్తులతో కలసి దందాలు చేసినవారే. వారి చెప్పుచేతల్లో, వారి అదుపాజ్ఞల్లో, వారి పోషణలో బతికినవారే. వారిని కాదని కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన తెలంగాణవాదులు ఏమీ చేయలేరు. మొత్తంగా తెలంగాణలో మౌలికంగా ఎటువంటి మార్పులు సంభవించవు.

ఇక రెండవ ప్రమాదం. ఇది పెద్ద ప్రమాదం కూడా. టీఆరెస్ కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణ లో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి టీడీపీ, వైఎస్సార్సీపీ ఎప్పటిలాగే శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాయి. ఇప్పటికీ ఆ పార్టీల సీమాంధ్ర నాయకత్వం చుట్టూ తోకలు ఊపుతూ తిరిగే బానిస రాజకీయ సంతతి తెలంగాణలో ఉంది. విభజన నోటిఫికేషన్ ఆపాలని యనమల రామకష్ణ కోరుతున్న సమయానికే తెలంగాణ తెచ్చిన ఘనత తమ చంద్రబాబుదేనని ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్కడ వరంగల్‌లో ప్రకటిస్తుంటారు. ఇంకా ప్రమాదం ఏమంటే, తెలుగుదేశాన్ని గెలిపిస్తే తిరిగి తెలుగు ప్రజలను ఏకం చేస్తామని గాలి ముద్దుకష్ణమ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రకటిస్తారు. చంద్రబాబునాయుడు తెలుగుజాతి పేటెంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తనను 30 స్థానా ల్లో గెలిపిస్తే తెలుగు ప్రజలను ఏకం చేస్తానని చెబుతారు. తాము సమైక్యవాదులమేనని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనాయకులు ఇప్పటికీ చెబుతున్నారు. రేపెప్పుడయినా తెలంగాణలో, ఆంధ్రలో ఈ రెండు పార్టీలకు మెజారిటీ స్థానాలు వస్తే తెలుగుజాతి ఏకీకరణ ఉద్యమం మొదలుపెడితే తెలంగాణ ఏం కావాలి? పోరాడి సాధించుకున్న స్వయంపాలనాధికాంర ఏంకావాలి? తెలంగాణలో ఈ రెండు పార్టీల ఉనికిని ప్రశ్నించకుండా తెలంగాణ రాజకీయాల్లో మౌలిక మార్పులు రావు.

జార్ఖండ్‌లో లాలూప్రసాద్‌యాదవ్, నితీష్‌కుమార్‌లకు ఎదురయిన అనుభవం ఇక్కడ చంద్రబాబు, జగన్‌లకు ఎదురుకావాలి. చంద్రబాబు, జగన్‌రెడ్డిల సైగలకు నాట్యాలు చేసే నాయకులు ఇంకా తెలంగాణ కు అవసరమా? తెలంగాణవాదులు ఆలోచించుకోవాలి. టీఆరెస్ కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణవాదులు ఆలోచించడానికి ఇంకా ఏమీ మిగలదు. చంద్రబాబు, జగన్‌ల నెత్తిన పాలుపోసినవారవుతారు. అటువంటి పరిణామం తెలంగాణకు ఎంతమాత్రం మంచిది కాదు.
తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు లు రావాలంటే అందుకు కేసీఆరే నడుం కట్టాలి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసే పార్టీగా టీఆరెస్ బలపడాలి. దొరల రాజ్యం వస్తుందని, భూస్వాముల పాలన వస్తుందని ప్రత్యర్థు లు, కిరాయి మూకలు చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి.

సామాజిక తెలంగాణ సాధనకు కషి చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినవాళ్లు వచ్చిన తెలంగాణకు నాయకత్వం వహించకపోతే తెలంగాణ ప్రజలు మూన్నాళ్లకే భంగపడవలసి వస్తుంది. తెలంగాణ సమస్య రాష్ట్రం ఏర్పాటుతో పూర్తి కాదు. చేయవలసిందంతా రాష్ట్రం వచ్చిన తర్వాతనే. మన అస్తిత్వాన్ని మనం ప్రకటించుకోవాలి. మన చరిత్ర మనం రాసుకోవాలి. మన సాంస్కతిక మూలాల ను తిరిగి ప్రతిష్టించుకోవాలి. మనపై రుద్దిన ఆధిపత్య సాంస్కతిక మూలాలను కడిగెయ్యాలి. మన నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు దక్కేందుకు కంకణం కట్టుకుని పనిచేయకపోతే తెలంగాణ ప్రజలు త్వరలోనే ప్రత్యేక రాష్ట్రం పై భ్రమలుకోల్పోయే ప్రమాదం ఉంది.
[email protected]

532

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా