సత్యమేవ జయతే


Sat,February 22, 2014 01:19 AM

మన పత్రిక లేకపోతే మేమేమై పోయేవాళ్లమో అని ఒక పెద్దమనిషి చెప్పిన మాట నమస్తే తెలంగాణ జన్మను సార్థకం చేసింది. సీమాంధ్ర మీడియా నిరాశ నిస్పహలను, అపజయ భావనను తెలంగాణపై రుద్దేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆశల

పతాకాన్ని భుజానవేసుకుని, నమ్మకమనే కాగడాను ముందుపెట్టుకుని తెలంగాణ ప్రజలతో కలిసి నడిచింది నమస్తే తెలంగాణ. ఇదంతా మన తపస్సు.తెలంగాణలో ఈ పదేళ్లూ చాలా మందికి జీవితం ఉద్యమంలా, ఉద్య మం జీవితంలా సాగిపోయింది. అదే ధ్యాస. అదే శ్వాస. పెళ్లిల్లు, పేరంటా లు మొదలు చావుల వరకు అన్నిచోట్లా అదే మాట, అదే చర్చ. మాటలు మార్చే రాజకీయ పార్టీల నిర్వాకంపై అంతులేని కోపం. కళ్ల ముందు పిల్లలు రాలిపోతుంటే హదయం కల్లోలమైన సందర్భాలున్నా యి. నాయకుల నిర్వాకం భరించలేను. నేను చనిపోతున్నాను అని ఇంజనీరింగ్ చదివిన శ్రీకాంత్ నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో నంబరు చూసి ఫోను చేసే సమయానికే అక్కడ గుండెలవిసేలా ఏడ్పులు వినిపించాయి. తమ్ముడు చనిపోయాడని అవతలి నుంచి దుఃఖం.

ఇంటినుంచి వెళ్లిపోతున్నా అని ఒక విద్యార్థి నుంచి మెసేజ్ వస్తుం ది. రెండవరోజు మానేరులో శవం తేలుతుంది. అగ్నిశిఖల్లో దూకి నిరసన బావుటా ఎగురవేసినవాళ్లు, రైళ్లకు ఎదురెళ్లి సీమాం ధ్ర నిర్వాకాన్ని సవా లు చేసినవాళ్లు, పోలీసుల కళ్ల ముందు తానే కాగడా అయి మత్యువును ఊరేగించినవాడు, పార్లమెంటుకు అల్లంత దూరంలో ఉరిపేనుకుని ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును తట్టిలేపినవాడు... ఒకరా ఇద్దరా...... ఎంతమంది బిడ్డ లు? ఎన్ని కుటుంబా ల ఘోష? తెలంగాణ ఒక ఎడతెగని శోక సముద్రం ఒడ్డున నిలబడి చిగురుటాకులా వణికిపోయింది. ఒక అనిశ్చిత రాజకీయ ప్రపంచం ముందు నిలబడి స్వేచ్ఛకోసం విలపించింది. మొద్దుబారిన రాజ్యాంగ వ్యవస్థల ముందు సాగిలపడి సాయం కోసం ఎదు రు చూసింది. శత్రువు కుమ్మరించే అబద్ధాల కుంభవష్టిని చూసి బేలగా దిగులు చెందిన సందర్భాలున్నాయి. దుఃఖంతో కళ్లు చెమ్మగిల్లిన సందర్భాలున్నాయి. రౌద్రంతో విరుచుకుపడిన క్షణాలున్నాయి. గుండె చెదరి ఏదో ఒక ధ్వంస రచన చేయాలని పిలుపునిచ్చిన మిత్రులు ఎందరో. ఎప్పటికయినా గెలుస్తామ న్న నమ్మకమే వీటన్నిటినీ జయించే శక్తిని ఇచ్చింది.

సత్యమేవ జయతే అన్నది తెలంగాణ విషయంలో జరుగుతుందనిపించింది. తెలంగాణవాదానికి బలం పోయడానికి, తెలంగాణ వ్యతిరేకుల మౌఢ్యా న్ని తిప్పికొట్టడానికి కొన్నిసార్లు కటువుగా, తీవ్రంగా రాయవలసి వచ్చింది. ఎందరో మిత్రులు దూరమయ్యారు. కొత్తగా ఎందరో మిత్రులయ్యారు. అయి నా తెలంగాణ డిమాండు ఒక ధర్మం. చివరగా ధర్మం జయించింది.
ఏ ఉద్యమానికయినా ఒక చోదకశక్తి ఉంటుంది. ఒక కేంద్ర బిందువు ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి రెండూ కేసీఆరే. ఈ దశాబ్దంలో రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ చుట్టూ పరిభ్రమింపజేసిన రాజకీయ శక్తి ఆయన. అన్ని పార్టీలతో జై తెలంగాణ అనిపించిన ధీశాలి. తెలంగాణ లక్ష్య సాధనకు ఓటు ను ఆయుధంగా, ప్రజాస్వామిక పంథాను ప్రమాణంగా, శాంతిని మంత్రంగా ఆయన ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పుడప్పుడూ మాట లు మీరవచ్చు కానీ ఎప్పుడూ చేతలు అదుపుతప్పకుండా చూశారు.

ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా, ఎన్ని ఎదురు దెబ్బలుతిన్నా మళ్లీ మళ్లీ ఆయన ఎన్నికలనే ఆశ్రయించారు. ఉద్యమాలతో కలసి నడుస్తూ నే, అవి దారి తప్పుతాయనుకున్నప్పుడు, తన చేయిజారిపోతాయనుకున్నప్పుడు ఆయన దూరం జరుగుతూ వచ్చారు. రెండడుగులు వెనుకకు వేయ డం మూడడుగులు ముందుకు నడవడానికేనని ఆయన ప్రతిసందర్భంలో రుజువు చేస్తూ వచ్చారు. శత్రువు చేతికి చిక్కకుండా ఇంత దూరం ఉద్యమా న్ని నడిపించి, చివరికి శత్రువును చిక్కుల్లో పడేయ డం ఆయన సాధించిన గొప్ప విజయం. ఆధునిక భారత రాజకీయాల్లో తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రాత్మక విజయం. కేసీఆర్‌పై శత్రువులు ఎందుకు అంత గా దాడిచేశారో, ఎందుకు అన్ని అపనింద లు కురిపించారో తెలంగాణ పురిటినొప్పులు చూస్తే అర్థమవుతుంది.

కేసీఆర్ ఢీకొన్నది ఎంతటి బలమై న ప్రత్యర్థులనో గత ఆరుమాసాలుగా ఢిల్లీలో జరుగుతూ వచ్చిన పరిణామాలు చెప్పకనే చెబుతాయి. కేసీఆర్ రాజకీయ శక్తి అయితే కోదండరామ్ ఉద్య మ శక్తి. జయశంకర్‌సార్ భావజాల ఉద్యమానికి ఆద్యులు. సీపీఐ, బిజేపీలు నిజాయితీగా తెలంగాణకోసం నిలబడి కొట్లాడారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నా నమ్మిన విధానం కోసం ఇక్కడా అక్కడా నిర్భయంగా ఒకే మాటమాట్లాడిన ఏకైక నాయకుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. ఉద్యోగులు, అధ్యాపకులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, విద్యావంతులు, వైద్యులు, విద్యార్థులు, జర్నలిస్టులు ఆయా సందర్భాల్లో ఉద్యమ విస్ఫులింగాల్లా పనిచేశారు. ఉద్య మ జ్వాల బలహీనపడుతున్నప్పుడల్లా వారే ఆజ్యమయ్యారు. గద్దర్ ఒక సాంస్కతిక యుద్ధనౌక. ఆయన ఆట పాట మాట ఒక స్ఫూర్తి. గోరటి వెంకన్న, అంద్శైలు అక్షరాలకు స్వరాలు కట్టి పాటల ప్రవాహాలు పుట్టించిన కవిరాజులు. రసమ యి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, విమలక్క, సంతో ష్...ఇలా ఎందరో... ఒక్కొక్కరు ఒక్కో సాంస్కతిక సైనికుడు. అందరూ ఉద్యమ దీపం నిరంతరం ఆరిపోకుండా చేతులు అడ్డంపెట్టి నడిపించిన వారే.

భావజాల యుద్ధంలో నమస్తే తెలంగాణ నిర్వర్తించిన పాత్ర అసాధారణమైనది. సీమాంధ్ర మీడి యా అసత్యాలు, అర్ధ సత్యాలు, వక్రీకరణలు గుప్పించి తెలంగాణ ప్రజాబాహుళ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో నమస్తే తెలంగాణ నేనున్నానంటూ వచ్చింది. ఇది నడవదని, నాలుగురోజుల్లో మూతపడుతుందని ఎగతాళి చేసిన సీమాం ధ్ర పెద్ద మనుషులు ఉన్నారు. పత్రికను నడపడం తమకు మాత్రమే తెలిసిన విద్య అని విర్రవీగినవారున్నారు. నిజమే పత్రిక నడపడం అంటే కోట్లు కుమ్మరించి రూపాయలు ఏరుకోవడం. తెలంగాణలో అలా చేయగలిగినవారెవరూ లేరని సీమాంధ్ర యాజమాన్యాల ధీమా. అవును. సీఎల్ రాజంగారు పత్రిక భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకోకపోతే తెలంగాణ తన గొంతును ఎప్పుడో కోల్పోయి ఉండే ది. ఆయన స్వయంగా తెలంగాణ వాది. 1969లో జైలుకెళ్లినవారు. తెలంగాణ రావాలని పంతం ఉన్నవారు. అందుకే ఆయన పట్టుదలగా ఈ పత్రికను మీదేసుకుని నడిపించారు. తెలంగాణ గొంతుకగా, ఆత్మగౌరవ ప్రతీకగా నమస్తే తెలంగాణ సీమాంధ్ర మీడియా దాడులను ఎప్పటికప్పుడు పూర్వపక్షం చేస్తూ వచ్చింది.

ఉద్యమ శక్తులకు చారిత్రక సత్యాలను, సమాచారాన్ని, వాదాలను అందిస్తూ వచ్చిం ది. బాబూ. నాకు డెబ్బయ్యేళ్లు. ఉద్యమాలు చెయ్యలేను. శ్రీశైలం కుడి ఎడమ రెండూ ఆంధ్రవే అన్న వార్తను చూసినప్పటి నుంచి నా మనసు కుతకుత ఉడికిపోతోంది. ఇవ్వాళ పొద్దున మన పత్రిక చూసిన తర్వాత మన సు కుదుటపడ్డది. మన పత్రిక లేకపోతే మేమేమై పోయేవాళ్లమో అని ఒక పెద్దమనిషి చెప్పి న మాట నమస్తే తెలంగాణ జన్మను సార్థకం చేసింది. సీమాంధ్ర మీడియా నిరాశ నిస్పహలను, అపజయ భావనను తెలంగాణపై రుద్దేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆశల పతాకాన్ని భుజానవేసుకుని, నమ్మకమనే కాగడాను ముందుపెట్టుకుని తెలంగాణ ప్రజలతో కలిసి నడిచింది నమస్తే తెలంగాణ. ఇదంతా మన తపస్సు.
మరి వరమిచ్చినవారు? ప్రణబ్ ముఖర్జీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్‌మోహన్‌సింగ్, దిగ్విజయ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, సురవరం సుధాకర్‌రెడ్డి, మాయావతి, మీరాకుమార్, సీజే కురియన్...ఇంకా అందరికీ పేరు పేరునా వందనాలు.
[email protected]

593

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా        


Featured Articles