రాజకీయ కార్పొరేట్ ఉగ్రవా దులు


Sat,February 15, 2014 01:05 AM

సీమాంధ్ర నాయకత్వం పార్లమెంటు సాక్షిగా తమ బరితెగింపును ప్రదర్శించి ఇంతకాలంగా తెలంగాణ ఎలా అన్యాయానికి గురవుతూ వచ్చిందో దేశానికంతా తెలియజెప్పారు. సీమాంధ్ర నాయకత్వం దాష్టీకాన్ని జాతీయ మీడియా కూడా కళ్లారా చూసింది. వారి వాదనల్లోని డొల్లతనం, వారి చేష్టల్లోని హీనత్వం అందరికీ తెలిసి వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆగిపోతే అందుకు అన్ని పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.

పార్లమెంటు ఉభయసభల్లో తాజాగా జరిగిన పరిణామాలను గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. వాళ్లు ఎంతకయినా తెగించగల సమర్థులు. దేనినయినా అమ్మగలినవాళ్లు, కొనగలిగినవాళ్లు, మేనేజ్ చేయగలిగినవాళ్లు. ఎటువంటి వ్యవస్థలనయినా ధిక్కరించగల వాళ్లు. పార్లమెంటును, శాసనసభలను, అత్యున్నత న్యాయస్థానాలను సైతం తమ నోట్ల కట్టల బరువు తో తొక్కిపెట్టగలమని భావించేవాళ్లు. ప్రజాస్వామ్యాన్ని తమ కాళ్ల కింద తివాచీగా మార్చుకోగలిగినవాళ్లు. దేవతా వస్ర్తాల్లో ఊరేగుతూ తమ పీతాంబరాలు చూడండని దేశాన్ని నమ్మించగలవాళ్లు. గుర్తుందా, ఎంత మంది ఎంపీలను కొంటే ప్రధాని కావచ్చు అని అడిగినవాడొకడు ఇప్పుడు జైలులో ఉన్నాడు. అటువం టి వాళ్లే ఇప్పుడు కొందరు పార్లమెంటులో ఉన్నారు. గమనించండి, పార్లమెంటు లో అల్లరి చేసినవాళ్లం తా ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్లే. రాజగోపాల్, సీఎం రమేశ్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి... వీరికి ఏ విలువల గురించీ, ఏ వ్యవస్థల గురించీ, ఏ అధిష్ఠానాల గురించీ భయం లేదు, భక్తి లేదు. ఉండదు. పార్లమెంటులో నిన్న జరిగిన సీక్వెన్సు చూడండి.

సీమాంధ్ర ఎంపీల అల్లరి మధ్యే లోక్‌సభలో బిల్లు ను ప్రవేశపెడుతున్నట్టు హోం మంత్రి షిండే ప్రకటించారు. ఆ తర్వాత గొడవ మరింత తీవ్రమయిం ది. సభను వాయిదా వేశారు. ఈ పరిణామాలకోసమే కాచుకున్నవారిలా బిజెపి అగ్రనేత లాల్‌కష్ణ అద్వానీ, ఇటువంటి గందరగోళ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం మరే బిల్లుల జోలికి పోకుండా కేవ లం బడ్జెట్‌కు మాత్రమే పరిమితం కావాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణ పిల్లల ఆత్మహత్యలపై చెలించి, అనేకసార్లు అమ్మలా స్పందించిన సుష్మా స్వరాజ్, బిల్లు సభా వ్యవహారాల జాబితాలో లేదు. దాన్ని ప్రవేశపెట్టినట్లు నేను చూడలేదు అని చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టినట్టు దేశమంతా టీవీ ల్లో ప్రసారం అయింది. లోక్‌సభ సచివాలయం ఆ తర్వాత ప్రకటన కూడా ఇచ్చింది. లోక్‌సభ కార్యకలాపాల సమాచార బులెటిన్‌లో సభలో జరిగినదం తా రికార్డయింది. ఆ బులెటిన్ లోక్‌సభ వెబ్‌సైట్‌లో యథాతథంగా పెట్టారు.

అయినా బిజెపి అగ్రనేతలు ఎందుకిలా మాట్లాడారు? తెలంగాణ బిల్లును తక్షణమే పార్లమెంటు లో ప్రవేశపెట్టాలని, తెలంగాణ బిల్లును గట్టెక్కిస్తామని అనేకసార్లు సవాలు చేసిన బిజెపి వైఖరిలో ఈ మార్పు దేనిని సూచిస్తున్నది? ఈ ప్రకటనలు చూసి తెలంగాణ బిజెపి నేతలు విలవిలలాడిపోయారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు మొరపెట్టుకున్నారు. ఆయన వెంటనే వివరణ ఇచ్చారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, బిల్లు తెస్తే మద్దతు ఇస్తామని చెప్పారు. ఇందులోనూ మెలిక ఉంది. బిల్లు తెచ్చారు. బిల్లును వ్యతిరేకించేవారు సభలో ఆందోళన చేయడం కొత్తకాదు. ఉత్తరాఖండ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్‌డిఏ మిత్రపక్షాలైన లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎస్‌పి, ఆర్జే డీ, యునైటెడ్ అకాలీదళ్ సభ్యులు వెల్‌లోకి వచ్చి బిల్లును ఆమోదించే ముందు ఉధమ్‌సింగ్‌నగర్‌ను ఉత్తరాఖండ్‌లో కలిపే విషయమై జార్జిఫెర్నాండెజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించాలని ఆందోళనకు దిగారు. కానీ బిజెపి ఇవేవీ లెక్కచేయకుండా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. మరి బిజెపి ఇప్పుడెందుకు ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నది. అవకాశం దొరికితే చాలు బిల్లును ఎగ్గొడదామని ఎందుకు చూస్తున్నారు? చంద్రబాబునాయు డు ఇప్పుడు ఢిల్లీలో తిష్ఠవేసి లోక్‌సభ సమావేశాల ను ఎందుకు అంత క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నారు? రాజ్యసభ సభ్యుడు కూడా కానీ కంభంపాటి రామ్మోహన్‌రావు బిడ్డ రిసెప్షన్‌ను ఢిల్లీలోనే ఏర్పా టు చేసి ప్రత్యేకంగా బిజెపి అగ్రనాయకులనే ఎందు కు పిలిచారు? అసలు ఏం జరుగుతున్నది?

బిజెపి అధికారంలోకి రావాలనుకోవడం, మిత్రులను వెదుక్కోవడం చాలా సహజం. సీమాంధ్రలో టీడీపీ ఆ పార్టీకి ఉపయోగపడేమాట వాస్తవం. కానీ టీడీపీ పొత్తుతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడెందుకు టీడీపీ బాటలో నడుస్తున్నది. చంద్రబాబునాయుడు మాయను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నది? చంద్రబాబు నాయుడు ఈ నెలరోజుల వ్యవధిలో అనేక పార్టీల అగ్రనాయకులను కలిశారు. ఆయన కనీసం నలుగురైదుగురు ప్రాంతీయ నేతలను ప్రధానిని చేస్తానని ఊరించాడు. జయలలిత, ములాయంసింగ్, మమతా బెనర్జీ...గతంలో నితీష్‌కుమార్...ఇలా అనేక మందికి ఆయన ఆశలు పెట్టి ఉన్నాడు. తాను ఎవరినయినా ప్రధానిని చేయగలనని ఆయన నమ్ముతూ ఉన్నాడు. నిజానికి ఇప్పుడు ఆయనకే దిక్కులేదు. ఆయనకే ఎవరో ఒకరు ఆసరా కావాలి. ప్రాంతీయ పార్టీల నాయకుల ఆసరా ఆయనకు చాలదు. మోడీ నాయకత్వంలోని బిజెపి ఒక్కటే ఆయనకు కొంత ప్రాణం పోయగలదు. కానీ ఆయ న విజయవంతంగా ఎదుటివారికే తన అవసరం ఉన్నట్టుగా నమ్మించగలరు. సీమాంధ్ర, తెలంగాణాల్లో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో బిజెపి పోటీచేస్తుంది.

అత్యధిక శాసనసభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది- బిజెపి, టీడీపీల మధ్య స్థూలంగా ఇదీ అంగీకారం. బిజెపి రాష్ట్రం నుంచి కనీసం 20 లోక్‌సభ స్థానాలను గెలుస్తామని అంచనా వేసుకుంటున్నది. అదెలా సాధ్యం అనిపించవచ్చు. కానీ సీమాంధ్ర తిరుగుబాటు కాంగ్రెస్ ఎంపీలంతా బిజెపిలో చేరితే? బిజెపి, టీడీపీ, తిరుగుబాటు సీమాం ధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఒక్కటయితే? ఇదీ లెక్క. అందుకే బిజెపి అయోమయానికి గురవుతున్నది. అతలాకుతలం అవుతున్నది. తెలంగాణకు దూరం గా జరగడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా స్పందిస్తున్నది. ఆ తర్వాత గొంతు సవరించుకుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. రాజకీయాలు ఎంత నిర్దయగా ఉంటాయో ఈ పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం బిజెపి నిజాయితీగా వ్యవహరించడం లేదని సామాన్యుడికి కూడా తెలిసిపోతున్నది. అవకాశవాదంతో వ్యవహరిస్తున్నదని వారి ప్రకటనలు తెలియజేస్తున్నాయి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ అధిష్ఠానం మాట మాత్రమే కాదు, వాళ్లు బిజెపిలో ఉంటే బిజెపి అధిష్ఠానం మాట కూడా వినేవాళ్లు కాదు. గాలి జనార్దనరెడ్డికి, లగడపాటి రాజగోపాల్ కు అట్టే తేడా లేదు. వాళ్లు వినదల్చుకునేవాళ్లు కాదు. తాము కోరినట్టు ప్రపంచం నడచుకోవాలని శాసించేవాళ్లు. తెలంగాణ అడ్డుకోదల్చినవాళ్లు. తెలంగాణను అడ్డుకోదల్చినవాళ్లతో బిజెపి అంటకాగుతుందా లేదా అన్నది తేల్చుకోవాలి.

ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయే ప్రసక్తి లేదు. ఆ బిల్లును నెగ్గించవలసిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ది, ఇంతకాలం సవాళ్లు విసురుతూ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం బిజెపిది. తెలంగాణను నెగ్గించవలసిన బాధ్యత పార్లమెంటుది, ప్రజాస్వామ్యానిది. సీమాంధ్ర నాయకత్వం పార్లమెంటు సాక్షిగా తమ బరితెగింపును ప్రదర్శించి ఇంతకాలంగా తెలంగాణ ఎలా అన్యాయానికి గురవుతూ వచ్చిందో దేశానికంతా తెలియజెప్పారు. సీమాంధ్ర నాయకత్వం దాష్టీకాన్ని జాతీయ మీడియా కూడా కళ్లారా చూసింది. వారి వాదనల్లోని డొల్లతనం, వారి చేష్టల్లోని హీనత్వం అందరికీ తెలిసి వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆగిపోతే అందుకు అన్ని పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. తెలంగాణలో అడుగుపెట్టలేని పరిస్థితి వస్తుంది. చంద్రబాబునాయుడు తెలంగాణ మీద ఆశలు పెట్టుకోలేదు. ఆయనకు కావలసింది సీమాంధ్ర.

ఆయన అయితే గియితే ముఖ్యమంత్రి కావలసింది అక్కడే. తెలంగాణ ఏమయిపోయినా పట్టించుకోదల్చుకోలేదు. తెలంగాణ టీడీపీ నేతలకు అర్థం కాకపోయినా ప్రజలకు ఆ విషయం అర్థం అవుతున్నది. ఈ రాష్ట్రంలో బిజెపిని ఎప్పుడయినా తెలంగాణే ఆదరించింది. అంత గడ్డుకాలంలో కూడా బిజెపికి ఒక్క తెలంగాణలోనే మూడు స్థానా లు లభించాయి. 2009 ఎన్నికల్లో బిజెపికి సీమాంధ్రలో ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. మొత్తంగా 1.2 శాతానికి మించి ఓట్లు రాలేదు. తెలంగాణలో 5.6 శాతం ఓట్లు వచ్చాయి. ఈ వాస్తవాలను విస్మరించి బిజెపి ఇప్పుడు కొత్త నేస్తాల మోజులో ఏదయినా చేయడానికి సిద్ధపడితే, తెలంగాణ ప్రజలకు అర్థం కాకుండాపోదు. తెలంగాణలో బిజెపి బతకడానికి చావడానికి ఇదొక పరీక్ష.
[email protected]

658

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా