మహా అజ్ఞాన ప్రదర్శన


Sat,January 25, 2014 12:51 AM

వెనుకబడిన జిల్లాల జాబితాలో హైదరాబాద్ తప్ప తక్కిన తెలంగాణ జిల్లాలన్నీ ఉన్నాయి. సీమాంధ్రలో అనంతపురం, కడప, చిత్తూరు, విజయనగరం మాత్రమే ఉన్నాయి. ఆ విషయం ముఖ్యమంత్రికీ తెలుసు. ఇతర సీమాంధ్ర నేతలకూ తెలుసు. వారు అసెంబ్లీలో చెబుతున్నవన్నీ అబద్ధాలని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఏమి కావాలి? బాబూ, మీ బంగారు కంకణాలు వద్దు, మీరు శాకాహారులుగా మారనూ వద్దు. తెలంగాణ ఇంకే మాత్రం మీ కపట ప్రేమను భరించలేదు.

చట్టసభ సాక్షిగా మంత్రులు, మహామంత్రుల చారిత్రక అజ్ఞాన ప్రదర్శన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది. వద్ధ సింహం బంగారు కంకణం కథ గుర్తుకు వస్తున్నది. విడిపోతే తెలంగాణకే అన్యాయం జరుగుతుందని దుఃఖపడుతుంటే వ్వొస్తున్నది. వారు చెబుతున్న వందఅబద్ధాల సంగతి వదిలేద్దాం. కష్ణా నది జలాల గురించి వారు చెప్పిన లెక్కలు, చేసిన బెదిరింపులు చూస్తే వారి వాదనల్లోని డొల్లతనం తెలిసిపోతుంది. శ్రీశైలండ్యాము నుంచి నీటి ని ఉపయోగించుకోవడం వల్ల 13 లక్షల ఎకరాల్లో సాగు స్థిరీకరణ జరిగింది అని చెప్పిన నోటితోనే విడిపోతే నెట్టెంపాడుకు, కల్వకుర్తి, ఏఎంఆర్ ప్రాజెక్టులకు నీటిని కోల్పోతారని బెదిరించారు. కలిసి ఉంటే ఇంటర్ బేసిన్ చేంజ్ కింద ఈ ప్రాజెక్టులకు నీరు సర్దుబాటు చేయవచ్చునని కూడా ముఖ్యమంత్రి బోధించారు.కష్ణా పరీవాహక ప్రాంతంలో 1955లో నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే సాగు లో ఉండేదని ఇప్పుడు 43లక్షల ఎకరాలు సాగవుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ముఖ్యమంత్రి లెక్క ప్రకారం కష్ణా నది కింద సాగవుతున్నది కానీ, స్థిరీకరించింది కానీ 56లక్షల ఎకరాలు.

ఇం దులో తెలంగాణలో సాగవుతున్నది లెక్క ప్రకారం- వాస్తవ లక్ష్యాలు ఎలా ఉన్నా, సాగర్ ఎడ మ కాలువ కింద 8లక్షల ఎకరాలు, ఏఎంఆర్ కింద లక్ష ఎకరా లు, జూరాల కింద లక్ష ఎకరాలు, రాజోలిబండ మళ్లింపు కాలువ కింద 30వేల ఎకరాలు మొత్తం 10.3 లక్షల ఎకరాలు, ఇంకొంచెం పెంచి 11 లక్షల ఎకరాలు అనుకుందాం.56లక్షల ఎకరాల్లో పదకొండు లక్షల ఎకరాలు తీసేస్తే 45 లక్షల ఎకరాలు ఎక్కడ సాగవుతున్నది? సీమాంధ్రలో 5 లక్షల ఎకరాలు 45 లక్షల ఎకరాలు ఎలా అయింది? తెలంగాణలో పదకొండు లక్షల ఎకరాలు మాత్రమే ఎందుకు సాగులో ఉంది? సాగుభూమి ఎక్కడ ఎక్కువ పెరిగింది? కలిసి ఉండి ఎవరు ఎక్కువ బాగుపడ్డారు? ఎవరి నిధులు ఎవరికి ఖర్చు చేశా రు? ఎవరు ఎవరిని పోషించారు? ఎవరు మోసపోయారు? ఇవ్వాళ మళ్లీ ఎవరిని మోసగించాలని చూస్తున్నారు? వాస్తవానికి నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎంఆర్ ప్రాజెక్టులు కష్ణా బేసిన్ లో కష్ణా పరీవాహక ప్రాంతానికి నీరందించడానికి న్యాయంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులకు ఇచ్చిన తర్వాతనే రాయలసీమలోని ఏ ప్రాజెక్టుకయి నా నీరు వెళ్లాలి. అవి నికర జలాలైనా, మిగులు జలాలైనా సరే. ఇంటర్ బేసిన్ చేంజ్ అంటే ఒక బేసిన్ నీటిని మరో బేసిన్‌కు తరలించడం. సీమాంధ్ర ప్రభుత్వాలు గత మూడు దశాబ్దాలుగా చేస్తున్నది అదే.

ఇంటర్ బేసిన్ చేంజ్ దయ తెలంగాణకు అక్కర లేదు. కష్ణా నీటితో పెన్నా బేసిన్ ప్రాజెక్టులన్నీ నింపుకునేందుకు కాలువలు తవ్వారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఒక నది స్థాయికి పెంచి నీరు మళ్లించుకుపోయారు. సోమశిల, కండలేరు, గండికోట, మైలవరం, బ్రహ్మంగారి మఠం, అవుకు.. ఇలా నిర్మించిన రిజర్వాయర్లకు కష్ణా బేసిన్‌కు సంబంధంలేదు. అవ న్నీ పెన్నా నదిపై లేక దాని ఉపనదులపై నిర్మించినవి. ఇంటర్ బేసిన్ చేంజ్ సర్దుబా టు సీమాంధ్రకు అవసరం.కానీ తెలంగాణకు కాదు. సుమారు 150టీఎంసీల నీటిని తరలించేందుకు సీమాంధ్ర నాయకత్వం కుట్రలు చేసింది.

బచావత్ ట్రిబ్యునల్ నివేదిక నిర్ధారించిన 298టీఎంసీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన 370టీఎంసీ లు కానీ తెలంగాణలో వినియోగంలోకి తీసుకువచ్చి ఉంటే తెలంగాణలో పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు.ఉచిత విద్యుత్ ద్వారా తెలంగాణ రైతులకు 19,377 కోట్ల రూపాయల మేలు జరుగుతున్నదని విడిపోతే విద్యుత్ సమస్య వస్తుందని కూడా ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాలువల నీళ్లు లేక, రాక, బోర్లు వేసి, కరెంటు మోటార్లు పెట్టి తెలంగాణ రైతాంగం నష్టపోయింది ఎన్ని లక్షల కోట్ల రూపాయ లు ఉంటుందో చెప్పగలరా? అర్ధరాత్రి అపరాత్రి మీరిచ్చే విద్యుత్ కోసం తెలంగాణలో ఇప్పటివరకు కరెంటు షాకులతో మరణించిన రైతుల లెక్కలు తీద్దామా? తెలంగాణకు న్యాయంగా రావలసిన నీటివాటా రాకపోవడం వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో చెప్పగలరా? కష్ణా నుంచి తెలంగాణకు రావలసిన నీటివాటా 360 టీఎంసీలు అంటే కనీ సం 36లక్షల ఎకరాలు సాగు కావాలి. కానీ సాగవుతున్నది11లక్షల ఎకరాలకు మించదు. మిగిలిన 25 లక్షల ఎకరాల్లో కూడా సాగునీటికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా వ్యవసాయం చేసుకోగలిగి ఉంటే తెలంగాణ రైతాంగం ఎన్ని లక్షలకోట్ల రూపాయలు సంపాదించేవారో లెక్క లు వేద్దామా?.

మరో అబద్ధం.. హైదరాబాద్, రంగారెడ్డి, మెద క్, నల్లగొండ జిల్లాలు సీమాంధ్ర జిల్లాల కంటే అభివద్ధి చెందాయని. ఈ జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగిందని, సంపద పెరిగిందని, జీడీపీ పెరిగిందని మనఅమాత్యులు, కొందరు సీమాంధ్ర టీడీపీ సభ్యు లు లెక్కలు చెబుతున్నారు. తలసరి ఆదాయం, జీడీ పీ ఒక బ్రహ్మపదార్థం. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి కింద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గత యాభైయ్యేళ్లుగా ప్రోత్సాహకాలు ఇచ్చాయి.


ఉచి త భూములు, చౌకవిద్యుత్, పన్ను రాయితీలు, రుణాలు ఇప్పించారు ప్రాంతాలను అభివద్ధి చేయడమంటే అక్కడ పరిశ్రమ పెట్టి అక్కడి స్థానికులకు ఉపాధి కల్పించడం. సీమాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టారు. ప్రయోజనాలన్నీ పొం దారు. కానీ వారు తమతోపాటే తమ ప్రాంతం నుం చి సిబ్బందిని తెచ్చుకున్నారు తప్ప, స్థానికులకు తగినంతగా ఉపాధి కల్పించలేదు. వాచ్‌మెన్‌లు, స్వీపర్‌లు, కార్మికులు, క్లర్కుల వంటి ఉద్యోగాల్లో మాత్ర మే ఇక్కడివారిని తీసుకున్నారు. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబంలో ఒక తరం బాగుపడుతుంది. ఆ తర్వాతి తరా లు అభివద్ధిపథంలో ఉంటాయి.

కానీ తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల ప్రజలకు సీమాంధ్ర పారిశ్రామికవేత్తలుఅటువంటి అవకాశం ఇవ్వలేదు. అక్కడి వారినే తెచ్చుకుని, వారినే ప్రోత్సహించి, హైదరాబాద్‌లో స్థిరపడడానికి దోహ దం చేశారు. ఇప్పుడు ఆ కంపెనీలు, వాటి ఆస్తులు, ఆ కంపెనీల ఉద్యోగుల జీతభత్యాలు + మెదక్ జిల్లా ప్రజల ఆదాయం డివైడెడ్‌బై మెదక్ జిల్లా జనాభా= తలసరి ఆదాయం అం ఈ నాయకులను ఏమనాలి? పదిమంది పారిశ్రామిక వేత్తలు, పదిమంది సామాన్యుల సంపద డివైడెడ్ బై 20 వేస్తే తలసరి ఆదాయం కోట్లల్లో వస్తుంది. అంతమాత్రాన పేదవాడు ధనికుడు కాలేడు. పేదవాడి తలసరి ఆదా యం పెరిగినట్టు కాదు. ఇదొక మోసపూరితమైన లెక్కల విధానం. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల గ్రాం ట్‌ఫండ్

(బిఆర్‌జిఎఫ్-http:// www.nird. org. in/brgf/ doc/ BRGF FINALGUIDELINES.pdf)పథకం కింద రాష్ట్రం లో పదమూడు జిల్లాలను వెనుకబడిన జిల్లాల కింద గుర్తించి గత పదేళ్లుగా నిధులు కేటాయిస్తున్న ది. వంద కొలమానాల ఆధారంగా ఆ జిల్లాలను ఎంపిక చేసింది. వెనుకబడి న జిల్లాల జాబితాలో హైదరాబాద్ తప్ప తక్కిన తెలంగాణ జిల్లాలన్నీ ఉన్నాయి. సీమాంధ్రలో అనంతపురం, కడప, చిత్తూ రు, విజయనగరం మాత్రమే ఉన్నాయి. ఆ విషయం ముఖ్యమంత్రికీ తెలుసు. ఇతర సీమాంధ్ర నేతలకూ తెలు సు. వారు అసెంబ్లీలో చెబుతున్నవన్నీ అబద్ధాలని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఏమి కావా లి? బాబూ, మీ బంగారు కంకణాలు వద్దు, మీరు శాకాహారులుగా మారనూ వద్దు.తెలంగాణ ఇంకే మాత్రం మీ కపట ప్రేమను భరించలేదు.
[email protected]

673

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా