కేజ్రీవాల్ ఒక రోల్ మోడల్


Sat,January 11, 2014 02:33 AM

రాజకీయాల్లో పరస్పర సంఘర్షణ అనివార్యమే. కానీ ఆ సంఘర్షణ విధానాలపై జరగాలి. వ్యక్తులు కేంద్రంగా కాదు. మార్పును, కొత్తను ఆహ్వానించని పార్టీ ఏదయినా పాత
రాజకీయాలను కొనసాగించాలని చూస్తున్నట్టే భావించాలి. మార్పు మన పాదాల కింద మట్టిని కొట్టేసినా సరే అది దేశానికి మంచిదయితే స్వాగతించాలి. కేజ్రీవాల్ పార్టీని
బతకనివ్వండి. వర్ధిల్లనివ్వండి. ప్రత్యామ్నాయ రాజకీయాలను ఎదగనీయండి.

అసాధ్యాలు సుసాధ్యమవుతున్న కాలం. నిలువ నీటిని కొత్త నీరు తరిమేస్తున్న కాలం. సామాన్యులు కూడా మాన్యులు కాగలరని నిరూపించిన కాలం. ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని దేశానికి చాటిచెప్పిన కాలం. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడొక రోల్ మోడల్. ఆయన ఎలా పరిపాలిస్తారు, చివరకు ఎక్కడ తేలుతారన్నది అనంతరం సమీక్షించుకోవలసిన విషయం. కానీ ఇప్పుడు మాత్రం దేశ రాజకీయాల్లో ఆయన ఒక ఆశను రేకెత్తించారు. మార్పు సాధ్యమేనని చూపించారు. నిలబడి కొట్లాడితే సవా లు చేయవచ్చునని రుజువు చేశారు. ‘వారు పోతే వీరు వీరు పోతే వారు’ కాకుండా, ఒక నికార్సైన ప్రత్యామ్నాయం సాధ్యమేనని నిరూపించారు.

దేశ రాజధాని ఢిల్లీని చేజిక్కించుకున్నారు. తెలు గు సినిమా తరహాలో ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటే మొరటుగా ఉంటుంది. కానీ ఇవ్వాళ అరలు అరలు గా, పొరలు పొరలుగా చీలిపోయిన రాజకీయ వ్యవస్థలో ఏ రంగూ పూసుకోకుండా ఒక పార్టీని పెట్టి విజయం వైపు నడిపించాడే, అదీ అతని గొప్పత నం.ఆయన తాతలు తండ్రులు రాజకీయాల్లో లేరు. వారసత్వ సంక్రమణం లేదు. కోటీశ్వరుడు కాదు. సొంతంగా ఏఇమేజీ లేదు. ఎదుర్కోవలసింది రెం డు పెద్ద పార్టీలను. సువ్యవస్థిత పార్టీలను. పెద్ద పెద్ద ఐడియాలజీలను. కానీ ఆయన అవినీతి వ్యతిరేక పోరాట యోధుడుగా మొదలై నిబద్ధంగా, ధైర్యంగా పాత వ్యవస్థలను సవాలు చేశారు. ఓ మోస్తరు ఎన్నికల ఖర్చులతో పార్టీని జనంలోకి తీసుకెళ్లారు. జనం విశ్వాసం చూరగొన్నారు. జయించారు. మొత్తానికి మొత్తం ఓకొత్త తరాన్ని చట్టసభల్లోకి తీసుకువచ్చా రు. ఆయన జటిలమైన సిద్ధాంతాలు చెప్పలేదు. ఢిల్లీ ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నాడు. ప్రజలకేం చేస్తాడో చెప్పాడు. సాధారణ భాషలో, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. అధికారంలోకి వచ్చా రు. మాట మీద నిలబడ్డాడు. తను చెప్పినవి అమలు చేస్తున్నారు. ఆయనను రాజకీయంగా ఎంతకాలం బతకనిస్తారో తెలియదు. కానీ ఆయన రుజువు చేయదల్చుకున్నది రుజువు చేశారు.నిజాయితీగా ఎవరోఒకరు ముందుకు వచ్చి పోరాడితే ప్రత్యామ్నాయం సాధ్యమేనని రుజువు చేశారు. మార్పు తేవచ్చునని రుజువు చేశారు. అం దుకు ఆయనను దేశం గుర్తుపెట్టుకుంటుంది.

ఆయన వెనుక ఎవరో ఉన్నారని, ఆయనకు ఎన్నికల నిధులు కుప్పలు తెప్పలుగా వచ్చాయని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అమెరికా ఏజెంటు అని ముద్రలు వేస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో లెక్కలు తీస్తే అన్ని పార్టీలు వందసార్లు గంగలో మునిగినా వాటి మురికి వదలిపోదు. ఏ పార్టీ ఎన్ని నిధులు బ్లాకులో, ఎన్ని నిధులు వైట్‌లో ఖర్చు చేస్తున్నాయో అంచనా వేస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

ప్రతిపార్టీ వెనుక ఎవరో ఒకరు ఉన్నారు. బహుళజాతి కంపెనీలు అన్ని పార్టీలకు ఎన్నికల నిధులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బట్వాడా చేస్తూనే ఉన్నాయి. హవాలా మార్గంలో ఎవరికి ఎన్ని నిధు లు వస్తా యో ఎన్‌ఐఏ కూడా కనిపెట్టలేదు. ఇవి కాకుండా జనంపై పడి ‘మాకు ఇన్ని నిధులు కావా లి. అంద రూ ఇవ్వాల్సిందే’ అని గోళ్లూడగొట్టి వసూ లు చేసిన ముఖ్యమంవూతులు దేశంలో ఉన్నారు. మరొక్క మాట ఈ దేశంలో అణు ఒప్పందానికి, విదేశీ ప్రత్య క్ష పెట్టుబడుల బిల్లుకు ఓటు వేసిన వాళ్లంతా అమెరికా ఏజెం కమ్యూనిస్టు పార్టీ లు అప్పుడే ఆరోపించాయి. వాల్‌మార్ట్ లాబీయింగ్‌కు, వారిచ్చే డాలర్లకు అమ్ముడుపోయినవాళ్లు కేజ్రీవాల్‌ను నిందిస్తే ఎలా? అందువల్ల ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఆమ్ ఆద్మీ పార్టీ పై చేస్తున్న విమర్శలు పెద్దగా చెల్లుబాటు కాబోవు. ఎవరినీ నమ్మించలేవు. ఎవరి ఏజెంటయినా పర్వాలేదు, కానీ ఆయన సంస్కరణల ఎజెండాకు భిన్నంగా పనులు మొదలుపెట్టాడు. పేదలకు తాగునీటిని ఉచితంగా ఇచ్చిన మొదటి ముఖ్యమంవూతిగా చరివూతలో నిలిచిపోతాడు.

మన నాయకులు, మన జర్నలిస్టులు కొందరు ఎంతగా పుచ్చిపోయారంటే తాగునీటిని ఉచితంగా ఇవ్వడాన్ని కూడా సహించలేకపోయా రు. జనాకర్షక ఎజెండా మొదలు పెట్టాడనీ, దేశాన్ని వెనుకకు తీసుకెళుతున్నాడని నిందించారు. తాగునీరు సహజవనరు. దేశంలో ప్రతిపౌరుడి హక్కు. ఉచిత విద్య, ఉచిత వైద్యం కంటే ముందుగా ఇవ్వాల్సింది ఉచితంగా తాగునీరు.ఉచిత లాప్‌టాప్‌లు, ఉచిత టీవీల కంటే పేదలు బతకడానికి అత్యంత అవసరమైనది తాగునీరు. అందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడాన్ని మించిన గొప్ప ఎజెండా ఏదీ లేదు.

కానీ కేజ్రీవాల్‌పై ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి మొదలైంది. అవినీతి, అప్రదిష్టలను మూటగట్టుకుని పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ నుంచి కంటే కొత్తగా అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపి నుంచి ఈ దాడి ఎక్కువగా ఉంది. తమకు రావలసిందేదో రాకుండా అడ్డుపడుతున్నాడని కేజ్రీవాల్‌పై బీజేపీ నాయకత్వం రకరకాల విమర్శలు గుప్పిస్తున్నది. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి, ఢిల్లీలో కాంగ్రెస్‌ను కదిలించలేకపోయిన బీజేపీ, కాంగ్రెస్‌ను సవా లు చేసేవాడొకడు వచ్చినందుకు సంతోషించాలి. కాంగ్రెస్‌ను దిక్కుతోచని స్థితిలో నిలబెట్టినందుకు అభినందించాలి. కానీ కేజ్రీవాల్ బలపడితే తమ ఓటు బ్యాంకు చీలిపోతుందని, తమ విజయావకాశాలు తగ్గిపోతాయని బీజేపీ భావిస్తున్నది.
మొగ్గలో నే ఆ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఆతృత బీజేపీ నేతల్లో కనిపిస్తున్నది. అందుకే పాత చింతకాయ పచ్చడిలాంటి ఆరోపణలు, కాలం చెల్లి న విమర్శలు ఆయనపై కుమ్మరిస్తున్నది.

హుందాతనాన్ని విస్మరిస్తున్నది. బీజేపీ, నరేంవూదమోడీ తమ విశ్వసనీయతను పెంచుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ఎదుటివారిపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసి ఎదగాలనుకోవడం గొప్ప కాదు. పైగా కేజ్రీవాల్ కాంగ్రెస్ మాదిరిగా పదేళ్లు అధికారంలో లేడు, మీరు విమర్శించలు గుప్పించడానికి! రాజకీయాల్లో పరస్పర సంఘర్షణ అనివార్యమే. కానీ ఆ సంఘర్ష ణ విధానాలపై జరగాలి. వ్యక్తులు కేంద్రంగా కాదు. మార్పును, కొత్తను ఆహ్వానించని పార్టీ ఏదయినా పాత రాజకీయాలను కొనసాగించాలని చూస్తున్నట్టే భావించాలి. మార్పు మన పాదాల కింద మట్టిని కొట్టేసినా సరే అది దేశానికి మంచిదయితే స్వాగతించాలి. కేజ్రీవాల్ పార్టీని బతకనివ్వండి. వర్ధిల్లనివ్వం డి. ప్రత్యామ్నాయ రాజకీయాలను ఎదగనీయండి.
[email protected]

685

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా