నయా జమీందార్ల నంగనాచితనం


Fri,September 30, 2011 10:44 PM

తెలంగాణ ప్రజల్ని గతంలో రజాకార్లు, పటేల్ పట్వారీలు, భూస్వాములు, దొరలు రాచి రంపాన పెట్టి నంజుకుతిన్నారు. ప్రజలు ఎలాగోలా వారి కబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛగా జీవిస్తుంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం రాబందుల్లా తయారయ్యారు.

-విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్


lagadapati-talangana patrika telangana culture telangana politics telangana cinemaరాబందులు సాధువచనాలు పలకడం....
నయా జమీందార్లు గతించిన దొరతనాలను బూచిగా చూపడం....
నరకయాతన పెడుతున్నవాడు శ్రేయోభిలాషిగా పోజు పెట్టడం.....
సొంతనేలపై పరాయీలను చేసినవాడు స్వేచ్ఛ గురించి వాగడం....
దళారీలు, కాంట్రాక్టర్లు దయామయుల్లా నటించడం.....
దొంగేదొంగా దొంగా అనడం....
వంచనకు, ద్రోహచింతనకు పరాకాష్ఠ!
వందల ఎకరాల వక్ఫ్ భూములను మింగి లాంకో కోటలు కట్టినవాళ్లు,
నాదర్‌గుల్‌లు, అమీన్‌పూర్‌లు మింగేసి ఎస్టేట్‌లను ఏర్పాటు చేసినవాళ్లు,
ప్రభుత్వ వనరులను కొల్లగొట్టి పొరుగు రాష్ట్రానికి కరెంటు అమ్ముకునే వాళ్లు,
భూదానోద్యమ భూముల్లో రియల్ ఎస్టేటు జెండాలు ఎగరేసిన కబ్జాకోర్లు,
వేలాది ఎకరాల అసైన్‌మెంటు భూముల్లో ప్రహరీలు తిప్పిన భూబకాసురులు,
గురుకుల ట్రస్టు భూములను ఆక్రమించి మేడలుమిద్దెలు కట్టిన వాళ్లు,
హైదరాబాద్‌లో, తెలంగాణలో లక్షలాది ఎకరాల భూములను కొల్లగొట్టి
నయా జమీందారీ వ్యవస్థను ఏర్పాటు చేసినవాళ్లు,
సీమాంధ్ర పెత్తందారీ కంబంధ హస్తాల్లో తెలంగాణను నిలువునా బంధించినవాళ్లు,
స్వేచ్ఛ గురించి తెలంగాణకు పాఠాలు చెప్పాలా? రాజగోపాల్ వంటి మేకవన్నె పులుల నయవంచనలకు, నయగారాలకు మోసపోయేవాళ్లు ఇంకా ఇక్కడ ఎవరూ లేరు.


తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే రెండు గంటలు ఎక్కువ పనిచేసి నిరసన తెలపాలి. సమ్మెవల్ల నష్టపోతుంది సామాన్యులే, డబ్బున్నవారికి దీనివల్ల ఇబ్బందేమీ లేదు.

-లోక్‌సత్తా అధ్యక్షుడు జయవూపకాశ్‌నారాయణ


ఈయన ఒకప్పుడు ఐఎఎస్ అధికారి. మంచి అధికారిగా పేరుండేది. అదే మంచిపేరుతో రెండు గంటలు అదనంగా పనిచేసి రాష్ట్రాన్నో, జిల్లానో బాగుచేసి ఉండవచ్చు. తన కింద ఉన్న సిబ్బందితో రెండు గంటలు అదనంగా పనిచేయించి జిల్లాలను, శాఖలను ఉద్ధరించి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. రాజకీయాల్లోకి వస్తేనే, రాజకీయాధికారం ఉంటేనే ఏదయినా చేయవచ్చని ఆ ఉద్యోగానికి రాజీనామా పారేసి ఉద్యమంలో చేరారు. ఉద్యమాన్ని పార్టీగా మార్చా రు.

ఈయన ఏమయినా ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి, ఎవరి ఉద్యోగంలో వాళ్లు ఉండి రాజకీయాలు చేయాలని చెప్పారా అంటే అదీ లేదు. ఈయన కూడా సభలు పెడతారు, ర్యాలీ లు నిర్వహిస్తారు. జనాన్ని పోగేస్తారు. ఉపన్యాసాలు దంచుతారు. జనాన్ని వెంటేసుకుని పాదయావూతలు చేస్తారు. వారి పనిచెడగొడతారు. జనాన్ని కదిలించకుండా ఏమార్పయినా జరిగిందా? జనం వీధుల్లోకి రాకుండా తోలుమందం ప్రభుత్వాలు చలిస్తాయా? గాంధీ సహాయనిరాకరణలు, హర్తాళ్‌లు, విదేశీవస్తు బహిష్కరణలు నిర్వహించకుండానే దేశ ప్రజలను సమీకృతం చేశారా? అంతెందుకు జనం కదలిరాకపోతే అన్నా హజారేను కేంద్రం పట్టించుకునేదా? పురిటినొప్పులు పడకుండా కొత్త శిశువు జన్మిస్తుందా?


నేను సీఎంగా ఉన్నప్పుడు పిల్లలుగా ఉన్నవారు నేడు ఓటర్లుగా మారారు. ఆ యువత అందరితో సంబంధాలు నెలకొల్పుకోవాలంటే జనంలో ఉండడమే మార్గం. తమతో ఉండి తమతో కలసిపోయే నేతనే జనం ఇష్టపడతారు. అందుకే మనం జనంలోకి వెళ్లాలి.

-మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ఏ జనంతో....ఏ ప్రాంతంలో బాబూ తమరు మమేకమయ్యేదీ? మనుషులను ఓటర్లుగా మాత్రమే చూసే రాజకీయ శిఖామణీ! తమరు చెప్పే యువకులు తెలంగాణలో ఉన్నారా లేదా? ఆ యువతతో తమరికి సంబంధాలు ఉన్నాయా లేవా? ఆ యువత మనసు ఇప్పుడేం చెబుతోందో తమరికి అర్థమవుతోందా? ఎక్కడో ఎందుకు-తెలంగాణ యువకులతో ఉండి, వారితో కలసిపోవడానికి ఒక్కసారి ప్రయత్నించు మహావూపభో! వారి గుండె చప్పుడు తెలుస్తుంది. తమరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంపడ్డ రోజు నుంచి- అంటే 10 డిసెంబరు 2009 నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 700 మందికి పైగా యువకులు బలిదానం చేశారు. ఒక్క సెప్టెంబరు మాసంలోనే 16 మంది కన్నుమూశారు. అందరూ యువకులే.

వీళ్లంతా ఓటర్లే. వీళ్లం తా తమరు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు పిల్లలుగా ఉండి ఇప్పుడు పెద్దయిన వారే. ఈ మారణ హోమాన్ని ఆపగలిగిన శక్తి అధికార పక్షమైన కాంగ్రెస్ చేతిలో ఎంత ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా తమరి చేతుల్లో కూడా అంతే ఉంది. తెలంగాణ కోసం మీతో నేనున్నాను, తెలంగాణపై ఇచ్చిన మాట తప్పను అని ఒక్క మాట చెప్పు బాబూ! జారిపోతున్న గుండెలు నిలబడతాయి. ఆరిపోతున్న ఆశలు చిగురిస్తాయి. బతుకుమీద ఆశలు మోసుపూత్తుతాయి. బాబూ తెలంగాణ యువత నీ యువత కాదా? వారి చావు మోతలు నీ గుండెలు తాకడం లేదా? ఓట్లు వచ్చినప్పుడు కాదు బాబూ, ఆపద వచ్చినప్పుడు యువకుల మధ్యకు రావాలి. తప్పించుకు తిరుగువాడు నాయకుడు కాదు. మాటతప్పని వాడే మహానాయకుడు. మీరు ఏ కోవలోకి వస్తారు బాబూ?


పేదలు సహా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వీరికి సంతోషంగా ఉంది...తెలంగాణపై రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అంతవరకు వేచి ఉండాలే తప్ప పేద ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులను ఇబ్బందులపాలు చేయడం మంచిది కాదు.

-ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి
ప్రజలను ఏడిపిస్తున్నవారు వారి మేలుకోరుతున్నట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది!
ప్రజలను కష్టపెడుతున్నవారు వారి బాధలు చూసి కలతపడుతున్నట్టు నటిస్తే ఏమవుతుంది?
అందరినీ వీధుల్లోకి ఈడ్చినవారు అందరి ప్రతినిధిలాగా సుద్దులు చెబితే ఏం చేయాలి?
వందలాది కుటుంబాల్లో గర్భశోకాన్ని మిగిల్చినవారు ఎవరి సంతోషం గురించి మాట్లాడుతున్నారు? ఎవరి పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు? మొసలి కన్నీరు కథ తెలుసా సార్! ఇది తెలంగాణ వేలితో తెలంగాణ కంట్లో పొడిపించే జాణతనం. ఉద్యమక్షిశేణుల మధ్య చీలిక తెచ్చే కుహకం. తెలంగాణ కోరుతున్న ప్రజాబాహుళ్యం మధ్య తంపులు పెట్టే తెల్లోల్ల తెలివి. ‘రెండు మూడు నెలల్లో పరిష్కారం’ అని ఎంతకాలంగా చెబుతున్నారు సార్! ఏ రెండు మూడు నెలలు సార్! అలా గోడమీద రాసుకుని మురిసిపొమ్మంటారా? ఇంకా ఎంత మంది బలికావాలి! ఉరితాళ్లలో బిగుసుకుంటున్న మెడ నరాలను గురించి, కాలకూట విషంతో కాలిపోతున్న పేవుల గురించి, నిలువునా దగ్ధమైపోతున్న నిండు మనుషుల గురించి కించిత్ కనికరం ఉన్నా ఈ సమస్యను ఇంతకాలం నాన్చుతారా సార్! ఎందుకు సార్ నీతులు చెబుతారు?


బాన్సువాడ ఉప ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయిం చాం. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అన్ని రాజకీయ పార్టీలు బాన్సువాడ ఉప ఎన్నికను బహిష్కరించి నిరసన తెలపాలి.


-టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎవరూ నమ్మరు!/నమ్మినా చేరదీయరు!
మాటతప్పినవాడికి/మాటమార్చినవాడికి
విశ్వసనీయత ఒక ఎండమావి/ చంద్రబాబు ఒక బండబావి
అక్కడ నీళ్లు తోడే ప్రయత్నం వృథా!
గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం.... గెలవనిచోట పోటీని త్యాగం చేయడం అంటే ఇదే.
ఆడలేనమ్మ గోడకేసి కొట్టుకుందట. జారిపడ్డవాడు అబ్బో అదో లఘువు అని గొప్పలు పోయాడట. తెలుగుదేశం పోకడలు చూస్తుంటే జాలేస్తుంది. పరువుపోయి నా పైచేయి నాదేనని బుకాయించే ప్రయత్నం తెలుగుదేశానిది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా ఒక ఉద్యమ ఆయుధమే. తెలంగాణకు అనుకూలంగా ప్రజాభివూపాయాన్ని కూడగట్టే పరీక్ష ఎన్నికలు. నిబద్ధత లేనివారికి, విశ్వాస ఘాతుకానికి పాల్పడినవారికి కర్రుకాల్చి వాతపెట్డడానికి ప్రజలకు ఒక అవకాశం ఎన్నికలు. తెలంగాణ విషయంలో డ్రామాలాడుతున్నవారిని తిరస్కరించడానికి ఒక సందర్భం ఎన్నికలు. తెలంగాణ ద్రోహులకు చుక్కలు చూపించడానికి ట్రీట్‌మెంట్ ఎన్నికలు. తెలుగుదేశానిది ఏడుపు, ప్రేలాపన, పలవరింత!

కొసమెరుపు
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూలై నెలల మధ్య పారిక్షిశామికాభివృద్ధి రేటు గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 13 శాతం నమోదయ్యింది. జూలై మాసంలో 13.4 శాతం వృద్ధి కనిపించింది.


-అర్థ గణాంకశాఖ


తెలంగాణ, హైదరాబాద్ ఆగమైపోతున్నదని తెగ బాధపడిపోతున్న వారికి ఈ ఆధారాలు చాలనుకుంటా! ఐటీ ఎగుమతులూ తగ్గలేదు. ఐటీ ఉద్యోగాల రాకా తగ్గలేదు. పారిక్షిశామికోత్పత్తి తగ్గలేదు. మరి ఏడిచేవాళ్లు ఎందుకు ఏడుస్తున్నట్టు? తెలంగాణ ఉద్యమాన్ని బద్నాం చేయడానికి కాకపోతే!

370

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా