చర్చిల్ నుంచి చంద్ర బాబు దాకా..


Sat,December 14, 2013 02:23 AM

అబద్ధానికి గొంతుపెద్దది. ఆధిపత్యవాదికి బుకాయింపుపూక్కువ. అన్యాయానికి నిలు న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. అడ్డదారికి అసలైన నిర్వచనం, పద్ధతులను గురించి ప్రసంగిస్తున్నాడు. వెన్నుపోటు సాధనం చేసుకున్నవాడు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఏమాటకూ నిలబడనివాడు, మాటల్లేకుండా ఎలా చేస్తారని నిలదీస్తున్నాడు. ఏ ప్రతిపాదనలూ సూచించనివాడు, ఏమీ చెప్పకుండా ఎలా చేస్తారని వాపోతున్నాడు. అంకెకు రాడు బొంకడం మానడు. ఆధిపత్యశక్తుల స్వభావమే ఇలా ఉంటుందేమో!భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం మౌంట్‌బాటెన్ ప్రణాళికను ప్రకటించినప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అచ్చం చంద్రబాబులాగే మాట్లాడాడు. ‘అంత తొందందుకు. ఇంత తక్కువ సమయంలో ఇది ఎలా సాధ్యం?’ అని ప్రశ్నించాడు. ‘ఇది తొందరపాటు చర్య’ అని కూడా బెదిరించాడు. ‘భారతీయులంటే నాకు ద్వేషం. వాళ్లు జంతు ప్రవృత్తి కలిగినవారు. అమానుషమైన మతం వారిది’ అని అంతకుముందే ఒక ఇంటర్వ్యూ లో ప్రకటించి ఉన్నాడు. ‘వాళ్లకు అధికారం ఇస్తే రాస్కెల్స్, రోగ్స్, ఫ్రీబూటర్స్ చేతుల్లోకి వెళుతుం ది.... వాళ్లలో వాళ్లు తన్నుకు చస్తారు’ అని హెచ్చరించినవాడు. గురువారంనాడు చంద్రబాబు పాత్రికేయుల సమావేశం చూసిన వారికి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఆయన అంతగా ఎందుకు ఆవేశపడుతున్నారో, ఎందుకు దుఃఖపడుతున్నారో తెలంగాణలో చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతుంది, ఒక్క టీటీడీపీ నాయకులకు తప్ప.


ఇంత తక్కువ కాలంలో ఇన్ని మాటలు మార్చిన నేతగా చంద్రబాబు చరివూతలో నిలిచిపోతారు. ఆయన ‘శంభుని శిరంబు నుండి....పవనాంధోలోకం’ దిశగా జారిపోతున్నాడు. ఇప్పుడు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్‌డ్డిల అవసరం లేదు. ఆయనే వారి స్థానంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. జూలై 30న సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానం చేసినరోజు ‘విభజనకు సహకరిస్తానని, నాలుగైదు లక్షలకోట్లు రాజధానికి ఇవ్వాలని’ డిమాండు చేసిన చంద్రబాబు గత మూడు మాసాల్లో ఎన్ని వంకరలుపోయారో? ఆ తర్వాత అఖిలపక్షం కావాలన్నారు. తీరా ఢిల్లీకి పిలిస్తే వెళ్లడానికి నిరాకరించారు. టర్మ్స్ ఆఫ్ రెఫన్స్‌కు మీమీ అభివూపాయాలు పంపండి అంటే ఒక్క ముక్కా రాయలేదు. పార్లమెంటులో చర్చకు సహకరించరు. మళ్లీ ఇప్పుడు అఖిలపక్షం అంటాడు. అవిశ్వాసం అంటాడు. ఆర్టికల్ 3 బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టంలోనిది, చెల్లదంటాడు. ముసాయిదా బిల్లు విమానంలో ఎలా తెస్తారంటా రు. ఆయన ఆగమాగమై మాట్లాడుతున్నాడు. అల్లకల్లోమవుతున్నాడు.

ఆయన ఇంత పరేషాన్ కావడానికి కారణం హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఇంకా మమకారం చావలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా దాదాపు ఇలాగే వ్యవహరిస్తున్నాడు. ఇలాగే మాట్లాడుతున్నా డు. ఆవేశపడుతున్నాడు. ఇంకా తెలంగాణను ఆపగలమని, ఆపకపోయినా తెలంగాణలో చెంచాగుంపును రాజకీయంగా నిలబెట్టగలమని వీరు కలలుగంటున్నారు. అందుకే ఈ నరకయాతన. జగన్‌బాబు తెలంగాణపై ఆశలు వదిలేసుకుని సమైక్యాంధ్ర అన్నాడు కాబట్టి ఆయన ఆవేశపడడం లేదు. కూల్‌గా తనపని తాను చేసుకుపోతున్నాడు. అక్కసు, ఆక్రో శం ప్రదర్శించడం లేదు. ముఖంలో దుఃఖాన్ని, దుగ్ధ ను కనిపించనివ్వడం లేదు. కానీ చంద్రబాబు, కిరణ్‌బాబు బయటపడిపోతున్నారు. తెలంగాణ జారిపోతున్నదన్న బాధ, తెలంగాణ నేతలపై కోపం, అక్క సు అన్నీ బయటపడుతున్నాయి. ఆధిప త్య కోటలు కూలిపోతున్నవేళ ఇంతకాలం వాటిని అనుభవించిన వారిలో సహజంగా వ్యక్తమయ్యే విపరీత మానసిక ప్రవర్తన ఇది. అడుగు అడుగున తెలంగాణకు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘తెలంగాణది కేవలం రాష్ట్రాల పునర్విభజన ఉద్యమం కాదు. డీ కాలనైజేషన్ కోసం(వూపాంత విముక్తికోసం) జరుగుతున్న ఉద్యమం. బ్రిటిష్‌వాళ్లు లండన్‌లో ఉండి మన దేశాన్ని కాలనీగా మార్చుకుని పాలించా రు. వీళ్లు మన ఊళ్లో ఉండి, మన ప్రాంతాన్ని కాలనీగా మార్చి మనపై స్వారీ చేస్తున్నారు. వీళ్ల నుంచి స్వేచ్ఛకోసం ఆఖరు నిమిషం దాకా అడుగుఅడుగు నా కొట్లాడాల్సిందే’ అని జస్టిస్ సుదర్శన్‌డ్డి ఇటీవల ఒక సభలో అన్నారు. వీళ్ల తీరు, మాట, చేష్టలు నూటికి నూరుపాళ్లు వలసపాలకులను తలదన్నేలా ఉన్నాయి.

నిజానికి చంద్రబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబులకు తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు చెప్పాలి. తెలంగాణపై వీరి దాష్టీకాన్ని, వీరి అప్రజాస్వామిక ప్రవర్తనను, వీరి దుర్మార్గపు రాజకీయాలను ఇప్పుడు ఢిల్లీ కూడా చూసింది. జాతీయ మీడియా కూడా గమనించింది. అవిశ్వాస తీర్మానాలు వీరి బాగోతా న్ని మరింత బట్టబయలు చేశాయి. తెలంగాణ ప్రజ లు అనుభవిస్తున్న క్షోభ ఇప్పుడు జాతికంతటికీ తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా గత మూడు మాసాలుగా చాలా చాలా చారివూతక నిర్ణయాలు జరిగాయి. కేంద్రమంవూతివర్గం నిర్ణయం జరిగింది. బిల్లు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి బిల్లు ను అసెంబ్లీకి పంపారు. అయినా తెలంగాణ ప్రజ ల్లో సంబరాలు లేవు. హర్షధ్వానాలు లేవు. ఎందుకం సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడి యా, ముఖ్యంగా చంద్రబాబుకు వంతపాడుతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెళ్లు ఎప్పటికప్పు డు తెలంగాణ రాదన్న భావనను కొనసాగిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. బిల్లు వస్తేనేం. ‘ప్రతి సభ్యుడు, ప్రతి పాయింటు మీద మాట్లాడి, అసెంబ్లీ అభివూపా యం పంపాలి’ అని రాష్ట్రపతి కోరాడట. అందుకు 40రోజుల సమయం సరిపోదట. ఈలోపు పుణ్యకాలం ముగిసిపోతుంద ట. గురువారం రాత్రి ఇది ఒక చానె ల్ రాక్షసానం దం. భారత రాజ్యాంగ చరివూతలో ఏ బిల్లు మీదా ప్రతి సభ్యుడూ మాట్లాడడం జరగలేదు. అణుబిల్లు, ఆహారభవూదత బిల్లు, విదేశీ పెట్టుబడుల బిల్లు.. ఆయా పార్టీల ప్రతినిధులు మాట్లాడారు.

ప్రతిపార్టీకి కొంత సమయం కేటాయిస్తారు. ఆ సమయాన్ని ఆయా పార్టీలు తమ నేతలకు కేటాయిస్తాయి. సాధారణంగా బిల్లులపై చర్చ జరిగే పద్ధతి ఇది. కానీ ఉన్మాదం జర్నలిజం అయినచోట ఏ తర్కా లూ పనిచేయవు. ఏ సంప్రదాయాలూ గుర్తుకురావు. ఈ పత్రికలు, చానెళ్లు ప్రతి సందర్భంలో ఏదో ఒక మెలిక పెడుతూనే వచ్చాయి. ఇదిగో అడ్డం, అదిగో అడ్డం అని వాగుతూనే, రాస్తూనే వచ్చాయి. కానీ ఏదీ ఆగలేదు. రేపు అసెంబ్లీలో కూడా ఏదీ ఆగదు. ఆగితే కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమూ కాదు. మన ది ప్రజాస్వామ్యమూ కాదు. తెలంగాణ ప్రజలకు మరోసారి పరీక్ష. మరోసారి నిరీక్షణ. రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇవ్వడం అసాధారణం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమానించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన బిల్లును ఈ పార్లమెంటు ఆఖరు ఘట్టానికి నెట్టడాన్ని సందేహించాల్సి వస్తోం ది. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం కోసమే ఇదంతా చేస్తోందా లేక ఇచ్చినట్టు నమ్మించి మరేదైనా చేస్తోం దా అన్న ఆందోళన కలుగుతోంది. ‘విమానంలో బిల్లు ప్రతులను పంపడం కేంద్రం కృతనిశ్చయాన్ని స్పష్టం చేయడానికే. దిగ్విజయ్ వచ్చిన రోజే బిల్లూ రావడం గమనించాలి’ అని ఒక రాజకీయ పండితు డు వ్యాఖ్యానించారు. అయినా కీడెంచి మేలెంచా లి. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఐక్యం గా నిలబడాలి. ఆఖరి అడుగుదాకా పోరాడాలి.
[email protected]

628

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా