ఆఖరిమెట్లు


Sat,November 23, 2013 12:21 AM


పరమపద సోపానంలో ఆఖరి మెట్లు అతివూపమాదకరమైనవి. అక్కడ భారీ సర్పాలే తప్ప నిచ్చెనలు ఉండ వు. ఆ సర్పాలకు చిక్కకుండా గమ్యం చేరకపోతే అథఃపాతాళానికి పడిపో యి, ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు పరమపదసోపానంలో ఆఖరి మెట్లపైకి వచ్చింది. తెలంగాణ జీవితం లో ఈ మూడు వారాలు అతికీలకం. తెలంగాణ రాజకీయ శక్తులు, ఉద్యమశక్తులు, పౌరసమాజం ఐక్యం గా అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి, కనీసం నిలువరించడానికి ముగ్గురునేతలు, ముఖ్యం గా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చేయని ప్రయ త్నం లేదు. కొండ చిలువ నోటికి చిక్కిన పొట్టేలు చందంగా తెలంగాణ పోరాడుతున్నది. ఈ కొండ చిలువలను వదిలించుకోకపోతే అవి పొట్టేళ్లను మాత్రమే కాదు మొత్తం తెలంగాణను మింగేస్తాయి. ఈ నాయకులను చూస్తుంటే విస్మయం కలుగుతున్న ది. ఇంతకాలం మనలను పరిపాలించిన నాయకులు వీళ్లా? మన ముఖ్యమంవూతులుగా, మన ఉద్ధారకులు గా భావించింది వీళ్లనా? పరీక్షా సమయం వస్తే వీళ్లు ఎటువైపు నిలబడతారో పసిగట్టలేకపోయామే? ఏ విధానానికీ, ఏ ప్రజాస్వామిక ప్రక్రియకూ, ఏ సంప్రదింపుల క్రమానికీ లొంగని నియంతలనా ఇంతకాలం మనం మోసింది? వీళ్లకు ఏ నీతీలేదు. ఒకరు బీజేపీ వైపు నుంచి నరుక్కొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇంకొకరు దేశమంతా తిరిగి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించండని పార్టీలను కూడగడుతున్నా రు. ‘అతడొక్కడే ఒక సైన్య’మట. ఆయన దేశాటన చూసి ‘విభజనవాదులు తలకిందులైపోతున్నార’ట. ఇవి ఆయన పత్రికల్లో రాసుకుంటున్నవే. ఇక కిరణ్‌కుమార్‌డ్డి అయితే సీల్డు కవర్ ముఖ్యమంవూతి గా వచ్చి తెలంగాణ భవిష్యత్తును తానే సీలు చేయగలనని భ్రమిస్తున్నారు.‘ఆయన ముఖ్యమంవూతిగా కాదు ఫ్యాక్షనిస్టుకంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు’ అని ఒక జర్నలిస్టు మిత్రుడు వ్యాఖ్యానించా రు. కానీ ఆయనకు గానీ, ఆయనకు అనుచరులకుగానీ అర్థంకానిదేమంటే ఆయన ఇంకా పదవిలో కొనసాగడమే కేంద్రం దయాభిక్ష. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ మర్యాదలు దెబ్బతినకుండా వ్యవహరించాలని కేంద్రం ఆచితూచి అడుగేస్తున్నది. ఆయనను తప్పించి, పీలేరు పంపించడానికి కేంద్రాని కి, కాంగ్రెస్‌కు ఒక్క క్షణం పట్టదు. కానీ సమస్యను జటిలం కాకుండా పరిష్కరించాలన్న ఏకైక కారణంతో, సహనంతో కేంద్రం అడుగులు వేస్తున్నది. కేంద్రం సహనాన్ని ఆయన తన బలంగా అనుకుం టూ ఉండవచ్చు. సొంత పార్టీలో పట్టుమని పదిమం ది ఎమ్మెల్యేలను తన వెంట ఉంచుకోలేని నాయకు డు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బీరాలు పలుకుతున్నాడు!

అసెంబ్లీ సమావేశం జరగకుండా, జరిగినా ఆలస్యంగా జరిగే విధంగా చేయాలన్నది ఆయన ఆఖరి యత్నం.పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రారంభంలోనే తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలన్నది యూపీఏ ప్రభుత్వ ప్రయత్నం. సమావేశాలు డిసెంబరు 5న మొదలవుతాయి. డిసెంబరు మొదటి వారంలోపు బిల్లును అసెంబ్లీకి పంపి, తిరిగి వెనుకకు వచ్చేట్టు చూడాలన్నది కేంద్రం యోచన. కానీ కిరణ్ కొత్త కుట్రలు చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలను ‘నిరవధికంగా వాయిదా(వూపోరోగ్)’ వేస్తూ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అంటే స్పీకర్ ఎప్పుడంటే అప్పుడు సమావేశాలను పిలువచ్చు. కానీ ఇప్పుడు స్పీకర్ దిష్టిబొమ్మలు తగులబెట్టించి, ఆయనను విలన్‌గా చిత్రించి, ఆయనపై ఒత్తిడి తెచ్చి, ఇప్పటికిప్పుడు అసెంబ్లీని ప్రోరోగ్ చేయించేందుకు పావు లు కదుపుతున్నారు. ఒకసారి ప్రోరోగ్ అయితే మళ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రి నుంచి లేఖ వెళ్లాలి. ఆయన లేఖ రాయకపోవచ్చు. రాసినా స్పీకర్ పిలవాలి. అదంతా పూర్తికావడానికి కనీసం వారంరోజులు, అంతకంటే ఎక్కువ సమ యం పడుతుంది. పార్లమెంటు సమావేశాలు డిసెంబరు 20తో ముగుస్తాయి. ఆ లోపు అసెంబ్లీ సమావేశం కాకుండా చూడడం, ఒకవేళ సమావేశం అయి నా పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా అసెంబ్లీ నుంచి తిరిగి బిల్లు వెళ్లకుండా చూడడం వంటి వికృ త ఆలోచనలు ఆయన చేస్తున్నారని ఆయన పార్టీవారే చెబుతున్నారు. తాటిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడొకడు ఉంటాడు. ఇది చావు తెలివి. కేంద్రం శీతాకాల సమావేశాలను మరోవారం రోజు లు పొడిగిస్తే కిరణ్ తల ఎక్కడ పెట్టుకుంటాడు? పార్లమెంటు సమావేశాల దాకా ఎందుకు? జీవోఎం నివేదికను సమర్పించడం,కేంద్రమంత్రివర్గం ముసాయిదా బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంప డం, రాష్ట్రపతి అసెంబ్లీకి నివేదించడం కిరణ్ ఆపగలడా? ఇవన్నీ జరిగిన తర్వాత కిరణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిలువరించగలడా? నిలువరించి హైదరాబాద్‌లో ప్రభుత్వం నడుపగలడా? రాజకీయ సంక్షోభం తలెత్తకుండా చూడగలడా? తన ప్రభుత్వాన్ని తాను కాపాడుకోగలడా? అసలు తానే అధికారంలో కొనసాగ గలడా? కిరణ్‌ది మేకపోతు గాంభీర్యం. కేవలం బుకాయింపు.

నిజానికి, సూక్ష్మంగా గమనిస్తే ముగ్గురు నేతలు ఇప్పుడు తమ సొంత రాష్ట్రంపైన దృష్టిని కేంద్రీకరించారు. రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్ధమయ్యా రు. ఒకాయన కుప్పం నుంచి యాత్రలు మొదలుపెట్టారు. ఇంకొకాయన కుప్పం నుంచి ఇచ్ఛాపురం యాత్రలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరు నుంచి ప్రచారం మొదలుపెట్టారు. అక్కడ ‘వీర సమైక్య ఛాంపియన్’గా పేరు కొట్టేయాలన్నదే అందరి ఆరాటం. చివరి వరకు పోరాడి ఓడిపోయానని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి తాపవూతయపడుతుండవచ్చు. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి పార్టీ పెడతారన్న ప్రచారమూ జరుగుతున్నది. కానీ ఆయన జరుపుతున్న సభల్లో జనం స్పందన గమనించినవావరికీ ఆయన ప్రజానాయకుడిగా ఆమోదం పొందుగలరన్న నమ్మకం కలుగదు. కాంగ్రెస్‌ను ఎదిరించి మాట్లాడుతున్నందుకు సీమాంవూధలో ఆయన ప్రసంగాలకు జనం ఊగిపోవాలి. కానీ అటువంటి హర్షధ్వానాలేవీ కనిపించడం లేదు. చంద్రబాబు, జగన్‌బాబు పరిస్థితి కొంచెం మెరుగు. ఈ నేతలు అక్కడ జనాన్ని ఉర్రూతలూగించలేకపోవడానికి కారణం స్వయంకృతం. వీరు చెప్పిన అబద్ధాలు, వీరు చేస్తున్న మోసం, వీరు మార్చుతున్న మాటలు వీరిపై జనంలో నమ్మకం సడలేట్లు చేశాయి. విభజన విషయంలో ఈ ముగ్గురిలో ఒక్క నాయకుడంటే ఒక్క నాయకుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదు. ‘ఈ సంక్షోభం ఇంకెన్నాళ్లు మోద్దాం? నేనున్నాను. నవ్యాంవూధను నిర్మి ద్దాం’ అని భరోసా ఇవ్వలేకపోయారు. సీమాంవూధలో పనబాక లక్ష్మి, డొక్కా మాణిక్య వరవూపసాద్, కొండ్రు మురళి, బాలరాజు వంటి దళిత నాయకులు చూపి న ధైర్యాన్ని కూడా వీళ్లు చూపలేకపోయారు. ఇప్పు డు ఈ క్షణంలో కూడా సమైక్యాంవూధను కాపాడతామనే భ్రమల జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మోసపూరితమైన వైఖరే వారిని బలితీసుకుంటుంది.

[email protected]

720

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా