విద్వేష వితండవాదం


Tue,October 18, 2011 10:22 PM

సమ్మెలు చేస్తే రాష్ట్రాలను పంచుతారా? సమ్మె ప్రభావం ఉందనడం ఒక భ్రమ.

-ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకాచౌదరిసభలు జరిపితే రాదు /ఊరేగింపులు చేస్తే డోంట్ కేర్
ర్యాలీలు నిర్వహించినా కదలరు /ధర్నాలను పట్టించుకోరు
సత్యాక్షిగహాలంటే లెక్కే లేదు/ మిలియన్ మార్చ్‌లూ పనిచేయవు

నిరాహారదీక్షలు చేస్తే తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు తీసుకుంటారు. అన్ని పార్టీలు తెలంగాణకు ఆమోదం తెలిపి, పిల్లి మొగ్గలు వేసినా ప్రజాస్వామ్యానికి ఏమీ కాదు. వందలాది మంది యువకులు ఆశోపహతులై మృత్యువు ఒడిని చేరుతున్నా ప్రభుత్వాలు చలించవు. లక్షలాది మంది యువకులు లాఠీలకు, బాష్ప వాయు గోళాలకు, తూటాలకు ఎదురొడ్డి పోరాడినా ప్రయోజనం ఉండదు. చివరకు కమిటీలు వేసినా తెలంగాణ రాదు.

renuka-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసమ్మెలు చేసినా కేంద్రం పట్టించుకోదు. ఇంకేం చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇంకేం ప్రత్యామ్నాయాలు మిగిలిఉన్నాయి? ప్రజలు కొట్టుకుని రక్తం ఏరులై ప్రవహించాలా? సహనం నశించి ప్రజాక్షిగహం కట్టలు తెంచుకోవాలాతైబహ్మాండం బద్దలు కావాలా? తెలంగాణ ప్రజలను ఏం చేయాల్సిందిగా పురిగొల్పుతున్నారు? స్పర్శజ్ఞానం ఉన్న చర్మానికి నొప్పి తెలుస్తుంది. స్పృహలో ఉన్న మెదడుకు పరిసరాల సోయి ఉంటుంది. హృద యం ఉన్నవాడికి అంతరాత్మ చైతన్యం ఉంటుంది. అధికార సుగంధాల మత్తులో సర్వాంగాలూ మొద్దుబారిపోయినప్పుడు పల్స్ దొరకడం కష్టమే. ఇక షాక్ ట్రీట్‌మెంట్ అవసరమేమో!

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారయింది. పాలన పూర్తిగా గాడితప్పడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

-మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుఒక కన్ను లేని వాడు /ండు కళ్లు లేని వారిని చూసి ఎద్దేవా చేసినట్ట్టు,
ఒక కాలు లేని వాడు/రెండు కాళ్లు లేని వారిని చూసి వెక్కిరించినట్టు,
సగం బట్టలు చిరిగినవాడు/అసలు బట్టలు లేనివారిని చూసి ఎగతాళి చేసినట్టు,
మాటమార్చిన వాడు /మాట తప్పినవాడిని శపించినట్టు
చంద్రబాబు చెల్లాచెదురవుతున్న తెలుగుసేన మధ్యలో నిలబడి, కుక్కలు చింపి న విస్తరి కాంగ్రెస్ గురించి దెప్పి పొడుస్తున్నారు. కుక్కలు చింపినా, నక్కలు చింపినా విస్తరి విస్తరే, చిరుగులు చిరుగులే. నిజమే.. కాంగ్రెస్ ఆగమైపోతున్నది. దిక్కూ దివాణం లేక నానాతెర్లవుతున్నది. నడిపించే నాథుడు లేక బెంబేపూత్తుతున్న ది. చుక్కానిలేని నావలాగా గాలి ఎటు ఊపితే అటు సాగిపోతున్నది. ఏ తీరానికి చేరుతుందో ఎవరికీ తెలియని మాట వాస్తవ మే. కానీ బాబుగారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందా? ఆయన విస్తరికి అస్సలు చిరుగులు పడలేదా? కొందరు ఎమ్మె ల్యే తమ్ముళ్లు ఎప్పుడో జగన్నాటకంలో కలసిపోయారు.

ఇంకొందరు తమ్ముళ్లు తెలుగుదేశం జెండా దించేసి తెలంగాణ జెండాపట్టుకుని ఎంచక్కాపోయారు. మరికొందరు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ‘న ఘర్ కా, న ఘాట్ కా’బన్‌కే పాగలోంకే తరహ్ ఘూమ్తా రహా! బావమరుదులూ తలా ఓ పాట అందుకుంటున్నారు. నికరంగా ఆంధ్రా తమ్ముళ్లు మాత్రమే అంతో ఇంతో ఈ బాబును మోస్తున్నారు. అయినా బాబు ఇవేవీ ఒప్పుకోరు. ఈ చిరుగులను కార్పెట్ కింద దాచేసి, ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ త్వరలోనే రాబోతుందని పంచరంగుల సినిమా చూపిస్తుంటారు. ఆర్నెల్ల ముందుగానే టికెట్లు ఇచ్చి అందరికీ వైభోగం తెస్తానని నమ్మిస్తుంటారు. ‘బుకాయించి భూములేలవచ్చు’నని సామెత. మన బాబుసారు బుకాయించి రాజ్యాలూ ఏలవచ్చునని అనుకుంటున్నారు!

విశాలాంధ్ర ఎప్పటికీ విశాలాంధ్రగానే ఉండాలి. విశాలాంధ్ర పదం ఎంత మధురంగా ఉంది!

-కాంక్షిగెస్ నేత, నటుడు చిరంజీవి


తమరు పార్టీలు మార్చొచ్చు/జెండాలు మార్చొచ్చు
ఎజెండాలు మార్చొచ్చు/మాటలు మార్చొచ్చు
విశాలాంధ్ర మాత్రం మారొద్దు/బహుళాంధ్ర రావద్దు


మహానటుల మహానటన!
కలసిపోవడాలు, విడిపోవడాలు, మారిపోవడాలకు తమరు వ్యతిరేకం కాదు. మనకు లాభం ఉంటే కలసిపోవచ్చు. మారిపోవచ్చు, విడిపోవచ్చు. ఎగిరి గంతేయవచ్చు. మనకు నష్టం జరిగే పనయితే, మన అనుభవంలో ఉన్నది చేజారిపో యే పనయితే అస్సలే మారొద్దు. స్వార్థం టు ది పవర్ ఆఫ్ స్వార్థం చిరునీతి!

నాలుగో స్తంభమైన జర్నలిజం నిష్పక్షపాతంగా ఉండాలి. వాస్తవాలను రాయా లి. లేని పక్షంలో ప్రజలు తిరగబడి నిలదీయడం ఖాయం.

-ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్‌డ్డితొలి స్తంభమైన శాసనకర్తలు, మలి స్తంభమైన కార్యనిర్వాహకులు మాత్రం నిష్పక్షపాతంగా ఉండనక్కరలేదు. వాస్తవాలను రాయాల్సిన పనిలేదు. ఒక ప్రాంత ప్రజలపట్ల, వారి ఆకాంక్షల పట్ల, వారి ఉద్యమాల పట్ల విద్వేషపూరితంగా వ్యవహరించవచ్చు. అవాస్తవ నివేదికలను, అబద్ధాల వంటకాన్ని ఏరోజుకారోజు వండివార్చి ఢిల్లీకి వడ్డించవచ్చు. ప్రజలు తిరగబడుతున్నా, నిలదీస్తున్నా అంతా ప్రశాంతంగా ఉందని నమ్మబలకవచ్చు. కేంద్రం చెవులు, కళ్లు కట్టేయవచ్చు. చెప్పేటందుకే నీతులు!

హైదరాబాద్ ఎవరిది?


హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉబలాటపడుతున్నారని, ఆ విషయమై చర్చలకు సిద్ధపడుతున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియదు. కానీ ఇటు తెలంగాణ నేతలు, అటు సీమాంధ్ర నేతలు తెలుసుకోవలసిన చారివూతక విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ గురించిన చర్చే 1952లో చెన్నయ్ గురించి, 1960లో బొంబాయి గురించి జరిగింది. ఇప్పుడు సీమాంధ్ర నాయకులు చేసిన వాదనలే అప్పుడు గుజరాతీలు, ఆంధ్ర నాయకులు చేశారు.అవి ఏమంటే:

బొంబాయి ఎవరిది?


మహారాష్ట్ర, గుజరాత్ వేరుపడినప్పుడు బొంబాయి తమకే దక్కాలని గుజరాతీలు వాదించారు. గుజరాతీలు ఇలా అన్నారు: ‘‘బొంబాయి ఆదివాసులం మేమే. బొంబాయిని నిర్మించిందీ మేమే. బొంబాయిలో వ్యాపార, పారిక్షిశామిక సంస్థల్లో అత్యధికం మేము ఏర్పాటు చేసినవే. బొంబాయి జనాభాలో అధిక శాతం గుజరాతీలే. బొంబాయి ఆదాయంలో అత్యధికం మా కంపెనీల నుంచి వస్తున్నదే. అందువల్ల బొంబాయి గుజరాత్‌కే దక్కాలి. గుజరాత్ రాజధానిగా ఉండాలి. అలా కాకపోతే కనీసం శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉండాలి. అదీ కాకపోతే బొంబాయిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి’’. చివరికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. గుజరాత్ తొలుత అహ్మదాబాద్‌ను రాజధానిగా చేసుకుంది. ఆ తర్వాత గాంధీనగర్‌కు రాజధాని మారింది.

చెన్నయ్ ఎవరికి దక్కాలి?


మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయేముందు జరిగిన గొడవంతా చెన్నయ్ గురించే. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రారంభించింది చెన్నపట్నం రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న నినాదంతోనే. ‘‘చెన్నపట్నం తెలుగులు నిర్మించిన నగరం. చెన్నపట్నం భూభాగాలన్నీ తెలుగు రాజులేలినవే. చెన్నపట్నం మూలవాసులు తెలుగువారే. ఇక్కడ తెలుగువారు పెద్ద ఎత్తున వ్యాపారాలు, పరిక్షిశమలు ఏర్పాటు చేశారు. చెన్నపట్నంలో తెలుగువారే మెజారిటీ. అందువల్ల చెన్నపట్నం తెలుగువారికే రాజధానిగా ఉండాలి. అందుకు అరవలు ఒప్పుకోకపోతే కనీసం ‘కోవం’ నది ఉత్తర భాగాన్ని ఆంధ్ర రాజధానిగాను, దక్షిణ భాగాన్ని తమిళుల రాజధానిగానూ చేయవ చ్చు. అదియును సాధ్యంగాకున్న చెన్నపట్నాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలి. అప్పటికీ కుదరకపోతే కేంద్రపాలిత ప్రాంతం చేయాలి. చెన్నపట్నం ఆదాయాన్ని ఇరువూపాంతాలకు పంచాలి’’.

ఈ వాదనలతోనే పొట్టి శ్రీరాములు చెన్నపట్నంకోసం పట్టుబట్టారు. అయితే ఆయన దీక్ష మొదలైన కొన్నాళ్లకు అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ చెన్నయ్ జోలికి రాకపోతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అడ్డం పడబోమని ప్రకటన చేశారు. కానీ పొట్టి శ్రీరాములు, ఆయనకు దన్నుగా నిలిచిన బులుసు సాంబమూర్తి వంటి వారు చెన్నయ్ లేకుండా రాష్ట్రం అక్కరలేదన్నారు. అయినా నెహ్రూ ప్రకటించలేదుగా అని విమర్శలు చేశారు. చివరకు 1952 డిసెంబరు 9న నెహ్రూ స్వయంగా ప్రకటన చేశారు. చెన్నయ్ విషయం పక్కనబెడితే త్వరితగతిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అప్పటి స్టేట్స్ కౌన్సిల్‌లో ఆయన ప్రకటించారు. అప్పుడు కూడా శ్రీరాములుతో దీక్ష విరమింపజేయలేదు ఆంధ్ర నాయకులు.

చెన్నయ్ విషయం తేలాల్సిందే అని పట్టుబట్టి ఆయనచేత బలవంతంగా దీక్ష కొనసాగింప జేశారు. ఆ తర్వాత ఆరు రోజులకు డిసెంబరు 15వ తేదీన పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వా త చెన్నపట్నం లేకుండానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది. కొన్ని ఆఫీసులు, కొంతకాలం చెన్నపట్నంలో కొనసాగించడానికి తొలుత ఒప్పుకున్న రాజాజీ, చెన్నపట్నంపై చేసిన యాగీతో విసుగుచెంది, వాళ్లు ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండడానికి అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మిగిలిన చరిత్ర మనకు తెలుసు.
రాజధానితో ఏ రాష్ట్రం విడిపోలేదా?

ఇది ఇంకో అబద్ధం. రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోరడం ఏమిటి? రాజధానితో ఏ రాష్ట్రమయినా విడిపోయిందా అని కొందరు తరచూ ప్రశ్నిస్తున్నా రు. వారిది అజ్ఞానమయినా కావాలి. బుకాయింపయినా కావాలి. 1970 వర కు అస్సాం, మేఘాలయ కలిసి అస్సాం రాష్ట్రంగానే ఉండేవి. అప్పటి రాజధాని షిల్లాం గ్. మేఘాలయ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినప్పుడు కేంద్ర దిగివచ్చి తొలుత స్వయంవూపతిపత్తి కలిగిన ప్రాంతంగా, ఆ తర్వాత 1972లో ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటు చేశారు. షిల్లాంగ్ రాజధానిగా మేఘాలయ విడిపోయింది. అస్సాం తమ కొత్త రాజధానిగా గౌహతికి సమీపంలోని దిస్‌పూర్‌ను ఎంచుకుంది. ఈ పరిణామాలన్నీ నేర్పుతున్న పాఠం ఏమంటే హైదరాబాద్ తెలంగాణ ప్రజలది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను ఎవరూ విడదీయలేరు. హైదరాబాద్ ఆదాయాన్ని పంచాలని మరో వాదన. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎన్ని జిల్లాలు? ఎవరి ఆదా యం? ఎక్కడి ఆదాయం? అలాగే విశాఖ ఆదాయం, తిరుపతి, గుంటూరు ఆదా యం కూడా పంచుతారా?

346

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles