ఎవరి హైదరాబాద్? ఎవరి ఆదాయం?:కట్టా మీఠా:కట్టా శేఖర్‌రెడ్డి


Sat,November 2, 2013 12:40 AM

విభజన సమస్య చివరకు హైదరాబాద్ కోసం, హైదరాబాద్ చుట్టూ పరివూభమిస్తోంది. సమన్యాయం అని చంద్రబాబు మాట్లాడుతున్నదీ, సమైక్యాంధ్ర అని కిరణ్‌బాబు, జగన్‌బాబులు మాట్లాడుతున్నదీ అంతర్లీనంగా హైదరాబాద్ గురించే. రాష్ట్ర ఆదాయానికి అత్యధిక నిధులు సమకూర్చే హైదరాబాద్‌లో మావాటా ఏమీ లేదా అన్నదే వారి ప్రశ్న. హైదరాబాద్ ఆదాయంలో వాటాలేకపోతే ఆంధ్ర ఎలా మనుగడ సాగిస్తుందన్నదే వారి ఆందోళన. హైదరాబాద్‌లో మేము పంచిన భూముల సంగతేమిటి? మేము దంచిన భూముల మాటేమిటి? అన్నదే వారిని కలవరపెడుతున్న సమస్య.కానీ ఇవేవీ బాహాటంగా చెప్పే దమ్ము ధైర్యం వారికి లేదు.మనసులోని అధర్మ వాంఛలకు వేస్తున్న అందమైన ముసుగు సమైక్యత. ఇదంతా ప్రజలకు కూడా అర్థమవుతున్నది. ‘ఆక్షికమించిన భూముల జోలికి వెళ్లం. అక్రమంగా పంచిన భూములను ముట్టుకోం. గతంలో మీరు చేసిన పాపాలను పట్టించుకోం అని విభజన బిల్లులో పెడతామని హామీ ఇవ్వమనండి. వాళ్లు నోరుమూసుకుని వెళతారు’ అని డ్బ్బైఏళ్ల రిటైర్డు అధికారి ఒకరు ఫోను చేసి చెప్పారు.హైదరాబాద్ గురించి ఎందుకింత వివాదం జరుగుతోంది? హైదరాబాద్‌లో జీవితచక్రం నిరాఘాటంగా తిరగడానికి అవుతున్న ఖర్చు ఎంత? హైదరాబాద్‌ను పోషించడానికి తెలంగాణ నష్టపోయిందెంత? హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయం ఎంత? తెలంగాణ కోల్పోయిన ఆదాయం ఎంత? నిజాయతీగా విశ్లేషించుకుంటే చాలు. రాష్ట్ర జనాభాలో ఇవ్వాళ 27 శాతం హైదరాబాద్ పట్టణ పరివ్యాప్తిలో జీవిస్తున్నారు. ఇందులో అన్ని ప్రాంతాల వాళ్లు, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని కులాలు, మతాల ప్రజలు ఉన్నారు. విభజన జరిగితే ఏ కొద్దిమంది ఉద్యోగులో తరలిపోతారు తప్ప వీరంతా ఇక్కడే ఉంటారు. నగరానికి అందిస్తున్న మౌలిక సదుపాయాలేవీ ఆగిపోవు, తగ్గిపోవు. ఆ మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ పెట్టిన పెట్టుబడి ఏమిటి?ఇప్పుడు హైదరాబాద్‌పై వస్తున్న ఆదాయం ఒక్క సింగూరు రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి చాలదు. సమైక్యతకోసం తెలంగాణ నష్టపోయిన వివరాలు తీస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎంతనీరు? ఎన్ని ఉద్యోగాలు? ఎన్ని భూము లు? ఎన్ని లక్షల కోట్లు?

హైదరాబాద్ నగరానికి ఒక కాప్టివ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయిన మహానుభావులు సమైక్య ప్రభువులు. సమైక్యాంవూధలో ఇన్ని నిర్వాకాలు చేసి ఇప్పుడు కలిసుందామని,హైదరాబాద్ లో వాటా కావాలని మాట్లాడితే ఏమని అర్థం చేసుకోవాలి? హైదరాబాద్ అంటే ఇక్కడి ప్రజలు. వారి జీవితం. హైదరాబాద్ ఆస్తి కాదు పంచుకోవడానికి!


సింగూరు ప్రాజెక్టును నిర్మించింది కరువు కాటకాలతో విలవిలలాడుతున్న మెతుకుసీమ రైతులను ఆదుకోవడానికి.29 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ చివరకు ఏమైంది?చుక్కనీరు రైతులకు ఇవ్వకుండా మూడు దశాబ్దాలుగా మం జీర ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు తరలించుకువచ్చారు. నగరానికి 1996లో రోజుకు 658 మిలియన్ లీటర్లు తాగునీరు అవసరం కాగా ఇప్పుడు 840 మిలియన్ లీటర్లకు పెరిగింది. 1996లో తలసరి నీటి వినియోగం 150 లీటర్లు ఉంటే ఇప్పుడది 120 లీటర్లకు తగ్గిపోయింది. నీటి అవసరాలు పెరిగేకొద్దీ ఒక్కొక్క ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లింపు మొదలైంది. కృష్ణానది నుంచి 17 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇప్పటికే 10.5 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. తాజాగా గోదావరి జలాల తరలింపు పథకం నడుస్తోంది. ఈ నీటిపూక్కలన్నీ తెలంగాణ వినియోగంలో చూపిస్తున్నారు. ఈ నీటి తరలింపు ఖర్చునంతా తెలంగాణలో ఖర్చుల కింద చూపిస్తున్నారు. కానీ తెలంగాణకు జరిగిన నష్టాల్లోకి వెళ్లి చూడండి-సింగూరు, మంజీరా ప్రాజెక్టుల కింద రైతాంగం ఏటా కనీసం 20 టీఎంసీల నీరు ఉపయోగించుకుంటే రెండు లక్షల ఎకరాలు సాగయ్యేది. రాజశేఖర్‌డ్డి సూక్ష్మ వ్యవసాయం ప్రకారమైతే ఆరు లక్షల ఎకరాలు సాగయ్యేది. తడి పంటలయితే ఏటా ఎకరాకు 80 వేల రూపాయల రాబడి వస్తుంది. అంటే మెదక్ రైతులకు ఏటా 1600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ ముప్పైఏళ్లలో వారు నష్టపోయింది ఎంతో లెక్కవేయండి. అలాగే కృష్ణా నీటికీ మూల్యం కట్టండి. ఇవి కాకుండా తెలంగాణకు నీటి వాటాలు ఇవ్వకపోవడం వల్ల నష్టంఎంత? కృష్ణా నదిలో కేటాయించిన 280 టీఎంసీల నీటిని తెలంగాణ ఉపయోగించుకుని ఉంటే ఇవ్వాళ నల్లగొండ, మహబూబ్‌నగర్‌లు దారివూద్యంలో కొట్టుమిట్టాడవలసి వచ్చేదా? ఫ్లోరైడు సమస్య, వలసల విషాదంతో అలమటించేవా?
ఒక ఉద్యోగం పది కుటుంబాల జీవితాలను బాగు చేస్తుందిపభావితం చేస్తుం ది. ఊరుకు పది ఉద్యోగాలు ఉంటే ఆ ఊరు మారిపోతుంది. జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. సమైక్యాంవూధలో తెలంగాణ పౌరులకు అర్హత ఉండీ దక్కకుండా పోయిన ఉద్యోగాల సంఖ్య, దానివల్ల జరిగిన నష్టం లెక్కలు తీయండి-హైదరాబాద్ ఎవరికి దక్కాలో తెలిసిపోతుంది.


తెలంగాణ ఉద్యమకారులు లక్షకు పైగా ఉద్యోగాలు కోల్పోయామని చెబుతుంటారు.యాభైవేల ఉద్యోగాలే తీసుకుందాం. ఒక ఉద్యోగం సంపాదన ఇన్నేళ్లలో తక్కువలో తక్కువ కనీసం కోటి రూపాయలు ఉంటుందనుకుందాం.అంటే 50వేల కోట్ల రూపాయలు ఉద్యోగాల రూపంలోనే తెలంగాణ నష్టపోయింది. ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణకు దక్కి ఉంటే తెలంగాణ ఇంతగా వెనుకబడి ఉండేది కాదు. హైదరాబాద్ నగరం చుట్టూ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకం కింద పరిక్షిశమలు పెట్టడానికి తొలినాళ్లలో ఉచితంగా భూములు, నీరు, పన్ను రాయితీలు, సబ్సిడీ విద్యుత్ ఇచ్చారు. అవన్నీ తెలంగాణ వనరులే. తెలంగాణ జిల్లాల యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడంకోసం ఈ పథకాన్ని తెచ్చారు. కానీ జరిగింది ఏమిటి? ఆ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కడివారో ఇప్పుడయినా లెక్కలు తీయండి. ఆ కంపెనీలు కాలుష్యకారకాలుగా మారి ఎంత నరకం చూపిస్తున్నాయో ఆ పారిక్షిశామిక వాడలకు వెళ్లి చూడండి. తెలంగాణ ఉద్యమం ఎందుకు సమంజసమైనదో అర్థం అవుతుంది. ఆ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయం మాదేనని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. ఇక్కడి వనరులు, ఇక్కడి భూములపై వెలసిన కంపెనీలు ఇక్కడ పన్నులు కట్టకుండా విజయవాడలో చెల్లిస్తాయా?


అతిపెద్ద కుంభకోణం భూములదే. హైదరాబాద్‌లో, హైదరాబాద్ చుట్టూ సర్ఫెఖాస్, పైగా, వక్ఫ్, భూదాన్, షేవూషీ, గురుకులవూటస్టు, బోనావేకెన్సీ...ఇలా రకరకాల పేర్లతో ఉన్న ప్రభుత్వ భూమి కనీసం రెండు లక్షల ఎకరాలు మాయమయింది. బాలానగర్ మండల రెవెన్యూ రికార్డులు రెండుసార్లు తగులబడ్డాయి. నిన్నగాకమొన్న శంకర్‌పల్లి హెచ్‌ఎండీఏ జోనల్ కార్యాలయం తగులబడింది. షేక్‌పేట మండల కార్యాలయంలో కూడా ఒకసారి అగ్నివూపమాదం జరిగింది. ఇవ్వాళ హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ తారుమారయ్యాయి. అన్యాక్షికాంతమైన భూమి కనీసం లక్ష ఎకరాలే లెక్కవేయండి. ఎకరం విలువ కోటి రూపాయలే లెక్కగట్టండి. లక్ష కోట్ల రూపాయలు హైదరాబాద్, రంగాడ్డి జిల్లాలు కోల్పోయాయి. న్యాయంగా కొనుక్కున్న భూముల గురించి మాట్లాడడం లేదు. ప్రైవేటు భూముల గురించి మాట్లాడడం లేదు. తెలంగాణలో భూములు కొనాలం ప్రాంతీయ అభివృద్ధి మండలి అనుమతి తీసుకోవాలని రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందం నుంచి ఇప్పటిదాకా జరిగిన దుర్మార్గాలను చూస్తే హైదరాబాద్‌పై సీమాంధ్ర నాయకత్వం చేస్తున్నవాదన ఎంత అన్యాయమైనదో, ఎంత మోసపూరితమైనదో అర్థమవుతుంది.


హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు 19 ప్రభుత్వరంగ కంపెనీలను మూసేశారు. వాటి ఆస్తులను వేలం వేశారు. హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిన జనాభాను తట్టుకోవడానికి ఇన్నర్‌రింగ్‌రోడ్డు అవసరం అన్నారు. ఫ్లై ఓవర్లు కట్టారు. తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు అవసరం అన్నారు. ఇప్పుడు మెట్రోరైలు వస్తోంది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల వెనుక సీమాంధ్ర రియల్టర్ల ప్రయోజనాలే ప్రాథమికమైనవి. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం లక్షలకోట్ల అప్పులు తెస్తోంది.

అవన్నీ ఇప్పుడు హైదరాబాద్‌పై వదిలేస్తారా లేక సీమాంధ్ర పంచుకుంటుందా? హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ, విద్యుత్ వినియోగం, రవాణా సౌకర్యాల నిర్వహణ కోసం ఎంత ఖర్చవుతోంది? ఈ లెక్కలన్నీ తేలాలి. 2009-10 లెక్కల ప్రకారమే 3541 బస్సులు రోజుకు 40,006 ట్రిప్పులు నగరంలో తిరుగుతున్నాయి. నగరం వినియోగానికి కనీసం1000 నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని నిపుణులు అంచనా. హైదరాబాద్ నగరానికి ఒక కాప్టివ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయిన మహానుభావులు సమైక్య ప్రభువులు. సమైక్యాంవూధలో ఇన్ని నిర్వాకాలు చేసి ఇప్పుడు కలిసుందామని, హైదరాబాద్‌లో వాటా కావాలని మాట్లాడితే ఏమని అర్థం చేసుకోవాలి? హైదరాబాద్ అంటే ఇక్కడి ప్రజలు. వారి జీవితం. హైదరాబాద్ ఆస్తి కాదు పంచుకోవడానికి. హైదరాబాద్‌ను మీరు తేలేదు తీసుకుపోవడానికి. విడిపోయిన తర్వాత కూడాఆ జీవితం కొనసాగుతుంది. ప్రజలు కలిసే ఉంటారు.

[email protected]

523

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles