భస్మాసుర రాజకీయం


Fri,October 11, 2013 11:53 PM


ప్రజావూపతినిధులను తిరస్కరించే అవకాశం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజా గా సీమాంధ్ర ప్రాంతంలో సర్వే నిర్వహించారట. ఆ సర్వేలో 63 శాతం మంది ఓటర్లు అక్కడి ప్రజావూపతినిధులను తిరస్కరించారని, అనంతపురంలో అత్యధికంగా 74.3 శాతం మంది ప్రజలు తమ నాయకులను తిరస్కరించారని ఆ సర్వే సారాంశం. ప్రకాశం నుంచి కర్నూలు వరకు తిరస్కార ఓటు శాతం అరవై శాతానికి పైగా ఉంటే విశాఖలో 50శాతం ఉంది, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, గుం టూరు జిల్లాల్లో 55 శాతం ఉంది. రాజగోపాల్ చేయించిన ఉద్దేశం వేరే. ఆ సర్వేనూ పూర్తిగా నమ్మాల్సిన పనిలేదు. కానీ సీమాంధ్ర ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉందన్నది ఈ సర్వేల అంతస్సారం. ప్రజలను మభ్యపెడితే, మోసం చేస్తే, భ్రమల్లోకి తీసుకెళితే, లేనిపోని భయాలతో రెచ్చగొడితే....వారు పూలతో సత్కరించరు. రాళ్లతోనే స్వాగతిస్తారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా గత పన్నెండేళ్లలో ఏరోజూ తీవ్రంగా స్పందించలేదు. 2004 ఏప్రిల్‌లో టీఆస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. టీఆస్-కాంక్షిగెస్‌లకు ఓటేస్తే రాష్ట్రం విచ్ఛిన్నమవుతుందని చంద్రబాబు చెప్పినా జనం పట్టించుకోలేదు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తామ’ని తీర్మానం చేసి 2009 ఏప్రిల్‌లో టీఆస్‌తో పొత్తుపెట్టుకున్న తెలుగుదేశం పార్టీని సీమాంధ్ర ప్రాంతంలో 53 స్థానాల్లో గెలిపించారు. సామాజిక తెలంగాణ ఇస్తామని ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీని 16 స్థానాల్లో గెలిపించారు. ‘మేము గెలిస్తేనే తెలంగాణ వస్తుంద’ని చెప్పిన రాజశేఖర్‌డ్డికి మరోసారి ఓటేసి అధికారంలోకి తీసుకువచ్చారు. 2009 డిసెంబరు 9 ప్రకటన తర్వాత కూడా సీమాంధ్ర ప్రజల్లో నిరసన కొనసాగలేదు. ఉప ఎన్నికల్లో టీఆస్ అభ్యర్థులపై పోటీ చేయకుండా, ‘తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామ’ని చెప్పిన జగన్‌మోహన్‌డ్డి పార్టీని మొన్నమొన్ననే సీమాంవూధలో 17 స్థానాల్లో గెలిపించారు. వీటన్నింటి సారం ఏమంటే కేంద్రం తెలంగాణ నిర్ణయం ప్రకటించే వరకు సీమాంవూధ లో పెద్దగా అలజడిలేదు. జూలై 30 తర్వాత కూడా మొదటి పది రోజులు అనంతపురం, తిరుపతి, విశాఖ వంటి కొన్ని చోట్ల తప్ప మిగిలిన ప్రాంతమంతటా సాధారణ స్థాయిలోనే నిరసనలు ఉద్యమాలు కొనసాగాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఉద్యమం తీవ్రమవుతూ వచ్చింది.


కారణాలు తెలియనివీ కావు, కొత్తవీ కావు. తెలంగాణ రాదని, రానివ్వబోమని సీమాంధ్ర నాయకులు చివరి నిమిషం వరకూ అబద్ధాలు చెబుతూ, నమ్మబలుకుతూ వచ్చారు. నాయకులు గానీ, ప్రభుత్వం కానీ విభజనకు ప్రజలను మానసికంగా సిద్ధం చేయలేదు. తీరా కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇదేదో హటాత్పరిణామంలాగా, తాము ఊహించని ఉత్పాతంలాగా నాయకులు నోరెళ్లబెట్టారు. వెంటనే తేరుకుని ఇంకా తెలంగాణను ఆపగలమని మళ్లీ మళ్లీ ప్రగల్బాలు పలుకుతూ వచ్చారు. విభజన పరిణామంతో ప్రజల్లో భయాలు, ఆందోళనలు మొదలయ్యాయి. హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం పోతుందన్న బాధ వారిని కలతకు గురిచేసింది. వారి భయాలపై ఆజ్యం పోస్తూ హైదరాబాద్‌లో ఊడలుదిగిన మీడియా సామ్రాజ్యాలు సీమాంధ్ర రాజకీయ నాయకత్వంపై ముప్పేట దాడి చేశాయి. సీమాంధ్ర నాయకులను మోసగాళ్లుగా, దద్దమ్మలుగా, అబద్ధాలకోర్లుగా, చేతగానివాళ్లుగా చిత్రీకరిస్తూ రెచ్చిపోయాయి. హైదరాబాద్‌ను కోల్పోతున్నామన్న అక్కసునంతా మీడియా ప్రజలపై చూపింది. అక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపించడం మొదలుపెట్టింది. ప్రజలను ఎంతగా రెచ్చగొట్టాలో మీడియా అంతగా రెచ్చగొట్టింది. రెండు వారాలు గడిచేసరికి మీడియా ఆశించిన ఉద్యమం కొండంత రూపం దాల్చింది. విచిత్రం ఏమంటే స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఒక సామాన్యుడు అయిపోయాడు. అనంతపురంలో ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడుతున్న మాటలే రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చారు. ఉద్యమం చప్పబడుతుందునుకున్న ప్రతి నాలుగురోజులకూ పాత్రికేయుల సమావేశాలు నిర్వహించి అసత్యాలు, అర్థసత్యాలు, అజ్ఞానమూ కలబోసి జనం మీదికి వదలుతూ వచ్చారు. సీమాంధ్ర నాయకులు, ముఖ్యమంత్రి, మీడియా అందరూ జనం తరఫున మాట్లాడుతున్నామనుకుని రెచ్చిపోయారు. రాజకీయ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయిన నేపథ్యం ఇదీ. భస్మాసురుడికి వరమిచ్చిన శివుడు చివరికి తనను తాను రక్షించుకోలేకపోయాడు. మరో నాయకుడు శ్రీహరి మోహిని రూపంలోరావలసి వచ్చింది. ప్రజలు భస్మాసురులు కాదు, నాయకులు, మీడి యా వారిలో సృష్టించిన భయాందోళనలు, ఆగ్రహం భస్మాసురుని రూపం. సీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. వారికి నమ్మకం కలిగించే ధీరుడు కావాలి.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వచ్చిన రోజున ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ‘విభజనకు సహకరిస్తానని, నాలుగైదు లక్షల కోట్లతో రాజధాని నిర్మించాల్సి ఉంటుంద’ని ప్రకటించారు. కానీ ఆశ్చర్యకరంగా ‘అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా’నని ముందు నుంచీ చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రతిపక్ష నాయకుడిగా మారిపోయాడు. ‘ఇట్లా ఎట్లా విభజిస్తారు?’ అని అడ్డం గా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి.... విభజన అనివార్యమని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఇది జరిగి తీరవలసిందేనని, ఆధునికాంధ్ర రాష్ట్రాన్ని నిర్మించుకుందామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సీమాంధ్ర ప్రజలకు నష్టం జరుగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని, రెండు మూడేళ్లలో అత్యంత ఆధునిక రాజధానిని నిర్మించుకుందామని చంద్రబాబుతో పాటు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడి ఉంటే పరిస్థితి ఎలా ఉండే ది? డీఈవోలను, డీఆర్‌డీఏ అధికారులను, జాయింట్ కలెక్టర్లను ఉద్యమ నాయకులుగా, పోలీసులను ప్రేక్షకులుగా ప్రోత్సహించకుండా, ఉద్యమాన్ని కట్టడి చేసే బాధ్యతలు తీసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ చేస్తున్నపనే ముఖ్యమంత్రి చేసి ఉంటే ప్రజలు ఇంతగా నిరాశానిస్పృహలకు లోనయ్యేవారు కాదు. ఇంత గా కలతచెందేవారు కాదు. రాజకీయం కోసమైనా ప్రజలను ఇంత దిక్కులేనివారుగా మార్చకూడదు. తిరస్కార ఓటు సర్వే ఫలితాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. 63 శాతం మంది మాకు మీరెవరూ అవసరం లేదని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం ఎవరు? అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ-వూపతినాయకుని పాత్ర ద్వారా ఫలితాలు సాధించాలనుకోవడం వల్లనే ఇటువంటి దుస్థితి. ప్రజాస్వామిక మర్యాదలు, విలువలు పాటించకపోవడం వల్లనే ఇటువంటి విపరీత పరిణామాలు. నాయకులు నాయకులుగా ఉండాలి. కష్టకాలాల్లో ప్రజలకు ధైర్యమివ్వాలి. ముందుండి నడిపించాలి. తమ వెంట తీసుకెళ్లాలి. చేతగానివాళ్లలా, చేతుపూత్తేసినవారిలా, అసమ్మతివాదిలా వారి ముందు నిలబడితే తిరస్కరించక ఏం చేస్తారు. విభజన కంటే నాయకుల దివాలాకోరుతనం, నాయకత్వ లేమి సీమాం ధ్ర ప్రజలకు ప్రమాదకరం. విభజన వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించలేనివి కాదు. అన్ని సమస్యల పరిష్కారానికీ ఎప్పటి నుంచో నిర్ధారించిన ప్రమాణాలు ఉన్నాయి. హైదరాబాద్ చేజారిపోతుందన్న భయం మరీ అర్థరహితం. ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగావకాశాలూ, ఏ వ్యాపారావకాశాలూ ప్రాంతాల ప్రాతిపదికన రావు, జరగవు. మైక్రోసాఫ్ట్, ఐబిఎం, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్....ఆ మాటకొస్తే ఏ ప్రైవేటు కంపెనీ స్థానిక రిజర్వేషన్లు పాటించవు. అలా జరిగి ఉంటే బెంగళూరు ఐటి కంపెనీల్లో మనవాళ్లు 30 శాతం మంది ఉద్యోగాలు చేసేవారు కాదు. మన ఇన్‌ఫ్రా కంపెనీలు దేశమంతా కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసేవి కావు. విభజనపై రచ్చ చేసి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు! విభజన వల్ల కంటే ఈ విద్వేష బీజాల వల్ల ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది.

[email protected]

444

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా