అజ్జకారితనం అంతమయ్యే దాకా


Sat,October 5, 2013 12:09 AM


కేంద్ర వూపభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించడం ఒక చరివూతాత్మక మలుపు. ఈ నిర్ణయం చేసిన కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని పట్టుబట్టిన సోనియాగాంధీకి, ఆమె మాటను నిజాయితీగా, నిబద్ధంగా అమలులో పెట్టేందుకు కృషిచేసిన దిగ్విజయ్‌సింగ్‌కు కృతజ్ఞతలు. ఆరు దశాబ్దాల ఉద్యమాలు, త్యాగాలు, ముఖ్యంగా గత పుష్కరకాలంగా సాగిస్తున్న రాజీలేని పోరాటాల ప్రతిఫలం తెలంగాణ రాష్ట్ర సాకారం. అనేక దాడులు, విమర్శలు, ఆరోపణల జడివానలను తట్టుకుని, సీమాంధ్ర రాజకీయ పక్షాలు, సీమాంధ్ర మీడియా ఉన్మాదపూరిత వికృత చేష్టలను ఎదిరించి తెలంగాణ నినాదాన్ని సజీవంగా, సమరశీలంగా నిలబెట్టిన ఒక బక్కమనిషి, ఒక మొండి మనిషి, డెబ్బయ్యేళ్ల వయస్సులో కూడాగజ్జెకట్టి ఆడిన ఒక నడిచే పాట, అధ్యాపక ఉద్యోగ సంఘాలు, అనేక ఆలోచనా స్రవంతుల మేధావులు, కళాకారులు, విద్యార్థులు, న్యాయవాదులు, దళిత ఉద్యమకారుల కృషికి ప్రతిఫలం తెలంగాణ. ఒకపరి ఉధృతంగా, ఒకపరి నిదానంగానయినా నిబద్ధతతో నిలబడి కొట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, తుమ్ము తూ, దగ్గుతూ, దీర్ఘాలు తీస్తూ, సన్నాయినొక్కులు నొక్కుతూ అయినా ఢిల్లీలో తెలంగాణ కోసం ప్రయత్నాలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఈ విజయంలో భాగస్వాములు. తెలంగాణవాదానికి కొండంత నైతిక బలాన్నిచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ, భారతీయ జనతాపార్టీ ఈ విజయంలో గొప్ప ప్రేరక శక్తులుగా పనిచేశాయి. ఇలా చెప్పాల్సివస్తే ఇంకా పెద్ద జాబితాయే తయారవుతుంది. కానీ మనం ఇంకా చేరాల్సిన గమ్యం మిగిలే ఉంది. చెప్పుకోవాల్సిన ముచ్చట చాలానే ఉంది.కానీ సీమాంధ్ర నేతల అజ్జకారితనం, రంపరాకాసి తత్వం చూస్తే అంతిమ విజయం చేతికొచ్చే దాకా ఆనందించాలనిపించడం లేదు. సంబరాలు జరుపుకోవాలనిపించడం లేదు. నాకు పరమపద సోపాన పటమే గుర్తుకు వస్తున్నది. ఎన్నో పాములు, నిచ్చెనలు దాటుకుని తెలంగాణ అంతిమ గమ్యం చేరవలసి ఉన్నది. మనం ఎక్కవలసిన నిచ్చెనలు, తప్పించుకోవలసిన పాములు ఇంకా చాలా ఉన్నాయి. ‘ఆఖరు వరకూ అప్రమత్తంగా ఉండాలని’ టీఆస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపులోని ఆంతర్యం కూడా అదే.‘ఇంతదాకా వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇక వెనక్కు పోతుం దా?’ అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నిజమే. కానీ సీమాంధ్ర నాయక త్వం చేస్తున్న హరాకిరి చూస్తే అలా అనిపించడంలేదు. వాళ్లు ఎంతకయినా తెగించగలరు.

1951 జూలైలో బెంగళూరు కాంగ్రెస్ సమావేశంలో విశాలాంధ్ర గురించి అయ్యదేవర కాళేశ్వరరావు ప్రస్తావిస్తే జవహర్‌లాల్ నెహ్రూ ఆగ్రహించి, అభ్యంతరపెట్టారు. ‘ఇలా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కద’ని హెచ్చరించారు. కాళేశ్వర్‌రావు కాంగ్రెస్ నుంచి వైదొలగడమే కాదు. ఇండిపెండెంటుగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు. ‘ఆంధ్ర ప్రాంతం భారత దేశం నుంచే వైదొలుగుతుంద’ని ప్రకటించాడు. ఆయన 1947 ఏప్రిల్‌లో కూడా అవసరమయితే దేశం నుంచే విడిపోతామని ప్రకటించారు.అంతకుముందే 1936లోనే ‘ఆంధ్ర జాతీయ జెండా’ను తయా రు చేసుకున్న పెద్దమనుషులు ఆంధ్రానాయకుల్లో ఉన్నారు. అంతటి దేశభక్తులు వాళ్లు. వాళ్లు ఏదైనా సాధించాలనుకున్నారంటే ఎలా కమ్మేస్తారో చరివూతలో చాలా సందర్భాల్లో నమోదయి ఉంది. విశాలాంధ్ర సాధనకోసం వారు చేసిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ నాయకులను దారికి తెచ్చుకోవడానికి కులాలు, పార్టీలు, బంధుత్వాలు...దేనినీ వదల్లేదు. హైదరాబాద్‌లో కొందరు, ఢిల్లీలో కొందరు, మద్రాసులో ఇం కొందరు, బెజవాడలో మరికొందరు...ఎక్కడికక్కడ రాయబారాలు, రాజకీయ బేరాలు నాడు తెలంగాణ నాయకత్వాన్ని, అలాగే ఢిల్లీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కన్నడ, మరాఠ్వాడా నేతలను తెలంగాణకు వ్యతిరేకంగా ఉసిగొల్పి వారందరిచేతా విశాలాంధ్ర నినాదం చేయించారు. రెడ్లు, కమ్యూనిస్టులు, ముస్లింలకు వ్యతిరేకంగా బ్రాహ్మణ నాయకత్వాన్ని రెచ్చగొట్టి వారిచేత విశాలాంధ్ర అనిపించారు. అదొక భావజాల ముట్టడి. నెహ్రూ కూడా ‘నాకు ఇష్టం లేదు. అయినా విశాలాంధ్ర తప్పదు’ అనవలసిన పరిస్థితి. తెలంగాణ వాదులను నమ్మించడానికి సీమాంధ్ర నాయకులు చేసిన పెద్దరికాలు, ఇచ్చిన హామీలు, మాట్లాడిన తీపిమాటలు ....అదో పెద్ద చరిత్ర. అందుకే తెలంగాణవాదులు అంతిమగమ్యం గుర్తుపెట్టుకునే ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తీర్మానం రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ నుంచి మళ్లీ కేంద్రానికి వెళ్లాలి, రాష్ట్రపతి తెలంగాణ బిల్లును పార్లమెంటు ఆమోదానికి పంపాలి, పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి..... ఇన్ని దశలు దాటుకుని తెలంగాణ అవతరించాలి. అన్నీ సాఫీగా జరిగితే ఆరు వారాల పని.

తెలంగాణ ఏర్పాటు తీర్మానానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం అవసరం లేదు. దాని అభివూపాయం మాత్రమే కావాలి. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలోని 3వ అధికరణం ద్వారా సర్వాధికారాలు పార్లమెంటుకు కట్టబెట్టిన ఉద్దేశమే అది. ఏ రాష్ట్రంలోనయినా మెజారిటీ, మైనారిటీ ప్రాంతాలు ఉంటాయి, ఏ ప్రాంతమయినా విడిపోవాలని కోరుకుంటే మెజారిటీ దాష్టీకం విభజనకు అడ్డం కాకూడదనే స్ఫూర్తితోనే రాజ్యాంగంలో ఈ అధికరణాన్ని పొందు పరిచారు. అయితే సంబంధిత రాష్ట్రానికి తెలియకుండా రాష్ట్ర విభజన జరుగకూడదు కాబట్టి ఆ రాష్ట్ర శాసనసభకు నివేదించి, అభివూపాయం తెప్పించుకుని, ఆ అభివూపాయం ఎటువంటిదయినా దానితో నిమిత్తం లేకుండా పార్లమెంటు విభజన నిర్ణయం చేయాలని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. అంతేకాదు రాష్ట్రాల విభజన బిల్లుకు సాధారణ మెజారిటీ చాలు. పార్లమెంటు సమావేశానికి హాజరయిన సభ్యుల్లో సాధారణ మెజారిటీతో ఈ బిల్లును ఆమోదించవచ్చు. ఆంధ్ర ప్రాంతం ఎంపీలు సభకు గైర్హాజర్ అయినా, బిజెపి, జెడియు, బిఎస్‌పి వంటి పార్టీల మద్దతుతో తెలంగాణ తీర్మానాన్ని గట్టెక్కించవచ్చు. కానీ ఇవన్నీ కాంగ్రెస్ ఇంతే చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేసినప్పుడు మాత్రమే సాధ్యం. అంతేకాదు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇచ్చే విషయంలో కూడా మెలికలు పెట్టకుండాబిల్లును ఆమోదించాలి. ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం శాంతిభవూదతలు, రెవెన్యూ, పట్టణ వ్యవహారాలు, విద్య వంటి అంశాలను కేంద్రం అజమాయిషీలో చేర్చే పని అయితే అది కేసీఆర్ కోరుతున్న ‘సంపూర్ణ తెలంగాణ’ కాబోదు. రెవెన్యూ కేంద్రం అజమాయిషీలో ఉండేట్టయితే అది తొమ్మిది జిల్లాల తెలంగాణే అవుతుంది. అటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరు. ఒక్క శాంతి భద్రతలు తప్ప మరే అంశాన్నీ కేంద్రం అజమాయిషీలో చేర్చినా హైదరాబాద్ తెలంగాణలో భాగం కాజాలదు. ఉమ్మడి రాజధాని విషయంలోనే చాలా భయాలు ఉన్నాయి. ఒక్కసారి ఒప్పుకుంటే కంపలాగా పట్టుకుంటారని, ఈ సమస్య ఇప్పుడే తేలిపోవాలని చాలా మంది తెలంగాణవాదులు మాట్లాడుతున్నారు. ఇంకా వనరులు, విద్యుత్, జలాలు, అప్పు లు ఆదాయాల పంపిణీ వంటి అంశాలపై మనం తేల్చుకోవలసిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ తేలేదాకా తెలంగాణ అప్రమత్తంగానే ఉండవలసిన అవసరం ఉంది. ఆంధ్ర నాయకత్వాన్ని ఎప్పుడూ తక్కువగా అంచ నా వేయవద్దు.

అనుభవించేదేదో చేజారిపోతే ఎంత అక్కసు, ఆక్రోషం, ఆవేశం వ్యక్తమవుతాయో సీమాంధ్ర నాయకత్వాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంతకాలం దోచుకుని, దాచుకుని, ఏలుకున్న వైభవమేదో తమకు దూరమవుతుందన్న బాధ తప్ప సమైక్యత, సోదరభావం శూన్యం. ఒక్క నాయకుడి మాటల్లోనూ హేతుబద్ధత, విచక్షణ కనిపించడం లేదు. తెలంగాణ చచ్చినా పర్వాలేదు, కానీ మా భోగం, మా వైభవం తగ్గకూడదన్న రాక్షసానందం తప్ప వారు లేవనెత్తుతున్న వాదనల్లో ఒక్కటి కూడా వాస్తవ పరీక్షకు నిలిచేవి కాదు. ఏ మాటకూ, ఏ విలువకూ, ఏ ప్రజాస్వామిక సంప్రదాయానికీ కట్టుబడని రాజకీయ జాతిని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం అకస్మాత్తుగా, హడావిడిగా జరిగిందా? చంద్రబాబు నాయుడు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, దేవేందర్‌గౌడ్‌లతో కమిటీవేసి అన్ని ప్రాంతాల నేతలతో మూడు నాలుగు మాసాలపాటు చర్చలు జరిపి దసరారోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తామని తీర్మానం ఆమోదించారు. మరి చంద్రబాబు ఆంధ్రకు ఏమి చేస్తారో అప్పుడే ఎందుకు చెప్పలేదు? ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనపరమైన చర్యలు తీసుకుంటామ’ని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బాబు, ఆంధ్ర ప్రజానీకానికి ఏం చేయబోతున్నారో అందులో ఎందుకు వివరించలేదు? ‘మేము అధికారంలోకి వస్తేనే తెలంగాణ వస్తుంద’ని హామీ ఇచ్చిన వైఎస్ రాజశేఖర్‌డ్డి, ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌డ్డి, ఆంధ్ర సెంటిమెంటు గురించి అప్పుడే ఎందుకు మాట్లాడలేదో? పన్నెండేళ్లుగా తెలంగాణ నినాదంతో అంటకాగుతూ, ఇక్కడి ఓట్లు సీట్లతో అధికారంలోకి వచ్చిన సీమాంధ్ర నాయకత్వం ‘సమైక్యత’ అనే ఒక అహంకారాన్ని, ఒక అబద్ధాన్ని ఊరేగించారు తప్ప, ఒక్కరోజు కూడా సీమాంధ్ర ప్రయోజనాల సంగతేమిటని ఎందుకు ప్రశ్నించలేదో?ఏమైనా చేయగలం, ఏదైనా ఆపగలం, ఎవరినయినా బుట్టలోవేయగలం అన్న ఆధునిక దళారీ మనస్తత్వమే ఈరోజు ఈ పరిస్థితికి కారణం. తమ ప్రాంతంలోని అన్ని పార్టీల నాయకులూ అబద్ధాలు చెప్పి, మభ్యపెట్టి, సమైక్యతకు ఢోకాలేదని బుకాయించి మోసం చేశారన్నదే సీమాంధ్ర ప్రజల ప్రధాన సమస్య. వారి ఆగ్రహానికి ప్రధాన కారణం అదే. సీమాంధ్ర మీడియా విష ప్రచారం అక్కడి ప్రజలను మరింత రెచ్చగొట్టింది. హైదరాబాద్ కోల్పోతే ప్రళయం వస్తుందన్నంత భయాన్ని పెంచిపోషించాయి. నిజాలు చెప్పి, నిజాయితీగా ప్రజల వద్దకు వెళ్లి ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు విభజన అనివార్యం, అందుకు సిద్ధం కావాలని ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఇవ్వాళ ఇంతటి క్షోభ ఉండేదికాదు. ఒక్కడంటే ఒక్కడు మాట మీద నిలబడకపోవడం సీమాంధ్ర నాయకుల నైతిక దుర్బలత్వం. వాళ్లు తెలంగాణ ప్రజలనే కాదు రేపు ఆంధ్రా ప్రజలనూ మోసం చేయగలరు. వాళ్లు ప్రజలను మంచి మార్గంలో నడపలేరు. విధ్వంసంవైపు, విద్వేషాలవైపు నడుపగలరు. ఒక మాట మీద నిలబడే వాడితో, ఒక విధానం ఉన్నవాళ్లతో ఎంతకాలమయినా పోరాడవచ్చు. ఏ నీతీ లేనివాడితో పోరాడడమే ప్రమాదకరం. అందుకే అనుక్షణం మనల్ని మనం కాచుకోవాలి. అరవై ఏళ్ల స్వప్నం సాకారమయ్యే తరుణం దగ్గరికి వచ్చింది. ఈ ఆఖరి క్షణాలు విలువైనవి. ఏమాత్రం బెట్టు సడలినా శాశ్వతంగా బలి అవుతాం. తస్మాత్ జాగ్రత్త.

[email protected]

485

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన