కట్టమంచి నుంచి కేసీఆర్ దాకా


Sat,September 21, 2013 01:34 AM


తెలంగాణ నిర్ణయం వెలువడిన వెంటనే హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ప్రకటన వచ్చిన రోజు ‘విభజనకు సహకరిస్తాను’ అని చెప్పిన చంద్రబాబు, పది రోజులు కాకముందే ‘ఏపీఎన్జీవోల(సమైక్యాంధ్ర) ఉద్యమం న్యాయమైనదే. వారికి నేను సంఘీభావం ప్రకటిస్తున్నాను’ అని ప్రకటించారు. పాపం వారి అవస్థలు వర్ణనాతీతం. వారు మార్చే రంగులు ఏ చిత్రకారుడి కుంచెకూ అందవు. అందుకే తెలంగాణలో వారి పార్టీ ఆఫీసులు ఖాళీ అవుతున్నాయి. అక్కడక్కడా ఆఫీసులు ఉన్నా వారి వెనుక జనం లేరు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆ పార్టీలు అప్రస్తుతం. కాంగ్రెస్ ఒక్కటే ప్రస్తుతం. చరిత్ర సృష్టిస్తుందా లేక చెత్తబుట్టలోకి వెళుతుందా అన్నది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి.;

‘వా రితో మనకు సామాజిక సంబంధాలు లేవు. వారి మోసాలు, కుట్రలు, కుతంవూతాలు మన వాళ్లకు తెలియవు. మనం సూటిగా మాట్లాడతాం. ఏదైనా సూటిగా చేస్తాం. కానీ వాళ్లు ఒకటి చెబుతారు, మరొకటి చేస్తారు, గోవును వశపరచుకునే పులిలాగా. మన వాళ్లు వాళ్ల లాగా కాలేరు, కాబోరు. అందువల్ల వారికి, మనకు మధ్య సాపత్యం ఉండే అవకాశమే లేదు. అయినా బలవంతంగా మనలను వారితో కలుపుతున్నారు. వర్ణించనలవికాని పంజాబ్, పాలస్తీనా వంటి దురవస్థలు ఇక్కడ కూడా తలెత్తే అవకాశం ఉంది’- ఈ మాటలన్నది టీఆస్ అధినేత కేసీఆర్ కాదు. తెలంగాణ మేధావులు కాదు. చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత, కవి, ఆచార్య డాక్టర్ కట్టమంచి రామలింగాడ్డి. ఆరున్నర దశాబ్దాల క్రితం శ్రీబాగ్ ఒడంబడిక తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు జి.వి.సుబ్బారావు ‘హిస్టరీ ఆఫ్ ఆంధ్ర మూవ్‌మెంట్(వాల్యూమ్-2)’ అనే గ్రంథంలో రికార్డు చేశారు. ఆయన ఆరోజు కూడా మాట్లాడింది ఆంధ్ర రాజకీయ నాయకత్వం గురించే, ప్రజల గురించి కాదు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన ఐదున్నర దశాబ్దాల తర్వాత ఇవ్వాళ తెలంగాణలో కూడా సీమాంధ్ర నాయకత్వం గురించి అటువంటి అభివూపాయాలే వ్యక్తం అవుతున్నాయి. సీమాంధ్ర నాయకత్వం స్వభావం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మారలేదని తెలంగాణ అనుభవం చెప్పకనేచెబుతున్నది. అవే మోసాలు, అవే కుట్రలు, కుతంవూతాలు. ఏ విలువలకూ కట్టుబడని మనస్తత్వం. పార్టీలు లేవు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, నాయకత్వ విధేయతలు లేవు, విధాన నిబద్ధతలు లేవు. తమ పెట్టుబడులకు కాపలా కాచుకోవడం, తమ ఆధిపత్యాన్ని పరిరక్షించుకోవడం తప్ప మరే ఉన్నత లక్ష్యమూ లేని నాయకత్వం. ఈ నాయకులు సొంత ప్రయోజనాలకు తప్ప దేనికీ నిబద్ధులు కారని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికయినా అర్థం చేసుకోవాలి. ఈ నాయకత్వానికి సొంత ప్రజల పట్ల కూడా నిజాయితీ లేదు. సొంత ప్రజలకూ నిజాలు చెప్పి ఒప్పించలేని వంచక స్వభావం వారిది. చివరి నిమిషం వరకూ మభ్యపెట్టి మోసం చేసే ధోరణి వారిది.
‘రాయలసీమలో జరుగుతున్న ఉద్యమం తెలంగాణకు వ్యతిరేకమో అనుకూలమో కాదు. అది సమైక్యాంధ్ర ఉద్యమమూ కాదు. అక్కడి రాజకీయ నాయకత్వం దగాపూరితమైన ధోరణికి వ్యతిరేకంగా జరుగుతున్నది. ఇంతకాలం నమ్మించి మోసం చేసిన రాజకీయ నాయకత్వంపై ఆగ్రహంతో జరుగుతున్నది’ అని సీమాంవూధకు చెందిన ఒక జర్నలిస్టు మిత్రుడు వ్యాఖ్యానించారు. ‘మొదటి నుంచీ నాయకులు నిజాలు చెప్పకపోవడం వల్ల తలెత్తిన సంక్షోభం ఇది’ అని ఆయన చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అంగీకరిస్తున్న అంశం ఇది. పన్నెండేళ్లుగా తెలంగాణ నినాదం గురించి తెలిసి, ఆ నినాదానికి మద్దతు ప్రకటించి, అది ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వక తప్పదని సోయి ఉండి, తీరా నిర్ణయం జరిగాక పార్టీలు, నాయకులు అడ్డంగా మాట్లాడుతుంటే అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు ఏం కావాలి? చివరి నిమిషం దాకా ‘తెలంగాణను ఆపుతున్నామ’ని అక్కడ, ‘ఇస్తున్నామ’ని ఇక్కడ నాటకాలాడిన నేతలను ఏమి చేయాలి? అక్కడ జరుగుతున్న ఉద్యమం సీమాంధ్ర రాజకీయ నాయకత్వ వైఫల్యం. అవకాశవాద రాజకీయ జూద ఫలితం. విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్ల పంటను పండించుకునే కుతంత్రం. సీమాంధ్ర నాయకత్వానికి సొంత ప్రయోజనం తర్వాతే ప్రజల ప్రయోజనం. ఓట్లకోసం, అధికారంకోసం అకస్మాత్తుగా దేశభక్తులవుతారు. ప్రాంత భక్తులవుతారు. కానీ ఏ భక్తీ వాళ్ల స్వభావం కాదు, ఉత్త నటన. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు లేడు. వీలైనంత భయపెట్టి, విద్వేషం రగిలించి, చెలరేగే మంటల్లో చలికాచుకుందామనుకునే వాళ్లే తప్ప మేమున్నామని చెప్పే ధీమంతుడయిన నాయకుడు లేడు. అదొక విషాదం.
సీమాంధ్ర ప్రజలను వంచించడంలో ప్రధాన పాత్ర అక్కడి కాంగ్రెస్ నాయకులదే. వారిని నియంవూతించలేకపోయిన అధిష్ఠానానిదే. నూట ఇరవై ఐదేళ్ల అనుభవం ఉన్న పార్టీ కూటిలో రాయిని తీయలేకపోవడం అంటే ఇదే. కుప్పుస్వామి అయ్యర్ మేడిట్ డిఫికల్టీ లాగా ప్రతిసమస్యనూ ఇలా జటిలంగా తయారు చేసి చేతులు కాల్చుకుంటున్నది. అక్కడా ఇక్కడా అన్ని చోట్లా రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆ పార్టీ అతితెలివి అసలుకే ముప్పు తెస్తున్నది. సమస్యను పరిష్కరించాలన్న తాపవూతయం కంటే ప్రయోజనాలకు సంబంధించిన లెక్కలు పైచేయి సాధిస్తున్నాయి. అకారణ జాప్యం, అనవసర గోప్యం ఆ పార్టీని రెండు ప్రాంతాల్లోనూ దోషిగా నిలబెడుతున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడి ఇప్పటికి యాభై రోజులు దాటిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం జాప్యం చేసే కొద్దీ, సీమాంధ్ర నాయకులు తెలంగాణ నిర్ణయాన్ని ఇంకా ఆపగలమని నమ్మించి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య కూడా మునుపు లేని విద్వేషాలు, ఆవేశకావేషాలు పెరుగుతున్నాయి. తెలంగాణపై ఏవో కుట్రలు జరుగుతున్నాయని, ఇక రాదేమోనని భావించి ఇప్పటికీ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భావోద్వేగాలతో కూడిన సమస్యను పరిష్కరించేప్పుడు వేగంగా వ్యవహరించకపోతే అందుకు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. పన్నెండేళ్లుగా రాష్ట్రాన్ని ఈ సందిగ్ధం పీడిస్తున్నది. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ఒక డోలాయమాన స్థితిలో పనిచేస్తున్నాయి. అభివృద్ధి కుంటుపడుతున్నది. ఇతర సమస్యలన్నీ పక్కకుపోయాయి. అధిక ధరలు, అవినీతి రాజ్యం చేస్తున్నాయి. ఎవరూ ఎవరిని ప్రశ్నించే పరిస్థితి లేకుండాపోయింది. ఇతర ఉద్యమాలన్నీ అప్రధానమై పోయాయి. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడాతెలంగాణ ఏర్పాటును ఆపితే, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది.
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చిన వాళ్లు ఒక్కడూ ఆ మాటమీద నిలబడడం లేదు. అధిష్ఠానం ఏరికోరి పెట్టుకున్న ముఖ్యమంత్రి, సోనియమ్మకు విధేయుడినని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్ అడుగులు ముందుకు పడకుండా కాళ్లల్లో కట్టె పెడుతున్నారు. కాంగ్రెస్‌కు కావలసినన్ని కష్టాలు ఆయనే సృష్టిస్తున్నారు. ఆయన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంవూతిగా కాకుండా, సీమాంధ్ర ముఖ్యమంవూతిగా నిరూపించుకుంటున్నారు. సీమాంధ్ర ఉద్యమాలు చల్లారుతున్నాయనుకున్నప్పుడల్లా గుప్పెడు ఆజ్యం ఆయనే కుమ్మరిస్తున్నారు. డీజీపీ దినేశ్‌డ్డి ముఖ్యమంవూతికి నంబర్ టూలా వ్యవహరిస్తున్నారు. సీమాంవూధలో పోలీసులు దగ్గరుండి ప్రశాంతంగా, ‘ప్రజాస్వామ్యయుతం’గా ఉద్యమం జరగడానికి చేయూతనిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కనీసం వీరిద్దరినయినా విశ్వాసంలోకి తీసుకోకుండా, వీరిని దారిలోకి తెచ్చుకోకుండాఇంత పెద్ద నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తుంది? లేకపోతే కాంగ్రెస్ అధిష్ఠానమే వీరిని ఆడిస్తోందా? ‘మీ ఆట మీరు ఆడండి...మేం చేసేది మేము చేసుకుపోతాం’ వంటి అవగాహన ఏదైనా ఉందా? ఏదైనా కానీయండి...ఇన్ని తెలివితేటలను భరించే శక్తి ప్రజలకు లేదు. కాంగ్రెస్ కనీసం ముఖ్యమంవూతిని తమ కార్యాచరణకు అనుకూలంగా మల్చుకుని ఉండాలి. లేదంటే మార్చుకుని ఉండాలి. ఆ పని తెలంగాణపై నిర్ణయం చేయడానికి ముందే చేసి ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంవూతిని మార్చినా ప్రయోజనం ఉండదు. పైగా నష్టం ఎక్కువ. ఇక ఇప్పుడు మందుపూతలు, ఇంజెక్షన్‌లు పనిచేయవు. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటు సాధ్యం. తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడా కాంగ్రెస్‌కు మందుపాతరే. ఆంధ్రవూపదేశ్‌ను కాంగ్రెస్ పూర్తిగా వదలుకోవలసిందే.
తెలంగాణ విషయంలో ఆలస్యం అమృతం కాదు, విషం. కాంగ్రెస్ అధిష్ఠానం ఇక ఇప్పుడయినా మీనమేషాలు లెక్కించడం మానుకోవాలి. రాజకీయ జూదాన్ని పక్కనపెట్టాలి. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌డ్డి ప్లేటు ఫిరాయించి ఉండవచ్చు. చంద్రబాబు ఎవరికీ అర్థం కాని భాష మాట్లాడుతూ ఉండవచ్చు. రెండు పార్టీలూ పోటీలు పడి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతూ ఉండవచ్చు. ‘సమన్యాయం’ అంటే ఏమిటో జగన్‌మోహన్‌డ్డి, ‘ఇరు ప్రాంతాలకు అన్యాయం జరుగని రీతి’ అంటే చంద్రబాబునాయుడు వివరించి చెప్పలేకపోవచ్చు. హైదరాబాద్‌పై అంతర్గతంగా, బహిరంగంగా అనేక పేచీలు లేవనెత్తుతూ ఉండవచ్చు. తెర అనేక రకాల లాబీయింగ్ చేస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణలో వారి పని అయిపోయింది. తమవి తెలంగాణ పార్టీలు కాదని, ఆంధ్రా పార్టీలు మాత్రమేనని రుజువు చేసుకున్నాయి. తెలంగాణ నిర్ణయం వెలువడిన వెంటనే హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ప్రకటన వచ్చిన రోజు ‘విభజనకు సహకరిస్తాను’ అని చెప్పిన చంద్రబాబు, పది రోజులు కాకముందే ‘ఏపీఎన్జీవోల(సమైక్యాంధ్ర) ఉద్యమం న్యాయమైనదే. వారికి నేను సంఘీభావం ప్రకటిస్తున్నాను’ అని ప్రకటించారు. పాపం వారి అవస్థలు వర్ణనాతీతం. వారు మార్చే రంగులు ఏ చిత్రకారుడి కుంచెకూ అందవు. అందుకే తెలంగాణలో వారి పార్టీ ఆఫీసులు ఖాళీ అవుతున్నాయి. అక్కడక్కడా ఆఫీసులు ఉన్నా వారి వెనుక జనం లేరు. తెలంగాణ ప్రజలకు ఇప్పు డు ఆ పార్టీలు అప్రస్తుతం. కాంగ్రెస్ ఒక్కటే ప్రస్తుతం. చరిత్ర సృష్టిస్తుందా లేక చెత్తబుట్టలోకి వెళుతుందా అన్నది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి. తెలంగాణ పార్టీలు, ఉద్యమ సంఘాలు ఇప్పుడు కాంగ్రెస్‌పైనే ఒత్తిడి తేవాలి. కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటే టీడీపీ, వైఎస్సార్‌సీపీ అడ్డం కాదు. టీఆస్ అడ్డం కాదు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులూ అడ్డం కాదు. మైనారిటీ ఓట్లతో అణుబిల్లును నెగ్గించుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది. అనేక వివాదాల మధ్య ఆహారభవూదత బిల్లును ఆమోదింపజేసుకున్న ఘనత కాంగ్రెస్‌ది. ఎంపీలు రాజీనామాలు చేయనీయండి. మంత్రులు రాజీనామాలు చేయనీయండి. కానీ వాటిని ఆమోదించకపోవడం అన్నది కాంగ్రెస్ చేతిలోనే ఉంది. వారిని కట్టడి చేయడం అన్నది కాంగ్రెస్ చేతిలోనే ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం కరుణించి కాపాడకపోయి ఉంటే ఇప్పుడు ఢిల్లీలో సమైక్యాంధ్ర పక్షాన చక్రం తిప్పుతున్నవాళ్లలో సగం మంది జగన్‌లాగా జైళ్లలో ఉండాల్సినవాళ్లు. వ్యాపారాల్లో దివాలా తీసి దుకాణాలు కట్టేయాల్సినవాళ్లు. వాళ్లకు ముకుతాడు వేయడం కాంగ్రెస్‌కు కష్టం కాదు.
images అందువల్ల ఇప్పుడు బాధ్యతంతా కాంగ్రెస్‌దే. సీమాంవూధలో కాంగ్రెస్‌కు కొత్తగా పోయేదేం లేదు. పోవాల్సింది ఎప్పుడో పోయింది. రాష్ట్రం ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ వెంట నడుస్తుంది. వడివడిగా అడుగులు ముందుకు వేస్తే అందరికీ మంచిది, కాలయాపన చేసినా, కొత్త ఎత్తులు వేసినా కాంగ్రెస్ చిత్తు కావడం ఖాయం.

[email protected]


547

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles