అదే చరిత్ర, అవే కుట్రలు


Fri,September 6, 2013 11:29 PM

అప్పుడూ వివాదం రాజధానికోసమే. ఇప్పుడూ అల్లరి చేస్తున్నది రాజధాని కోసమే. అప్పుడు వారు చేసిన రాద్ధాంతానికి పొట్టి శ్రీరాములు బలయ్యారు. మద్రాసుపై పేచీ పెట్టకపోతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును వేగిర పరుస్తామని డిసెంబరు 9ననే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. నెహ్రూ ప్రకటనకు ముందే మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచార్యులు కూడా మద్రాసు జోలికి రాకపోతే విభజనకు సహకరిస్తామని ప్రకటించారు. మద్రాసు సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు రాష్ట్రం సాధించుకుందామని ఎన్‌జి రంగా వంటి ఆంధ్ర నాయకులు కూడా పిలుపునిచ్చారు. కానీ కొందరు ఆంధ్ర ‘పెద్ద మనుషులు’ మద్రాసు సంగతి ఇప్పుడు తేల్చుకోకపోతే ఇంకెప్పుడూ తేల్చుకోలేమని వాదించి, పట్టుబట్టి, దీక్ష కొనసాగింపజేసి పొట్టి శ్రీరాములును బలిచేశారు. స్వరాష్ట్రం వస్తే చాలునని, శ్రీరాములు దీక్ష విరమించాలని కోరుతూ ఆంధ్ర అంతటా అనేక పట్టణాల పౌరసంఘాలు తీర్మానాలు చేసి పంపాయి. ‘పొట్టి శ్రీరాములుగారు మద్రాసుతో కూడిన రాష్ట్రంకోసమే ప్రాణాలర్పిస్తున్నారు. ఆ విధంగా భారత ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తేగానీ ఆయన ఉపవాసం విరమమించనంటున్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాము మీరు విరమించండని చాలా మంది ఆయనకు తంతులిస్తున్నారు. మనం ఈ తీర్మానాన్ని ఏకక్షిగీవంగా ఆమోదిస్తే నెహ్రూ ఈ విషయంలో వెంట నే కదిలి వ్యవహరిస్తారని నాకు ఆశ ఉంది (8.12.1952)’అని ప్రకాశం నాయకత్వంలో ఆంధ్రరాష్ట్ర పరిషత్తు తీర్మానం చేసింది. ఈ తీర్మానం తర్వాతనే నెహ్రూ రాష్ట్ర ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు అంటే 11వ తేదీ సాయంత్రం శ్రీరాములు దీక్షా శిబిరాన్ని సందర్శించిన ప్రకాశం పంతులు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించలేదని ఆంధ్ర పత్రిక సంపాదకీయం (13.12.1952) రాసింది. ‘సత్యానికి ఇక్కడ స్థానం ఉన్నదా’ అని శ్రీ రాములు ప్రశ్నిస్తే, ‘సత్యానికి స్థానం ఎక్కడ’ అని ప్రకాశం రెచ్చగొట్టారు. ‘సత్యానికి తావులేని చోట తమబోటి వాళ్లకు స్థానం లేదు’ అని శ్రీరాములు భీష్మించుకున్నారు.

మద్రాసుపై చాలాకాలం పేచిపెట్టి వివాదం నడిపించిన పెద్ద మనుషుల్లో ప్రకాశం పంతులు ప్రముఖుడు. మద్రాసు మాదేనని చాటి చెప్పడం కోసం ఆయన 1951లో హార్బర్(జార్జి టౌను) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కూడా. కానీ అక్కడి ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత ఎనిమిది రోజులకే 1952 డిసెంబరు16న శ్రీరాములు ఆత్మార్పణ చేశారు. నెహ్రూ ప్రకటన తర్వాత శ్రీరాములు దీక్ష విరమణకు సుముఖత వ్యక్తం చేశారని, ఈ పెద్ద మనుషులే ఆయనను బలవంతపెట్టి ప్రాణంతీశారని చెబుతారు. శ్రీరాములు మరణం ఆంధ్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది. హర్తాళ్లు, బందులు జరిగాయి. పలు చోట్ల జరిగిన కాల్పుల్లో అనేక మంది యువకులు మరణించారు. మద్రాసుపై ఎన్నివాదనలు చేశారో! ముందు మద్రాసు తమదే అన్నారు. తర్వాత దానిని రెండు భాగాలు చేసి కోవై నదికి ఉత్తర మద్రాసును ఆంధ్రకు, దక్షిణ మద్రాసును తమిళనాడుకు రాజధానులు చేయాలని వాదించారు. ఆ తర్వాత యూటీ చేయాలని వాదించారు. మరికొంతకాలం ప్రత్యేక రాష్ట్రమే చేయాలని పట్టుబట్టారు. చివరకు ఛీకొట్టించుకుని అక్కడనుంచి బయపటడవలసి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ విషయంలోనూ వారి తీరు అలాగే ఉంది. ఏదో ఒక తొండి చేసి హైదరాబాద్‌పై ఆధిపత్యం సాధించాలన్నది వారి పంతంగా కనిపిస్తున్నది. సమైక్యాంధ్ర నినాదం ఆ కుతంవూతానికి ముసుగు మాత్రమే. శాశ్వత యూటీ అని, ఉమ్మడి రాజధాని అని, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం అని....ఇలా రకరకాల వాదాలు ముందుకు తెస్తున్నది అందుకే. విడ్డూరం ఏమంటే ఆంధ్ర నాయకత్వం హైదరాబాద్‌కు వచ్చిననాటి చరివూతను వక్రీకరించి, అనేక అబద్ధాలు జోడించి మాట్లాడుతున్నారు. బాగా జ్ఞాని అనుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నారు.

ఎన్ని అబద్ధాలు? రాజధానిగా ఉన్న ప్రాంతం విడిపోవడం ఇదే మొదల ట. సమైక్య అస్సాంకు రాజధానిగా ఉన్న షిల్లాంగ్ మేఘాలయ రాష్ట్రంతో ఉండిపోయింది. అస్సాం కొత్త రాజధానిని గౌహతి శివార్లలో నిర్మించుకుంది. ఇవ్వాళ ఆంధ్ర ప్రాంతం అనుభవిస్తున్న శాపాల పాపం అలనాటి ఆంధ్ర నాయకత్వానిదే. వారు సొంత రాజధాని నిర్మించుకుందామనుకోలేదు. విజయవాడ అప్పటికే ఆంధ్ర ప్రాంతానికి సాంస్కృతిక, రాజకీయ రాజధాని. అందరికీ అనువైన విజయవాడను రాజధానిగా ఏర్పాటు చేయాలని రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలూ కోరారు. కర్నూలును రాజధానిని చేయడాన్ని చివరకు అనంతపురం, కడప నేతలు కూడా వ్యతిరేకించారు. అలనాటి ఆంధ్రపవూతిక ప్రతులు చూస్తే ఈ విషయాలన్నీ అవగతమవుతాయి. కానీ రాజగోపాలచారి, నీలం సంజీవడ్డి, ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి మహానుభావులంతా ఒక వ్యూహం ప్రకారం రాజధానిగా కర్నూలును ఎంపిక చేయించారు. ఆంధ్ర శాసనసభ్యులతో తీర్మానం చేయించారు. కేంద్రం రాష్ట్ర విభజన బిల్లును తిరిగి మద్రాసు శాసనసభకు నివేదించినప్పుడు కూడా మళ్లీ ఓటింగ్ జరిగింది. వావిలాల గోపాలకృష్ణయ్య విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని సవరణ ప్రతిపాదించారు. ఆ సవరణపై 26 జూలై 1952న మద్రాసు శాసనసభలో ఓటింగ్ జరిగింది. 61 మంది సవరణకు అనుకూలంగా వేస్తే 62 మంది సవరణకు వ్యతిరేకంగా ఓటు వేశారు. విషాదం ఏమంటే సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసిన 62 మందిలో 5మంది ఆంధ్రేతర ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలుగు ప్రజలు విజయవాడనే కోరుకుంటున్నారని, ఆంధ్రేతర ఎమ్మెల్యేలతో ఓటు వేయించి మోసం చేశారని అదేరోజు ఆంధ్రపవూతిక సంపాదకీయం రాసింది. కానీ రాజాజీ, ప్రకాశం, నీలం సంజీవడ్డి....అంతాకలసి 62 మంది తీర్పునే ప్రాతిపదికగా తీసుకుని కర్నూలును రాజధానిగా నిర్ణయించారు. ఇదంతా ఎందుకో తెలుసా? కేవలం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అప్పట్లో కమ్యూనిస్టులు, కమ్మ నాయకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర. విజయవాడలో రాజధాని వస్తే కమ్యూనిస్టుల ఆధిపత్యం స్థిరపడిపోతుందని భావించిన భూస్వామ్య, సనాతన శక్తులన్నీ అప్పట్లో ఏకమై అడ్డుకొట్టాయి. ఆ పాపమే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని వెంటాడుతున్నది. విజయవాడ ఒక చారివూతక అవకాశాన్ని కోల్పోయింది.

హైదరాబాద్‌కు ఆంధ్ర రాజకీయ నాయకత్వం రావాలని, వారు ఇక్కడ పెత్తనం చేయాలని తెలంగాణ కోరుకోలేదు. ‘కర్నూలులో మేం పని చేయ లేం. ఈ అవస్థలు పడలేం’ అధికారులు, ఉద్యోగులు ముక్త కంఠంతో నినది స్తే, ‘త్వరలోనే మనం రెడీమేడ్ రాజధానికి వెళుతున్నాం. ఓపికపట్టండి’ అని సర్ది చెప్పుకున్నారు ఆంధ్ర నాయకులు. విశాలాంధ్ర నినాదాన్ని ఖాయం చేసి ప్రచారంలోకి తెచ్చింది ఆంధ్ర కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు. హైదరాబాద్‌లో అప్పటికి మేధావి వర్గంగా ఎదిగిన సనాతన బ్రాహ్మణ మేధావులను పోగేసి వారి చేత విశాలాంధ్ర నినాదాలు చేయించింది అయ్యదేవర కాళేశ్వర్‌రావు. తెలంగాణ బ్రాహ్మణ మేధావులు కూడా అమాయకంగానే తెలుగువారంతా కలసి ఉంటే బాగుంటుందని ఆరోజు విశాలాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్నారు. కానీ అత్యధిక ప్రజానీకం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని ఫజలలీ నాయకత్వంలో ఏర్పాటయిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం కూడా రికార్డు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షునికి రాసిన లేఖలో కూడా తెలంగాణ ప్రజల అయిష్టతను స్పష్టంగానే పేర్కొన్నారు. ప్రజల అయిష్టత దృష్ట్యా హైదరాబాద్‌ను మరో ఆరేళ్లు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో ఏర్పడే హైదరాబాద్ అసెంబ్లీ మూడింట రెండొంతుల మంది విలీనానికి సిద్ధపడితే విశాలాంధ్ర ఏర్పాటు చేయవచ్చునని ఫజల్ అలీ నివేదికలో సిఫారసు చేశారు. ఈ నివేదికపై ప్రకాశం, నీలం సంజీవడ్డి, కడప కోటిడ్డి, అయ్యదేవర కాళేశ్వర్‌రావు మండిపడ్డారు. ‘హైదరాబాద్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ మనకు దక్కద’ని వారు పత్రికల్లో బాహాటంగానే ప్రకటనలు చేశారు. విశాలాంధ్ర ఏర్పాటు ప్రక్రియను వేగిరపర్చాలని ఢిల్లీపై ఒత్తిడి తెచ్చారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాల నాయకులు కూడా వీరికి తోడయ్యారు. హైదరాబాద్ రాష్ట్రం తొందరగా విచ్ఛిన్నమైపోవాలని, తమ ప్రాంతాలు తమ మాతృభాషా రాష్ట్రాల్లో కలసిపోవాలని వారు కోరుకున్నారు. నాడు తెలంగాణది కర్ణుడి పతనం వంటిది. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెల్చిన కమ్యూనిస్టులు కూడా విశాలాంధ్ర మైకంలోనే పడిపోయారు. ఇవన్నీ సీమాంధ్ర నాయకత్వానికి కలసి వచ్చా యి. లాబీయింగ్‌లో వారు ఇప్పుడు ఎంత బలవంతులో అప్పుడు కూడా అంతే బలవంతు లు. రాజాజీ, పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవడ్డి గోవింద వల్లభ్ పంత్ ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పారు. విజయవాడకు వ్యతిరేకంగా ఉపయోగించిన పాచికనే ఢిల్లీలో కూడా ఉపయోగించారు. తెలంగాణ విడిగా ఉంటే రెడ్స్ (కమ్యూనిస్టులు), రజకార్లు, రెడ్లు చెలరేగుతారని, బూర్గుల రామకృష్ణారావు వారిని ఎదిరించి నిలబడలేరని నెహ్రూను ఒప్పించారు. ఆ మంత్రం బాగా పనిచేసింది. అప్పటిదాకా హైదరాబాద్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన బూర్గుల రామకృష్ణారా వు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వెంటనే మారిపోయారు. ఏ వ్యక్తులు, ఏ శక్తులు ఆయన పై పనిచేశాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నాయకత్వానికి ప్రతిఘటించి, తమ మాటను నెగ్గించుకునే తెలివితేటలు అప్పటికింకా రాలేదు. వెనుకబాటు మనస్తత్వం, పరిస్థితులు మన ప్రజలకే కాదు, మన నాయకత్వానికీ ఉన్నాయి. అందుకే లాబీయింగ్‌కు తలొగ్గారు.

మేము హైదరాబాద్ కోసం చాలా త్యాగాలు చేశాం అని ఆంధ్ర మిత్రులు కొందరు వాదించడం చూస్తున్నాను. వాస్తవానికి త్యాగం చేసింది తెలంగాణ, ఈ ప్రాంత నాయకత్వం. తమ స్వయం పాలనాధికారాన్ని త్యాగం చేసి ఆంధ్ర చేతుల్లో పెట్టింది తెలంగాణ నాయకత్వం. తమ ఉద్యోగాలు, భూము లు, నీళ్లు, వనరులు అన్నీ ఆంధ్ర ఆధిపత్య శక్తులకు అప్పగించారు. చివరికి రాజధానిని కూడా ఆంధ్రవూపదేశ్ కోసం త్యాగం చేశారు. ఆంధ్రులు ఇక్కడికి రాకముందే హైదరాబాద్ రాజధాని. ఆంధ్రులు ఇక్కడికి రావాలని, తమపై అధికారం చెలాయించాలని ఇక్కడి ప్రజలు కోరుకోలేదు. అందువల్ల నష్టపోయింది తెలంగాణ. నిజానికి ఆంధ్ర నాయకత్వం అప్పట్లో ‘రెడీమేడ్ రాజధాని’ కోసం తమ ప్రాంతాన్ని మోసం చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో ఉన్న తమ ఆస్తులకోసం ఆంధ్రను మోసం చేస్తున్నారు. చరివూతలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఆంధ్ర నాయకత్వానికి వచ్చింది. కానీ ఎప్పటిలాగే కుట్రలతో, మాయలతో, కలహ భోజనంతో హైదరాబాద్‌ను కాజేయాలని చూస్తున్నది. ఒక్క నాయకుడికి కూడా వాస్తవాలు మాట్లాడి, ప్రజలను ఒప్పించే దమ్ము లేకపోవడం ఇవ్వాళ ఆంధ్ర రాజకీయాల దుస్థితి. ఏ విలువలకూ, ఏ మాటలకూ, ఏ ప్రజాస్వామిక సంప్రదాయాలకు కట్టుబడి ఉండకపోవడం వారికి రివాజుగా మారింది. అవకాశవాదానికి నిలు రూపాలుగా ప్రవర్తిస్తున్నారు. నాయకత్వ దివాళాకోరుతనం వల్లనే ఆంధ్ర ప్రజలు సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించుకోలేనివి కాదు. ఎవరికీ అన్యా యం జరుగకుండా విభజన చేయగల ఏర్పాట్లు మన రాజ్యాంగ నియమా లు, చట్టాల్లో ఉన్నాయి. వాటిని గుర్తించడానికి నిరాకరించడం వల్లనే ఈ దుస్థితి. మద్రాసుపై క్లెయిమ్‌ను కాపాడడం ప్రకాశం పంతులు వల్లనే కాలేదు, కిరణ్‌కుమార్‌డ్డి వల్ల, అశోక్‌బాబు వల్ల ఏమవుతుంది? వేలాది మంది సాయుధుల రక్షణలో సభ జరుపుకోనివ్వండి. కొత్తగా వారు రుజువు చేసేదేమీ లేదు.

[email protected]

686

KATTA SHEKAR REDDY

Published: Sun,November 3, 2019 07:11 AM

మర మనుషులు

మనుషులుగా అంతరించేవారే కాదు, మహోన్నత మానవులుగా వ్యవహరించేవారూ చాలామంది ఉన్నారు. చిరుగుపాతల బట్టలతో ఒక మహారణ్యాన్ని పెంచిన అమ్మల గు

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్        


Featured Articles