టీడీపీ, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్


Sat,August 24, 2013 12:26 AM


బీ జేపీ ఆశాజ్యోతి నరేంవూదమోడీ హైదరాబాద్ వచ్చి వెళ్లిన నాటి నుంచి అనుకుంటున్నదే నిన్న పార్లమెంటులో బట్టబయలయింది. 2009 డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు ఎలా ప్లేటు ఫిరాయించారో ఇప్పుడు పార్లమెంటులో బీజేపీ కూడా అలాగే అడ్డం తిరిగింది. ‘బిల్లు పెట్టండి మేం మద్దతి స్తాం’ అని నిన్న టిదాకా గర్జిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు బిల్లుకు అడ్డంపడుతున్న ఎంపీలకు మద్దతుగా నిలిచింది. బీజేపీ, టీడీపీల మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరుగబోతున్నదంటూ గత పదిరోజులుగా సమాచారం అందుతూనే ఉంది. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నరేంవూదమోడీ యాక్సిస్ పనిచేస్తున్నదని, వీరంతా తెలంగాణకు అడ్డుపడే ప్రమాదం ఉందని తెలుగుదేశంలోనే ఒక సీనియర్ నాయకుడు ఉప్పందిస్తూనే ఉన్నారు. గురువారం పార్లమెంటులో జరిగింది చూస్తే ఇది నిజమేనని రుజువవుతోంది. లోక్‌సభలో స్పీకర్ తెలంగాణపై ఒకరోజు ప్రత్యేక ప్రస్తావనకు టీఆర్‌ఎస్ ఎంపీల కు అవకాశం ఇచ్చినప్పుడు బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ ఏమన్నాడో గుర్తున్నదా? టీఆస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేస్తుంటే సుష్మాస్వరాజ్ ఏమన్నారో గుర్తున్నదా? ‘ఈ కొత్త సంప్రదాయం ఏమిట’ని అద్వానీ ప్రశ్నిస్తే, ‘చేసింది చాలు ఇక ముగించండి’ అని సుష్మాస్వరాజ్ గద్దించారు.ఇప్పుడు వారే సీమాంధ్ర ఎంపీలకు బాసటగా నిలబడ్డారు. సస్పెం డ్ చేయాలని ప్రతిపాదించిన ఎం పీపూవరూ బీజేపీ ఎంపీలు కాదు. అందరూ ప్రతిపక్ష ఎంపీలు కూడా కాదు. ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు. నలుగురు టీడీపీ ఎంపీలు. కానీ బీజేపీ అగ్రనాయకత్వం రాజకీయాలకు అతీతంగా ఉప్పొంగిపోయిం ది. ఇందులోని మర్మం మనమే అర్థం చేసుకోవలసి ఉంది. మొన్నొకరోజు ఒక మిత్రుడు ఫోను చేశాడు.‘అన్నా..నాకు భయమేస్తోంది. మళ్లీ తెలంగాణను మోసం చేస్తారేమో అనిపిస్తుంది. రామోజీరావు అద్వానీతో, చంద్రబాబు మోడీతో మాట్లాడుతున్నారట. వెంకయ్యనాయుడు వీరందరినీ అనుసంధానం చేస్తున్నాడట. ఏదో ఒక వంకపెట్టి బిల్లును అడ్డుకోవాలని వీరు ప్రయత్నిస్తున్నారట. మోడీ టీడీపీకి స్వాగతం పలుకడం, చంద్రబాబు అనుకూల సినిమా ప్రముఖులు అనేకులు మోడీని కలవడం...ఏదో గూడుపుఠాణీ నడుస్తున్నదన్న అనుమానం రేకెత్తిస్తున్నాయి. వీరంతా కలిసి అంబానీల మీద కూడా ఒత్తిడి తెస్తున్నారట. కేంద్రానికి చెప్పి ఏదో ఒకటి చేయాలని కోరుతున్నారట...’ఆ మిత్రుడి ఆందోళనకు అంతులేదు. ఇవన్నీ జరుగుతాయని కాదు. ఇదంతా వాస్తవమూ కాకపోవచ్చు. కానీ ప్రజాస్వామిక ప్రక్రియలన్నీ విఫలమవుతున్నప్పుడు, స్వేచ్ఛాకాంక్షలపై ఏవో కనిపించని గద్దలు వాలుతున్నాయనిపించినప్పుడు తెలంగాణ హృదయాలు అల్లల్లాడుతున్నాయి. గుబులుతో రోదిస్తున్నాయిపజాస్వామ్యం కంటే పలుకుబడి పెత్తనం చేసిన ప్రతిసందర్భంలోనూ సమాజం ఇలా క్షోభకు గురి అవుతోంది. తెలంగాణ కు ఇది ఎన్నాళ్ల శాపమో!

ఐదు రోజులనాడే ఢిల్లీకి చెందిన ఒక మిత్రుడు చెప్పాడు. లోక్‌సభలో సభా కార్యక్షికమాలకు అడ్డుపడుతున్న ఎంపీలను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నదని, అదే విషయం సభా సలహా సంఘంలో ప్రతిపాదించిందని, అందుకు బీజేపీ ససేమిరా అంటోందని ఆయన చెప్పాడు. బీజేపీ సీమాంధ్ర ఎంపీలకు బాసటగా నిలబడాలని నిర్ణయించుకుందని ఆరోజే ఆ జర్నలిస్టు మిత్రుడు చెప్పాడు. ఆయన చెప్పిందే నిన్న జరిగింది. కానీ ఇవేవీ ఇక్కడి మీడియా రాయలేదు. రాయదు. ఇప్పుడు ఒక్కొక్కరి రంగులు బయటికి వస్తున్నాయి. తెలంగాణ విషయంలో అన్నిపార్టీల నిజస్వరూపమూ ఒక్కొక్కటే బయటపడిపోతున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణను వదిలేసుకున్నది. తమ పార్టీ సీమాంధ్ర పార్టీయేనని బాహాటంగానే అక్కడ రంగంలోకి దిగింది. సీమాంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. అక్కడ విగ్రహాల విధ్వంసంలోనూ వారిదే కీలకపాత్ర. వారి దారిలోనే ఇప్పుడు టీడీపీ బయలుదేరింది. కాంగ్రెస్ మొదటి నుంచీ డబుల్ గేమ్ ఆడుతోంది.అందరూ కలసి తెలంగాణ ప్రజలను మరోసారి వంచించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సమాజం ఇప్పుడు అప్రమత్తంగా, సమరసన్నద్ధంగా ఉండకపోతే శాశ్వత బానిసత్వాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆధిపత్యకోసం జరిగే యుద్ధంలో శాంతి ఉండదు. ప్రజాస్వామ్యం ఉండదు. ఆధిపత్యాన్ని అంగీకరించి బానిసత్వాన్ని స్వీకరించడమో, లేక ఆధిపత్యాన్ని అంతం చేసి స్వేచ్ఛాపతాకాన్ని ఎగురువేయడమో...ండే ప్రత్యామ్నాయాలు. టీడీపీ, బీజేపీలు ఎప్పుడయినా ఇందు కు భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదు. ఆ పార్టీలు తెలంగాణపై ఆశలు వదులుకునే ఇలా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు గతంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినా వారు ఇలాగే వ్యవహరిస్తారని అర్థమవుతోంది. విషాదం ఏమంటే బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది తెలంగాణలోనే. నిజాయితీ కలిగిన నాయక త్వం ఉంది తెలంగాణలోనే. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీకి సుమారు ఆరు శాతం ఓట్లు వస్తే, కోస్తాలో ఒకటిన్నర శాతం ఓట్లు వచ్చా యి. కానీ ఆధిపత్య బం ధుత్వాల ముందు ప్రాంతీయ ప్రయోజనాపూంత? పార్టీ తెలంగాణలో ఉంది. కానీ పెత్తనం సీమాంధ్ర ఆధిపత్య శక్తుల చేతుల్లో ఉంది. అద్వానీని, మోడీని ఎవరు ప్రభావితం చేయగలరు? టీడీపీలో తెలంగాణ కోసం ఎవ రు కొట్లాడగలరు? కొట్లాడినా వారిని పట్టించుకునేదెవరు? ఆ పార్టీ వారిది కాదు. సీమాంధ్ర ఆధిపత్య శక్తులది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్వయం గా కృషి చేస్తామని 2008 విజయదశమి రోజు తీర్మానం చేసిన టీడీపీ, గత ఆరేళ్లలో సీమాంధ్ర ప్రజానీకాన్ని, సీమాంధ్ర టీడీపీ నాయకత్వాన్ని సిద్ధం చేయలేదంటే ఆ నేరం ఎవరిది? ఎన్ని బహురూపుల వేషాలు వేసినా ఇక చంద్రబాబును నమ్మడం కష్టం. ఆయన నేరు గా యుద్ధాలు చేయరు. అన్నీ తెర మంత్రాంగాలే. పైకి ఎన్ని చెప్పినా తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన చేయగలిగినదంతా చేస్తున్నారు. ఎప్పుడనుకుంటే అప్పుడు ములాయంతో, జయలలితతో, బీజేపీ అగ్రనేతలతో నేరుగా మాట్లాడగలిగిన సత్తా ఎవరికి ఉంది? ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.

తెలంగాణలో ఇక మనకు మిగిలింది కాంగ్రెస్. మనం కేంద్రంలో పోరాడాల్సింది కూడా కాంగ్రెస్‌పైనే. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల గురించి చెప్పుకోవలసింది ఏమీ లేదు. వారంతా ఇప్పుడు తెలంగాణ తెచ్చామని భ్రమించి, ఆ తెచ్చిన ప్రతిష్ఠను ఎలా ఖాతా లో వేసుకోవాలో, తెలంగాణ వస్తే పెద్ద పెద్ద కిరీటాలు ఎలా కొట్టేయాలో లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్లు మొన్న కొట్లాడిందీ లేదు. రేపు కొట్లాడతారన్న నమ్మకమూ కలగడం లేదు. కొందరు ఎంపీలు ఇందుకు మినహాయింపు. వారు కూడా మూడడుగులు ముందుకు వేస్తారు. రెండడుగులు వెనుకకు వేస్తారు. తెగిద్దామన్న పంతం ఎవరికీ లేదు. సీమాంధ్ర నాయకులను చూసి కూడాఏమీ నేర్చుకోలేదు. ఏదో ఒక తెలంగాణ, ఎలాగో ఒక లాగ వస్తే చాలు అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానం ముం దు సాగిలపడిపోతున్నారు. పది జిల్లాల తెలంగాణ, సీమాంధ్ర ఆధిపత్యం లేని తెలంగాణ సాధించుకుందామన్న కసి, పంతం వారికి లేదు. ‘తెలంగాణ నాయకత్వానికి సీరియస్‌నెస్ లేదు. ఒక నిబద్ధత లేదు. తొందరగా బోల్తాపడడం అలవాటు. ఇటువంటి రాజీతత్వం వల్లనే 1956లో తెలంగాణను కోల్పోయాం.ఐదున్నర దశాబ్దాలు పరాయిపాలనలో బతికాం. ఇప్పుడు మళ్లీ అటువంటి తప్పులు చేయొద్దు. ఆంధ్రులు బలమైనవారు. మళ్లీ మళ్లీ వారితో కొట్లాడే అవసరం మనకు వద్దు’ అని సీనియర్ చరిత్ర ఉపన్యాసకుడు ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా? హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. ఉమ్మడి రాజధానిగా ఉన్నకాలంలో ఢిల్లీ తరహా ఏర్పాట్లు చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు. ఢిల్లీ తరహా ఏర్పాట్లు అంటే హైదరాబాద్ శాంతి భద్రతలతో పాటు భూములను కూడా కేంద్రం చేతిలో పెట్టడం అన్నమాట. హైదరాబాద్ భూములను కేంద్రం చేతిలో పెడితే అది పది జిల్లాల తెలంగాణ ఎలా అవుతుంది? అందువల్ల కాంగ్రెస్ హైదరాబాద్ రెవెన్యూ హక్కులను తెలంగాణకే ఇవ్వవచ్చు. ఇక మిగిలింది శాంతి భద్రతలు. ఎక్కడివరకు? హైదరాబాద్ పోలిస్ కమిషనరేట్ పరిధివరకా లేక హైదరాబాద్, సైబరాబాద్ కమిషన్‌రేట్‌లను రెంటినా? హైదరాబాద్ పోలీసు కమిషనరే ట్ హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకు పరిమితమైనది. అవసరమైతే ఒక్క హైదరాబాద్ జిల్లాకు మాత్రమే ఈ శాంతి భద్రతల వ్యవహారాన్ని పరిమితం చేయాలి. అంతకుమించి రాజీపడితే తెలంగాణకు ఇక నిష్కృతి లేదు.

నిజానికి ఆంధ్ర నాయకులు 1953లో మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు కూడా ఇటువంటి వివాదాలే లేవదీశారు. మద్రాసులో సగానికంటే ఎక్కువ తెలుగు ప్రజలే ఉన్నారని, మద్రాసును తెలుగువారే నిర్మించారని, అక్కడ పరిక్షిశమలు, వ్యాపారాలు తెలుగువారే నెలకొల్పారని అందువల్ల మద్రాసును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పట్టుబట్టారు. కనీసం మద్రా సు నడిమధ్య నుంచి ప్రవహిస్తున్న కోవై నదికి ఇవతలి ప్రాంతాన్ని ఆంధ్ర రాజధానిగా చేసి, నదికి ఆవలి నగరాన్ని తమిళనాడుకు రాజధాని చేయాలనీ వాదించారు. తమిళులు ఇవేవీ ఒప్పుకోలేదు. విభజన విధివిధానాలకోసం వేసిన కైలాసనాథ్ వాంఛూ మద్రాసును ఆంధ్రులు గెస్ట్ కాపిటల్‌గా ఉపయోగించుకు నే అవకాశం ఇవ్వాలని సూచించారు. 32 మంది తెలుగేతర ఎంపీలు అతిథులుగా కూడా ఇక్కడ ఉండడానికి వీలులేదంటూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు లేఖ రాశారు. ఆంధ్ర నాయకత్వం ఇప్పుడు అదే రికార్డును వల్లెవేస్తున్నది. అవే వాదనలు చేస్తున్నది. హైదరాబాద్‌లో తమ జనాభా 30 లక్షల మంది ఉన్నారని అందువల్ల హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వాదిస్తున్నారు. ఇవన్నీ కాలం చెల్లిన వాదనలు. ఇప్పుడు తెలంగాణ నాయకులు కనీసం ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నారు.అప్పుడు మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలచారి అందుకు కూడా ఒప్పుకోలేదు. ఆగమేఘా ల మీద కర్నూలు వచ్చి టెంట్లు వేసుకుని ప్రభుత్వాన్ని నడుపుకోవలసి వచ్చింది. ‘కర్నూలు ను త్యాగం చేసి హైదరాబాద్‌కు వస్తే మాకు దక్కిన ప్రతిఫలం ఇదా?’ అని ఒక ఆత్మీయుడు ప్రశ్నించాడు. ‘మీరు ఒక్క కర్నూలు ను త్యాగం చేశారు. కానీ మేము మా (హైదరాబాద్) రాష్ట్రాన్ని త్యాగం చేశాం. మా స్వయం పాలనాధికారాన్ని త్యాగం చేశాం. మా జుట్టు మీ చేతికిచ్చాం. మా ఉద్యోగాలు, వనరులు త్యాగం చేశాం. చివరకు మా రాజధానిని కూడా త్యాగం చేశాం. ఇప్పుడు మాది మేము అడగడానికి వందలాది మందిని బలిపెట్టుకుంటున్నాం’ అని చెబితే, తాను ఈ కోణాన్ని గ్రహించలేదని చెప్పాడు. ఇక ఇప్పుడు మనకు మరో మార్గం లేదు. ఇప్పుడు తెలంగాణ సాధించకపోతే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో ఊహించుకుం ఆందోళన కలుగుతోంది.

కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు ఏం చేస్తుందన్నదే ముఖ్యం. తాము ఏరికోరి నియమించుకున్న కిరణ్‌కుమార్‌డ్డి తమ మాట వినడం లేదని అధిష్ఠానం చెబితే ఇప్పుడు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాంగ్రెస్‌లోనే మరో వ్యూహం ఏదో నడుస్తూ ఉన్నది. లేకపోతే ఇంత సాగదీత, ఇంత మెతకదనం ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో ముఖ్యమం త్రి, గవర్నర్, కేంద్ర హోంశాఖ రోజువారీ సమీక్షలు జరిపిన కాలం మనకు తెలుసు. హైదరాబాద్‌లో సభపెడితే వందలాది పోలీస్ ఔట్‌పోస్టులు దాటుకుని రావడం మనకు తెలుసు. నిరాహారదీక్ష చేయాలంటే ముందే అరెస్టులు చేసి, దూర ప్రాంతాలకు తరలించి వేధించడం తెలుసు. ఇప్పుడు అక్కడ అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి. గవర్నర్ తెరపై కనిపించడం లేదు.ముఖ్యమంత్రి శాంతిభవూదతల సమీక్షలు చేయడం లేదు. కేంద్ర హోం శాఖ నిశ్చింతగా ఉంది. మీడియా, పార్టీలు, ఉద్యోగ సంఘాలు యథే చ్ఛగా రెచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఎవరిపై ఏ ఆంక్షలు లేవు. కిటుకు అంతా ఢిల్లీలోనే ఉంది. అధిష్ఠానం వద్దే ఉంది. అధిష్ఠానం అనుకుంటే సీమాంధ్ర కాం గ్రెస్ నాయకులను కట్టడి చేయడం క్షణాల్లో పని. కట్టడి చేయలేకపోతే పం జాబ్ ఏర్పాటు సందర్భంగా చేసిన పనే ఇప్పుడూ చేయవచ్చు. అప్పుడు కూడా పంజాబ్ ముఖ్యమంత్రి విభజనకు సహకరించడానికి నిరాకరించా రు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను డిస్మిస్ చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తలుచుకుంటే మార్గాలు లేకపోలేదు.

[email protected]

475

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా