తెరలు తొలగిపోయే వేళ..


Sat,July 27, 2013 12:52 AM

ద్వంద్వాలు ధ్వంసమయ్యేవేళ ఆసన్నమైంది. బహుముఖ వేషాల ముసుగులు తొలగిపోయే తరుణం వచ్చేసింది. మేకవన్నె పులుల స్వరూపం బట్టబయలయ్యే సందర్భం వచ్చేసింది. తెలంగాణ ప్రజలకు ఈ స్పష్టత మంచిదే. ఎవరు ఎక్కడో తేలిపోవలసిందే. వేషానికి, స్వభావానికి మధ్య అంతరం తెలుసుకోవలసిన సమయం వచ్చేసింది. వేషం ఉదరపోషణార్థం. రాజకీయ పరిభాషలో సీట్లు, తద్వారా అధికార సంపాదనకోసం. స్వభావం పుట్టుకతో వచ్చింది. ప్రాంతీయాభిమానానికి, కులాభిమానాని కి, స్వభావానికీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది సహజం కూడా. దానిని అధిగమించి సమస్యను గుర్తించి న్యాయాన్యాయాల విచక్షణతో మాట్లాడేవారు చాలా కొద్ది మంది.

పరీక్ష వచ్చినప్పుడే స్వభావం తెలిసిపోతుంది. ఇప్పుడు వైఎస్సార్సీపీ స్వభావం బట్టబయలయింది. ఆ పార్టీ ప్రాంతీయ స్వభావం బట్టబయలయింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కూడా ఎందరు నిలబడతారో ఎందరు కలబడతారో తేలిపోతుంది. నిర్ణ యం వస్తే తెలుగుదేశం ఎంతవరకు నిలబడుతుందో అర్థమవుతుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా చెక్కు చెదరకుండా ఇచ్చినమాటకు నిలబడడమే రాజకీయ నిబద్ధత. రాజకీయ పార్టీల విశ్వసనీయతను పెంచేవి ఇటువంటి సందర్భాలే. నాయకుల ధీరత్వా న్ని నిరూపించేది ఇటువంటి పరీక్షలే. పరీక్షా సమయాల్లో జారిపో యి, ఆ తర్వాత ఎన్ని సుభాషితా లు చెప్పినా జనం విశ్వసించరు. తెలుగుదేశం ఇంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్య ఇదే. సీమాం ధ్ర పార్టీలు పదేపదే ఇటువంటి తప్పులు చేస్తున్నాయి. తెలంగాణలో మనుగడ సాగించాలనుకునే పార్టీలు తమ పార్టీలను అందుకు సిద్ధం చేయాలి. ఒక విధాన నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉండే విధంగా అక్కడా ఇక్కడా నాయకుల ను ఒప్పించాలి, ప్రజలను మెప్పించాలి. కానీ పెద్ద పార్టీలు ఏవీ ఆపని చేయలేదు. అలా చేసిన పార్టీలు బిజెపి,సిపిఐ-అక్కడా ఇక్కడా ఒకే మాట మాట్లాడుతున్నాయి. తమ పార్టీల నాయకత్వాన్ని అందుకు సిద్ధం చేశాయి. తమ పార్టీల సభ్యులనూ ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. అదేపని కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ చేసి ఉంటే ఇవ్వాళ సమస్య ఇంతదాకా వచ్చి ఉండేది కాదు.

‘విభజన వికాసానికే-విడిపోయి కలిసుందాం’ అని ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేస్తే ఎటువంటి ప్రతిఘటనా రాలే దు. ఒకటిండు చోట్ల చిన్నచిన్న సంఘటనలు తప్ప ప్రజల్లో ప్రతికూల భావన వ్యక్తం కాలేదు. రాజకీయ పార్టీలు చేసిన తప్పు అదే. సీమాంధ్ర ప్రజలను విభజనకు సిద్ధం చేయకపోవడమే ఆ పార్టీలు చేసిన నేరం. పన్నెండేళ్లుగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ, కొత్తగా వచ్చిన పీఆర్‌పీ అన్ని పార్టీలూ తెలంగాణ నినాదాన్ని ఆసరాగా చేసుకుని అధికారాన్ని, ఓట్లు, సీట్లు సంపాదించినవే.

ఇక్కడ ఓట్లకోసం, సీట్ల కోసం తెలంగాణ నినాదం ఎత్తుకున్నప్పుడే ఈ పార్టీలన్నీ అక్క డ సీమాంధ్ర ప్రజలను విభజనకు సిద్ధం చేసి ఉండాల్సింది. కలసి ఉండి కలహించుకోవడం కంటే, విడిపోయి అభివృద్ధి సాధిద్దామన్న వాదాన్ని అక్కడి ప్రజల్లో ప్రోదిచేయాల్సింది. తెలంగాణ ఉద్యమం పదేపదే ముందు కు వస్తోందని, ఇప్పుడు కాకపోతే మరికొన్నాళ్లకయినా విడిపోకతప్పదని సీమాంధ్ర ప్రజలకు వివరించి ఉండాల్సింది. విభజన వల్ల సీమాంవూధకు ఎలా మేలుజరుగుతుందో వివరించి అక్కడి ప్రజలను ఒప్పించాల్సింది. అత్యాధునిక రాజధాని, దానితోపాటు వచ్చే హంగులూ, అవకాశాలూ, అభివృద్ధి వారికి వివరించాల్సింది. హైటెక్‌సిటీని నేనే నిర్మించానని చెప్పుకునే చంద్రబాబునాయుడు అంతకంటే గొప్ప నగరాన్ని నిర్మించి ఇస్తానని ఆంధ్ర ప్రజలకు హామీ ఇచ్చి ఉండవచ్చు. ఆధునికాంధ్ర నిర్మాణానికి ఎలా పాటుపడతామో చెప్పి ఉండాల్సింది. కానీ ఆ కాలమంతా ఈ పార్టీలన్నీ వేషాలు వేశాయి. ఇక్కడొక మాట, అక్కడొక మాట మాట్లాడాయి. ‘తెలంగాణ రాదులే, ఇవ్వరులే, ఇస్తే అడ్డుకోవచ్చులే’ అని ఒక మోసపూరితమైన, వంచనాపూరితమైన వైఖరిని అవలంబిస్తూ వచ్చాయి.

‘తెలంగాణవాళ్లకు అంత తెలివి లేదు. మమ్మల్ని కాదని తెలంగాణ ఎలా వస్తుంది?’ అన్న ఆధిపత్య దురహంకారాన్ని ప్రదర్శించాయి. దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డి తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగించుకుని నంద్యాల వెళ్లగానే తెలంగాణపై విషం కక్కాడు. ఆయన అంశను పుణికి పుచ్చుకుని వచ్చిన పార్టీ కదా, వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే పాటపాడుతోంది. అదే విషం చిమ్ముతోంది. అయినా పర్వాలేదు. తెలంగాణ ప్రజలకు తమవావరో, పరాయివావరోతేలిపోవాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్‌ను పట్టుకుని వేలాడుతున్న తెలంగాణ సోదరులు ఇప్పుడు తమ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనం వహించేవాడు, ప్రేక్షకపాత్ర వహించేవాడు అన్యాయం చేసినవాడితో సమానం. వాళ్లు ఆగమేఘాలమీద రాజీనామాలు చేస్తుంటే, మీరు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోకండి. ఖండన ప్రకటనలతో కాలక్షేపం చేయకండి. రాజకీయాల్లో తటస్థత ఉండకూడదు.

రాజకీయ పార్టీలు ఏమైనా చేయనీయండి-తెలంగాణ ప్రజలు మాత్రం కలవరపడాల్సింది, ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ప్రిపేర్ ఫర్ ద వర్స్, ట్రై టు గెట్ ద బెస్ట్. తెలంగాణ వచ్చి తీరుతుంది. కాంగ్రెస్సే ఇవ్వా లి. కాంగ్రెస్ ఇప్పుడు ‘తెలంగాణ నిర్ణయంపై వెనుకకు వెళ్లలేని పరిస్థితి’కయితే వచ్చింది. పరిణామాలన్నీ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడే కాంగ్రె స్ ముందుకెళ్లాల్సి ఉంటుంది. అన్ని పార్టీలలో కొందరు సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారు. చేయనీయండి. 16 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.అవి ఆమోదం పొందితే అసెంబ్లీ లో ఎమ్మెల్యేల సంఖ్య 262కి తగ్గిపోతుంది. మరికొంత మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కూఆ ఆ బాట పట్టవచ్చు. సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేల సంఖ్య ఎంత తగ్గితే, తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో నెగ్గడం అంతసులు వు. నిజానికి నెగ్గకపోయినా పర్వాలేదు. అసెంబ్లీ ముందుకు వచ్చి వెనుక కు పోతే చాలు.

కానీ రాజీనామాలు పెరిగే కొద్దీ నెగ్గే అవకాశాలు మెరుగవుతాయి. ఇటువంటి సందర్భాలు చరివూతలో ఉన్నాయి. అవిభక్త పంజాబ్ ను విడదీయాలని సిక్కులు ఒకవైపు, విడదీయవద్దని హిందువులు మరోవైపు సంవత్సరాల తరబడి పోరాడారు. రాజీనామాల టగ్ ఆఫ్ వార్ అక్క డా జరిగింది. రాష్ట్రంలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. కేంద్రం చివరకు అక్కడ జూలై 1966 నుంచి 1 నవంబరు 1966 వరకు రాష్ట్రపతి పాలన విధించి, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లుగా విభజించింది. రాష్ట్రం లో అసెంబ్లీ నడవని పరిస్థితివస్తే ఇక్కడకూడా అదే పనిచేయవలసి వస్తుం ది. చేతిలో ప్రభుత్వం, ఎమ్మెల్యే పదవి ఉంటే వచ్చే ఎన్నికల్లో పోరాడడం తేలిక. రెండూ పోతే సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా వూపతినిధులు ఏదో ఒక గాలికి కుప్పకూలిపోవలసిన పరిస్థితి వస్తుంది. టీడీపీ పరిస్థితి కూడా అంతే. మూకతో కలసి రాజీనామాలు చేయడమా లేక సొంత పంథాలో సీమాంధ్ర ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయడమా? ఆ పార్టీ తేల్చుకోవాలి. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలంటే టీడీపీకి ఇది ఆఖరి అవకాశం. ఇప్పుడు తప్పటడుగు వేస్తే ఇక ఎప్పటికీ ఆ పార్టీ కోలుకోలేదు.

షిల్లాంగ్ అనుభవం
హైదరాబాద్‌లో సీమాంవూధులకు రక్షణలు కల్పించాలని, హైదరాబాద్‌ను కేంద్ర పరిపాలనా ప్రాంతం(సెంవూటల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా) కింద మార్చాలని కొంతమంది మాట్లాడుతున్నారు. కేంద్రం కూడా వారి మాట లు వింటున్నది. నిజానికి హైదరాబాద్‌లో సీమాంవూధుల ప్రయోజనాలకు ఇప్పటివరకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. హైదరాబాద్‌ను తెలంగాణ ప్రజలకు కాకుండా చేస్తేనే ఎక్కువ సమస్యలు వస్తాయన్న అంశాన్ని సీమాంధ్ర నాయకత్వం గుర్తించాలి. హైదరాబాద్ కోసమే విశాలాంధ్ర నినాదంతో వచ్చి, ఇవ్వాళ హైదరాబాద్‌ను మాకు కాకుండా చేశారన్న భావన తెలంగాణ ప్రజల్లో వస్తే అది ఎలా పరిణమిస్తుందో ఆలోచించుకోవాలి. కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండడం, ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం శాంతిభవూదతలకోసం ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వరకు అర్థం చేసుకోవచ్చు. సీమాంవూధలకు కొన్ని రక్షణలూ కల్పించవచ్చు. అందు కు భిన్నంగా ఏమి జరిగినా తెలంగాణ హక్కులను హరించడమే అవుతుంది. రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం చరివూతలో ఇంతవరకు జరుగలేదని కొంతమంది వాదిస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం.

అస్సాం, మేఘాలయ, అరుణాచ ల్ ప్రదేశ్‌లు విడిపోక ముందు వీటన్నింటికీ షిల్లాంగ్ రాజధానిగా ఉండేది. అనేక అస్తిత్వ ఉద్యమాల తర్వాత 1971 డిసెంబరు 30న ‘ఈశాన్య ప్రాంతాల (పునర్విభజ న) చట్టాన్ని’ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోనే పార్లమెంటు ఆమోదించింది. 1971 జనవరి 21న కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1974 వరకు షిల్లాంగ్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఎటువంటి సమస్యలూ తలెత్తలేదు. కానీ అస్సాం ప్రభుత్వం అంతదాకా వేచి చూడలేదు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజావూపతినిధులంతా అస్తమానం షిల్లాంగ్ దాకా వెళ్లడం అప్పటి అస్సాం ముఖ్యమంవూతికి నచ్చలేదు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 1972లోనే రాజధానిని గౌహతి సమీపంలోని దిస్‌పూర్‌లో తేయాకు తోటల్లో ఉన్న భవనాల్లోకి మార్చారు. 1973 మార్చిలో అస్సాం బడ్జెట్ సమావేశాలు దిస్‌పూర్‌లోనే జరిగాయి. దానికి సమీపంలోనే అత్యాధునిక రాజధానిని నిర్మించుకున్నది అస్సాం. హైదరాబాద్ ఎక్కడికీపోదు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంవూధుల ఆస్తులు ఎక్కడికీపోవు. ఏదో జరిగిపోతుందన్నది ఒక భ్రమ. సీమాంధ్ర ప్రజలు తమ అదనపు ఆదాయాన్ని పెట్టుబడి పెట్టడంవల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఒక సీమాంధ్ర మేధావి వాదించారు. నిజమే, అభివృద్ధి ఫలాలు ఇప్పుడు ఎక్కడికిపోతా యి? ఎవరు దోచుకుంటారు? ఇదే అదనపు ఆదాయాలను సీమాంవూధలోనే వెనుకబడిన ఒంగోలులోనో, వినుకొండలోనో, మార్కాపురంలోనో పెట్టుబడిగా పెడితే మరో ఆధునిక రాజధాని నిర్మాణం కాదా? అక్కడ సంపదలు రావా? అభివృద్ధి వికేంవూదీకరణ జరిగి సీమాంవూధలో మొత్తంగా కొన్ని కోట్ల ఎకరాల భూముల విలువలు పెరగవా? లక్షలాది ఉద్యోగాలు రావా?

అంతేకాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌పై ఎటువంటి మెలికలు పెట్టినా అవి కాంగ్రెస్‌కు, సీమాంధ్ర ప్రజలకు మేలు చేయవు. పరిమిత కాలం తర్వాత ఆటోమాటిక్‌గా రద్దయిపోయే క్లాజుతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడం, ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకు పరిమితం చేయడం, ఉమ్మడి రాజధానిలో- అంటే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో- శాంతిభవూదతల అంశాన్ని చూడడానికి ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి ఒక భారీ ప్యాకేజీ ప్రకటించడం అందరికీ మేలు చేస్తుంది. హైదరాబాద్‌ను ఎనిమిదేళ్లో, పదేళ్లో ఉమ్మడి రాజధానిగా చేసి, కేంద్ర పాలిత ప్రాంతానికే మరోపేరు పెట్టి, జీహెచ్‌ఎంసీ మొత్తాన్ని దాని పరిధిలోకి తీసుకురావాలని చూస్తే మాత్రం మళ్లీ అలజడి తప్పదు. అసంతృప్తి తప్పదు. అప్పుడు ఒక్క హైదరాబాద్‌ను కాదు మూడు జిల్లాలను తెలంగాణకు కాకుండా కాజేసినట్టవుతుంది. మెదక్, రంగాడ్డి జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలు కూడా ఉమ్మ డి రాజధాని పరిధిలోకి వస్తాయి. తెలంగాణ ప్రజలకు ఇది ఎంతమాత్రం నచ్చని విషయం. విభజన సద్భావంతో జరిగితే తప్ప, హైదరాబాద్ తొందరగా కుదురుకోదు, ప్రతిష్టంభన తొలగిపోదు. ఇన్ని మెలికలు, ఇన్ని ఆంక్షలు, ఇన్ని అనుమానాలతో విభజన జరిగితే అది హైదరాబాద్‌లోని రెండు ప్రాం తాల ప్రజలకూ మంచి చేయదు.

[email protected]

441

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా