ముందు నుయ్యి- వెనుక తెలంగాణ


Fri,July 19, 2013 11:45 PM


తెలంగాణ విఘటన (డిమెర్జర్) ప్రక్రియ అంతిమఘట్టానికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేగంగా పడుతున్నట్టు ఇప్పటికి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కేంద్రం పెద్దలు జరిపిన చర్చలకు సంబంధించి చూచాయగా వివరాలు బయటికి పొక్కుతున్నాయి. ఇంత జరుగుతున్నా తెలంగాణలో ఎవరికీ నమ్మకం కలుగడం లేదు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పోగేసుకున్న అపనమ్మకం ఇందుకు కారణం. కాంగ్రెస్ ఎప్పుడు ఏదశలోనైనా రూటు మార్చగలదన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో బలం గా నాటుకుపోయింది. ‘అయ్యేదాకా కాంగ్రెస్‌ను నమ్మడానికి వీలులేదు’ అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. తెలంగాణ నిజంగానే వస్తుం దా? కాంగ్రెస్ నిజాయితీగానే ప్రయత్నిస్తున్నదా? కాంగ్రెస్ నిజాయితీగా చేయదల్చుకుంటే ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల నోళ్లు ఎందుకు మూతపడ డం లేదు? టీఆస్‌తో చర్చలు ఎందుకు జరగడం లేదు? శాసనసభ తీర్మా నం ఎందుకు ముందుకు వస్తున్నది? తీర్మానం ఆమోదింపజేయడానికా? ప్రతిఘటింపజేయడానికా? ఎక్కడ ఏ సభకు వెళ్లినా ఇదే మాట. ఇవే ప్రశ్నలు. ఇవే అనుమానాలు. నిజమే- గత పదేళ్ల అనుభవం తర్వాత ప్రజ లు ఇలా అనుమానించడం, ప్రశ్నించడం సహజమే. ‘ఇప్పుడు జరిగే ప్రయత్నాల్లో ఏదైనా తేడా వస్తే తెలంగాణ సమాజంలో ఇంకా ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో’నని ఒక మిత్రుడు భయాందోళనలు వ్యక్తం చేశాడు. ‘కాంక్షిగెస్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ నాటకం ఆడుతున్నదేమో’నని మరో సీనియర్ సిటిజన్ సందేహం వ్యక్తం చేశాడు. పంచాయతీ సర్పంచి ఎన్నికల లెక్కలు చూపి సీమాంధ్ర నాయకులు తెలంగాణవాదాన్ని దెబ్బకొడతారేమోనని మరో అధ్యాపకుడు ఫోను చేశారు. వీటన్నింటికీ ఒకే సమాధానం- తెలంగాణవాదుపూవరూ భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదు. తెలంగాణ సాధన అంతిమఘట్టంలో ఉన్నాం. తెలంగాణ ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ అవసరం. తెలంగాణ ఇవ్వడానికి ఆ పార్టీకి అందుబాటులో ఉన్నది మూడు మాసాలే. ముందస్తుగా ఎన్నికలు వస్తే డిసెంబరులోనే రావాలి. షెడ్యూలు ప్రకారం అయితే వచ్చే మార్చి మొదటివారంలోలో ఎన్నికల ప్రకటన రావాలి. అంటే నవంబరు-డిసెంబరు తర్వాత కాంగ్రెస్ ఎన్నికల రంధిలో పడిపోతుంది. అప్పుడు తెలంగాణపై ఏమీ చేయలేదు. అందుకే ఏం చేసినా ఇప్పుడే చేయాలి.

‘మివూతులారా...ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందరూ తెలంగాణ రాష్ట్రం చూడాలి. నవతెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి. ఇచ్చి తీరుతుంది. ఇవ్వకపోతే, రేపు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరుమాసాల్లో మనం సాధించుకోగలం. ఇప్పుడు మన ఓటు, మన అధికారం మన చేతుల్లో ఉంది. కేంద్రంలో ఎవరినయినా మన చుట్టూ తిప్పుకోగలిగిన సంఘటిత శక్తి తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంది. అందుకే ఎవరూ బెంగపడవద్దు. స్థైర్యం కోల్పోవద్దు. పదేళ్లు కొట్లాడాం. పదిమాసాలాగలేమా?’ అని ఒక ఢిల్లీ మిత్రుడు మెసేజ్ పంపారు. ఈ విన్నపాన్ని పత్రికలో ప్రచురించాలని కోరారు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది కాంగ్రెస్ నిజాయితీ గురించి కాదు,అవసరం గురించి. ఆంధ్రవూపదేశ్ నుంచి కనీస ఎంపీ స్థానాలను పొందాలంటే ఉన్న ఏకైక మార్గం తెలంగాణ ఏర్పాటు. అందుకే కాంగ్రెస్ ఇంత హడావిడి చేస్తోంది. ఇది కాంగ్రెస్ గర్జ్, ఫర్జ్. ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడకపోవడానికి కారణం ఉంది. తెలంగాణ ఇస్తున్నామని కాంగ్రెస్ ఆంధ్రను పూర్తిగా వదిలేసుకోలేదు కదా! అక్కడా పార్టీని కాపాడుకోవాలి కదా! అక్కడ కూడా తమ వాళ్లనే హీరోలుగా నిలబెట్టాలి కదా! అందుకే వాళ్లు తెలంగాణ రాకుండా చివరిదాకా వీరోచితంగా పోరాడుతున్నట్టు కనిపించాలి కదా! ఇటువంటి ఆటలన్నీ ఆ పార్టీకి మామూలే. వాళ్లేమయినా చేసుకోనివ్వండి. ఎంత వీరోచితంగా మాట్లాడేవారయినా చివరగా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారన్న సంగతి మనం విస్మరించరాదు. అంతేకాదు, కాంగ్రెస్ వారితో కూడా చర్చించాల్సి ఉంది. వారి రాజధాని ఎక్కడ ఉండాలో, వారికి ఎటువంటి ప్యాకేజీ ఇస్తారో, హైదరాబాద్‌ను వదులుకుంటున్నందుకు వారికి ఎటువంటి ఆర్థిక సహాయం అందిస్తారో, అక్కడ ఏయే కేంద్ర సంస్థలను ఏర్పా టు చేస్తారో, జలవనరుల పంపిణీకి సంబంధించి ఎటువంటి ఏర్పా ట్లు చేస్తారో....ఇత్యాది అంశాలను గురించి వారితో సాకల్యంగా మాట్లాడకుండా నిర్ణయం చేయలేరు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అడ్డం తిరిగేవారు తిరుగుతారు. వారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా! సీమాంధ్ర నాయకత్వం తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఆఖరి నిమిషంలో చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తారు. కాంగ్రెస్ వాటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ ఇస్తే, తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి హారతిపడతారు. లేదూ-మోసం చేస్తే ఏం చేయాలో మనకు తెలుసు. తెలంగాణ సమాజం కూడా ఈ పరిణామాలన్నింటికీ సిద్ధపడాలి. లగడపాటి రాజగోపాల్ తమ వద్ద ఏదో బ్రహ్మాస్త్రం ఉందన్నాడు. ఆయన బ్రహ్మాస్త్రం జైళ్లో ఉంది. మన బ్రహ్మాస్త్రం మన చేతుల్లో ఉంది. అది ఓటు. ఆ భయమే కాంగ్రెస్‌ను నిర్ణయం దిశగా అడుగులు వేయిస్తున్నది. ఆ అడుగులు ఆగిన రోజున మన బ్రహ్మాస్త్రం దానిని తుత్తునియలు చేస్తుంది.

స్థానిక ఎన్నికల లెక్కలు చూపి తెలంగాణను అడ్డం కొడతారేమోనన్న ఆందోళన అవసరం లేదు. స్థానిక సంస్థల్లో కూడా తెలంగాణవాదమే గెలుస్తుంది. తెలంగాణవాదానికి జైకొ గెలుస్తున్నారు. వారు ఏ పార్టీవారయినా సరే. ఒకవేళ ఈ ఫలితాలను తెలంగాణకు వ్యతిరేక ఫలితాలుగా చూపించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీమాంధ్ర మీడియా తెలంగాణ ప్రజలకు దొరక్కుండా పోరు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఎంతో దూరం లేవు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, ఇతర సీమాంధ్ర నాయకులు ఇప్పటికే చాలా సార్లు అటువంటి వక్రీకరణలు కేంద్రంలో వినిపించారు. సహకార ఎన్నికల ఫలితాలను కూడా తెలంగాణకు వ్యతిరేకమైన తీర్పుగానే వివరించే ప్రయత్నం చేశారు. రేపు సర్పం ఎన్నికల ఫలితాలను కూడా అలా వివరించే ప్రయత్నం చేయవచ్చు. కానీ అధిష్ఠానం పెద్దలు అంతఅమాయకంగా ఉండరు. కోర్‌కమిటీ ముందు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన ప్రజెం సంబంధించి సీమాంధ్ర మీడియా ఇచ్చిన బిల్డప్ చూసి, ఢిల్లీ నుంచి ఒక మీడియా మిత్రుడు ఫోను చేసి ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి ఇచ్చిన లెక్కలు చూసి కోర్ కమిటీ సభ్యులంతా ఆశ్చర్యపోయి కిందపడి గిలగిలా కొట్టుకున్నట్టు కొన్ని చానెళ్లు, పత్రికలు రాశాయి. ‘అధిష్ఠానం అంత అమాయకంగా నోట్లో వేలేసుకుని లేదు. అధిష్ఠానం పెద్దల వద్ద అన్ని లెక్కలు ఉన్నాయి. రాహుల్ స్వయంగా రెండు అధ్యయన నివేదికలు తెప్పించుకున్నారు. జాతీయ చానెళ్లు చేసిన సర్వే రిపోర్టుల సమాచారం వారి వద్ద ఉంది. ఐబి నివేదికలు ఉన్నాయి. తెలంగాణ సమస్యకు సంబంధించి కొత్తగా వారు తెలుసుకోవలసింది ఏమీ లేదు. వీరు ఎవరు ఎలా ఉన్నారు? ఏం చేయబోతున్నారో అంచనావేయాలనుకుంది అధిష్ఠానం. వీరితో మాట్లాడి చర్చల ప్రక్రియను ముగించాలనుకోవడం కూడా మరో కారణం’ అని ఆ జర్నలిస్టు వివరించారు. అందువల్ల పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏదో చేసేస్తాయన్న భయం ఎవరూ పెట్టుకోవద్దు. తెలంగాణలో గెలిచినవాళ్లంతా జై తెలంగాణ అని నినదిస్తున్నవాళ్లే.

టీఆస్‌తో చర్చలు జరగడం లేదెందుకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నా రు. ఏది ముందు, ఏది వెనుక చేయాలో కాంగ్రెస్ ఇష్టం. కాంగ్రెస్ స్వ యంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించకుండా, సొంత ఇల్లు చక్కదిద్దుకోకుండా టీఆస్‌తో చర్చల ప్రక్రియను ప్రారంభిస్తే అది ముందు పడుతుం దా? సీమాంధ్ర నాయకత్వం ముందు పడనిస్తారా? ముందే టీఆస్‌తో చర్చలు జరిపితే సీమాంవూధలో అలజడి పెరుగుతుందని, వారిని ఒప్పించడం లేదం అదుపు చేయడం కష్టమవుతుందని కాంగ్రెస్ భావించి ఉండవచ్చు. సీమాంధ్ర నాయకత్వాన్ని విభజనకు మానసికంగా సిద్ధం చేయకుండా టీఆస్‌తో చర్చలు జరిపితే ఆంధ్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ ఆలోచించి ఉండవచ్చు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తర్వాత కాంగ్రెస్ టీఆస్‌తో సంప్రదింపులు జరుపవచ్చు. చాలా మంది తెలంగాణవాదుల ఆందోళన ఏమంటే టీఆస్‌తో చర్చలు జరుపడం లేదు కాబట్టి, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంలేదేమో, ఎన్నికల్లో లబ్ధిపొందడానికే కాంగ్రెస్ ఈ తతంగం నడిపిస్తున్నదేమో అని! తెలంగాణవాదులకు ఒక స్పష్టత అవసరం. టీఆస్‌తో చర్చలు జరపకుండా తెలంగాణ ఇస్తే మంచిది. తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, ఒక నవనిర్మాణ ఎజెండాతో పనిచేయడానికి ఆపార్టీ పనిచేస్తుంది. బలమైన శక్తిగా ఎదుగుతుంది. చర్చ లు జరిపి, తెలంగాణ ఇవ్వడం కోసం విలీనం కోరితే అది కూడా మంచిదే. ఇప్పుడు అందరి లక్ష్యం తెలంగాణ సాధన ఒక్కటే కావాలి. సమైక్య బంధనాల నుంచి తెలంగాణను విముక్తి చేయడంకోసం ఎంతటి త్యాగాలకయినా సిద్ధపడాలి.‘మరి నవ తెలంగాణ కోసం టీఆస్ ప్రతిపాదించిన ఎజెండా సంగతేమవుతుంది? ప్రత్యామ్నాయ రాజకీయా లు ఏమవుతాయి? మళ్లీ కాంగ్రెస్‌నే భరించాలా? ఇంతకాలం మోసం చేసినవారితో నే సహవాసం చేయాలా?’ అని కొందరు మిత్రులు వాదిస్తున్నారు. వారి వాదన న్యాయమైనదే. ఆగ్రహం కూడా సమంజసమైనదే. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా మొదలయినవాళ్లం. దాని కోసమే పన్నెండేళ్లుగా పోరాడుతున్నవాళ్లం.అనేక త్యాగాలు. అనేక ఉద్యమాలు చేసినవాళ్లం.ఎంతో క్షోభను అనుభవిస్తున్నవాళ్లం. నిజ మే మధ్యలో అనేక అంశాలు మన ఎజెండాలోకి వచ్చి ఉండవచ్చు. తెలంగాణ రాకకు అవేవీ అవరోధం కాకూడదు.తెలంగాణ రాకకు విలీనం సమస్య కాకూడదు. ఒకసారి తెలంగాణ సాధించుకున్నామంటే పొలిటికల్ డైనమిక్స్ మారిపోతాయి. తొలుత కాంగ్రెస్‌కు మేలు జరగవచ్చు, కానీ క్రమంగా కొత్త శక్తులు, కొత్త ప్రత్యామ్నాయాలు వాటంతటవే పుట్టుకువస్తాయి. అధికార వికేంవూదీకరణ చాలా రాజకీయ మార్పులు తీసుకువస్తుంది. మనమేదో వదిలేసుకుంటున్నామన్న భావన ఇప్పుడనవసరం.

ఇక అసెంబ్లీ తీర్మానం ఎందుకు? అది ఒక రాజ్యాంగ పరమైన ఫార్మాలిటీ. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఏ తీర్మానమయినా శాసనసభ ‘ప్రస్తావన(ఫర్)’ కు పంపాలని రాజ్యాంగంలోని 3వ అధికరణంలో ఉంది. రాష్ట్రాలను విభజించే సర్వాధికారం కేంద్రానిదే అయినా, రాష్ట్రాల శాసనసభలకు తెలియకుండా విభజన చేయకూడదన్న దృష్టితో రాజ్యాంగంలో ఈ ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూసీ తర్వాత ఆ ప్రక్రియను పూర్తిచేయడంకోసం కేంద్రం ముందుగా తీర్మానాన్ని శాసనసభకు పంపవచ్చు. ఈ తీర్మానం వల్ల తెలంగాణకు వచ్చిన ప్రమాదం లేదు. కాంగ్రెస్ కుట్రపూరితంగా ఇదంతా చేస్తే, అదిసభ జరిగిన తీరులోనే మనకు తెలిసిపోతుంది. అప్పుడు మన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. లేదూ నిజాయితీగానే ఈ తీర్మానా న్ని ప్రతిపాదిస్తే తెలంగాణవాదులకు అంతకు మించిన సంతోషం లేదు. తెలంగాణ తీర్మానం శాసనసభ ఆమోదం పొందకపోయే అవకాశమే లేదు. ఇప్పుడు శాసనసభలో ఉన్న ఓటేసే అర్హత ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 277.అందులో సగం మంది ఓటేస్తే తీర్మానం నెగ్గుతుంది. అంటే 138 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే చాలు.తెలంగాణ తీర్మానాన్ని సమర్థించే తెలంగాణలోని అన్ని పార్టీల సభ్యుల బలం 109. ఇంకా 29 మంది సభ్యుల మద్దతు కావాలి. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణపై నిజాయితీగా ఉంటే ఓటింగ్ సందర్భంగా విప్ జారీ చేయాలి. సీమాంవూధలో కాంగ్రెస్‌కు 99 మంది, టీడీపీకి 43 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీ విప్ జారీ చేస్తుందో లేదో తెలియదు. కాంగ్రెస్ విప్ జారీ చేయాలి. విప్ జారీ చేసినా అందరూ ఓటు వేయకపోవచ్చు. కనీసం 30 మంది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటేసినా తీర్మానం నెగ్గుతుంది. అలా కాకుండా అందరికందరూ విప్ ధిక్కరిస్తే తీర్మానం వీగిపోతుంది. ప్రభుత్వం పడిపోతుంది. రాష్ట్రపతిపాలన వస్తుంది. ఆ తర్వాత ఇక ఎన్నికలే. కానీ కేంద్రానికి సంబంధించినంతవరకు ఒక ప్రక్రియ పూర్తవుతుంది. శాసనసభకు నివేదించే ఫార్మాలిటీ పూర్తవుతుంది. తీర్మానం పార్లమెంటు ముందుకు వెళుతుంది. అందువల్ల ఇప్పు డు కాంగ్రెస్ ఏమి చేసినా మన మంచికే. మంచే జరుగుతుందని ఆశిద్దాం. జరగకపోతే మన బ్రహ్మాస్త్రం ఎలాగూ మనచేతిలోనే ఉంటుంది.

[email protected]

500

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా