వస్తే సంబరం, రాకుంటే సమరం


Sat,July 6, 2013 12:42 AM

దిగ్విజయ్‌సింగ్ ప్రాథమిక లక్ష్యం నెరవేరింది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందేమోనన్న ఆశను రేకెత్తించడంలోఆయన సఫలీకృతులయ్యారు. కానీ తెలంగాణ ప్రజల్లో భయాలు తొలగిపోలేదు. ఎన్నో ప్రశ్నలు. ఇంకెన్నో సందేహాలు, మెలికలు. కొంత మంది మిత్రులు ఫోన్ చేసి, ‘ఏం జరుగుతోంది?’తో మొదలు పెట్టి ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఎన్నాళ్లుగానో గూడుకట్టుకున్న ఉత్కంఠ, ఉద్వేగం వారిని అలా మాట్లాడిస్తున్నది. ‘కాంక్షిగెస్‌ను ఎలా నమ్మడం? నాన్నా పులి సామెత కాదు కదా? తెలంగాణ ఇచ్చే పనయితే టీఆస్‌తో ఎందుకు చర్చలు జరుపడం లేదు? ఇస్తే టీఆస్ విలీనానికి ఒప్పుకుంటుందా? ఇస్తే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తారా? రాయల తెలంగాణ ఇస్తారా? భవిష్యత్తు ఏమి టి? ఇక టీఆస్ పని అయిపోయినట్టే అని ఒక చానెల్, కేసీఆర్ గుండె గుభేల్ అని మరొక పత్రిక స్టోరీలు రాస్తున్నాయి.. నిజమేనా..?’- ఈ ప్రశ్నలకు అంతులేదు. చాలా ప్రశ్నలకు కాలం సమాధానం చెబుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. తెలంగాణ సమాజం ఇవ్వాళ బేజారు కావలసిన అవసరం ఎంతమాత్రం లేదు. కాస్త సావధానంగా ఆలోచిస్తే పై అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ రాజకీయావసరం. ఆ విషయం దిగ్విజయ్ సింగ్ స్పష్టంగానే చెప్పారు. కాంగ్రెస్‌కు తిరిగి అధికారం రావాలంటే ఆంధ్రవూపదేశ్ నుంచి కనీసం సగం సీట్లయినా సంపాదించాలి. తెలంగాణ ఇస్తే రాజకీయంగా తమకు మేలు జరుగుతుందని దిగ్విజయ్ బాహాటంగానే ఒప్పుకున్నారు.

‘తెలంగాణ ఇవ్వకపోయినా సీమాంధ్ర ఎలాగూ మనచేతికి వచ్చేట్టు లేదు. కనీసం తెలంగాణనైనా కాపాడుకుందాం’ అన్నది కాంగ్రెస్ ప్రస్తుత ఆలోచన. అన్ని లాజిక్స్ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ‘నాన్నా పులి’సామెతలో అబద్ధాలతో ఆటలాడిన పిల్లవాడిని పులి బలితీసుకుంటుం ది. మరోసారి మోసం చేస్తే ప్రజలతో ఆటలాడిన కాంగ్రెస్‌ను తెలంగాణ బలిపీ నిలబెడుతుంది. తెలంగాణకు శాశ్వతశవూతువుగా నిలబడిపోతుంది. కాంగ్రెస్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదు. సమయం మించిపోతున్నది. ముందుస్తు ఎన్నికల మేఘాలు జాతీయ రాజకీయాలను కమ్ముకుంటున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 27 నుంచి మొదలవుతున్నాయి. ఈ సమావేశాల్లోగా రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక ప్రక్రియ పూర్తి కావాలి. ఒకటి మాత్రం వాస్తవం, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదాకా కాంగ్రెస్‌ను నమ్మడానికి వీలు లేదు. ఏ దశలోనయినా ఈ ప్రక్రియను తొక్కిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేయవచ్చు. కాంగ్రెస్‌కు అటువంటి చరిత్ర ఉన్నది. సీమాంధ్ర నాయకత్వానికీ అటువంటి మాయవిద్యలు తెలుసు. పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం పొందని బిల్లులు ఇప్పటికీ అనేకం ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లు అందుకు ఉదాహరణ. అందుకే కాంగ్రెస్‌ను ఎంతవరకు నమ్మాలి? ఎంతవరకు అనుమానించాలి? అన్నది తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవలసిన అంశమే. కాంగ్రెస్ విషయంలో అమాయకత్వమూ వద్దు, అతి విద్వేషమూ వద్దు. కటువుగా అనిపించినా... తెలంగాణ ఇస్తే పల్లకీ మోత, ఇవ్వకపోతే పాడె మోత.

రెండవ అంశం - తెలంగాణ ఇస్తే టీఆస్ పని అయిపోయిన కేసీఆర్ గుండె గుభేల్ మంటుందా? ఆరిపోతున్న దీపాల అంతిమ దుఃఖం ఇది. ‘నావి రెండు కాళ్లూ పోతే పోయాయి. వాడి కళ్లూ కాళ్లూ రెండూ పోవాల’ని ఆశించే మీడియా మారీచుల ఏడుపు ఇది. ఇవ్వాళ తెలంగాణ సాధన ప్రేరక శక్తిగా, రాజకీయాలను నిర్దేశించే శక్తిగా, సురక్షితంగా ఉన్నది టీఆస్సే. వస్తే సంబరం, రాకపోతే సమరం చేసే పార్టీ అదొక్కటే. ‘తెలంగాణకోసం టీఆస్, టీఆస్‌కోసం తెలంగాణ’ అన్నది కేసీఆర్ బలం. కాంగ్రెస్ టీఆస్‌ను కలుపుకుని తెలంగాణ ఇచ్చినా, కలుపుకోకుండా ఇచ్చినా దాని ని సాధించిన నైతిక బలంలో సింహభాగం టీఆస్‌కే దక్కుతుంది. తెలంగాణ సాధించిన పార్టీగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. పన్నెండేళ్ల తెలంగాణ సాధన ఉద్యమ చోదకశక్తిగా కేసీఆర్‌కే ఆ కీర్తి దక్కుతుంది. కేసీఆర్ తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగకపోయి ఉంటే, పన్నెండేళ్లు ఈ ఉద్యమాన్ని, పార్టీని కాపాడి, కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తును సవాలు చేయకపోయి ఉంటే కేంద్రం ఈ మాత్రమయినా చలించి ఉండేది కాదు. తెలంగాణవాదులు చేసిన అన్ని ఉద్యమాలు ఒక ఎత్తు, తెలంగాణలో అన్ని పార్టీల భవిష్యత్తును సవాలు చేయడం ఒక ఎత్తు. ఆ పని కేసీఆర్ చేశారు. రాజకీయాధికారం పోతుందంటే తప్ప ఎవరూ తెలంగాణ నినాదం ఎత్తుకోలేదు. ఒకనాడు టిడీపీ కూడా రాజకీయాధికారంకోసమే తెలంగాణ బాటపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయాధికారం కోసమే తెలంగాణపై ఈ మాత్రమైనా మాట్లాడుతున్నది. కాంగ్రెస్ రాజకీయాధికారం పోగొట్టుకోగూడదనే తెలంగాణ ఎజెండాను ఇప్పుడు ముందేసుకున్నది.

ఇప్పుడు గుండెలు గుభేల్ మనాల్సింది తెలంగాణపై పరీక్షకు నిలబడాల్సిన పార్టీలది. టీడీపీ, వైఎస్సార్ సీపీలను ఎక్స్‌పోజ్ చేయడం కోసమైనా కాంగ్రెస్ అసెంబ్లీ ముందుకు తెలంగాణ తీర్మానం తెస్తుంది. అసలే సంకట స్థితిలో ఉన్న ఆ పార్టీలు తెలంగాణ తీర్మానంపై ఎలా నిలబడతాయన్నది ప్రధానం కాబోతున్నది. ఆ పార్టీలు తెలంగాణలో ఉండడమా, ఊడిపోవడమా అన్నది ఈ తీర్మానంతో తేలిపోనున్నది. దిక్కుతోచని స్థితిలో ఉన్నది చంద్రబాబు, జగన్. ఈ రెండు పార్టీలకే కాదు, కాంగ్రెస్‌కు కూడా అసెంబ్లీ తీర్మానం పరీక్షే. కానీ కాంగ్రెస్ తదనంతర పరిణామాలను కూడా ఊహించే రంగంలోకి దిగుతున్నది. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడేమంత గొప్పగా లేదు. రోజురోజుకు ఎమ్మెల్యేలు జారిపోతున్నారు. ఎన్నికలు సమీపించగానే మరో30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది సీమాం ధ్ర ప్రాంతానికి చెందినవారు, జగన్‌వైపు వెళ్లిపోతారని భావిస్తున్నారు. ఆంధ్రాలో పార్టీని గెలిపించే సత్తా ముఖ్యమంవూతికిగానీ, పీసీసీ అధ్యక్షునికిగానీ లేదు. ఏదైనా కాపాడుకుంటే తెలంగాణలోనే కాపాడుకోవాలి. అసెంబ్లీలో తీర్మానం పెడితే మా పార్టీలో కూడా మా మాట వినేదెవరో, జారిపోయేదెవరో తేలిపోతుంది. కొంతమంది ఎదురు తిరిగినా తీర్మానం నెగ్గించుకోగలమన్న నమ్మకం మా పార్టీకి ఉన్నది. తీర్మానం నెగ్గిన తర్వాత ప్రభు త్వం నడిచే పరిస్థితి లేకపోతే అసెంబ్లీని రద్దు చేస్తారు. నవంబరు-డిసెంబర్ నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు ఈ రెండు రాష్ట్రా(తెలంగాణ, ఆంధ్ర)లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికలు కూడాఈ రాష్ట్రాల ఎన్నికలతోపాటే నిర్వహించే ఆలోచన కూడా జరుగుతున్నది’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెబుతున్నారు.

కాంగ్రెస్ టీఆస్‌తో చర్చలు జరుపకుండా తెలంగాణ ఇస్తుందా? ఇంటగెలవకుండా రచ్చగెలవడం అసాధ్యం. కాంగ్రెస్ ముందుగా ఇంటగెలవాల్సి ఉంది. రాష్ట్రంలో పార్టీని ఒక దారికి తీసుకు రావాల్సి ఉంది. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను నియంవూతించడం ఎలాగో యోచించాల్సి ఉంది. ముందుగా ‘తెలంగాణ రాష్ట్రాన్ని మేమే మా చొరవతోనే ఇస్తున్నామ’ న్న సంకేతాలు కాంగ్రెస్ ఇవ్వదల్చుకుని ఉండవచ్చు. తదుపరి దశలో సీమాం ధ్ర నాయకులతో చర్చలు జరుపవచ్చు. ఇవన్నీ పూర్తి కాకుండా ముందుగానే టీఆస్‌తో చర్చలు జరిపితే సీమాంవూధలో మరింత ఎక్కువ అలజడి వచ్చే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ భావించి ఉండవచ్చు. తొలి అడుగులు పూర్తయిన తర్వాత టీఆస్‌తో చర్చలు జరుపవచ్చు. జరిపితే మంచిది. జరపకపోయినా మంచిదే. చర్చలు జరిపితే, ‘తెలంగాణ కోసం ఎటువంటి త్యాగాలకయినా సిద్ధం. పదవుపూంత, ప్రాణత్యాగాలకయినా సిద్ధం’ అని కేసీఆర్ గతంలోనే చెప్పి ఉన్నారు. ఆ మాటలకు కట్టుబడి ఉం డాల్సి ఉంటుంది. కేంద్రానికి అటువంటి సంకేతాలనే పంపాలి. అంటే కాంగ్రెస్‌కు సాగిలపడాలని కాదు. గౌరవ ప్రదమైన చర్చలు జరగాలి. పారదర్శకంగా జరగాలి. చర్చల సందర్భంగా తెలంగాణ రాకపోవడానికి టీఆస్ కారణం అనే నెపాన్ని మోపడానికి కాంగ్రెస్ ప్రయత్నించవచ్చు. అటువంటి అవకాశాన్ని టీఆస్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరాదు.

నిజమే ఇన్నేళ్లుగా ఒక బలమైన రాజకీయశక్తిని నిర్మించి, అనేక మందిని సమీకరించి, ఇప్పుడు తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలపడం అంత తేలికైన నిర్ణ యం కాదు. వివిధ పార్టీల నుంచి ఇంత మంది నాయకులను తీసుకొచ్చి ఇప్పుడు వారిని కాంగ్రెస్‌లో కలిపేయడం గుండెలు చీల్చే విషయమే. కానీ తెలంగాణ సాధన కంటే ఏదీ ముఖ్యం కాదన్న సంగతిని మరచిపోరాదు. ఉద్యమాన్ని, పార్టీని మొదలు పెట్టింది తెలంగాణకోసమే అన్న సంగతిని విస్మరించరాదు. పన్నెండేళ్ల ప్రయాణం తర్వాత బయలుదేరిన గమ్యాన్ని, లక్ష్యాన్ని మరచిపోవద్దు. రాజకీయ అస్తిత్వం కంటే తెలంగాణ అవతరణే ముఖ్యం.తెలంగాణ సాధించిన తర్వాత, సాధించిన వారిని తెలంగాణ ప్రజలు గుర్తించకుండా పోరు. వారి త్యాగాలను తెలంగాణ ప్రజలు విస్మరించరు. అదే సమయంలో కాంగ్రెస్ టీఆస్‌తో చర్చలు జరుపకుండా తెలంగాణ ఇస్తే మరీ మంచిది. అది టీఆస్ నెత్తిన పాలుపోయడం. కాంగ్రెస్ టీఆస్‌ను కలుపుకోకపోతే దిగులు పడాల్సింది, బేజారు కావాల్సింది టీడీపీ, వెఎస్సార్ కాంగ్రెస్‌లు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు, దానిని సాధించిన టీఆస్‌కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. ఎవరి సంబరాలు వారు జరుపుకోవచ్చు. ఎవరి క్రెడిట్ వారు తీసుకోవచ్చు. టీఆస్ నవతెలంగాణ నిర్మాణ రాజకీయశక్తిగా కలకాలం ఉంటుంది. తాను ముందే ప్రకటించుకున్న ఎజెండాను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణపై దాగుడుమూతలు ఆడిన సీమాంధ్ర పార్టీలు ఇంకా బలహీనపడతాయి. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుంది. తెలంగాణలో బలమైన రాజకీయ పక్షంగా ఎదుగుతుంది. ప్రజలు గెలిపిస్తే అధికారంలోకి వస్తుంది. లేదంటే ప్రధాన ప్రతిపక్షంగానైనా అవతరిస్తుంది. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త రాజకీయాలు అవతరిస్తాయి.

కాంగ్రెస్ ఇస్తే ఎటువంటి తెలంగాణ ఇస్తుందన్నది మరోవూపశ్న. రాయల తెలంగాణ ఇస్తోంది, వస్తోంది అంటూ కొన్ని చానెళ్లు, పత్రికలు ఊదరగొడుతున్నాయి. సోనియాగాంధీ రాష్ట్రాన్ని నిలువునా విభజించాలని సూచిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇది బర్త్‌డే కేక్ కాదు ఎలాపడితే అలా కోసివ్వడానికి. ప్రాంతాల అస్తిత్వ కాంక్షల సమరం. కాంగ్రెస్ తన అస్తిత్వంకోసం రాయలసీమ అస్తిత్వాన్ని బలిగా తీసుకుంటామంటే ప్రజలు హర్షించరు. కృత్రిమ విభజనలను జనం మెచ్చరు. నిజంగా కాంగ్రెస్ అలా ఆలోచిస్తుందో లేదో తెలియదు. దిగ్విజయ్ సింగ్ పదేపదే రెండు ప్రతిపాదనల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, సమైక్యాంవూధను కొనసాగించడం. ఈ రెండే ప్రత్యామ్నాయాలని ఆయన స్పష్టంగానే చెబుతున్నారు. రాయలసీమ జిల్లాలను తెలంగాణతో ముడిపెట్టి పరిష్కరించినా, హైదరాబాద్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి పరిష్కరించినా తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. కాంగ్రెస్‌కు ఇచ్చిన ఫలం కూడా దక్కదు. టీఆస్ కూడా అటువంటి ఏర్పాటును అంగీకరించదు. సమస్య మళ్లీ మొదటికి. మళ్లీ ఉద్యమాలు. కొత్త నినాదాలు. కాంగ్రెస్ అర్థం చేసుకోవలసింది ఏమంటే తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

[email protected]

368

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా