కాంగ్రెస్‌కు ఇదే చివరి అవకాశం


Sat,June 29, 2013 12:09 AM


కేంద్రంలో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఏదో ఒకటి తేల్చేస్తామంటున్నది. రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌సింగ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, బొత్స సత్యనారాయణలతో సమావేశమై చర్చ లు జరిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, పల్లంరాజులు కూడా దిగ్విజయ్‌తో మంతనాలు జరిపారు. ఈ మంతనాలన్నీ తెలంగాణ చుట్టే జరిగాయని అన్ని పత్రికలు రాశాయి. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో కూడాఒకింత అసాధారణమైన కదలికే వచ్చింది. పంచాయతీరాజ్ మంత్రి కుందూరు జానాడ్డి తెలంగాణ కోసం వీరోచిత పోరాటాలు చేయకున్నా, కాంగ్రెస్‌లో ఈ అంశాన్ని నిత్యం ఎజెండాలో ఉంచుతున్నది ఆయనే. నలుగురిని పోగేస్తున్నది, ఢిల్లీకి వెళ్లి మహజర్లు సమర్పిస్తున్నదీ ఆయనే. ఇప్పుడాయన నిజాంకళాశాల మైదానంలో ఒక పెద్ద సభ పెట్టి కాంగ్రెస్‌కు సంకేతాలు పంపదల్చుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ద్వారానే కాంగ్రెస్ భవిష్యత్తుకు సోపానం వేయాలని ఈ సభ నుంచి ఆయన పిలుపునివ్వాలనుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన అంశం ఏమంటే ఈసారి జానాడ్డి ప్రయత్నాలకు ముందెన్నడూ తెలంగాణ ఊసెత్తనివారు సైతం ఇప్పుడు మద్దతునిస్తున్నారు.

చాలా హడావిడి చేస్తున్నారు. సికింవూదాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ వంటివారు ఏర్పాట్ల పరిశీలనకు వచ్చి, టీవీలలో కనిపించినప్పుడు చాలా మంది ‘ఔరా! అని ముక్కున వేలేసుకున్నారు’. అంజన్ ఇన్నేళ్లలో ఏరోజూ తెలంగాణ కోసం గళం విప్పిన పాపాన పోలేదు. ఇటువంటి వాళ్లు తెలంగాణలో ఇప్పుడు చాలామందే తయారవుతున్నారు. మంచిదే. ఇప్పటికయినా తెలంగాణ డిమాండుతో చేతులు కలిపినందు కు వీళ్లందరినీ అభినందించాల్సిందే. వీరంతా నిజాం కళాశాల సభను బ్రహ్మాండంగా నిర్వహించాలని కార్యకర్తలకు ఆదేశాలిస్తున్నారు. అయితే సభ ఎంత బాగా జరిపామన్నది ముఖ్యం కాదు. సభ నుంచి ఎటువంటి సందేశం ఇస్తామన్నది ముఖ్యం. తెలంగాణ సాధనకు ఎటువంటి కార్యాచరణ ఇస్తామన్నది ముఖ్యం. తెలంగాణ సాధన కోసం జరిగే కృషిలో ఎంతమంది నిలబడతారన్నది ముఖ్యం.


కాంగ్రెస్ నాయకత్వం అంతా గుర్తు పెట్టుకోవలసిన అంశం ఒక్కటుంది -తెలంగాణ ఇవ్వడమూ, రావడ మూ తథ్యం. ఇప్పుడా ఇంకొన్నాళ్లకా అన్నదే సమస్య. ఇప్పుడు ఇచ్చినవాళ్లు, తెచ్చినవాళ్లు మొనగాళ్లవుతారు. ఇప్పుడు తెచ్చినవాళ్లే తెలంగాణ ప్రజలకు ఆప్తులు అవుతారు. ఇప్పుడు తెలంగాణ వస్తేనే ఈ ప్రతిష్టంభనకు, ఈ సంక్షోభానికి, ఈ ఆత్మహత్యలకు ముగింపు వస్తుంది. ఇప్పుడు రాకపోతే తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెసే అవుతుంది. ఇప్పుడు తప్పించుకోవడానికి, వాయిదాలు వేయడానికి కాంగ్రెస్‌కు ఇంకే కారణాలూ మిగల్లేదు. ఏకాభివూపాయం లేదన్నది అబద్ధం. రాజకీయ ఏకాభివూపాయం ఎప్పుడో వచ్చేసింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంటులో చేసిన ప్రసంగం ఒక్కసారి చూడండి. ‘రాజకీయ ఏకాభివూపాయం వచ్చిన తర్వాతనే 2009 డిసెంబరు 9న ప్రకటన చేశాన’ని ఆయన పార్లమెంటులో చెప్పారు. పార్టీలలో విభజన అన్నది ఆ పార్టీల సమస్య. తెలంగాణ సమస్య కాదు. ఏ అంశంపైన అయినా ఏకాభివూపాయం పదేపదే అడగరు. ఎస్సార్సీకి కాలం చెల్లిపోయింది. కాంగ్రెస్ ఆ పని చేయదల్చుకుంటే 2004 ఎన్నికల్లో గెల్చిన వెంటనే చేసి ఉండాలి. 2009లో కూడా శ్రీకృష్ణ కమిటీ బదులు ఎస్సార్సీనే వేసి ఉండవచ్చు. ప్యాకేజీలు చాలా పాతచింతకాయ పచ్చడి. దానిని ఎవరూ కోరడం లేదు. అది ఎందుకూ పనికిరాదు. పదేళ్ల ఉద్యమం తర్వాత, ఇన్ని హామీల తర్వాత, ఇంతమంది బలిదానాల తర్వాత ఇప్పుడు ప్యాకేజీ అంటే తెలంగాణ ప్రజలు ఛీకొడతారు. రాయల తెలంగాణ కూడా పేచీకోరు ప్రతిపాదనే. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ముందుపడకుండా చేసే కుహకమే. తెలంగాణ ఇవ్వడానికి నిరాకరించే ఎత్తుగడలో భాగమే.


కాంగ్రెస్ అధిష్ఠానం, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాల్సింది ఏమంటే ఇక ఇప్పుడు అటువంటి పప్పులేమీ ఉడకవు. కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరేదీ తెలంగాణ ప్రజలను శాంతింప జేయలేదు. కాంగ్రెస్‌కు ఒకటి, రెండు, మూడు అంటూ ప్రత్యామ్నాయాలు లేవు. తెలంగాణ ఏర్పాటుకు అసలు ప్రత్యామ్నాయమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వకపోతే రేపు ఎన్నికల తర్వాత ఎవరో ఒకరు ఇస్తారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణతో ఉంటారా, కాంగ్రెస్ అధిష్ఠానంతో ఉంటారో తేల్చుకోవాలి. నిజాం కళాశాల సభ అటువంటి సంకేతాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపాలి. సంకేతాలు అంటే సభలు, ఉపన్యాసాలు కాదు. ఒక అల్టిమేటమ్ ఇవ్వగలగాలి.తెలంగాణ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్పగలగాలి.ఒత్తిడి లేకుండా నిర్ణయాలు జరగవు. ఉత్తమాటలతో పనులు జరిగే కాలం కాదిది. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి మిగిలిన ఆఖరి అవకాశం ఇది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చి, ఆ క్రెడిట్ ఎవరు కొట్టేసినా అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రావడం ముఖ్యం. ఎవరు కొట్లాడారు? ఎవరు సాధించారు? ఎవరిని నెత్తికెత్తుకోవా లో ప్రజలు నిర్ణయిస్తారు. వారివారి జాతకాల ప్రకారం ప్రజలు వారివారి ఆదాయ వ్యయ ఫలాలు వారికి ఇస్తారు.నిజానికి కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిజాం కళాశాల సభను తెలంగాణ సాధనకోసం నిజాయితీతో చేస్తున్న ప్రయత్నంగా తెలంగాణవాదులు పరిగణించడం లేదు.

ఇదేదో మరోసారి మాయ చేసే ప్రయత్నమనీ, సాక్షాత్తూ కాంగ్రెస్ హైకమాండే ఈ నాటకాన్ని నడిపిస్తున్నదనీ వాదించేవారే ఎక్కువమంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏదో మైలేజీ కొట్టేయడం కోసమే కాంగ్రెస్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శలూ ఉన్నాయి. ఎన్నికల దాకా ఇలాగే కాలయాపన చేసి, మళ్లీ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసి, తెలంగాణ రాజకీయశక్తుల పునరేకీకరణను అడ్డుకునేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. తెలంగాణవాదులు ఇలా విమర్శించడంలో న్యాయంఉంది. కాంగ్రెస్ ఇలా అనేకసార్లు చేసింది. ఎంపీల రాజీనామాల విషయంలోనూ, ఎంపీలను చీల్చడంలోనూ, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఒక్కతాటి మీదకు రాకుండా చేయడంలోనూ కాంగ్రెస్ ఇటువంటి విభజించి పాలించే ఎత్తుగడలను అమలు చేసింది. ఇప్పుడు ఈ సభల వెనుక కూడా అటువంటి ఎత్తుగడ ఏదో ఉండి ఉంటుందని తెలంగాణవాదులు భావించడంలో తప్పులేదు. తెలంగాణవాదుల అనుమానాలను, భయాలను వమ్ము చేయాలంటే సభ జరిపి, ఉపన్యాసాలిచ్చి, దుమ్ముదులుపుకుని పోవడం కాదు-తెలంగాణ సాధన దిశగా ఒక మైలురాయి కాదగిన నిర్ణయాలు నిజాం కళాశాల సభ చేయగలగాలి.

ఆంధ్రవూపదేశ్‌లో కనీసం సగం సీట్లు గెలవకుండా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కల్ల. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే తప్ప సగం సీట్లకు గ్యారెంటీ లేదు. తెలంగాణ సమస్యను పరిష్కరించినా, పరిష్కరించకపోయినా ఆంధ్రలో కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు బహు తక్కువ. ఎక్కువ మైలేజీ పొందడానికి అవకాశం ఉన్నది తెలంగాణలోనే. ఆ మైలేజీని సంపాదించే యత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి గులామ్ నబీ ఆజాద్‌ను తప్పించి, మధ్యవూపదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాహుల్‌గాంధీకి పొలిటికల్ టీచర్ అయిన దిగ్విజయ్ సింగ్‌ను నియమించింది. సోనియా, రాహుల్‌గాంధీలకు దిగ్విజయ్‌పై నమ్మకం ఎక్కువ. మధ్యవూపదేశ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ముఖ్యమంవూతిగా ఉన్నది దిగ్విజయ్‌సింగే. ఆయనకు విభజన వల్ల తలెత్తే సమస్యలు బాగా తెలుసు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని ప్రాంతాల నాయకులు కూడా దిగ్విజయ్ మాటకు ఎక్కువ విలువనిస్తారు. ఆయన అందరినీ కట్టడి చేయగలరని అధిష్ఠానం నమ్ముతోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నిజాం కళాశాల సభ విజయవంతం కావచ్చు. దానితో పార్టీపై కొంత ఒత్తిడి పెరగవచ్చు. కానీ దానికంటే దిగ్విజయ్ సింగ్‌ను మెప్పించడం ముఖ్యం. ఆయనకు ఈ సమస్యకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం, ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఆయనను ప్రభావితం చేయడం ముఖ్యం. మెప్పించడం, ప్రభావితం చేయడం అంటే సహేతుకమైన వాదనలు వినిపించడం, సమంజసమైన కారణాలు చూపించడం.

తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏమిటో వివరించడం. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలోపు తెలంగాణపై ఒక స్పష్టత తీసుకురావాలి.ఇప్పుడు బస్సు మిస్సయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇంకెప్పుడూ దానిని అందుకోలేరు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇందుకు భారీ మూల్యాలు చెల్లించుకోవలసి వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రథమ ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్‌ను తిరిగి బతికించడం అసాధ్యమవుతుంది. నేతలంతా తమ రాజకీ య భవిష్యత్తును శాశ్వతంగా పణంగా పెట్టవలసి వస్తుంది. అవమానాలు, అనుమానాల మధ్య ప్రజల ముందుకు వెళ్లవలసిన దీనస్థితి దాపురిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కేంద్రంగా రాజకీయ శక్తుల ఏకీకరణ జరుగుతుంది. కొత్త రాజకీయశక్తులు బలపడతాయి. సరికొత్త రాజకీయ సమీకరణలు ముందుకు వస్తాయి. తెలంగాణలో, రాజధానిలో సందిగ్ధ రాజకీయ పరిస్థితులు మరికొంతకాలం కొనసాగుతాయి. ఆర్థిక, పారిక్షిశామిక రంగంలో నెలకొన్న స్తబ్దత కొనసాగుతుంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మేలుకోవాలి. తమ అస్తిత్వం కోసమైనా ఒకతాటిపై నిలబడి కొట్లాడాలి. అందరూ నిలబడి కొట్లాడితే 2014 ఎన్నికలతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇప్పుడే సిద్ధిస్తుంది. కొట్లాడితే విజయం మీదే, ఫలితమూ మీదే. కాంగ్రెస్‌కు ఇది ఆఖరు అవకాశం. కాపాడుకున్నా, చేజార్చుకున్నా వారి చేతుల్లోనే ఉన్నది.

[email protected]

325

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా