పబ్లిష్ అండ్ ఫినిష్


Sat,June 22, 2013 01:18 AM


టీఆరెస్ నేత కేటీఆర్‌పై రెండురోజులుగా జరుగుతున్న ప్రచార దాడిని చూసి చాలా మంది మిత్రులు ఫోను చేశారు. కొందరు ఆవేశంగా. కొందరు అనుమానం తో ఇంకొందరు స్పష్టమైన అవగాహనతో. కొందరి అభివూపాయాలు పాఠకులకు తెలియడం అవసరం. ‘పవూతికలను తగులబెట్టడం అన్యాయం. మీరు ఖండించడంలేదు ఎందుకు?’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. పత్రికలను తగులబెట్టడం, పత్రి కా కార్యాలయాలపై దాడులు ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఏ పత్రికయినా సరే. కానీ నువ్వు అవతలివాడి స్వేచ్ఛను గౌరవించినప్పుడు.. అవతలివాడి ప్రజాస్వామిక హక్కులు కాపాడినప్పుడు మాత్రమే నీకు అవి దక్కుతాయి.నీ చెయ్యి నా ముక్కుకు తగలనంతవరకే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం. న్యాయాన్యాయ విచక్షణ, ధర్మాధర్మ వివేచన లేకుండా నీ ముక్కు బద్దలుకొడతాను. నోరు మూసుకుని కూర్చొమ్మంటే ఎవరూ అంగీకరించరు. నీ దాడి జర్నలిస్టు వృత్తి నియమాలకు లోబడి ఉంటే నీకు పత్రికా స్వేచ్ఛ వర్తిస్తుంది. నీ దాడి రాజకీయ ఎజెండాతో నిండి ఉంటే నీకు రాజకీయ స్వేచ్ఛ మాత్రమే వర్తిస్తుంది. పబ్లిక్ స్క్రూటినీకి నిలబడాల్సిందే. విపరీత పరిణామాలకు సిద్ధపడాల్సిందే. ‘ఐ విల్ పబ్లిష్ అండ్ ఫినిష్’ అని ప్రకటించుకుని చేసేది పత్రికా స్వేచ్ఛకాదు, ఫక్తు బ్లాక్‌మెయిలింగ్, రాజకీయ విధ్వంసపూరిత ఎజెండా! అయినా.. పత్రికలపై దాడి అనవసరం. ఇష్టం లేకపోతే పత్రికను తిరస్కరించే హక్కు పాఠకుడికి ఉంది. ప్రకటనలు తిరస్కరించే హక్కు ప్రకటనకర్తలకు ఉంది. పత్రిక ప్రాణం పాఠకుల్లో ఉంటుంది. పాఠకులనునిర్ణయించుకోనీయండి. బాధి తులుగా మీరు చెప్పేది ఏదయినా ఉంటే పాఠకులకు చెప్పుకోండి.


కేటీఆర్ ఉదంతంలో ఒక పత్రి క, చానెల్ చేస్తున్న ప్రచారం చూసి ఓ సీనియర్ జర్నలిస్టు మిత్రుడు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘తెలంగాణవాళ్లకు సెటిల్‌మెంట్‌లు కూడా చేయడం రాదని, ఈ కథనం తెలియజేస్తున్నది. సెటిల్‌మెంట్‌లు ఎలా చేయాలో, భూములను, మనుషులను ఎలా మాయం చేయాలో వాళ్లకు తెలిసినంతగా మనకు తెలియదని అర్థమైపోయింది. ఒక సంఘటన గుర్తొస్తున్నది. జూబిలీహిల్స్‌లో కేబీఆర్ పార్కు పక్కరోడ్డు లో చాలా యేళ్ల క్రితం కారులో ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.కొన్నేళ్ల క్రితం ఆరువందల ఎకరాల గురుకుల ట్రస్టు భూములకు వారసుడు మాయమయ్యాడు. శవం కూడా ఇంతవరకు దొరకలేదు. దొరకదు. సెటిల్‌మెంట్‌లు చేయడం, ఆనవాళ్లు కూడా దొరకకుండా చేయడం ఒక కళ. వేలకోట్ల హైదరాబాద్ భూములను ఆలవోకగా మింగేసినవాళ్లు, వందలకొద్దీ సెటిల్‌మెంట్‌లను మెట్లుగా చేసుకుని పైకొచ్చినవాళ్లు, బంజారాహిల్స్, జూబిలీహిల్స్, మాదాపూర్, కొండాపూర్‌లను కాజేసినవాళ్లు హాయిగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ నీతులు చెబుతున్నారు. సతీష్‌డ్డి 35 లక్షలు ఎదురుఇచ్చి, ఉత్తపుణ్యానికి ఇరుక్కుపోయాడు. ఏమి విషాదమయ్యా ఇది?’ అని ఆయన అన్నా రు. ‘మీడియా చేతిలో ఉంటే బాధితులను నిందితులుగా చూపించవచ్చు. నిందితులను బాధితులుగా చూపించవచ్చు. ఒక వాదంపై ప్రచార యుద్ధమే చేయవచ్చు. ఒక నాయకుడిని ఫినిష్ చేయవచ్చు. ఆ చానెల్ కథనాలను బట్టి నాకర్థమైంది అయితే ఇదే’ అని మరో మిత్రుడు చెప్పారు. కానీ మీడియాకు వాదాలను, నేతలను ఫినిష్ చేసే శక్తే ఉంటే చంద్రబాబుకు ఈ గతిపట్టేది కాదు. టీడీపీ ఇం తగా బదాబదలయ్యేది కాదు. ఎందుకంటే ఆయనకున్నంత మీడియా బలగం ఈ రాష్ట్రంలో మరే పార్టీకీ, నాయకుడికీ లేదు.


అసలు జరిగింది ఇదీ -‘ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రధాన నిందితుడు గుండ్లూరి శ్రీనివాసరావు. బాధితులు సుబ్బాడ్డి, సతీష్‌డ్డి. శ్రీనివాసరావుకు ఘనమైన చరిత్ర ఉంది. ఆయన మీద అనేక చీటింగ్ కేసులు ఉన్నాయి. బ్యాంకుల వద్ద, వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని నిండా ముంచాడు. ఒరిస్సా వ్యాపారి కిడ్నాప్ కేసులో ప్రధాన ముద్దాయి శ్రీనివాసరావే. కానీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడి సాక్ష్యంపై ఆధారపడి ఆ చానెల్, ఆ పత్రిక అమాయకంగా ఇరుక్కుపోయిన సతీష్‌డ్డిపైన, తద్వారా కేటీఆర్‌పైన దాడికి పూనుకున్నది. శ్రీనివాసరావు లక్ష్యం అక్రమాల అభాండాన్ని పక్కవారిపై వేయడం. మీడియాధిపతి లక్ష్యం శ్రీనివాసరావును అడ్డం పెట్టి రాజకీయ కక్ష తీర్చుకోవడం. ఇద్దరూ కుమ్మక్కయి, దొంగే...దొంగా దొంగా అన్న చందంగా ఈ ప్రచార దాడికి దిగారు’ అని సతీష్‌డ్డి సన్నిహితుడు ఒకరు చెప్పారు. శ్రీనివాసరావు ఆరుకోట్లు తీసుకుని సతాయిస్తున్నాడని సుబ్బాడ్డి కేటీఆర్‌ను ఆశ్రయించిన మాట నిజం. కేటీఆర్ అదేదో మాట్లాడి పరిష్కరించమని సతీష్‌డ్డికి చెప్పినమాట నిజం. అక్కడితో కేటీఆర్ పాత్ర ముగిసింది. వరుసగా నాలుగైదు సార్లు మాట్లాడే సరికి శ్రీనివాసరావు సతీష్‌నే మాయచేశాడు. ‘బ్యాంకు లోన్ మంజూరు అయిందని, మార్జిన్ మనీ కడితే అది విడుదలవుతుందని’ కొద్దిరోజులు చెప్పాడు. ఎక్కడయినా డబ్బులు ఇప్పించమని సతీష్‌ను అడిగాడు. అది సాధ్యం కాలేదు. ‘నాకు ఒరిస్సాలో అగర్వాల్ అనే ఆయన 40 కోట్లు ఇవ్వాలి. అవి వసూలు చేస్తే మనకు అందరికీ డబ్బులు వస్తాయ’ని చెప్పాడు శ్రీనివాసరావు. ‘ముందుగా 35 లక్షలు అర్జంటుగా అవసరం ఉన్నాయని, అగర్వాల్ నుంచి డబ్బులు రాగానే 35 లక్షలకు డ్బ్బై లక్షలు ఇస్తానని చెప్పాడు’. తెలంగాణవాడు కదా! కసాయివాడిని నమ్మాడు. 35 లక్షలు ఇచ్చాడు. సతీష్‌డ్డి సుబ్బాడ్డి సమస్యను పరిష్కరించడానికి బదులు కొత్తగా సమస్యను కొని తెచ్చుకున్నాడు.


ఈ విషయం తెలిసి కేటీఆర్ సతీష్‌ను తిట్టాడు. ‘నీకేమైనా పిచ్చా! నువ్వెందుకు ఇరుక్కున్నావు ఇందులో’ అని. శ్రీనివాసరావు డబ్బులు ఇవ్వడం లేదు. తిప్పుతున్నాడు. తన మీద ఒత్తిడి పెరిగే సరికి దృష్టి ఒరిస్సాకు, అగర్వాల్ మీదకు మళ్లించాడు. మీరొస్తే అగర్వాల్ డబ్బులు ఇస్తాడని నమ్మజూపాడు. శ్రీనివాసరావు సతీష్‌ను మరికొందరిని తీసుకుని విశాఖపట్నం వెళ్లారు. అక్కడికి అగర్వాల్ వచ్చాడు. అగర్వాల్ అక్కడ పెద్ద కాంట్రాక్టర్. హైలెవల్ కనెక్షన్స్ ఉన్నవాడు. ఆయన మీద కూడా అనేక కేసులు, విచారణలు జరుగుతున్నాయి ఒరిస్సాలో. సిబిఐ కూడా ఆయన కంపెనీలపై దాడులు నిర్వహించింది. ఇంత పెద్ద అగర్వాల్ చాలా ఈజీగా, సరే అలాగే ఫలానారోజు భువనేశ్వర్‌కు వచ్చి డబ్బు తీసుకోండి అని వీళ్లకు చెప్పాడు. అగర్వాల్ చెప్పిన రోజుకు అందరూ కలసి భువనేశ్వర్‌కు వెళ్లారు. అగర్వాల్ డబ్బులు ఇవ్వలేదు. పేచీ పెట్టాడు. అగర్వాల్‌ను తీసుకుపోదామని శ్రీనివాసరావు పట్టుబట్టాడు. అగర్వాల్‌ను తీసుకుని బయలు దేరా రు. అగర్వాల్ ముందే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంబడిస్తున్నారన్న విషయం తెలిసిన మరుక్షణం శ్రీనివాసరావు కారు దిగి పారిపోయాడు. సతీష్, ఇతర మిత్రులు దొరికిపోయారు. ఇదీ కేసు. ఈ విషయం తెలిసిన తర్వాత సతీష్ బెయిలుకోసం కేటీఆర్ తమకు చాలా సహాయం చేశారని సతీష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి- బలిపశువులు ఎవరు? బాధితులు ఎవరు? కేడీలు ఎవరు? చీటర్స్ ఎవరు? నిజంగానే తెలంగాణవాళ్లకు సెటిల్‌మెంట్‌లు చేయడం రాదని ఇప్పు డు అర్థయింది.


మరి కేటీఆర్‌పై దాడి ఎందు కు? ఇది రాజకీయ సెటిల్‌మెంట్‌లో భాగం. ఎదుగుతున్నవాడిని కిందికి లాగాలి. కూలిపోతున్నవాడికి ఊపిరిపోయాలి. చిన్నగీతను పెద్ద గీత చేయలేం. పెద్దగీతను చిన్నగీతను చేయవచ్చు కదా! ఆ మీడియా వ్యూహం ఇదే. టీడీపీని ఎన్ని జాకీలు పెట్టి నిలబెట్టినా అది నిలబడడం లేదు. నానాటికీ చిన్నదయిపోతున్నది.ఇక మిగిలింది టీఆస్‌ను దెబ్బతీయడం. కేటీఆర్‌ను దెబ్బకొడితే కేసీఆర్‌ను దెబ్బకొట్టినట్టే. కేసీఆర్‌ను దెబ్బకొడితే తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చినట్టే. ఇదీ లెక్క.అందుకే కేటీఆర్‌పై దాడి. రెండు ప్రయోజనాలు-ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని బద్నాం చేయవచ్చు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న టీఆస్‌ను పలుచన చేయవచ్చు. మొరిగే కుక్కలకు నోటినిండా పని పెట్టవచ్చు. ఇదే జరుగుతున్నది. ‘కేటీఆర్‌పై దాడి చేస్తున్నవారు ఎవరో ఒకసారి గమనించండి! శ్రీనివాసరావు...అగర్వాల్ కిడ్నాప్ కేసు లో నిందితుడు, తప్పించుకు తిరుగుతున్నవాడు! ఎర్రబెల్లి, నర్సింహులు. వీరికి చంద్రబాబు వేసిన డ్యూటీ ఏమిటో తెలుసు. బాబు బిస్కట్లకు తోకలూపే గుంపు మరికొందరు వీళ్లకు తోడు. ఇక సిపిఐ నారాయణకు మై కు పిచ్చి...సబ్జెకు, సందర్భం ఏదయినానోటి దురద తీర్చుకోవడం అలవాటు’ అని తెలంగాణ జర్నలిస్టు మిత్రుడొకరు అన్నారు.. ఈ రాష్ట్రం లో రాజకీయ సెటిల్‌మెంట్‌లు చేయడం మొన్నటిదాకా కొన్ని పత్రికలు,చానెళ్లకు నడిచింది. తిమ్మిని బమ్మి చేయ డం, బమ్మిని తిమ్మి చేయడం సాధ్యమయింది. మీడియా బలం చూపి ముఖ్యమంవూతులను పాదాక్షికాంతులను చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయ చరివూతలో జరిగిన అతిపెద్ద రాజకీయ సెటిల్‌మెంట్ ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి, టీడీపీ నుంచి, చివరికి ఈలోకం నుంచే పంపించిన దారుణం. ఇప్పుడు సెటిల్‌మెంట్‌ల గురించి మాట్లాడుతున్నవారే ఆ రాజకీయ దురాగతంలో పాత్రధారులు, కుట్రదారులు..


రాజకీయ సెటిల్‌మెంట్‌లలో వీళ్లు ఎంత మాయగాళ్లంటే, 1984లో జరిగిన నాదెండ్ల భాస్కర్‌రావు ద్రోహాన్ని ‘వెన్నుపోటు’ గా, ప్రజస్వామ్యానికి విద్రోహంగా చిత్రించిన ఈ పెద్దమనుషులే, 1995లో చంద్రబాబు ఎన్‌టిఆర్‌ను కూలదోస్తే ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’గా కీర్తించారు. ఎన్‌టిఆర్‌పై దగ్గర ఉండి చెప్పులు వేయించారు. అప్పుడు బాబు పాతకాలను జస్టిఫై చేసి, ఎన్‌టిఆర్ గుండెపగిలి చనిపోయేలా చేసిన ముఠా వీళ్లే. ఏ ఉద్యమానికి ఏ సర్టిఫికెట్‌లు ఇవ్వాలో నిర్ణయించేది వీళ్లే. కానీ కాలం మారిపోయింది. ఈ సెటిల్‌మెంట్ వీరుల బాగోతం బట్టబయలైంది. పబ్లిష్ చేసి ఫినిష్ చేస్తామని వీళ్లు కంటున్న కలలు కల్లలయ్యాయి. ‘పార్టీలను, నేతలను నా కాళ్ల దగ్గరకు రప్పించుకుంటానని మాట్లాడిన దురహంకారులు ఈ మీడియా మాఫియా. వీరి రాజకీయ విధ్వంసక సలహాలు, కుయుక్తులు వినే చంద్రబాబు 2009లో అధికారంలోకి రావలసిన అవకాశాన్ని కోల్పోయారు. మహాకూటమిని భ్రష్టుపట్టించడంలో, కూటమిపై విషవూపచారం చేయడంలో, కూటమిలో చిచ్చుపెట్టడడంలో ప్రధాన పాత్రధారులు ఈ మహానుభావులే. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ఎన్నికల్లో టీఆస్‌ను దెబ్బకొడితే తెలంగాణవాదం ఫినిష్, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు....ఇలా నడిచింది వీరి వ్యూహం.చివరికది చంద్రబాబు నెత్తిన భస్మాసుర హస్తమై కూర్చుంది. అదే మాఫియాను నమ్ముకుని చంద్రబాబు ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆగంపట్టించాలని చూస్తున్నాడు. మీడియా ఒక వర్గం చేతిలో ఉన్నంతకాలం వారు ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు’ అని తెలంగాణ జేయేసీ నాయకుడొకరు చెప్పారు. ఇప్పుడు బహుళవూధువ మీడియా ప్రపంచం ఆవిర్భవించింది. తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వాన్ని ప్రకటించే సాధనాలు ఇప్పుడు అనేకం వచ్చాయి. వీళ్ల కుట్రలు తాత్కాలికంగా కొంత ప్రభావం చూపవచ్చు. కానీ కాల పరీక్షకు నిలబడలేవు. తాము అద్దాల మేడల్లో కూర్చుని అందరిపై రాళ్లు విసురుతున్నామన్న సంగతి వీళ్లు మరచిపోతుంటారు. జనం రాళ్లు విసిరితే ఈ మేడలు ఏమవుతాయో ఒక్కసారి యోచించుకుంటే మంచిది.

[email protected]

403

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా