కాంగ్రెస్ పతనమే తెలంగాణకు సోపానం


Fri,May 31, 2013 09:59 PM


తెలంగాణ ప్రజలు మనవావ్లూవరో, కానివావ్లూవరో గుర్తించాల్సిన సమ యం వచ్చింది. మాటిమాటికి మాటలు మార్చిందెవరో,నిక్కచ్చిగా నిలబడి కొట్లాడిందెవరో తేల్చాల్సిన తరుణం వచ్చింది. తెలంగాణకు శత్రువుపూవరో, తెలంగాణ పుత్రుపూవరో నిర్ణయించుకోవలసిన సందర్భం వచ్చింది. టీడీపీ తెలంగాణ పార్టీకాదు. దాని ప్రాంతమూ, సామాజిక పునాది రెండూ తెలంగాణకు సంబంధించినవి కాదు.అది తెలంగాణ సమస్యను ఎజెండాలోకి తెచ్చిన పార్టీ కూడా కాదు.‘వేరే కారణాల వల్ల తెలంగాణ’ అనవలసి వచ్చిందని ఆపార్టీ అధినేతే చెప్పుకున్నారు. ఎన్నికల అవసరాల వల్ల తెలంగాణ అనవలసి వచ్చిందని చెప్పలేడు కాబట్టి అలా చెప్పాడు. ఆపార్టీ ఎప్పటికీ మనసుతో తెలంగాణను కోరుకోదు. తెలంగాణ ఇవ్వాలని కొట్లాడదు.ఆ పార్టీ ఇప్పుడు క్షీణిస్తున్న పార్టీ.ఆ పార్టీ చేసిన తప్పిదాలు దానిని పతనం వైపు నడిపిస్తున్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గం.

తెలంగాణ సమస్యను ఎజెండాలోకి తెచ్చింది, పదేపదే హామీలు ఇచ్చింది,ఇస్తున్నట్టు ప్రకటించింది, మాట తప్పింది, పదేపదే మాటమార్చింది, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్నది, వెయ్యిమంది యువకుల బలిదానాలకు కారణమైంది,ఆంధ్రవూపదేశ్‌ను సంక్షోభంలోకి నెట్టింది, నాలుగుకోట్ల మంది ఆకాంక్షను దోశ, కేకు...లతో పోల్చి తెలంగాణ ప్రజలను అదేపనిగా అవమానించింది కాంగ్రెస్ పార్టీ, దానిని మోస్తున్న సామాజిక వర్గ నాయకత్వమే. కేంద్రంలో, రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉండీ, అన్ని అవకాశా లూ ఉండీ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కాం గ్రెస్ తెలంగాణ ఇవ్వదల్చుకుంటే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లు అడ్డంకాదు. మాట తప్పినందుకు, మాట మార్చినందుకు ఆ పార్టీలను కూడా తెలంగాణ ప్రజలు శిక్షించవలసిందే. కానీ మొదటి నిందితుడిని నిర్ణయించుకోవల సివస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీయే. దేశంలోని ప్రధాన పార్టీలను తోసిరాజని, పార్లమెంటులో ఓడిపోవడానికి, మైనారిటీలో పడిపోవడానికి సిద్ధపడి కూడా అనేక వివాదాస్పద బిల్లులను ఆమోదింపజేసుకున్న ఘనత కాం గ్రెస్‌ది, యూపీఏ ప్రభుత్వానిది. అందువల్ల తెలంగాణ రాకపోవడానికి, ఇవ్వకపోవడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దే.

ఆడిన మాటలు దప్పిన
గాడిద కొడుకంటు దిట్టగా
విని యయ్యో!
వీడా నాకొక కొడుకని
గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!

ఆడినమాట తప్పినవారిని నిందించడంకోసం ఒక శతకకారుని వ్యంగ్యం ఇది. కాంగ్రెస్‌ను గాడిదతో పోల్చడం కూడా అన్యాయ మే. గాడిద చాకిరీ చేస్తుంది, మోసం చేయదు. తెలంగాణపై కాంగ్రెస్ ఎంత మోసపూరితంగా వ్యవహరించింది? ఎన్ని వేషా లు, ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, ఎన్ని చర్చలు, ఎంత సాగదీత? తెలంగా ణ ప్రజలను ఎంతగా అవమానించింది? ఎంతగా క్షోభకు గురి చేసింది? కాం గ్రెస్ ఎక్కడ మొదలై ఎక్కడదాకా వచ్చింది? 1999లో వరుసగా రెండవసారి అధికారం కోల్పోయిన తర్వాత, వైఎస్ రాజశేఖర్‌డ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండుతో ఢిల్లీకి వెళ్లిన నాటి నుంచి తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల వరకు ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, ఎన్ని చర్చలు ఆవిరైపోయాయి! కానీ తెలంగాణ రాలేదు.

కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్...మూడు పార్టీలూ తెలంగాణను ఒక అవసరంగా వాడుకున్నాయే తప్ప, చిత్తశుద్ధితో దానిని సాధించే లక్ష్యంతో పనిచేయలేదు. ఎన్నికల్లో గెలిచే సోపానంగా పరిగణించాయే తప్ప ప్రజల ఆకాంక్షను తీర్చే ఉద్దేశంతో పనిచేయలేదు. అందుకే తెలంగాణ సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణకు సంబంధించిన 100 మంది ఎమ్మెల్యేలు, 15 ఎంపీలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినా, అసెంబ్లీ, పార్లమెంటులను స్తంభింపజేసినా, ఈ సమస్య ఇంతదూరం వచ్చేది కాదు. కానీ ఈ వందమంది, 15 మంది ఒక్క జట్టుగా లేకపోవడమే తెలంగాణకు శాపమైంది. వీరిలో అత్యధికులు సీమాంధ్ర నాయకత్వాల్లోని పార్టీల్లో ఉండడమే తెలంగాణకు పాపమైంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సీమాంధ్ర నేతల నాదస్వరానికి డూడూ బసవన్నలుగా ఆడారు తప్ప ఎదిరించిపోరాడే తెగువను చూపలే దు. తమ ఫార్చూన్‌లను చూసుకున్నారు తప్ప, తెలంగాణ ఫార్చూన్‌ను చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్న ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకత్వం చేష్టలుడిగి, చేవచచ్చి, పదవులచుట్టూ, పదవుల కోసం పొర్లు దండాలు పెడుతున్నది. తెలంగాణ సాధనకోసం తెగించి పోరాడే ఒక చారివూతక అవకాశాన్ని వారు కోల్పోయారు. తెలంగాణకు ద్రోహం చేసిన ముద్ర వీళ్లను జీవితకాలం వెంటాడుతుందన్నది గతానుభవమే. మర్రి చెన్నాడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు తప్ప తెలంగాణకు ద్రోహం చేసిన చరివూతను మాత్రం కడిగేసుకోలేకపోయారు.

టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇందుకు కొంత భిన్నం. వీరు డూడూ బసవన్నలుగానే కాదు, సీమాంధ్ర నేతల వేటకుక్కలుగా కూడా పనిచేస్తున్నారు. సీమాంవూధలో చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర జరిగినన్ని రోజులు తెలంగాణ మాట ఎత్తవద్దని ఆదేశిస్తే అందరూ నోరుమూసుకుని కూర్చున్నారు. యాత్ర అయిపోతూనే తెలంగాణ ఉద్యమ నేతలపైకి వారిని పెంపుడు కుక్కల్లా ఎగదోశారు. ఒక అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేసి నిజం చేయాలన్న గోబెల్ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఆయన నిజాయితీనీ, కష్టాన్నీ కాకుండా కుట్రలను, కుతంవూతాలను నమ్ముతున్నారు. ఆయన ప్రజల ను కాకుండా, ప్రచారాన్ని నమ్ముతున్నారు. ప్రజలను తన విధానాలతో మార్చడానికి ప్రయత్నించకుండా,‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి’ ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో నిజాయితీలేని కష్టం వృధా అవుతుంది. ఈపార్టీలలోని తెలంగాణ నేతలు మనుషులే ఇక్కడ. రిమోట్ సీమాంధ్రనేతల చేతుల్లోనే. వీళ్ల జెండా, ఎజెండా ండూ తెలంగాణకాదు.

ఈ పార్టీలకు తెలంగాణలో పునాదులు ఉన్నంతకాలం తెలంగాణ ఒక బలమైన రాజకీయశక్తిగా నిలబడి కొట్లాడలేదు. ‘తెలంగాణలో ఒక్క టీఆస్సే ఉండా లా?’ అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించాడు. తెలంగాణలో వెయ్యి పార్టీలు ఉండనీ. బలపడనీ. అవి తెలంగాణ పార్టీలే అయి ఉండాలి. వాటి నాయకత్వం తెలంగాణ నాయకుల చేతుల్లోనే ఉండాలి. మన ఓట్లతో గెలిచి, మంది పాటపాడేవాళ్లను మాత్రం తెలంగాణ ప్రజలు సహించకూడదన్నదే తెలంగాణవాదుల ఆకాంక్ష. తెలంగాణ చేత, తెలంగాణ కొరకు పనిచేసే తెలంగాణ పార్టీలు కావాలన్నదే వారిఆశ, ఆశయం. తెలంగాణలో బిజెపి, సిపిఐ, న్యూడెమాక్షికసీలు ఉన్నా యి. ఆపార్టీలూ బలపడుతున్నాయి. కొత్తగా శక్తులను కూడదీసుకుంటున్నాయి. సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. నాగంజనార్దనడ్డి బిజెపికి కొత్త బలం.ఆ పార్టీలనెవరూ ప్రశ్నించడంలేదు. నాయకత్వాలు ఎక్కడివాళ్లయి నా తెలంగాణ కోసమే మాట్లాడుతున్నారు. సిపిఐ కార్యదర్శి నారాయణ మాదిరిగా కరీంనగర్‌లో,తిరుపతిలోఒకే నినాదం ఇవ్వగలదమ్ము ఏ పార్టీ నాయకులకు ఉంది?

‘ఎన్నికలకు నాలుగు మాసాల ముందు తెలంగాణపై ఏదో ఒక తీర్మానం చేస్తుంది. మళ్లీ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తుంది.. అప్పుడు మీరేం చేస్తారు?’ అని అమెరికా భారతీయ మిత్రుడొకరు ప్రశ్నించారు. ఒక అంశంపై ఒకసారి మోసం చేయవచ్చు.పదేపదే మోసం చేయడం, పదమూడేళ్లుగా మోసం చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు తెలంగాణ ఆ దశలన్నింటినీ దాటిపోయింది. కేవలం తీర్మానాలు, ఇస్తామన్న హామీలు తెలంగాణ ప్రజలను శాంతింపజే యలేవు. ఒక వేళ ఎన్నికలకు నాలుగు మా సాల ముందు కేంద్ర మంత్రివర్గం తెలంగా ణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసినా దానికి ఏ విలువా ఉండదు. పార్లమెంటులో విభజన తీర్మానం ఆమోదం పొందడం తప్ప మరేదీ తెలంగాణ ప్రజలకు సమ్మతం కాదు, ఉత్త పార్టీతీర్మానాలు, మం త్రివర్గ తీర్మానాలు మరోసారి మోసం చేయడానికి ఉపయోగపడతాయి తప్పతెలంగాణ ఏర్పాటుకు దోహదపడవు. పదేళ్లూ అధికారం అనుభవించి, పార్లమెంటులో విభజన తీర్మానం పెట్టడానికి అన్ని అవకాశాలు ఉండి, అదేదీ చేయకుండా, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేని ఆఖరు క్షణాల్లో కంటి తుడుపు తీర్మానాలు చేస్తే ఎవరు నమ్ముతారు? ‘కాంక్షిగెస్ ఎందుకిలా చేస్తున్నది?’ అని ఆయనే మరో ప్రశ్న వేశారు. గతులు తప్పినప్పుడు ప్రాప్తకాలజ్ఞత నశిస్తుంది. తెలంగాణపై ఇప్పుడు నిర్ణయం చేసి, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విభజన ప్రక్రియ పూర్తి చేసినా కాంగ్రెస్‌కు కనీసం తెలంగాణ మిగులుతుంది.

ఇది తప్ప కాంగ్రెస్‌ను రక్షించగల మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదు. బహుశా ఆంధ్రవూపదేశ్‌ను ఇక వదిలేసుకోక తప్పదని కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చి ఉంటుంది. మరో ఐదేళ్ల తర్వాత చూసుకుందామని భావిస్తూ ఉండవచ్చు. కానీ ఐదేళ్ల తర్వాత ఆంధ్రవూపదేశ్ ఇలా కొనసాగే అవకాశమే లేదు. కర్ణాటక మాదిరిగా ఇక్కడ తిరిగి కాంగ్రెస్‌ను ఆదరించే అవకాశం లేదు. తమిళనాడు తరహా రాజకీయ పరిస్థితులు ఇక్కడ అవతరించే అవకాశాలే ఎక్కువ. ప్రాంతీయ పార్టీలు ఇంకా బలపడి తమిళనాడు తరహాలో కాంగ్రెస్ శాశ్వతంగా జూనియర్ భాగస్వామిగా మారిపోవడానికి అవకాశాలు న్నాయి. ఎన్నికల తర్వాత టీఆస్ లేక వైఎస్సార్ కాంగ్రెస్‌లకు ఏ పార్టీతోనూ విలీనం కావలసిన అవసరం అయితే ఉత్పన్నం కాదు. అవి శాశ్వత రాజకీయ పక్షాలుగా నిలిచిపోతాయి. ఎన్‌డీఏ అయినా యూపీఏ అయినా ఎన్నికల తర్వాత మద్దతును కోరగలవు తప్ప షరతులు విధించే శక్తిని కలిగి ఉండవు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసమయినా తెగించాల్సిన సమయం ఇది. తెగించిన వాళ్లను తెలంగాణ సమాజం అక్కున జేర్చుకుంటున్నది. మిగిలిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణవాదులుగా నిరూపించుకుంటారో, శాశ్వతంగా ద్రోహులుగా మిగిలిపోతారో తేల్చుకోవాలి. ముందు చూపును ప్రదర్శించని నాయకుపూవరూ చరివూతలో మిగల్లేదు.

[email protected]

328

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా