ఇక అన్ని ఎన్నికల్లో ఉప ఎన్నికల మార్గమే


Sat,May 25, 2013 01:09 AM

balabalaluపొద్దున్నే ఒక అధ్యాపక మిత్రుడు ఫోను చేశారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. టీఆస్‌పై చంద్రబాబు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి చేసిన విమర్శలు ఆయన కోపానికి కారణం. ‘టీఆస్ వసూళ్ల పార్టీ’ అని, ‘కుటుంబ పార్టీ’ అని విమర్శించడంపై ఆయన మండిపడ్డాడు. ‘టీడీపీ కార్పొరేట్ల పార్టీ. కాంట్రాక్టర్ల పార్టీ. దళారీల పార్టీ. కుంభకోణాల పార్టీ. వెన్నుపోట్ల పార్టీ. ఎన్‌టీఆర్‌ను బలితీసుకున్న పార్టీ. కుట్రలు, కుతంవూతాల పార్టీ. తెలంగాణ ద్రోహుల పార్టీ. తోడు దొంగల పార్టీ. ప్రపంచబ్యాంకు పార్టీ. కులపార్టీ గులపార్టీ. అతిపెద్ద కుటుంబ పార్టీ. హైదరాబాద్‌లో ప్రభుత్వరంగ కంపెనీలను మూసేసిన పార్టీ. ఆ కంపెనీల ఆస్తులను తెగనమ్మిన పార్టీ. సీమాంవూధుల పార్టీ....వంద పేర్లతో తిట్టగలను నేను. మీరెవరూ ఎందుకు పట్టించుకోరు? వాళ్లు అలా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించరు?’ అని ఆయన నిలదీస్తున్నట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ‘వసూళ్ల పార్టీ, వసూళ్ల పార్టీ అని మాట్లాడుతున్నారు.

చంద్రబాబు ఏమన్నా నారావారి పల్లి పొలాల్లో పంటలు పండించిన డబ్బును తెచ్చి ఎన్నికల్లో పెడుతున్నారా? వెంకటగిరి తోటల్లో బత్తాయి పండ్ల మీద వచ్చిన ఆదాయంతో ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారా? హెరి పాలలో వచ్చిన లాభాలతో పార్టీని నడిపిస్తున్నారా? చంద్రబాబుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? ఎవరి దగ్గరా వసూలు చేయకుండానే ఆయన పార్టీని నడిపిస్తున్నారా? ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చుపెడితే సుజనాచౌదరికి రాజ్యసభ టికె ట్ ఇచ్చారు? ఎంత డబ్బు వసూలు చేసి మధుకన్ నామా నాగేశ్వర్‌రావుకు ఎంపీ టికె ట్ ఇచ్చారు?’ ఆయన కోపం ఇంకా తగ్గలేదు.

‘పెద్ద ఏసు ప్రభువుల్లా వెయ్యి నోట్లు రద్దు చేయాలని, ఐదువందలనోట్లు రద్దు చేయాలి, డబ్బే జబ్బు అని ఆయన, ఆయన భజన బృందాలు నీతులు చెబుతున్నారు. కొవ్వూరు ఎన్నికల సమయంలో నెల్లూరులో పట్టుబడిన కోట్లు ఎవరివి? ఎన్నికల్లో డబ్బులు నీళ్ల ప్రాయంగా ఖర్చుపెడుతున్నది ఎవరు? అందరూ ఓటుకు వంద రూపాయలు ఖర్చు పెడితే ఓటుకు పదిహేను వందల రూపాయ లు ఇచ్చింది ఎవరు? ఉప ఎన్నికల సందర్భం గా పట్టుబడిన డబ్బులో ఏ పార్టీ వారిది ఎంతో ఎన్నికల కమిషన్ ఎందుకు బయటపెట్టదు? అంతెందుకు ఇతర పార్టీలలో ఉన్నవారిని కొనడానికి, సొంత పార్టీలో ఉన్నవారిని పార్టీలోనుంచి పోకుండా ఆపడానికి లక్షలు కోట్లు ఆఫర్ చేస్తున్నది ఎవరు?...’ అని ఆ మిత్రుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ మిత్రుడు గమనించాల్సిన విషయం ఒకటుంది.

నల్లగొండలో ఏదో ఒక మారుమూల పల్లె లో చదువులు చెప్పే ఆ మిత్రుడికి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత చంద్రబాబు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి ఏమంటే మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? ఆ మిత్రునికే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఇందులో కొన్ని విషయాలన్నా తెలియకుండా ఉండవు. తెలంగాణ సమాజం మునుపటికన్నా చైతన్యవంతమైందని ఆ మిత్రుడి మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.
తెలంగాణ అదృష్టం ఇదే. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్ నుంచి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన పనిలేదు. ఈసారి ఎక్కడికక్కడ ఇటువంటి అవగాహన ఉంది. నిజమే రాజకీయ ప్రత్యర్థులు బలమైన వాళ్లు. చివరి నిమిషం దాకా యుద్ధాన్ని ఎవరూ వదిలిపెట్టరు. తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించడానికి వారు ప్రయత్నాలు చేయకుండా ఉండ రు.

ఆరోపణల కుంభవృష్టిని కురిపించకుండా ఉండరు. బాబుగారి నోటినుంచో, బాబుగారి చెంచాల నోటి నుంచో మాట వెలువడగానే పత్రికలు, చానెళ్లు అన్నీ అశ్శరభ శరభ అశ్శరభ శరభ అని ఊగిపోతాయి. ఇంకా అనేకమంది రఘునందన్‌లు బయటపడతారు. రాజకీయ ఆశోపహతులు అనే క మంది కోవర్టులుగా మారతారు. అనేకమంది నాయకులను టీఆస్ నుంచి టీడీపీలోకి తీసుకురావడానికి చంద్రబాబు ఒక టాస్క్ ఫోర్సునే ఏర్పాటు చేశారని చెబుతున్నారు. టీఆస్ కూడా అదే పనిచేస్తున్నదని చెప్పడానికి సంకోచం లేదు. అయితే రెండు పార్టీల ప్రయత్నాల్లో ఒక తేడా ఉంది. టీఆస్ చేస్తున్నది తెలంగాణ రాజకీయ శక్తులను ఒక్కచోటికి తీసుకువచ్చి అస్తిత్వకాంక్షను బలంగా వినిపించాలని ప్రయత్నిస్తున్నది. టీడీపీ తెలంగాణవాదాన్ని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నది.

టీఆస్‌లోకి వచ్చే వాళ్లు టికెట్ల హామీ కోరుతున్నారు. గెలుపు మీద ఆశతో వస్తున్నారు. టీడీపీ మాత్రం ‘గెలుపు సంగతి తర్వాత, ఎవరికి ఎంతకావాలో తీసుకోం డి. రండి ఆహ్వానిస్తున్నది’. మెదక్ జిల్లాకు చెందిన టీఆస్ నాయకుడొకరు స్వయంగా ఈ విషయం చెప్పారు. ‘జంప్‌ల కార్యక్షికమాన్ని విజయవంతం చేయడానికి మా జిల్లా బాధ్యతలను ఒక కార్పొరేట్ ఎంపీకి అప్పగించారట’ అని ఆయన వివరించారు. ‘మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరయినా పర్వాలేదు. అందరికీ రేట్లు ఫిక్స్ చేయండి. మాట్లాడండి. పట్టుకురండి అని ఎన్‌టీఆర్ భవన్ నుంచి ఆదేశాలున్నాయి’ అని టీడీపీ నాయకులు ఇక్కడ చెబుతున్నారని ఆయన తెలిపారు. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ చంద్రబాబుకు ఇటువంటి రాజకీయాలు కొత్తకాదు. కుట్రలు కొత్తకాదు. తన ను ‘నారా నారా పోరా పోరా’ అన్న నర్సింహులును పార్టీలో చేర్చుకున్నారు. తనను ‘బిగ్‌బాస్’ అని ఆరోపించిన మైసూరాను చేర్చుకున్నారు. తనపై అన్ని రకాలా దుమ్మెత్తిపోసిన ముద్దు కృష్ణమను చేర్చుకున్నారు. క్యాంపులు నిర్వహించడం, జడ్‌పీటీసీలను కొనుగోలు చేయడం చాలా కాలంగా చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు గురించి ఇప్పుడు జనానికే బాగా అర్థమవుతున్నది. మనం ఊహించని కోణాలను జనం గమనిస్తున్నారు.

చంద్రబాబు శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? అని ఒక విందులో ఒక మిత్రుడు ప్రశ్నించాడు. ప్రభుత్వం పడిపోతే ఎన్నికలొస్తాయని, జగన్ కు లాభం చేకూరుతుందని ఇవ్వలేదని చెప్పా ను. ‘కాదు... తెలంగాణను అడ్డుకోవడం కోస మే’ అని ఆ మిత్రుడు చెప్పారు. అదెలాగంటే, ‘ప్రభుత్వం సంక్షోభంలో పడితే వెంటనే ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు. మహా అయి తే సస్పెండెడ్ యానిమేషన్‌లో పెడతారు. వెంటనే ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండేదికాదు. జగన్‌కు వెంటనే ఒరిగేదేమీ ఉండదు. కానీ రాజకీయ సంక్షోభం వస్తుంది. తెలంగాణ సమస్య మరోసారి తీవ్రమవుతుంది. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని నివారించేందుకే టీఆస్ ప్రతిపాదించిన అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు’ అని ఆ మిత్రుడు వాదించారు. అదీ నిజమే కావచ్చు.

చంద్రబాబు చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. పైకి ఒక లక్ష్యం ప్రకటిస్తారు. అసలు లక్ష్యం వేరే ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పి నా ఎన్ని లేఖలు రాసినా కచ్చితంగా ఆయన తెలంగాణకు అనుకూలం కాదు. అనుకూలత ఆచరణలో కూడా ఉండాలి. దేశంలోని సమస్యలన్నింటిపై ఆయన పోరాడతాడు. రాష్ట్రపతిని కలిసి ఏవే వో డిమాండ్లు పెడతాడు. గవర్నరుకు మహజర్లు సమర్పిస్తారు. చిదంబరంతో సమావేశమవుతాడు. ఇక్క డ తెలుగు తమ్ముళ్లు విద్యుత్ కోసం పోరాడతారు. బాబ్లీకోసం పోరాడుతున్నట్టు మాట్లాడతారు. కానీ పన్నెండేళ్లుగా తెలంగాణ హృదయాలను మండిస్తున్న స్వరాష్ట్ర కాంక్ష గురించి మాత్రం మాట్లాడరు. వెయ్యి మంది పిల్లల బలిదానాలను గురించి మాట్లాడరు. రాష్ట్రాన్ని అనిశ్చితిలో పడేసిన ఈ సమస్యను పరిష్కరించాలని ఒక పెద్ద మనిషిగా కూడా డిమాండు చేయరు. ఆయనకు ఆయన తమ్ముళ్లకు కావలసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కాదు, ఆయన ముఖ్యమంత్రి కావ డం. ఆయనకు స్పష్టత ఉంది. ఇంకా స్పష్టత రావలసింది తెలంగాణ నాయకులకే.

తెలంగాణ ప్రజలు తమ స్పష్టతను గత రెండేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో అనేకసార్లు చూపించారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్నీ వారు గుర్తిస్తున్నారు. ఎప్పటికయినా సీమాంధ్ర పార్టీలు మన పార్టీలు కావని 2009 డిసెంబరు తర్వాత పదే పదే రుజువయిపోయింది. వాళ్లు మనుషులే ఇక్కడ, ఆత్మలు అక్కడే అని తేలిపోయిం ది. తెలంగాణ ఓట్లతో గెలిచి ఆంధ్ర మేలు కోరతారని అర్థమయింది. మన ఎమ్మెల్యేల బలంతోనే సింహాసనంపై కూర్చుని ‘ఒక్క పైసా ఇవ్వను ఏం చేస్కుంటావో చేస్కో’ అని సవాలు విసరగల పెద్దమనుషులు వాళ్లు. అందు కే ఈ పార్టీలను వదిలించుకోవడం తప్ప తెలంగాణకు వేరే మార్గం లేదు. టీఆస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమాక్షికసీ ...తెలంగాణపై పోరాడుతున్న ఈ పార్టీలకు తప్ప మరే పార్టీకీ తెలంగాణ ఓట్లు పడకుండా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి. కలసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా-అందరి లక్ష్యం సీమాంధ్ర పార్టీలను ఓడించడమే కావాలి.

టీఆస్ ఒంటరి పోరుకు సిద్ధపడడంలో న్యాయం ఉంది. పొత్తులు తెలంగాణ సమస్యను ఎంతగా ఆగం పట్టించాయో గత రెండు ఎన్నికలు రుజువు చేశాయి. పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఏవీ ఎదగలేదు. 1998లో 18 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, 1999లో టీడీపీ కౌగిలిలో చేరి ఘోరంగా దెబ్బతిన్నది. 2004, 2009లో టీఆస్ అనుభవమూ అదే. రాజశేఖర్‌డ్డి టీఆస్‌కు వ్యతిరేకంగా 2004లో ఎన్నికల తర్వాత కుట్ర చేసి పార్టీని చీల్చితే, 2009లో ఎన్నికల సమయంలోనే చంద్రబాబు కుట్ర చేశారు. తెలంగాణ సొంత రాజకీయ సత్తాను చూపే అవకాశం ఇంతవరకు రాలేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ తన సొంత రాజకీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

తెలంగాణలో 2009-2012ల మధ్య 20 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 17 స్థానాలను టీఆస్ గెల్చుకుంది. రెండు స్థానాలను బీజేపీ గెల్చుకుంది. ఒక స్థానాన్ని నాగం జనార్దనడ్డి గెల్చుకున్నారు. అంద రూ తెలంగాణకోసం నిలబడి కొట్లాడుతున్నవారే. ఇందులో 9 స్థానాలు టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి గెల్చుకున్నవే. సీమాంధ్ర పార్టీలు తెలంగాణలో క్రమంగా ఎలా పతనమవుతున్నాయో గత ఐదేళ్ల ఓట్ల శాతాలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ఈ ఉప ఎన్నికల నమూనాలోనే రేపు మొత్తం ఎన్నికలు జరగాలి. సర్వేలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకున్నా, ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగానే ఉన్నాయి. అవి తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. సీ-ఓటర్ టీఆస్‌కు 12 స్థానాలను, బీజేపీకి ఒక స్థానాన్ని అంచ నా వేస్తే, మిన్హాస్ మర్చెంట్ అంచనాలో టీఆస్‌కు 13 చూపించారు.

ఏబీపీన్యూస్-నీల్సన్ సర్వే కూడా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగానే వచ్చింది. వచ్చే కాలం చాలా కీలకమైనది. టీఆస్ స్వయంకృతాపరాధా లు జరుగకుండా చూసుకోవాలి. టీఆస్‌లో రెండు రకాల వాళ్లున్నారు-కొందరు టీఆస్‌ను, ఉద్యమాన్ని మోస్తున్నవాళ్లు. ఇంకొందరు టీఆస్ మోస్తున్నవాళ్లు, భరిస్తున్నవాళ్లు. రెండో రకం వల్ల ఉద్యమానికి ఏ ప్రయోజనమూ లేదు. పొయ్యేవాళ్లను పోనివ్వండి. ఉద్యమ శ్రేణులను రాజకీయ సమరాంగణంలోకి తీసుకురావడంపై టీఆస్ దృష్టిపెట్టాలి. రాజకీయాలకు ఉద్యమ రూపం ఇవ్వాలి. ఏదీ ఆశించకుండా, షరతులు పెట్టకుండా ఇంతకాలం ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నవారికి ఎన్నికల సమరంలో అవకాశం ఇవ్వండి. అందరితో సమన్వయంతో వ్యవహరించడం టీఆస్ కే మేలు చేస్తుంది. ప్రత్యర్థులు మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో రాజకీయ దాడి చేయడానికి సమాయత్తమవుతున్నారు. మరింత అప్రమత్తంగా, తొట్రుపాటు లేకుండా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణవాద పార్టీలపై ఉంది.

[email protected]

363

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా