లోపలి మనుషులు!


Sat,September 3, 2011 01:42 AM

1969లాగానే ఇప్పుడు కూడా నక్సలైట్ల రిక్రూట్‌మెంట్ కాంపెయిన్‌కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉపయోగపడుతుందని పోలీసులు నమ్ముతున్నారు. మాజీ నక్సలైటు నాయకులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున సానుభూతిని పొందారు.

-డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్(వికీలీక్స్ ఆధారం)ఒక్కొక్కరిలో ఇద్దరేసి మనుషులు
ఒకరు పెద్దమనిషి మరొకరు కొద్ది మనిషి
ఒకరు అందరివాడు ఇంకొకరు కొందరివాడు
ఒకరు తటస్థుడు మరొకరు పచ్చిపక్షపాతి
ఒకరు బయటికి కనిపించేవారు
ఇంకొకరు లోపలి మనిషి
ఒకటి ముసుగు రూపం ఇంకకొటి అసలు రూపం!
2009 ఎన్నికల సమయంలో దివంగత రాజశేఖర్‌డ్డి, ఆతర్వాత నారా చంద్రబాబునాయుడు, నిన్న కొణిజేటి రోశయ్య, నేడు నాదెండ్ల మనోహర్! వీళ్ల లోపలి మనుషులు ఒక్కొక్కరే బయటపడుతున్నారు. నాడు వైఎస్ తెలంగాణలో ఎన్నికలు పూర్తికాగానే నంద్యాలకు వెళ్లి, తన నిజ స్వరూపం బయటపెట్టారు. హైదరాబాద్‌కు వెళ్లాలంటే వీసా తీసుకోవలసివస్తుందని ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి, అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని సవాలు చేసిన చంద్రబాబునాయుడు, తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటును ప్రకటించాక తనలోని అసలు మనిషిని తెరముందుకు తెచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో ప్రధాన పాత్రధారిగా మారారు. కొణిజేటి రోశయ్య బయటికి అందరివాడులా కనిపిస్తూనే, ఢిల్లీకి తెలంగాణకు వ్యతిరేకంగా రాయాల్సిందంతా రాసి తానూ ఆంధ్రా నాయకుడినేనని రుజువు చేసుకున్నారు. ఆయన మెత్తమెత్తగా కనిపిస్తూనే తనలోని మెత్తని కత్తిని ఎలా ఝుళిపించారో కేంద్రానికి రాసిన నివేదికలు చెప్పకనే చెప్పాయి. మనోహర్ సాధారణంగా వివాదాల్లో కనిపించరు. కానీ చాటు దొరికినప్పుడు ఆయనలోని అసలు మనిషి బయటికొచ్చారు. మూడో పక్షం కదా, అమెరికా వాళ్లు కదా బయటపెట్టరులే అని చెప్పాలనుకున్నది చెప్పేశా రు మనోహర్. ఈ లోపలి మనుషులు చెప్పేవన్నీ అబద్ధాలు. వీరి మాటలు, మంత్రాంగాల సారాంశం తెలంగాణను అడ్డుకోవడం. హైదరాబాద్‌ను ఆక్రమించినవారు వీసాల గురించి మాట్లాడడం, తెలంగాణ బిల్లు పెట్టండని సవాలు చేసినవారు నేర ని నల్లి లాగా తప్పించుకు తిరగడం, ఏ పక్షమూ వహించనని చెప్పిన పెద్ద మనిషి, తెలంగాణకు వ్యతిరేకంగా అదేపనిగా నివేదికలు పంప డం, తీర్పరిగా ఉండాల్సిన పెద్దమనిషి ప్రత్యర్థుల గుం పులో చేరిపోయి తెలంగాణ ఉద్యమకారులపై నక్సలైటు ముద్రవేసే ప్రయత్నాలు చేయడం ఆంధ్రానేతల రెండు ముఖాలను బట్టబయలు చేసింది. నక్సలైట్లు తెలంగాణకోసం పుట్టలేదు. తెలంగాణ తర్వాత అంతరించిపోరు. నక్సలైట్లు పుట్టి, పెరిగి, విప్లవాల జైత్రయావూతలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో కాదు సమైక్యాంవూధలోనే.

చదువుకున్న యువత ఈ దేశానికి గొప్ప సంపద. రాజకీయాలను తిట్టుకుంటూ కూర్చోవడంవల్ల ఫలి తం లేదు. రాజకీయాలను అసహ్యించుకుని దూరం గా ఉంటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. యువత రంగంలోకి వచ్చి కుళ్లును కడిగేయాలి.

-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిద్యార్థులకు రాజకీయాలొద్దు
వర్శిటీల్లో సామాజిక శాస్త్రాలొద్దు
అసలు తెలుగు విద్యార్థే రద్దు!
అధికారం మైకం తనువంతా కమ్ముకుని, అహంవూబహ్మాస్మి...రాజ్యమేలే కాలంలో చంద్రబాబునాయు డు బోధించిన రాజకీయ పాఠాలివి. కానీ అభివూపాయాలు మార్చనివాడు పొలిటీషియనే కాదంటారు కన్యాశుల్కంలో గిరీశం. పదేపదే అభివూపాయాలు మార్చుకుని, అపనమ్మకానికి, అవకాశవాదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించుకుని, రాజకీయంగా బలహీనపడిపోయి, మార్గాంతరంకోసం తన్లాడే వారు ఏం చేస్తారు?

చెల్లనివాడు చేవగలిగినవాడిని తోడు చేసుకోవాలి
అసమర్థుడు పనిమంతుడి సహవాసం చేయాలి
అవినీతిపరుడు అన్నాహజారే నీడలో దూరాలి!
చంద్రబాబు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. నిన్న చేదు అయిన విద్యార్థులు ఇప్పుడు ఆయనకు భావి భారత నిర్మాతలుగా కనిపిస్తున్నారు. నిన్న రాజకీయాల్లోకి వచ్చి భవిష్యత్తు పాడుచేసుకోవద్దని చెప్పిన పెద్ద మనిషి, ఇప్పుడు రాజకీయాలు బాగు చేయడానికి మీరే దిక్కని వేడుకుంటున్నారు. విద్యార్థులు నాడు చంద్రబాబు చెప్పాడని రాజకీయాలకు దూరంగా వెళ్లిపోలేదు, నేడు ఆయన దండ లు వేస్తారని తండోతండాలుగా తరలిరారు. చంద్రబాబుకు ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఎన్ని కీర్తనలయినా పాడవచ్చు. ఎవరు ఏమయినా చెప్పనీయం డి- ఈ యుగం విద్యార్థి, యువకులదే. విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి తీరాలి. రాజకీయాలను శుద్ధి చేయవలసింది, చేయగలిగిందీ విద్యార్థి, యువకులే. విద్యార్థులు రాజకీయ జెండాలను అందుకునే ముందు, అన్నా హజారేలు ఎవరో, 2జి రాజాలు ఎవరో కనిపెట్టగలగాలి. వాసుదేవుడెవరో, పౌండ్రక వాసుదేవుడెవరో గుర్తు పట్టగలగాలి. పాలను నీళ్లను వేరు చేసి చూడగలగాలి. నటులను, నిజాయితీపరులను గుర్తించగలగాలి.అవినీతిపై సామాజిక వేత్త అన్నా హజారే చేపట్టిన నిరసన నుంచి నక్సలైట్లు, ఉగ్రవాదులు అహింస గొప్పతనాన్ని గుర్తించాలి.

-గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీదయ్యాలు వేదాలు వల్లించినట్టు
మృగరాజు శాంతి మంత్రం బోధించినట్టు
హిట్లర్ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యసించినట్టు
మోడీ గాంధీయిజం బోధించినట్టుఊహించలేం. తట్టుకోలేం.
హింసను తొలి ఆయుధంగా ప్రయోగించి, అహ్మదాబాదును పీనుగుల గుట్టగా మార్చినవాడు అహింస గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నాడు. అధికారాన్ని ఉగ్రవాదిగా మార్చి, ఊచకోతలు జరిపించినవాడు శాంతి మంత్రం జపిస్తున్నాడు. బెస్ట్ బేకరీ ని, అందులోని మనుషులను నిట్టనిలువునా దహించిన శక్తులకు ప్రతినిధి అన్నా హజారేను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇది రాజకీయ హిపోక్షికసీకి పరాకాష్ఠ!
రాష్ట్ర విభజన సమస్య వీధుల్లో తేలేది కాదు.

-తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యఅసెంబ్లీలో తేలదని చెప్పిన పెద్ద మనిషివి నీవే! అసెంబ్లీలో తేలనిది వీధుల్లో కాక ఎక్కడ తేలుతుంది మహాశయా!తెదేపా, కాంగ్రెస్, తెరాస, ఇతర అన్ని పార్టీల ప్రజావూపతినిధులు రాజీనామాలు చేసి తిరిగి పార్టీ గుర్తులపై కాకుం డ ఉమ్మడి గుర్తుపై పోటీ చేయాలి.

-టీ టీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావునదిలో మునిగేవాడు తెప్పకోసం వెతుకులాడినట్టు, తెలంగాణ తెలుగుదేశం మిగిలిన పార్టీలతో జతకట్టడానికి వెంపర్లాడుతున్నది. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేసిన చంద్రబాబునాయుడును వదిలి పెట్టకుండా, అందరూ తమ సరసనకు రావాలని టీ-టీడీపీ వాదిస్తున్నది. అసలు రాజీనామా చేయకముందే పోటీ గురించి బెంగ ఎందుకు? తెలంగాణకోసం తమరు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంటే కండిషన్లు ఎందుకు? రాజీనామాలు చేయడానికి టీఆర్‌ఎస్ అనుమతి ఎందు కు? తెలంగాణపై స్పష్టమైన విధానంలేని పార్టీలు టీడీ పీ, కాంగ్రెస్. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది ఆ పార్టీల ఆంధ్రా నేతలే. ద్వంద్వ నీతిని అవలంబిస్తున్న టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి బయటికివచ్చి తెలంగాణవాదులతో కలసి పనిచేయాల్సింది టీ -టీడీపీ, కాంగ్రెస్‌ల నేతలే. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలకు గుర్తులు, జెండా లు పక్కనబెట్టాల్సిన అవసరం ఏముంది? టీ -టీడీపీకి సొంత జెండా, సొంత గుర్తులపై పోటీ చేసే ధైర్యం ఎందుకు లేకుండాపోయింది? విధానస్పష్టత లేని టీడీపీలో ఉన్నంతకాలం ఇలా దేబిరించాల్సిన పరిస్థితిలో ఉండాల్సి వస్తుందని వారు ఎందుకు గుర్తించడం లేదు?సిబిఐ విచారణ జరుగుతోంది జగన్ కంపెనీల్లో పెట్టుబడులపైనే తప్ప వైఎస్ రాజశేఖర్‌డ్డిపై కాదు. రాజశేఖర్‌డ్డి కాంగ్రెస్ నాయకుడు. జీవితాంతం పార్టీకోసం కష్టపడి పనిచేశారు..

-ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌డ్డికారణం లేకుండా కార్యం ఉంటుందా? విత్తనం లేకుండా చెట్టు ఉంటుందా? వైఎస్ లేకుండా జగన్ ఉన్నారా? ప్రభుత్వం మద్దతు లేకుండా సాక్షి అవతరించిందా? జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి? ప్రభుత్వం వద్ద ప్రాజెక్టులు, కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. ఆ కంపెనీలకు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? రాజశేఖర్‌డ్డి ప్రభుత్వం ఇచ్చింది. రాజశేఖర్‌డ్డి ప్రభుత్వం అంటే రాజశేఖర్‌డ్డి ఒక్కరేనా? లేదు మంత్రివర్గం కూడా ఉంటుంది. సలహాదారు కూడా ఉంటారు. రాజశేఖర్‌డ్డి జోలికి, మంత్రివర్గం జోలికి, సలహాదారు జోలికి వెళ్లకుండా ఈ విచారణలో ఏం తేల్చుతారు? తప్పులు చేసిన వాళ్లను కాకుండా, వారి తప్పుల వల్ల ప్రయోజనం పొందినవారిని మాత్రమే విచారించడంలో నీతి ఏముంది? నిజాయితీ ఏముంది? ఒట్టి రాజకీయ నాటకం! పార్టీని సవాలు చేసినందుకు జగన్‌ను వేధించే కుహకం!

383

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా