మన కురుక్షేవూతంలో హీరోలెవరు? విలన్‌లు ఎవరు?


Sat,May 11, 2013 01:28 AM

వైశంపాయనుడు మహాభారత కథను చెప్పడం ముగించిన తర్వాత జనమేజయునికి ఒక సందేహం వస్తుంది. ‘ఈ కథలో విలన్ ఎవరు? హీరో ఎవరు? నాకు అయోమయంగా ఉంది’ అంటాడు జనమేజయుడు. ‘దుర్యోధనుడా? ధృతరాష్ట్రుడా? గాంధారా? భీష్ముడా? శంతనుడా? ధర్మరాజా? శ్రీకృష్ణుడా? ఎవరు?’ అని ప్రశ్నిస్తాడాయన. ‘వారంతా జీవన పరమార్థాన్వేషణలో ఎవరి పాత్ర వారు నిర్వర్తించారు. వారెవరూ విలన్లూ కాదు, హీరోలూ కాదు. తనను తాను జయించినవాడు విజేత’ అంటారు వైశంపాయనుడు. అది ఇతిహా సం. తాత్విక సమాధానం. ఇది జీవితం. ప్రజాస్వామ్యం. ఆధునిక ఇతిహాసం. ప్రజామోదం పొందినవాడు విజేత. హీరోలయినా, విలన్లయినా ఐదేళ్లకోసారి మారిపోతుంటారు.

కర్ణాటక ఫలితాలను చూసినవాళ్లు, ఫలితాల పర్యవసానాలను అనుభవించినవాళ్లు తలా ఒక రకంగా వర్ణిస్తున్నారు. యడ్యూరప్ప విలన్ అని బిజెపి నాయకత్వం విమర్శిస్తోంది? నేను హీరోనంటే నేను హీరోనని కాంగ్రెస్‌లో ముగ్గురు నలుగురు ముందుకు వచ్చారు? ‘మా బలం పెరిగింది. భవిష్యత్తు మాదే’ అని కుమారస్వామి చెబుతున్నారు. ‘ఫలితాలు ఇలా ఉంటాయనుకోలేదు. నేను లేకపోతే బిజెపికి దిక్కులేదు. మా పార్టీకి పదిశాతం ఓట్లు వచ్చాయి’ అని యడ్యూరప్ప వాదిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లాగా బిఎస్సార్ కాంగ్రెస్ పెట్టిన శ్రీరాములు అప్పుడే ఏమైంది అని ఇంకా బీరాలు పలుకుతున్నారు. ఇదం తా యుద్ధంలో గెలిచినవాళ్లు, ఓడినవాళ్ల బాధ. ఇప్పుడు సమస్యల్లా పక్క రాష్ట్రాల వాళ్లది. ‘కాంక్షిగెస్ నైతికంగా ఓడిపోయింది. టెక్నికల్‌గా గెలిచింది. ఆ పార్టీకి పెరిగింది 2.4 శాతం ఓట్లు మాత్రమే’ అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలాగే ఇక్కడాకాంక్షిగెస్ గెలుస్తుందని ఏపీ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద సంబరాలు జరిపించారు. అవినీతి పార్టీలను అక్కడ ఓడించినట్టే ఇక్కడా ఓడిస్తారని టీఆస్ ముక్తాయింపు. జగన్ పార్టీ తన దుఃఖంలో తానుంది. ఇవేవీ పట్టించుకునే పనిలో లేదు.

కర్ణాటక ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌కు, జాతీయ రాజకీయాలకు వర్తింపజేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? వర్తిస్తే కర్ణాటకలో బిజెపికి పట్టిన గతే ఇక్కడ కాంగ్రెస్ కు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టాలి. అవినీతి విషయంలో ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక బిజెపి ప్రభుత్వం దొందూ దొందే. జగన్‌మోహన్‌డ్డిపై వచ్చిన ఆరోపణలన్నీ కాంగ్రెస్ ఖాతాలోనివే. జగన్‌మోహన్‌డ్డి చేసినట్టుగా చెబుతున్న అక్రమాలన్నీ రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా అధిష్ఠానం అండదండలతో సాగినవే. జగన్‌మోహన్‌డ్డి పాపాల్లో కాంగ్రెస్ అధిష్ఠానానికీ వాటా ఉంది. ఇవ్వాల కేసులు పెట్టవచ్చు. విచారణ జరుపవచ్చు. జగన్‌మోహన్‌డ్డి కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకోకపోయి ఉంటే, సోనియమ్మ సేవా బృందంలోనే కలసిపోయి ఉంటే ఈ పాటికి ముఖ్యమంత్రి అయ్యేవాడు. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా అయ్యేవాడు. కేంద్రంలో సకల సత్కారాలు లభించి ఉండేవి.

ఈరెండు పార్టీలు అవినీతికి ఒకరు తల్లి అయితే మరొకరు పిల్ల. అందుకే కర్ణాటక ఫలితాలు ఇక్కడా పునరావృతమయితే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ రెండూ గెలవకూడదు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ తిరిగి గెలవకూడదు. అనేకానేక కుంభకోణాల సుడిగుండంలో మునిగితేలుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించాలి. ఈ పదేళ్లలో ఇంత అప్రదిష్టను మూటగట్టుకున్న అదే కాంగ్రెస్‌ను మరి కర్ణాటకలో ఎందుకు గెలిపించారు? కర్ణాటక గెలు పు కాంగ్రెస్ ఘనత అన డం కంటే బిజెపి స్వయంకృతం అనడం సమంజసంగా ఉం టుంది. కర్ణాటక బిజెపిలో చీలికలు, అంతఃకలహాలు, అవినీతి అక్రమాలు ఆ పార్టీ ని కుదేలు చేశాయి. అక్కడి ప్రజలు బిజెపి పాలనతో రోసిపోయి కాంగ్రెస్‌ను ఎం చుకున్నారు. కేంద్రంలో జరుగుతున్న దానికంటే రాష్ట్రంలో జరుగుతున్నది వారిని ఎక్కువగా కలవరపరిచింది. పరోక్షానుభవం కంటే ప్రత్యక్షానుభవం మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉన్నప్పుడు తక్కువ ప్రమాదకారిని ఎంచుకోవడం సహజం. కర్ణాటకలో అదే జరిగింది. కర్ణాటకలో బిజెపి 2008 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 13.4 శాతం ఓట్లను కోల్పోయింది. అందులో కాంగ్రెస్‌కు వచ్చింది 2.4 శాతం మాత్రమే. మిగిలిన ఓట్లు కర్ణాటక జనతా పార్టీ, బీఎస్సార్ కాంగ్రెస్, తదితర పార్టీలకు వెళ్లాయి. ఎలా గెలిచినా గెలుపు గెలుపే. ప్రజస్వామ్యంలో ఒక ఓటుతో గెలిచినా విజయమే. ఓటమిని దిగమింగడం కోసం ఎన్ని వాదనలయినా చెప్పవచ్చు. కానీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు.

చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టు కర్ణాటకలో కాంగ్రెస్‌ది టెక్నికల్ విజ యం కాదు. నైతిక విజయమే. అది టెక్నికల్ విజయం అయితే 2009లో రాష్ట్రం లో కాంగ్రెస్‌ది టెక్నికల్ విజయమే. ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీకి, గెలిచిన పార్టీకి వచ్చిన ఓట్ల మధ్య అంతరం రెండు శాతం లోపే. ఎనిమిది లక్షల ఓట్ల లోపే. ఎంత తేడా అన్నది కాదు, అధికారం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. నైతిక విజయమా, టెక్నికల్ విజయమా అన్నది ముఖ్యం కాదు, దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. కాంగ్రెస్ నానా తెరువయింది. సోనియాగాంధీని, కాంగ్రెస్‌ను ఎదిరించినందుకు జగన్‌మోహన్‌డ్డి బలమైన శక్తిగా ఎదిగారు. చంద్రబాబు మరింత బలహీనపడిపోయాడు. తెలంగాణపై అందరూ మాట ఇచ్చి ద్రో హం చేశారు. తెలంగాణలో టీఆస్ పాదుకుపోయింది. కర్ణాటక ఫలితాలు ఇక్కడ పునరావృతం అయ్యే అవకాశమే లేదు. రాష్ట్రంలో చతుర్ముఖ పోటీలు, పంచము ఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీతో సహా మహాకూటమి అన్ని పార్టీలకు కలిపి 34.76 శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 36.55 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి స్వయంగా 28.12 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

తెలంగాణలో అయితే పరిస్థితి మరీ భిన్నం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి కాంగ్రెస్ కంటే రెండు శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మెజారిటీ స్థానాలు మహాకూటమే గెలిచింది. కానీ కాంగ్రెస్ కూడా 33 శాతం ఓట్లతో యాభైస్థానాలకు పైగా కైవసం చేసుకుంది. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి కారణం అయింది. చంద్రబాబునాయుడు అత్యాశ, అతితెలివి ఆరోజు తెలంగాణలో మహాకూటమిని దెబ్బతీశాయి. 2009 ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తేనే తెలంగాణలో తెలుగుదేశానికి వచ్చిన ఓట్లు 20 శాతం. గత ఐదేళ్లలో ఆ పార్టీ ఏమయిందో అందరూ గమనిస్తున్న విషయమే.

వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నానాటికీ తీసికట్టుగా తయారయింది. మాటమార్చడాలు, ద్వంద్వ ప్రమాణాలు, నేలబారు ఎత్తుగడలు నాయకుల ప్రతిష్ఠను దిగజార్చుతాయి. స్వవచోఘాతాలు నేతలను పలుచన చేస్తాయి. నాయకుడు ఒక మాటంటే దానికి కట్టుబడి ఉండాలి. చంద్రబాబు చాలా కష్టపడి రెండువేల ఐదువందల కిలోమీటర్లు నడిచారు. కానీ పార్టీలో, నాయకుల్లో, కార్యకర్తల్లో నమ్మకం కలిగించలేకపోయారు. ఇక ప్రజల సంగతి ఎలా ఉంటుందో ఎలా చెప్పగలం?
‘నేను మారాను’ అని చంద్రబాబు చెబుతున్నారు. ‘నిజమే ఆయన మారాడు’ అని సీమాంధ్ర మీడియా సర్టిఫికెట్ ఇస్తోంది. నేను మారాను అని చెప్పుకోవలసి రావడమే ఒక దుస్థితి. చంద్రబాబు మారా డు అని ప్రజలు విశ్వసించాలి. జనం ఆయనను నమ్మకపోవడానికి కారణం ఆయన మాటిమాటికి మార్చిన విలువలు. ఎన్‌టిఆర్‌ను అధికారం నుంచి, పార్టీ నుంచి గెంటేశారు.

ఇప్పుడు ఆయనే మా దేవుడు అని ఆయన విగ్రహానికి పూల దండలు వేస్తున్నారు. ఎప్పుడూ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. సంస్కరణలే భవిష్యత్తు అన్నారు. ఇప్పుడు ప్రజలకు మేలు చేయని సంస్కరణలు అవసరం లేదని చెబుతున్నారు. వ్యవసాయం దండగ అన్నాడు. ఇప్పుడు వ్యవసాయం పండగ చేస్తానంటున్నారు. నాడు ఉద్యోగులపై స్వారీ చేశారు. నేడు మళ్లీ అటువంటి తప్పులు చేయనంటున్నారు. ‘తెలంగాణపై తీర్మానం పెట్టండి. మేము మద్దతు ఇస్తాం’ అన్నాడు. రెండు రోజులకే మాటమార్చి ‘రావూతికి రాత్రి తెలంగాణపై నిర్ణయం ఎలా తీసుకుంటారు’ అని అడ్డం తిరిగారు. చంద్రబాబు ఎంత ఆరాటపడుతున్నా ఈ పిల్లి మొగ్గలను జీర్ణించుకోవడమే కష్టంగా ఉంది. నమ్మకం ఒకసారి కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం. ఇంత అనుభవం కలిగిన నాయకులు ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోవడంలేదో తెలియదు.

కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వాన్నం. కుక్కలు చింపిన విస్తరి. అమీబాకు ఒళ్లంతా కాళ్లు. ఎటంటే అటు నడవగలదు. కాంగ్రెస్ ఈ పదేళ్లలో అదే చేసింది. తెలంగాణ విషయంలో ఎన్ని వంకరలు పోయిందో. ఎన్ని పిల్లి మొగ్గలు వేసిందో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడా అక్కడా ఎన్ని కుంభకోణాలకు భూమిక అయిందో. ద్రోహం, మోసం, వంచన అనే పదాలకు రూపం ఇస్తే కాంగ్రెస్ అన్నంత పేరు సంపాదించుకుంది. నిర్ణయాలు తీసుకోకపోవడం, తీసుకున్నవి అవినీతి నిర్ణయాలు కావ డం...ండూ చూశాం. జగన్‌మోహన్‌డ్డిపై వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలకు కర్త, కర్మ, క్రియ కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకే ఆ పార్టీ జగన్‌మోహన్‌డ్డిపై సంధిస్తున్న అస్త్రాలేవీ పనిచేయడం లేదు. చాలా అస్త్రాలు వెనుదిరిగొచ్చి కాంగ్రెస్‌నే అతలాకుతలం చేస్తున్నాయి.

అవినీతిపరునిపై యుద్ధం చేసేవాడు నీతిమంతుడై ఉండాలి. రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆ నీతి లేదు. ఆ శక్తి లేదు. అందుకే ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా జగన్ రాజకీయంగా బలమైన శక్తిగా మనగలుగుతున్నాడు. సరై న ప్రత్యామ్నాయం ఉంటే జగన్‌ను కూడా జనం తిరస్కరిస్తారని తెలంగాణ పరిస్థితులే చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది. ఈ మూడు పార్టీలతో రోసిపోయిన జనానికి, తెలంగాణ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న ప్రజానీకానికి బలమైన వేదికగా ఆవిర్భవించింది. రాజశేఖర్‌డ్డి నాయకత్వంలో ఎన్నికలు జరిగినపుడే తెలంగాణలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతం 33. ఇప్పుడు జగన్‌కు అంత బలం కూడా లేదు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆంధ్రవూపదేశ్ కర్ణాటక అయ్యే అవకాశం లేదు. అక్కడి లెక్కలు వేరు. ఇక్కడ పరిష్కరించుకోవలసిన లెక్కలు వేరు.

[email protected]

369

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles