ఎవరు దొరలు? ఎవరు వారసులు? ఎవరు దొంగలు?


Fri,May 3, 2013 01:11 PM

తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్‌పై అన్నివైపుల నుంచి దాడిచేయడానికి సీమాంధ్ర పార్టీలు,సీమాంధ్ర మీడియా చావుతెలివిని ప్రదర్శిస్తున్నాయి. కేసీఆర్ ఉద్యమాన్ని అడ్డుపెట్టి సంపాదించుకున్నారని, కుటుంబరాజకీయాలు చేస్తున్నారని సీమాంధ్ర మౌత్ పీసెస్ దాడిచేస్తున్నాయి. విడ్డూరం ఏమంటే.. ఇలా దాడి చేస్తున్న పార్టీలు, పత్రికలు అన్నీ ఏదో ఒక కుటుంబాన్ని మోస్తున్నవే, సమర్థిస్తున్నవే. కాంగ్రెస్‌కు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే అర్హతే లేదు. గాంధీల కుటుంబం మొదలు రాజశేఖర్‌డ్డి కుటుంబం వరకు.. వారంతా సకుటుంబ సపరివారంగా రాజకీయాలు చేశారు.

తెలుగుదేశం ఫక్తు కుటుం బ పార్టీగానే వచ్చింది. ఎన్‌టిఆర్, ఆయన బంధువులు అనేక మంది ఆయనతోనే రాజకీయాల్లోకి వచ్చారు. దగ్గుబాటి కుటుంబం,ఆ తర్వాత నారావారి కుటుంబం పార్టీని అల్లుకుపోయాయి. కుటుంబ బలంతోనే చంద్రబాబు ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచి,అధికారాన్ని, ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి కొత్తకాదు. ప్రధానుల వారసులు ప్రధానులు కావడం, ఎంపీల పిల్లలు ఎంపీలు కావడం,ఎమ్మెల్యేల పిల్లలు, భార్యలు ఎమ్మెల్యేలు కావడం చూస్తూనే ఉన్నాం.ఎంపీలు, ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చి గెలిపించడం అందరికీ తెలిసిన విషయమే. భూస్వామ్య సంస్కృతికి కొనసాగింపుగానే దేశంలో వారసత్వ రాజకీయాలు మనుగడ సాగిస్తున్నాయి. తప్పొప్పులను సమీక్షించడంలో తప్పులేదు. జరుగుతున్నదంతా మంచే అని కూడా చెప్పబోవడం లేదు.

కానీ ఒక్క కేసీఆర్ విషయంలోనే ఈ రూళ్లకపూరను ఎందుకు ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న. ఒక్క కేసీఆర్ విషయంలోనే దొరతనం ఎందుకు గుర్తుకు వస్తోంది? ఒక్క కేసీఆర్ విషయంలోనే వారసత్వం ఎందుకు అడ్డంపడుతోంది? ఒక్క కేసీఆర్ విషయంలోనే అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఆరవైఏళ్లు తెలంగాణను ఎండబెట్టి పండబెట్టి దోచుకున్న సీమాంధ్ర దొరలకు, కమ్మ,డ్డి భూస్వాములకు, పెట్టుబడిదార్లకు సేవచేయడానికి లేని అభ్యంతరం కేసీఆర్‌కు చేయడానికి ఎందుకు అడ్డం వస్తున్నది? చంద్రబాబు, కిరణ్, జగన్‌ల దర్బారుల్లో పడిగాపులు కాయడానికి లేని అభ్యంతరం కేసీఆర్‌తో కలసి పనిచేయడానికి ఎందుకు అడ్డం వస్తున్నది? అంటే వీరికి దొరతనమో, అవినీతో, కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకకపోవడమో... ఇవేవీ అడ్డంకాదు, అభ్యంతరం కాదు. వేరే లక్ష్యం ఉంది - అదే తెలంగాణవాదాన్ని దెబ్బతీయడం. కేసీఆర్‌ను బలహీనపర్చి సీమాంధ్ర నాయకులను బలపర్చడం.

అరవైఏళ్లుగా సీమాంధ్ర నాయకత్వం పూసుకున్న బురదను కొంత కేసీఆర్‌పై పూసి తెలంగాణ ఉద్యమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. తెలంగాణ నాయకులను ఇంతకాలం ఇలా ఆగంపట్టించే ఎందుకూ కొరగాకుండా చేశారు. ఇప్పుడు కూడా వీరిని ప్రతిఘటించకపోతే తెలంగాణకు విముక్తి నిష్కృతి లేదు.
కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఇటువంటివే. ఆయన పుష్కర కాలంలో ఏనాడూ అధికారంలో లేరు. కొద్దికాలం మంత్రిగా ఉన్నా పోర్టుఫోలియో లేని మంత్రిగానే ఉన్నారు. ఈ పన్నెండేళ్లూ ఉద్యమాలూ, ఊరేగింపులూ,సభలు,దీక్షలు,సమ్మెలతోనే జీవితం గడచిపోయింది.

తెలంగాణ ఉద్యమంలో కాకుండా ఆయన ఏ అధికార పార్టీ శరణుజొచ్చినా ఆయన ఆర్థికంగా బలపడే అవకాశాలు వందట్లు ఎక్కువ. కానీ ఆయన తెలంగాణ సాధనకోసమే రాజీపడకుండా కొట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో నిలబడి పోరాడుతున్న అనేకమంది నాయకులు అప్పులపాలయ్యారు. కానీ సీమాంధ్ర పార్టీలు ఇక్కడ కూడా బురదజల్లే అస్త్రాన్నే ఉపయోగిస్తున్నాయి. ‘మనం ఎట్లాగూ పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో ఉన్నాం. అదే బురదను కేసీఆర్‌కూ అంటిస్తే సరిపోతుంది కదా’అన్నది వారి ఎత్తుగడ. సీమాంధ్ర నేతల అవినీతి ముందు తెలంగాణ నేతలు ఎవరయినా నిలబడగలరా? ఒకప్పుడు ఇల్లు అమ్ముకోజూసిన రాజశేఖర్‌డ్డి అమాంతంగా ఒక పారిక్షిశామిక సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు, ఇరవైఏళ్లనాడు నా వార్షికాదాయం 36 వేల రూపాయలని చెప్పుకున్న చంద్రబాబు హటాత్తుగా హెరి డైరీలు, హెరి ఫ్రెష్‌లు, వందల ఎకరాల భూములు సంపాదించుకోవచ్చు.చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకోవచ్చు. తాతలు తాతల నుంచి ఇప్పటిదాకా రాజ్యాలేలవచ్చు. కుటుంబాలు కుటుంబా లు రాష్ట్రాన్ని దున్నుకోవచ్చు. ఈ మీడియాకు, తెలంగాణలోనే ఉన్న వారి చెంచాలకు వారి కుటుంబాల గురించిపట్టదు. వారి అక్రమ సంపాదనల గురించి మాట్లాడరు!

కేసీఆర్ కుటుంబం ఉద్యమాల్లో ఉన్నది. కేసీఆర్ మూలన ఉన్నవాళ్లను తీసుకొచ్చి పదవులు కట్టబెట్ట లేదు. హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమం పునాదుల నుంచీ నిర్మాణంలో ఉన్నారు. కేటీఆర్ ఉద్యమాల్లో పాల్గొంటూ ఎదిగారు. కవిత తెలంగాణ సాంస్కృతిక వేదికలను నిర్మిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. వారు సాధనతో నాయకులయ్యారు. సీమాంధ్ర పార్టీలు, వారి చెంచాలు, వారి మీడియా లక్ష్యం కేసీఆర్ కాదు. కేసీఆర్‌ను దెబ్బ తీస్తే తెలంగాణను దెబ్బతీసిన భావిస్తున్నారు. కేసీఆర్‌ను ఓడిస్తే తెలంగాణను ఓడించిన అనుకుంటున్నా రు. అందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది ఈ దాడి మరింత పెరి గే అవకాశం ఉన్నది. తెలంగాణలో ఇప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే సీమాంధ్ర నాయకుల కుటుంబ రాజకీయాలను గురించి తెలుసుకోవాలి. వారి అవినీతి అక్రమాల చరివూతను తెలుసుకోవాలి..
విచిత్రం ఏమంటే...

అవిశ్వాస తీర్మానం ద్వారా అర్థమయింది ఏమంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని! కిరణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంఐఎం దూరమయింది. చాలా మం ది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. మం త్రుల మధ్య సఖ్యతలేదు. విద్యుత్‌చార్జీలు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రం లో జగన్ పార్టీ, కేసీఆర్ పార్టీలు లేకుండా ఒక్క కాంగ్రెస్, టీడీపీలే పోటాపోటీగా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. టీడీపీ ఈ ప్రభుత్వాన్ని నడవనిచ్చేది కాదు. సీమాంధ్ర మీడియా కిరణ్‌కుమార్‌డ్డికి కును కు లేకుండా చేసేది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిందని గగ్గోలు పెట్టేవి. కిరణ్‌కు ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగే నైతిక హక్కులేదని రొదపె కానీ అటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇటు టీడీపీని మోస్తున్న మీడియా కిక్కురుమనకుండా పడి ఉన్నది. తేలుకుట్టిన దొంగలా ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు టీడీపీ మీడియా వ్యవహరిస్తున్నాయి. పైగా వీరు కిరణ్‌కుమార్‌డ్డిలో అటు జగన్‌ను, ఇటు కేసీఆర్‌ను ఎదుర్కోగల ‘హీరో’ను చూస్తున్నారు. కిరణ్ దూకుడుగా, సమర్థంగా అందరినీ ఎదుర్కొంటున్నారని కీర్తిస్తున్నది. వీలైనంత పొగడడానికి ప్రయత్నిస్తున్నది. అందరి తొర్రలను వెదికి వెదికి పట్టుకునే టీడీపీ మీడియా కిరణ్‌ను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నది.

జగన్ బయటికి వస్తారా?
జగన్‌ను బయటికి తీసుకురావడానికి సీమాంవూధకు చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు లాబీయింగ్ చేస్తున్నారని ఒక ఢిల్లీ మిత్రుడు చెప్పా రు. ఎందుకు, ఎలా అని ప్రశ్నిస్తే అతను చెప్పిన వాదన ఆశ్చర్యం కలిగించింది. ‘జగన్ బయటికి రాకుండా తెలంగాణలో టీఆస్‌కు అడ్డుకట్ట వేయ డం కష్టం. ఆంధ్రాలో ఎలాగూ జగన్ ప్రభావాన్ని కట్టడి చేయలేకపోతు న్నాం. మనం పోతే పోతాం. జగన్‌ను బయటికి తీసుకువచ్చి వచ్చే ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టాలి. సమైక్యాంవూధను కాపాడడానికి ఇదొక్కటే మార్గంగా కనిపిస్తున్నది’ అని కోస్తా జిల్లాల్లో సమైక్యవాదానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారని ఆయన వివరించారు. రాజకీయ అస్తిత్వం కంటే కూడా సీమాంధ్ర నాయకులకు తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టడమే ప్రధాన ఎజెండాగా ఉన్నదని ఆయన మాటలు విన్న తర్వాత అర్థమయింది. తాము మునిగినా పర్వాలేదు, తెలంగాణవాదం మాత్రం ఓడిపోవాలి. తెలంగాణలో వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు కూడా సరిగ్గా ఇదే విషయంపై మథనపడుతున్నారు. ‘జగన్ బయటికి రాకుంటే మనం గెలవలేం. ఇప్పుడున్న బలం చాలదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆ పార్టీలో క్రియాశీకలంగా పనిచేస్తున్న నాయకుడొకరు వాపోయారు.

అంతర్యుద్ధాలు ముమ్మరం
‘చంవూదబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబు... అం తా ఆంధ్రాబాబులే. తెలంగాణలో వారి కీలుబొమ్మలు లేకుండా చేయాలి. ఆ పార్టీలను తెలంగాణలో ఫినిష్ చేయకపోతే తెలంగాణను ఎప్పటికీ సాధించుకోలేం’ అని టీఆస్ అధిష్ఠానం ఆలోచిస్తుంటే, ఎన్నికలలోపు టీఆస్‌ను ఆగం పట్టించాలని టీడీపీ, వైఎస్సార్సీపీలు ప్రయత్నిస్తున్నాయి. ఆకర్ష్‌కు విరుగుడుగా వికర్ష్‌ను అమలు చేయాలని ఈ రెండుపార్టీలు పథకాలు రచిస్తున్నాయి. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు. టీఆస్‌ను దెబ్బతీయడమంటే కేసీఆర్‌ను దెబ్బకొట్టడం కాదు, తెలంగాణవాదాన్నే దెబ్బకొట్టడం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ఓడించాలి’ అని టీడీపీ యోచిస్తున్నది. 2009 సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు పార్టీ నాయకులతో జరిపిన వీడియో కాన్ఫన్స్‌లో కూడాఇదే వ్యూహాన్ని అమలుచేశారు.

ఒకవైపు టీఆస్‌తో పొత్తు పెట్టుకుని, మరోవైపు ఆ పార్టీని దెబ్బతీయడానికి చేయాల్సినదంతా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి యుద్ధాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉంటాయి. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను ఉపయోగించుకుని పీఆర్‌పీని ఎన్నికల ముందు ఎలా బద్నాం చేశారో, ఇప్పుడు టీఆస్‌ను కూడా అలా పలుచన చేయాలని ఈ రెండు పార్టీలు యోచిస్తున్నాయి. రాజకీయాల్లో నెగ్గడంకోసం సీమాంధ్ర నాయకత్వం ఎంతదూరమైనా వెళుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండకపోతే మరోమారు భంగపడాల్సి వస్తుంది.


seemandra

[email protected]

404

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా