రాజకీయ అనివార్యత సృష్టిస్తేనే..


Sat,April 13, 2013 01:48 AM

‘తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతుంది. తెలంగాణ వస్తుంది’ అని మా టీవీ లో రామలింగేశ్వర సిద్ధాంతి చెప్పాడట. ఒక మిత్రుడు ఫోను చేసి చాలా ఆనందంగా చెప్పాడు. మా టీవీది పార్టీల పంచాంగం కాదు కాబట్టి నమ్మొచ్చని ఆ మిత్రుడి తీర్మానం. పంచాంగాలు నిజమైతే తెలంగాణ ఎప్పుడో వచ్చి తీరాలి. అవి గ్రహగతుల ఆధారంగా చేసే అంచనాలు మాత్రమే. అంకగణిత ఫలితాలు కాదు. రాజకీయ ప్రయత్నం లేకుండా తెలంగాణ రాదు. తెలంగాణ పంచాయతీ ఆఖరి అంకానికి చేరుకుంటున్నది. ఏప్రిల్ 22 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి.

ఏప్రిల్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ సమావేశాల సందర్భంగా తెలంగాణ పంచాయతీ తేలిపోవాలి. దోషుపూవరో, ద్రోహుపూవరో, తెలంగాణకు ఆప్తుపూవరో స్పష్టమైపోవాలి. రాజకీయ అనివార్యత సృష్టిస్తే తప్ప తెలంగాణ రాదని ఇప్పటికి పలుమార్లు స్పష్టమైంది. ఆ పని ఎవరు చేయాలి? ఆ అనివార్యత సృష్టించే మొనగాడెవరు? అటువంటి రాజకీయ బలం ఎవరికి ఉంది? తెలంగాణ కాంగ్రెస్‌కే. అనివార్యత సృష్టించడం అంటే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాల మనుగడను శాసించాలి. తెలంగాణ ఇవ్వండి లేదంటే ప్రభు త్వం నుంచి తప్పుకుంటామని చెప్పగలగాలి. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు-వీళ్లదే బాధ్యత. ఆ తర్వాత బాధ్యత తెలంగాణలో ప్రతిపక్షం నుంచి అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలది. ఈసారి తెలంగాణ రాకపోతే దోషులు వీళ్లే. ఇక్కడ అక్కడ ప్రభుత్వాలను నిలబెట్టగలిగిన, పడగొట్టగలిగిన బలం వీరికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకం. బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉంది. అవిశ్వాసం వీగిపోయింది కాబట్టి ప్రభుత్వం నిక్షేపంగా ఉంటుందని ఎవరయినా అనుకుంటే పొరపాటే. బడ్జెట్ అమోదం పొందడానికి మరోసారి ఓటింగ్ జరగాల్సి రావచ్చు. అప్పుడయినా ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టవచ్చు.

తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నిష్క్రియాపరులుగా మిగిలిపోయినా, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆదేశాలు పాటించి ప్రేక్షక పాత్ర పోషించినా, ఓటింగ్‌కోసం పట్టుపట్టకపోయినా తెలంగాణకు ఎనలేని నష్టం జరుగుతుంది. ఇప్పటికి పదేళ్లుగా రాష్ట్రం సంక్షోభంలో ఉండిపోయింది. ఒక సందిగ్ధం రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నది. నిరాశా నిస్పృహలు యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అభివృద్ధి కుంటుపడుతున్నది. తెలంగాణపై ఇప్పుడు కూడా తేల్చకపోతే కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించరు. ఎంత నాన్చితే ఉద్యమం అంత నీరసపడిపోతుందని కేంద్రం భావిస్తున్నది. నాన్చడమే మందు అని శ్రీకృష్ణ కమిటీ కూడా సలహా ఇచ్చింది. కేంద్రం కూడా అదే చేస్తున్నది. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సింది కాంగ్రెస్, తెలుగుదేశంలే. ఈ పార్టీలు ఇప్పుడయినా తెగింపు పోరాటానికి దిగితే, ఇంతకాలం ఏం చేశారన్నది ప్రజలు మరచిపోతారు. వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. 2009లో ‘అసెంబ్లీలో తీర్మానం పెట్టండి.

మద్దతు ఇస్తామని’ చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎందుకు కట్టడి చేస్తున్నారు? అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని టీఆస్ ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆదేశాలకు డూడూ బసవన్నల్లా ఎందుకు తలలూపుతున్నారు? తెలంగాణ రాజకీయ నాయకులంతా ఇప్పుడొక చారివూతక సంధికాలం లో నిలబడి ఉన్నామని గుర్తించాలి. ఇప్పుడు మీరు అనుసరించే పాత్రలు మిమ్మల్ని ద్రోహులుగానో తెలంగాణ హీరోలుగానో నిలబెడతాయి. మీరు పృథ్వీరాజులవుతారా? జయచంవూదులవుతారా? మీరు అర్జునులవుతారా? సైంధవులవుతారా? అదే చరిత్ర ముందు తరాలకు రికార్డవుతుంది. ఒక్కసారి ద్రోహులుగా ముద్రపడ్డవావరూ రాజకీయంగా తిరిగి బతికిబట్టకట్టలేదు. నాదెండ్ల భాస్కర్‌రావు ఏమయ్యారు? ఎన్‌టిఆర్‌ను అవమానించి, అకాల మరణానికి గురిచేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏమవుతున్నాడు? తెలంగాణ ఉద్యమానికి అనేక ద్రోహాలు చేసిన రాజశేఖర్‌డ్డి ఏమయ్యారు?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకూ ఇదే ఆఖరి అవకాశం. ఇప్పటిదాకా జరిగిన దాగుడుమూతలు చాలు. ఢిల్లీలో పిల్లుల్లా, గల్లీలో పిడుగుల్లా ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? ఇక రాజీనామా డ్రామాలు వద్దు. ఇప్పుడయినా నిలబడండి. పోరాడితే మళ్లీ గెలుస్తారు. నాటకాలాడితే జనం ఛీకొడతారు. తెలంగాణ రాకపోతే ప్రజలు మిమ్మల్ని ఎలాగూ తిరస్కరిస్తారు. తిరస్కృతులుగా మిగులుతారా? విజేతలుగా తిరిగొస్తారా? తెలంగాణ నుంచి మొత్తం 17 మంది ఎంపీలు ఉన్నారు. ఒవైసీ కలసిరాకపోవచ్చు. మిగిలిన 16 మంది నిలబడి కొట్లాడితే పార్లమెంటు నడుస్తుందా? 9 మంది ఎంపీలతో శరద్‌పవార్ చక్రం తిప్పుతుంటే మనవాళ్లకు కనిపించడం లేదా? దాదాపు మన బలమే కలిగిన డీఎంకే కేంద్రం నుంచి ఎలా పనులు చేయించుకుందో చూడడం లేదా? శ్రీలంక తమిళులకోసం డీఎంకే ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు! మనవాళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ పని చేయలేరా? మనకంటే తక్కువ బలం కలిగిన కేరళ కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో కీలక మంత్రిత్వశాఖలు నిర్వహిస్తూ ఎలా పెత్తనం చేస్తున్నారో చూడడం లేదా? నాయకులుగా ఎదగడానికి వచ్చిన అవకాశాలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉపయోగించుకోలేదు.

తెలంగాణ ప్రజల పక్షాన తెగువతో కొట్లాడే నిజాయితీపరులు కావాలి. త్యాగానికి నిలబడితే చరిత్ర గతిని తిప్పడానికి పది సంవత్సరాలు అవసరం లేదు. పదిరోజులు చాలు. 2009 ఎన్నికల తర్వాత టీఆస్ పరిస్థితి ఎలా ఉండేది? తెలంగాణవాదులు ఎంతటి నిరాశావహ పరిస్థితుల్లో పడిపోయారు? కానీ కేసీఆర్ దీక్ష మొత్తం పరిస్థితిని మార్చేసింది. ఇప్పుడు కూడా కేసీఆర్‌పై చాలామందికి అదే నమ్మకం. ‘కేసీఆర్ మళ్లీ ఏదో ఒకటి చేస్తారు. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెడతారు’ అన్న ఆశ ఒక్కటే చాలా మందిని నిబ్బరంగా ఉంచుతోంది. ఆ పని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు చేయలేరు? అటువంటి సాహసాన్ని ఎందుకు ప్రదర్శించరు?

తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ చౌకబారు రాజకీయాలు మానడం లేదు. తెలంగాణకోసం తమ నిజాయితీని నిరూపించుకోవడం ద్వారా కాకుండా అవతలివారి మీద బురదజల్లి పైకిరావాలని చూసే వక్రబుద్ధిని వారు వీడడం లేదు. ‘మనం ప్రజల విశ్వాసం పొందలేం.కేసీఆర్, టీఆస్, తెలంగాణ ఉద్యమం మీద ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీద్దాం’అన్నది తెలుగుదేశం ఎత్తుగడగా కనిపిస్తున్నది. కేసీఆర్ మీద, టీఆస్ మీద విమర్శలు కుమ్మరించి తాము పెద్దవాళ్లు అవుదామని చూస్తున్నారు తప్ప, తెలంగాణకోసం కొట్లాడి పేరు తెచ్చుకుందామనుకోవడం లేదు. కేసీఆర్ తెగ సంపాదించాడని ఒక పిచ్చి మేధావి ఓ రాయి విసురుతాడు, తెలుగుదేశంలో ఉండే పిచ్చోళ్లు అదే రాయిని అందిపుచ్చుకుని రంకెలు వేస్తారు.

కేసీఆర్ నిజంగా అంత డబ్బే సంపాదించి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సీమాంధ్ర మీడియా ఇంత ప్రశాంతంగా ఉండనిచ్చేవారా? ఎంత కిరికిరి చేసేవారు? తెలుగుదేశం అధినాయకుని వద్ద ఉన్నంత సొమ్ము, ఆయన వద్ద ఉండేంత మంది కాంట్రాక్టర్లు, పారిక్షిశామికవేత్తలు కేసీఆర్ వద్దనో, టీఆస్ వద్దనో ఉండి ఉంటే ఈ పాటికి తెలంగాణ వచ్చి ఉండేది. తెలుగుదేశం నాయకులు అద్దా ల మేడలో కూర్చుని ఇతరులపై అబద్ధాల రాళ్లు ఎందుకు విసురుతున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకంగా లేరు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. తెలుగుదేశం నేతల ఆరోపణల లక్ష్యం కేసీఆర్‌ను దెబ్బతీయడం కాదు, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడం. అసత్యపు ఆరోపణలతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించడం. తెలంగాణ గురించి మాట్లాడకుండా, కొట్లాడకుండా రేపు తెలంగాణ ప్రజలను ఎలా ఓట్లడుగుతారు? తెలంగాణపై సభలో తీర్మానం చేయాలని టీఆస్, సిపిఐ, బిజెపి ఎమ్మెల్యేలు కొట్లాడుతుంటే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు బుద్ధావతారాల్లా కూర్చున్నారు? ‘తీర్మానం పెడితే మద్ద తు ఇస్తామని’ చంద్రబాబు స్వయంగా చెప్పారు కదా! ఇప్పుడెందుకు నోరు మూసుకుని కూర్చుంటున్నారు? తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఉన్న సంఖ్యాబలమే టీఆస్‌కు ఉంటే ఇవ్వాళ పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ రాజకీయ అస్తిత్వాన్ని పెట్టాల్సింది చంద్రబాబు చేతిలో కాదు, తెలంగాణ ప్రజల చేతిలో. తమకోసం కొట్లాడినవారిని జనం ఎప్పుడూ మరవరు.

టీఆస్, టీజేఏసీలకు కూడా ఇది తాడో పేడో తేల్చుకోవలసిన సమయం. ఉద్య మం లేకుండా రాజకీయ అస్తిత్వ పోరాటం ముందుకు సాగదు. చాలా చేసి అలసిపోయామని కొందరు, ఇంకెంతకాలం పోరాడతామని మరికొందరు, ఎన్నికల్లో చూసుకుందామని ఇంకొందరు...ఇలా శ్రేణులు చెల్లా చెదరైపోతే 2008 ఉప ఎన్నికల నాటి పరాభవం ఎదురవుతుంది. రాజకీయ శక్తులను, ఉద్యమ శ్రేణులను ఎక్కడికక్కడ విడదీసి కొట్టాలన్నది శ్రీకృష్ణ కమిటీ నివేదిక సలహా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీమాంధ్ర నాయకుల పెత్తనంలోని రాజకీయ పక్షాలు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పార్టీలు, తెలంగాణ ఉద్యమకారులు వీరి వలలకు చిక్కకుండా తెలంగాణ వచ్చేదాకా లేదంటే ఎన్నికలు వచ్చేదాకా ఈ ఐక్యత చెడకుం డా, ఉద్యమ వేడి చల్లారకుండా చూసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడు దెబ్బతింటే ఇక ఎప్పటికీ కోలుకోలేము. తెలంగాణ ఈ పన్నెండేళ్లు కొట్లాడింది ఒక ఎత్తు, ఈ ఏడాది కొట్లాడేది మరో ఎత్తు. తప్పుటడుగులు, తప్పటడుగులు పడకుం డా చూసుకోవలసిన తరుణం. ఈ పన్నెండేళ్లుగా కేంద్రమో, కాంగ్రెస్ పార్టీయో తెలంగాణపై తీర్పు చెప్పాలని ఎదురు చూస్తూ వచ్చాం. ఇప్పుడు తీర్పు చెప్పే అవకాశాన్ని మన చేతుల్లోంచి జారవిడుచుకోవద్దు. ఉద్యమమయినా, ఎన్నికలయినా తీర్పు మనచేతుల్లోనే ఉండేలా చూసుకోవాలి.

[email protected]

301

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా