మనసులేని మహానగరం


Fri,March 29, 2013 11:54 PM

manmohan-soniaదేశంలో జరుగుతున్న పరిణామాలకు న్యూఢిల్లీ కళ్లుమూసుకుని వ్యవహరిస్తోందే మో! తాను చేయదల్చుకున్నది చేస్తుంది.అందరినీ అడిగి చేస్తున్నట్టు, అందరి మాటలు వింటున్నట్టు నటిస్తూ ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలకు ఏమి కావాలో న్యూఢిల్లీకి తెలియదని అనుకోలేము. పత్రికా సంపాదకులు ఏమి రాస్తున్నారో, ఏమని విశ్లేషిస్తున్నారో కూడా కేంద్రానికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. కేంద్రంలోని మహాసచివులు అమాయకులనీ అనుకోలేము. పత్రికా సంపాదకుల సదస్సులో మంత్రుల ఉపన్యాసాలు, సంపాదకులు అడిగిన ప్రశ్నలు, అందుకు వారిచ్చిన సమాధానాలు విన్నతర్వాత కలిగిన అభివూపాయం ఇది. వారు చెప్పదల్చుకున్నవి చెప్పా రు. సంపాదకులు స్వేచ్ఛగా ప్రశ్నలడిగారు. మంత్రులు నిర్మొహమాటంగా సమాధానా లు చెప్పారు. కానీ ఎవరూ సంతృప్తి పడినట్టు కనిపించలేదు. అదంతా ఒక వృథా విన్యా సం మాదిరిగా కనిపించిందే తప్ప సంపాదకుల నుంచి ఏదో తెలుసుకుని సరిదిద్దుకోవ డం కోసం జరిగింది కాదని అర్థమయింది.

ఆర్థిక మంత్రి చిదంబరం ఉద్యమాలు చేస్తు న్న ప్రజలను, వారికి మద్దతునిస్తున్న మీడియాను తప్పు పట్టారు. ఇలా అయితే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మలిదశ సంస్కరణలను వేగవంతం చేయ డం అనివార్యమని నిర్దంద్వంగా చెప్పారు. అందుకు అందరూ సహకరించాలని కోరా రు. బడ్జెట్‌లో చెప్పిన అంశాలను మరోసారి వల్లెవేశారు. నిజానికి మీడియా బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత పెద్ద ఎత్తున ప్రజాభివూపాయసేకరణ చేసింది. ప్రజలు ఏమికోరుకుంటున్నారో పత్రికల్లో, చానెళ్లలో ప్రచురించారు, ప్రసారం చేశారు. అవేవీ బడ్జెట్ లో కనిపించలేదు. కనీ సం పరిశీలిస్తామన్న హామీ కూడా చిదంబరం మాటల్లో ధ్వనించలేదు. ప్రజల ఆత్మకు న్యూఢిల్లీ చాలా దూరంగా ఉందనిపించింది. రైల్వేబోర్డు చైర్మన్ మొత్తం రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని మరోసారి సదస్సులో కుమ్మరించారు.ఆ వివరాలన్నీ అప్పటికే సంపాదకులంతా విన్నారు. రాశారు. విశ్లేషించా రు.

మళ్లీ మొదటి నుంచీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన కూడా సంస్కరణల విషయంలో స్పష్టంగానే చెప్పారు. ఇంధనచార్జీలకు అనుగుణంగా టికెట్ల ధరలు పెరుగుతాయ ని చెప్పారు. బుల్లెట్ రైళ్లు ఆలోచన చేస్తున్నామని, ప్రైవేటు పెట్టుబడుదారులకోసం చూస్తున్నామని చెప్పారు. వందలాది ప్రాజెక్టులు ప్రారంభించి ఏదీ పూర్తి చేయకుండా పది పదిహేనేళ్లు సాగదీస్తూ పోతే ఆ పెట్టుబడి అన్‌వూపొడక్టివ్ కావ డం లేదా అని అడగాలనిపించింది. కానీ ఆఖరి ప్రశ్నతో చర్చ ఎక్కడో ఆగిపోయింది.

కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖ మంత్రి నారాయణ స్వామి వచ్చీ రావడమే దాడి మొదలుపెట్టారు. చాలా హుషారుగా మాట్లాడారు. అవినీతి సమస్యను అన్నా హజా రే ఎత్తుకోకముందే తాము లోక్‌పాల్ బిల్లును రూపొందించామని చెప్పారు. మీడియా ఎక్కువ చేస్తున్నదని, మీడియా ట్రయల్ మానుకోవాలని సూచించారు. ప్రభుత్వంలో అవినీతిని నిర్మూలించడానికి చాలా కష్టపడుతున్నట్టు చెప్పారు. సీబీఐ నిర్ణయాలతో తమకు సంబంధమే లేదని చెప్పారు. ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయింది.

డిఎంకే స్టాలిన్ నివాసంపై దాడి చేయడాన్ని గుర్తు చేస్తే, అక్రమంగా కార్లు దిగుమతి చేసుకుంటే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఆదేశాల ప్రకారం సోదాలు జరిగాయని మంత్రి సెలవిచ్చారు. ఎప్పుడో దిగుమతి చేసుకున్న కార్లకు, తీరా మద్దతు ఉపసంహరించుకున్న మరుసటిరోజు ఎందుకు సోదాలు చేశారంటే ఆయన గతుక్కుమన్నా రు. ఈ సమయంలో చేయడం కరెక్టుకాదని ప్రధాని ఒప్పుకున్నారు కదా అని చెప్పారు. ఐఎఎస్, ఐపీఎస్‌ల పనితీరును పదిహేనేళ్లకు ఒకసారి, ఇరవై ఐదేళ్లకు ఒకసారి సమీక్షించి, పనికిరానివారిని ఇంటికి పంపిస్తామని అందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. మంత్రులు కృష్ణ తీర్థ, అజయ్ మాకెన్‌లు చెప్పిన అంశాలు కొంత ప్రయోజనకరంగా ఉన్నాయి. అజయ్ మాకెన్ గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన రంగంలో తేబోతున్న సంస్కరణల గురించి చాలా చెప్పారు.

ఆకర్షణీయంగా, జనరంజకంగా ఉన్నాయి. అయితే అమలు కావడమే కష్టమనిపించింది. పట్టణ పేదలు కొలేటరల్ సెక్యూరిటీ లేక ఇళ్లు కొనుక్కోలేకపోతున్నారని, వారికి సెక్యూరిటీ ఇచ్చేందుకు ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టాన్ని తేబోతున్నామని చెప్పారు. కొనుగోలుదారుల రక్షణకోసం ఈ చట్టంలో చాలా మంచి ప్రతిపాదనలే చేశారు. కానీ చాలామంది సంపాదకులు ‘ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంద ని నమ్ముతున్నారా? రియల్టర్లలో ఎక్కువమంది రాజకీ య నాయకులే ఉన్నారు కదా?’ అని అక్కడే సందేహం వ్యక్తం చేశారు. ఆయన తామయితే ప్రయత్నిస్తున్నామని చెప్పా రు. ఆయన మంచి విషయాలు చాలా చెప్పారు కాబ ట్టి, చెడ్డ విషయాల చర్చ ఎక్కువగా జరగలేదు. ఈ సదస్సుకు భాషా పత్రికల వారిని మాత్రమే పిలిచినట్టు స్పష్టమయింది.

సదస్సు ముగిసిన తర్వాత మరుసటిరోజు ఉదయం ఏడు గంటలకు ఒక జర్నలిస్టు మిత్రుడు, నేను వాకింగ్‌కు బయలు దేరాము. కొత్త ఢిల్లీని నడిచి చూస్తే కానీ అర్థం కాద ని ఆ రెండు రోజుల అనుభవం తెలిపింది.ఆంధ్రభవన్ నుంచి ఇండియా గేట్ అక్కడి నుంచి అక్బర్‌రోడ్, జన్‌పథ్, అక్కడి నుంచి కేంద్ర సచివాలయ భవనాలు, రాష్ట్రపతి భవనం, పార్లమెంటు భవనం...తిరిగి ఆంధ్రాభవన్ సుమారు 12కిలోమీటర్లు నడిచాం. మధ్యమధ్యలో మిత్రుడు ఢిల్లీ విశేషాలు చెబుతున్నాడు.‘ఇక్కడ సంఘజీవితం మిస్సవుతాం. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉంటాయి, కానీ ఎక్కువ జీవితానందాన్నిచ్చే చిన్న చిన్న ముచ్చట్లు కరువవుతాయి’అంటారాయన. విశాలమైన రోడ్లు,అంతకంటే విశాలమైన భవంతులు.అక్కడ నడుస్తుంటే మనుషుల మధ్య నడుస్తున్నట్టు అనిపించలేదు.

గోడల మధ్య నడుస్తున్నట్టు అనిపించింది.‘అది ఆత్మలేని నగరం’ అని ఒక జర్నలిస్టు మిత్రుడు అంతకుముందు తరచూ అంటుండేవారు. ఆయన అలాఎందుకు అనేవారో అక్కడ తిరుగుతుంటే అనిపించింది.అందమైన నగరం. అద్భుతమైన డిజైను. గీత గీసినట్టుండే రాజపథాలు, జనపథాలు, శాంతిపథాలు. షడ్భుజి జంక్షన్‌లు.అడుగడుగునా గోల్ చక్కర్‌లు.రోడ్ల పొడవునా పూలతివాచీలు. బారులుతీరిన వృక్షాలు. కానీమనుషులేరీ. ‘మాసారు (ఎంపీ) లేకుంటే మూడెకరాల ఇంట్లో ఉండడానికి మాకు భయమేస్తుంది’ అన్నాడోగార్డు. సోనియాగాంధీ నివసించే టెన్ జనపథ్ చాల పెద్ద భవం తి. దానికి మూడు దారులున్నాయి. ప్రధాన ద్వారం నుంచి సోనియా, ప్రధాని మాత్రమే ప్రవేశిస్తారట. మిగిలిన వాళ్లంతా అక్బర్‌రోడ్డు వైపు ఉన్న మరో ద్వారం నుంచి ప్రవేశిస్తారట.సోనియాగాంధీ ఇంటిని ఆనుకుని అక్బర్‌రోడ్డులో ఎఐసిసి కార్యాలయం ఉంటుంది. సోనియాగాంధీ ఎఐసిసి కార్యాలయానికి రావలసి వచ్చినప్పుడు రెంటి మధ్య ఉన్న ద్వారం నుంచి నేరుగా వస్తారట.

‘సోనియాగాంధీ గురించి చాలామంది చాలా అనుకుంటారు కానీ వాస్తవానికి ఆమె బలహీనురాలు. చాలా సున్నిత మనస్కురాలు. ఎవరయినా కష్టాలు చెబితే కరిగిపోతారు. కన్నీరు పెడతారు. సాహసించి ఏ నిర్ణయమూ చేయలేరు. చుట్టూ ఉండేవారిపైనే ఎక్కువగా ఆధారపడతారు’ అన్నారు దారిలో కలిసిన మరో మిత్రుడు.‘రాహుల్‌గాంధీ విడిగా ఉంటారు. ఆయన ప్రపంచం వేరే. ఆయన అప్పుడప్పుడూ తల్లి వద్దకు వచ్చిపోతుంటారు. ఆయనకంటే ప్రియాంకాగాంధీనే ఎక్కువ గా తల్లితో గడుపుతుంటారు. ఇన్నేళ్లయినా రాహుల్‌గాంధీ ఎటువంటి ప్రత్యేక ముద్ర నూ సంపాదించుకోలేకపో యారు. ఆయనకు ఏదో ఆటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు అనిపిస్తుంది’ అన్నారాయన. ఇంతవిశాలమైన నివాసాల్లో ఉంటు న్నా సొం తంగా వీళ్ల పేరుమీద ఒక్క ఆస్తి కూడాలేదట! మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాకు అంతులేని ఆస్తులు పోగయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

జనపథ్ మీదుగా రాజ్‌పథ్ చేరుకుని రైసినాహిల్స్ దాకా నడుస్తూ వెళ్లాము. ఆధునిక రాజ వూపసాదాల సముదాయం. ఒక పక్క సౌత్‌బ్లాక్. ఇక్క డ ప్రధాని, ఆంటోని, సల్మాన్ ఖుర్షీద్ ఆఫీసులు ఉం టాయి. మరోపక్క నార్త్ బ్లాక్ ఇక్కడ చిదంబరం, షిండే, తదితరుల కార్యాలయాలు ఉంటాయి. ఉదయం ఎనిమిది అవుతోంది. మంత్రుల చేంబర్లలో ఏరోజుకారోజు అలంకరించడం కోసం అప్పుడే పూలబుట్టలు వచ్చాయి. రంగు రంగుల పూల బుట్టలు. కేంద్ర బడ్జెట్ తయారయ్యేది నార్త్ బ్లాక్‌లోని ఒక నేలమాలిగలో అని మిత్రుడు చెబితే ఆశ్చర్యంవేసింది. ఆర్థిక నియంవూతణ వ్యవస్థలన్నీ ఆ భవనంలోనే ఉంటాయట.
అవి దాటుకుని మరో యాభై అడుగులు ముందుకు వెళితే రాష్ట్రపతి భవనం.‘ప్రణబ్ ముఖర్జీ రాక ముందు రాష్ట్రపతి భవనం వైపు రావాలంటే ఎన్నో ఆంక్షలు, నిబంధనలు ఉండే వి. ఆయన వచ్చిన తర్వాత అన్నీ సడలించారు.

మీడియాను లోపలికి అనుమతిస్తున్నారు. వచ్చీపోయే నాయకులు కూడా ఎక్కువే. ఢిల్లీ రాజకీయాలపై తన పట్టును కొనసాగించే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్రపతిభవన్‌కు రాకపోకలను సులభతరం చేశారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు’ అని మరో సీనియర్ జర్నలిస్టు వివరించారు. న్యూఢిల్లీని కింగ్‌జార్జి 5 ఆదేశాల మేరకు ల్యూటెన్ అనే ఆర్కిటెక్ట్ ప్లాన్ చేశారు.1911లో నిర్మాణం మొదలుపెట్టి 1931లో పూర్తిచేశారు. భారతదేశంలో తమ అధికారం శాశ్వతం అనుకుని నిర్మించినట్టున్నారు. ఎక్కడా రాజీపడలేదు. అద్భుతమైన లే అవుట్. సచివాలయ భవనాలు తప్ప, నివాసభవనాలన్నీ ఒకే అంతస్తుతో నిర్మించారు. అక్కడక్కడా కొందరు కొత్తగా రెండో అంతస్తులు నిర్మించారు. నార్త్ బ్లాక్‌ను దాటుకుని ముందుకు వస్తే పార్లమెంటు భవనం.అక్కడి నుంచి మరికొంత దూరం నడిస్తే కృషిభవన్. ఆ పక్కనే పచ్చిక బయళ్లు. ఫౌంటెన్‌లు. రోడ్డు వెంట వరుసగా వృక్షాలు.

రాజపథానికి సమాంతర పథం అది. మోస్ట్ హాపెనింగ్ సిటీ. రక్షక వాహనాలు ఎప్పుడూ పరుగులు తీస్తుంటాయి. రాత్రి పన్నెండు దాకా జనం బిరబిరా తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున రెండు నుంచి మళ్లీ రోడ్లు కళకళలాడుతూనే ఉంటాయి. అయినా అక్కడ ఎవరికి ఎవరు?
కృషి భవన్‌కు అల్లంత దూరంలో ఒక చెట్టు. అక్కడే ఒక గుండె తన్లాడింది. అక్కడే ఒక హృదయం వికలమైంది. అక్కడే ఒక యువకుడు ఉరితాడును ముద్దాడింది.ఆ చెట్టు కు ఒక శవంవేలాడింది. ఆ శవం తెలంగాణది. ఆ యువకుడు యాదిడ్డి. దుర్భేద్యమైన ఢిల్లీ ఆత్మను బద్దలు కొట్టి తెలంగాణవాదాన్ని వినిపించడానికి యాదిడ్డి వెయ్యిమైళ్లు ప్రయాణించి వచ్చాడు. పార్లమెంటుకు యాభై మీటర్లదూరంలో మృత్యుపాశాన్ని అలుముకున్నాడు. అయినా ఘనీభవించిన ఆ ఆత్మలు చలించలేదు. చివరికి యాదిడ్డి శవాన్ని తీసుకోవడానికి ఆంధ్రభవన్ కూడా నిరాకరించింది. అవును- ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావుకే ఆరడుగుల నేల ఇవ్వని నగరం ఇది. ఇది ముమ్మాటికీ ఆత్మలేని నగర మే. ప్రజలకు ఢిల్లీ ఎంతో దూరం. ఇక్కడ సమిష్టి ఆత్మ(8OLLE8TIVE SOUL) లేదు.

[email protected]

273

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా