కత్తుల కోలాటం


Sat,March 16, 2013 12:59 AM

kiran-kumar-chandrababuఅక్కడ కొన్నేళ్లుగా కత్తుల కోలాటం జరుగుతోంది. గుంపులు గుంపులుగా అందరూ కత్తులు తిప్పుతూనే ఉంటారు. భీకరంగా యుద్ధం చేస్తున్నట్టు అందరి నొసళ్ల నుంచి చెమట ధారలు కడుతుంది. కానీ ఒక్క రక్తం చుక్క కింద పడదు. లక్ష్య సాధన దిశగా ఒక్క అడుగు ముందుకు పడ దు. కత్తులు తిప్పేవాళ్ల స్థానాలు మారవు. ఏ గుంపూ ఇంకో గుంపును కలుపుకోదు. అసలది యుద్ధమే కాదు. శత్రువు ఎక్కడో దూరంగా నిలబడి వికటాట్టహాసం చేస్తుంటాడు. కేంద్రం వినోదం చూస్తూ ఉంటుంది. ఆశనిరాశల అల్పపీడనాలు పిల్లల ఉసురుతీస్తుంటాయి. ఆత్మహత్యలు అలవాటయ్యాయి. ఆగ్రహావేశాలు చల్లారిపోయాయి. కొట్లాడేవాళ్లు అలసిపోతున్నారు.

ఇక రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు మాత్రం మిగిలాయి. క్రమం గా తెలంగాణ ఉద్యమం ఊపిరి తీయడం ఎలాగో సూచిస్తూ శ్రీకృష్ణ కమిటీ రాసిచ్చిన నివేదిక అక్షరాలా అమలవుతున్నది. పార్టీలను, వ్యక్తులను, ఉద్య మ సంఘాలను ఎలా మేనేజ్ చేయాలో, వీలైనంత ఎక్కువకాలం సాగదీసి ఉద్యమ ఉష్ణోక్షిగతను ఎలా తగ్గించాలో శ్రీకృష్ణకమిటీ ఉపదేశించింది. అటు కేంద్రమూ, ఇటు రాష్ట్రమూ అదే మంత్రాన్ని పఠిస్తున్నాయి. ఆచరిస్తున్నా యి. తెలంగాణ ఉమ్మడి ఆకాంక్షను, దాని చుట్టూ అలుముకున్న ఆవేశకావేశాలను చల్లార్చాలంటే తెలంగాణ సమాజాన్ని చీల్చాలి. ఎక్కడికక్కడ వ్యక్తిగత ఎజెండాలతో చీలిపోయే పరిస్థితి కల్పించాలి. సహకార ఎన్నికలయిపోయాయి. స్థానిక ఎన్నికలు పెట్టాలి. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలి.

పదవుల కోలాటంలో తెలంగాణ సమాజం ఉమ్మడి ఆకాంక్షను మరచిపోయేదాకా ఈ మంత్రాంగం నడిపించాలి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చి నా పార్లమెంటు ఎన్నికలు వచ్చినా ఉమ్మడి తీర్పులు ఉండవు. ఇదీ కాంగ్రెస్ వ్యూహం. చంద్రబాబు వ్యూహం కూడా ఇదే.
అవిశ్వాసం విషయంలో చంద్రబాబు వెనుకడుగు వేయడానికి కారణం ఇటువంటి ఎత్తుగడే. ఇప్పుడు అవిశ్వాసం పెట్టి, అది నెగ్గి ప్రభుత్వం పడిపోతే ఎవరికి లాభం? చంద్రబాబు ఈ ప్రశ్న వేసుకుని, సమాధానం చెప్పుకుని, ఛత్ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వను పొమ్మన్నాడు. నిజానికి అవిశ్వాసం నెగ్గేదా? నెగ్గే ప్రమాదం ఉందని చంద్రబాబు భావించారు.

నెగ్గితే వెంటనే ఎన్నికలు వస్తాయని, అది సీమాంవూధలో జగన్‌కు, ఇక్కడ టీఆస్‌కు ఉపయోగపడుతుందని భావించాడు. జగన్ ప్రభావం క్రమంగా తగ్గుతోందని, ఆయన పాపులారిటీ గ్రాఫ్ పడిపోతున్నదని తెలుగుదేశం అనుకూల రాజకీయ విశ్లేషకులు చంద్రబాబును నమ్మించగలుగుతున్నారు. ఇంకొంతకాలం ప్రభుత్వం పడిపోకుండా చూడగలిగితే జగన్ ప్రభావం ఇంకా తగ్గిపోవచ్చని కూడా వారు బాబుకు భరోసా ఇస్తున్నారు. నిజమే జగన్ పాపులారిటీ గ్రాఫ్ పడిపోతున్నమాట వాస్తవం. పార్టీ ప్రారంభించిన నాటి ఊపు, వాపూ ఇప్పుడు లేదన్నదీ నిజం. అర వై శాతాలు, యాభై శాతాలు నలభై శాతాలకు పడిపోయిన సంగతీ తెలిసిందే. కానీ సాధార ణ ఎన్నికల్లో, అదీ త్రిముఖ పోటీలో 35 శాతం ఓట్లు ఏ పార్టీనైనా గెలిపిస్తాయన్నది చారివూతక అనుభవం.

2009 ఎన్నికల్లో రాజశేఖర్‌డ్డి కేవలం 36.55 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు చెమటోడ్చడం వల్ల కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో కాస్త పరిస్థితులు మెరుగుపడవచ్చు. కానీ గత ఎన్నికల్లో 28.12 శాతానికి పడిపోయిన ఆయన ఓటు బ్యాంకు ఏకంగా 35 శాతానికి ఎగబాకే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. గత ఎన్నికల్లో చిరంజీవి పార్టీకి వచ్చిన ఓట్లు కొన్ని తెలుగుదేశం పార్టీకి తిరిగి వస్తాయనుకున్నా, తెలుగుదేశం నుంచి జగన్ చీల్చుకుంటున్న ఓట్లు తక్కువేమీ కాదు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కంటే తెలుగుదేశం నుంచి జగన్ పంచన చేరినవారే ఎక్కువ. ఆయన పాదయాత్ర ముందుకు సాగే కొద్దీ ఒక్కొక్క ఎమ్మెల్యే జారిపోతున్నారు. 2009లో 92 మంది ఎమ్మెల్యేలు కలిగిన తెలుగుదేశం వాస్తవిక బలం ఇప్పుడు 76కు పడిపోయింది. ‘2000 కిలోమీటర్లు నడిచి పార్టీని మూడు వేల కిలోమీటర్లు వెనుకకు తీసుకుపోయారు’ అని సీనియర్ తెలుగుదేశం నాయకుడు దాడి వీరభవూదరావు ఆవేశంలో అన్నప్పటికీ అందులో అర్థం ఉంది.

కత్తి, డాలు పట్టుకుని యుద్ధం చేయవలసిన ప్రతి సందర్భంలో చంద్రబాబు పలాయనవాదం అవలంబిస్తున్నారు. ఎవరో ఒకరిని తోకలుగా చిత్రిస్తూ చివరకు తనే కాంగ్రెస్‌కు తోకగా తేలిపోతున్నారు.
అంత మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీని అతలాకుతలం చేయగలిగిన సత్తాకలిగిన ప్రధాన ప్రతిపక్షం లక్ష్యాన్ని మరచిపోయింది. ఫోకస్ కోల్పోయింది. నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, ఆ పార్టీ అనుకూల మీడియా, కేంద్రం అందరూ అవసరమైన దానికంటే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి జగన్‌ను మహానాయకుడిని చేశారు. పోతే దొరకడన్నట్టు మూకుమ్మడిగా దాడి చేశారు. వీళ్ల దాడిని చూసి జనమే విస్తుపోయారు. అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ జనానికి మాత్రం వీళ్ల చేతిలో బాధితునిగా కనిపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్.

జగన్ నేరాలన్నీ కాంగ్రెస్ నేరాలే అవుతాయి. ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ అయితే, రెండో ముద్దాయి జగన్ అవుతారు. కానీ తెలుగుదేశం ఈ చిన్న లాజిక్‌ను విస్మరించి, కాంగ్రెస్ జోలికెళ్లకుండా జగన్ మీద కాన్‌సంవూటేట్ చేశారు. అది అనేకసార్లు మిస్‌ఫైర్ అయింది. అవుతూనే ఉంది. అవిశ్వాసం సందర్భంగా కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు. టీఆస్ తీర్మానానికి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోయినంత మాత్రాన ఇంత వివాదం కొనుక్కోనవసరం లేదు. నిజానికి ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబే ముందుగా చొరవ తీసుకుని ప్రభుత్వంపై అవిశ్వాస యుద్ధం ప్రకటించి ఉండాల్సింది. ఒక చారివూతక అవకాశాన్ని గాలికి వదిలేశారు. టీఆస్ ముందుకు వచ్చిన తర్వాత కూడా తాము స్వయంగా అవిశ్వాసం పెడతామని, టీఆస్ తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించి ఉంటే సరిపోయేది. కానీ చంద్రబాబు ఆ విషయం చెప్పడంలో తన ఆక్రోశాన్ని, అక్కసును దాచుకోలేకపోయారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సింది పోయి, టీఆస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను టార్గెట్ చేసుకుని మాట్లాడారు. అవిశ్వాసం వల్ల ఏదో జరుగబోతోందన్న చంద్రబాబు తత్తరపాటే ఆయన తప్పుడు నిర్ణయాలకు కారణం. తద్వారా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ రక్షకునిగా మరోసారి ముద్ర వేయించుకున్నారు. అసెంబ్లీ లో కాంగ్రెస్, తెలుగుదేశం శాసనసభ్యులు కలసి సంబరపడేదాకా వ్యవహారం వెళ్లిందంటే ప్రజ లు దీనిని ఎలా అర్థం చేసుకుంటారు? చంద్రబాబు కొత్తగా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం సంగతి దేవుడెరుగు, ఉన్నది పోకుండా కాపాడుకునే సాహసాన్ని కూడా ప్రదర్శించడం లేదు. కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలను రెంటినీ దోషులుగా నిలబెట్టకుం డా ఆయన ఎంత పాదయాత్ర చేసినా ఆశించిన ఫలితాలు రావు.

అవిశ్వాసం టీఆస్ పెట్టినా, చివరకు చంద్రబాబు పెట్టినా వెంటనే నెగ్గే అవకాశాలు ఎంతమాత్రం లేవు. అత్యధికశాతం మంది ఎమ్మెల్యేలు సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఏడాది ముందుగా ఎందుకు పదవి వదలుకోవడం అని ఆలోచించేవారే అధికం. పైగా కాంగ్రెస్ తన సన్నాహాల్లో తాను ఉన్నది. పరీక్ష అనివార్యమైతే అటు టీడీపీలో, ఇటు కాంగ్రెస్‌లో జగన్‌తో చేయి కలుపుతారన్న అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను కొందరిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ యోచించినట్టు చెబుతున్నారు. సభలో సభ్యుల సంఖ్యను 280కి తగ్గించగలిగితే, 141 మంది మద్దతుతోనయినా నెగ్గుకురావచ్చని కాంగ్రెస్ పెద్దలు భావించారట. అయితే టీడీపీ కోయిల తొందరపడి ముందే కూసింది. పరిస్థితి అంతదాకా రాకముందే జెండా ఎత్తేసింది. అవిశ్వాస తీర్మా నం శాసనసభలో ఒక అర్థవంతమైన సమీక్షకు సందర్భం. ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, తప్పుల బోనులో నిలబెట్టడానికి ఒక అవకాశం. కానీ విడ్డూరం ఏమం ప్రతిపక్ష శిబిరమే చీలిపోయింది. పరస్పరం కత్తులు దూసుకుంటున్నది. ఉన్నంతలో అధికార పక్షమే ఐక్యంగా ఉన్నది. ఇది ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపుతుంది?

టీఆస్ లక్ష్యం కూడా అవిశ్వాసాన్ని నెగ్గించాలని కాదు. తెలుగుదేశం పార్టీని బోనులో నిలబెట్టాలన్నదే. తెలుగుదేశం ఎవరి సరసన నిలబడుతుం దో రుజువు చేయడమే. ఆ మేరకు విజయం సాధించింది. కానీ కాంగ్రెస్, తెలుగుదేశంల సాగదీత సిద్ధాంతాన్ని, రకరకాల ఎన్నికలతో తెలంగాణ సమాజాన్ని నీరుగార్చే వ్యూహాన్ని ఎదుర్కోవడానికి కేవలం రాజకీయ ఎత్తుగడలు చాలవు. ఉద్యమ వాతావరణం లేకుండా టీఆస్ రాజకీయ లబ్ధి పొందడం అసాధ్యం. స్థానిక సంస్థల ఎన్నికలయినా, మున్సిపాలిటీ ఎన్నికలయినా, చివరకు అసెంబ్లీ ఎన్నికలయినా తెలంగాణ వేడి లేకుండా టీఆస్ ఎదుర్కోలేదు. శాంతికాలపు ఎన్నికలేవీ టీఆస్‌కు అచ్చిరాలేదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా జిల్లాల్లో టీఆస్‌కు బలమైన పునాదులు లేవు. కార్యకర్తలు లేరు. శాఖలు లేవు. పోలింగ్ బూత్ వద్ద నిలబడి ఓటు వేయించే యంత్రాంగం లేదు. వరుస ఎన్నికల్లో ఒకటే మంత్రం కూడా పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఒకే అంశంపై పదేపదే ఓటడిగితే జనంలో విముఖత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఉద్యమం ఒక్కటే టీఆస్‌కు, తెలంగాణ వాద పార్టీలకు శ్రీరామరక్ష.

[email protected]

407

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా