అవినీతి చంద్రుడు


Sat,August 27, 2011 07:55 PM

నాపై నిరాధార ఆరోపణలు ఎన్నెన్నో చేస్తున్నారు. రెండెకరాల ఆసామి రెండు వేలకోట్లు సంపాదించారంటున్నారు... ఎవరైనా సరే వెయ్యి కోట్లివ్వండి...వారికి మా కుటుంబ సభ్యులం కలసి ఆస్తిపాస్తులన్నీ రాసిచ్చేస్తాం.

-మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుbabu-caricature-telangana-N talangana patrika telangana culture telangana politics telangana cinemaచంద్రబాబు వంద కోట్లు ఇస్తే ఆస్తులన్నీ రాసిస్తా అనలేదు. రెండు వందల కోట్లు ఇవ్వమని కూడా అడగలేదు. మూడు వందల కోట్లు అడగడం చాలా తక్కువని భావించి ఉంటారు. ఐదువందల కోట్లు అంటే ఇరుక్కుపోతానని అనుకున్నారేమో! వెయ్యికోట్లకు తగ్గలేదు. మనసులో ఉన్నదే మాటలోకి వస్తుంది. రాజకీయాల్లో నిజాయితీగా ఉంటూ వెయ్యికోట్లు సంపాదించవచ్చని బాబుగారు భావిస్తున్నారే మో! కానీ అసాధ్యం. 1988లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబునాయుడు తన వార్షికాదాయం 1,44,480 రూపాయలు అని స్వయంగా ప్రకటించుకున్నారు. 1994లో కంపెనీ రిజిస్ట్రార్‌కు సమర్పించిన హెరి ఫుడ్స్ ప్రాస్పెక్టస్‌లో ‘చంద్రబాబు నాయుడుకు ఏ పరిశ్రమతోగానీ, వ్యాపార కార్యకలాపాలతో కానీ సంబంధం లేదు’ అని పేర్కొన్నారు. ఈ పదిహేడేళ్లలో అదిప్పుడు వెయ్యికోట్లకో ఎనిమిది వందలకోట్లకో పెరిగినా అది అసాధారణమే.

ఐదువందల కోట్లకు పెరిగినా అది అసహజాభివృద్ధే. రెక్కల కష్టం మీద ఆధారపడిన రైతు ఈ ఇరవై రెండేళ్లలో ఉన్న భూమిని కోల్పోకుండా ఉంటే గొప్పవాడు. కేవలం రెక్కల కష్టం పెట్టుబడిగా బతుకుతున్న కూలీ మూడు పూటలా తిన గలిగితే ఘనం. జీతమే జీవితంగా జీవించే ఎన్‌జీఓ ఒక బొమ్మరిల్లు కట్టుకోగలిగితే గొప్ప విజయం. వ్యాపారం చేసేవారు, పరిశ్రమలను నడిపించేవారు సైతం తమ ఆస్తులను ఐదు రెట్లో పది రెట్లో పెంచుకోగలిగితే అసాధారణమే. తమ ఆస్తులను మూడొందల రెట్లు, నాలుగొందల రెట్లు పెంచుకున్న వాళ్లంతా ఏమి చేసి ఉండాలి? రాజకీయాల్లో, ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడి అయినా ఉండాలి. పారిశ్రామికవేత్తలు వ్యాపారం కాకుండా దానిని అడ్డుపెట్టుకుని మరేదో చేసి ఉండాలి. ఇదంతా కామన్‌సెన్స్‌కు తెలిసే విషయం. అవినీతిలో పెద్ద గీతలు చిన్న గీతలు ఉండవచ్చు. జగనూ, చంద్రబాబు ఉండవచ్చు. జగన్ అవినీతి పెద్దది కాబట్టి చంద్రబాబు అవినీతి మాసిపోదు. చంద్రబాబు ఎంత తెలివైన వారంటే, కాంగ్రెసోళ్లు వెయ్యికోట్లు ఇస్తే వాటిని కూడా ఎన్‌టిఆర్ ట్రస్టు కు, బసవతారకం ట్రస్టుకు ఇస్తారట. రెడ్‌క్రాస్ సొసైటీకో, ఉస్మానియా ఆస్పత్రికో, నిమ్స్ ఆస్పత్రికో, గుంటూరు ఆస్పత్రికో ఇస్తాననలేదు. తాను నడిపించుకుంటున్న ట్రస్టులకే ఇచ్చుకుంటారట. డొల్లతనం నిండుగా ఉన్నప్పుడు ఇలాంటి పొల్లు సవాళ్లే పుడతాయి.

ప్రధానికి ధైర్యసాహసాలు ఉన్నాయి కాబట్టే సంకీర్ణ భాగస్వామ్య పార్టీకి చెందిన ఓ మంత్రి, ఎంపీ అవినీతి కేసులో తీహార్ జైలు కెళ్లారు. అధికారం పోయే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పాలిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం అస్థిరపడే ప్రమాదం ఉందని తెలిసినా అక్కడా సిబిఐ దాడులు జరుగుతున్నాయి.

-కాంక్షిగెస్ ఎంపీ, కాంట్రాక్టర్ కావూరి సాంబశివరావుచంద్రబాబు, జగన్‌బాబు అవినీతి వ్యతిరేక ఢంకారావాలకు కావూరి వారి అవినీతి వ్యతిరేక వీరోచిత ధైర్యసాహస ప్రకటనలకు సారూప్యం ఉంది. బాబులిద్దరూ అన్నా హజారే కీర్తనలను ఆరున్నొక్క రాగంలో అందుకుంటే, కావూరివారు మన్మోహనుని దివ్యమనోహర మహాద్భుత నిష్కళంక నీతినిజాయితీలను గురించి శంకరాభరణ రాగమే అందుకున్నారు. నీతిమంతుడికి నీతిమంతుడు సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. నీతిమంతుడికి అవినీతిపరులు సర్టిఫికెట్ ఇస్తే జనం ముక్కున వేలేసుకుంటారు. అవినీతి పరునికి అవినీతి పరుడు సర్టిఫికెట్ ఇస్తే జనం నవ్విపోతారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్న దర్యాప్తులు, విచారణలు, అరెస్టులు అన్నీ మన్మోహనులవారి ఘనతే అన్నట్టు కావూరివారు బిల్డప్ ఇచ్చారు. కానీ కావూరివారు ఎప్పటిలాగే అబద్ధాలు పోగేసి, ప్రధాని వద్ద మార్కులు కొట్టేసే కుట్రపన్నారని కుంభకోణాల చరిత్ర చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2జీ కుంభకోణం, కామన్ గేమ్స్ కుంభకోణం, ఇప్పుడు జగన్‌పై నడుస్తున్న విచారణ ఇవేవీ ఏలినవారు మన్మోహనుల దయవలన వెలుగు చూసినవి కావు.

మంత్రులు, ఎంపీలు అరెస్టులు కావడం తీహారు జైలు కెళ్లడం కూడా ప్రధాని ధైర్యసాహసాల వలన కాదు. రాజా, కనిమొళి, సురేశ్ కల్మాడీలు జైలు ఊచలు లెక్కబెట్టడానికి కారణం సుప్రీంకోర్టు, ప్రత్యేక న్యాయస్థానాలు. జగన్మోహన్‌డ్డి కేసులో కూడా హైకోర్టు ఆదేశాలను కవచంగా పెట్టుకునే సిబిఐ విచారణ జరిపింది తప్ప ‘నిజాయితీపరుడయిన’ మన్మోహనుని కృప వల్ల కాదు. ఈ కుంభకోణాలను ముందుగా తవ్వి తీసింది కూడా సిబిఐ కాదు. జర్నలిస్టులు ఒకవైపు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సిఎజి) ఇంకోవైపు ఈ అక్రమాలను తవ్విపోసిన తర్వాత, సుబ్రమణ్యస్వామి, ప్రశాంత్ భూషణ్ వంటివారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత, అప్పుడుగానీ ధృతరాష్ట్రులవారు మేల్కొనలేదు. ఆ క్షణంలో కూడా భాగస్వామ్యపక్షాలకు వీలైనంత నొప్పికలగకుండా ఎలా చేయడం అన్నదానిపైనే ప్రధాని కాపుగాశారు. సైంధవ పాత్ర పోషించడానికి చేయని ప్రయత్నమంటూ లేదు.

కానీ కోర్టులు వీరిని చొరబడనీయలేదు. 2జి కుంభకోణంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంలో కూడా కేంద్రం పిల్లిమొగ్గలు వేయడానికి ప్రయత్నించింది. కానీ సుప్రీంకోర్టు కేంద్రానికి సందివ్వలేదు. అందువల్ల పార్లమెంటులో కావూరి వారిది కంఠశోష తప్ప కానికి పనికి వచ్చేది కాదు. కుంభకోణాల మంత్రివర్గానికి అధ్యక్షత వహించిన వారు, ధైర్యవంతుడు, సాహసి కాక ఏమవుతాడు. పిరికివాడు నేరం చేయలేడు.

పౌర సమాజం సభ్యులు తామే చట్ట సభల సభ్యులైనట్లుగా ప్రవర్తిస్తున్నారు. పౌరసమాజం ఉద్యమానికి భారత ప్రభుత్వం ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నదని హనోయిలో నన్ను అడిగారు.

-కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీచట్టసభల సభ్యులు ఆముదం పూసుకున్న వస్తాదుల్లా, ఇంకా చెప్పాలంటే ప్రణబ్ ముఖర్జీలాగా, జనం అవసరాలకు దొరకకుండా జారిపోతూ ఉంటే జనం చట్టసభ సభ్యుల్లా కాక ఎలా వ్యవహరిస్తారు? సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రులు ఆ సమస్యను పాతరేయడానికో, వాయిదా వేయడానికో శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే పౌర సమాజం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోక ఏం చేస్తుంది? పార్లమెంటు బాధ్యతను ప్రజలపైకి, పార్టీలపైకి నెట్టి మీరూ మీరూ తేల్చుకోండి అని తమాషాలు చూస్తూ ఉంటే, ప్రజలు చట్ట సభల సభ్యుల్లా కాక మరెలా వ్యవహరిస్తారు? పౌర సమాజం లేదా ప్రజా ఉద్యమాల ఒత్తి డి లేకుండా ఒక్క మంచి చట్టమైనా రూపు దాల్చిందా? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మొదలు, సమాచార హక్కు చట్టం వరకు అనేక చట్టాలు సామాజిక కార్యకర్తలు కోర్టులకు వెళ్లి ఆదేశాలు తెస్తేనో, ఉద్యమాలు చేస్తేనో వచ్చినవే కాదా? కర్ర విరగకుండా పాము చావకుండా సమస్యను దాటవేయడంలో ప్రణబ్‌ముఖర్జీది ఎనలేని ప్రతిష్ఠ. ఆయన చర్చించి, ఒప్పించి, ఉద్ధరించిన సమస్య ఒక్కటీ లేదు. ఆయన పెద్దరికంలో లోక్‌పాల్ వివాదమూ పరిష్కారమయ్యే అవకాశం లేదు.

కొసమెరుపు
అన్నా హజారే చేత దీక్ష మాన్పించాలంటే ఏం చేయా లి? ఒక జర్నలిస్టు మిత్రుడు ఇచ్చిన సలహా విస్మయాన్ని, ఒకింత ఆశ్చర్యాన్నీ కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్‌ను ఆయనకు చెరోపక్క కూర్చోబెడితే చాలు-హజారే బతుకుజీవుడా అని పారిపోతాడు అని ఆ మిత్రుడు చెప్పారు. వీరిద్దరూ హజారే దీక్షకు మద్దతు ప్రకటించారు. లోకాయుక్త పరిధిలో మంత్రులను, ముఖ్యమంత్రి చేర్చడానికి ససేమిరా నిరాకరించిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు ఏకంగా ప్రధానిని కూడా లోక్‌పాల్ పరిధిలో చేర్చాలంటున్నారు. అధికారం లేనప్పుడు నాయకులు మునుపెన్నడూ లేనంత దేశభక్తులవుతారంటారు. చంద్రబాబును చూస్తే అది అర్థమవుతున్నది. డబ్బు సంపాదనలో కొత్త ఒరవడి సృష్టించి, ఆర్థిక నిపుణులకే కొత్త పాఠాలు నేర్పిన జగన్ అవినీతికి వ్యతిరేకంగా హజారే కంటే గట్టిగా గళం విప్పుతున్నారు. విడ్డూరం...విధి వైపరీత్యం.

చరిత్ర ఏం చెప్పింది?
‘ఆంధ్ర, తెలంగాణల విలీనీకరణ ఒక వివాహం వంటిదని చెప్పవచ్చు. అన్ని వివాహాల వలెనే దీనిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, చెడు లక్షణాలూ ఉన్నాయి. ఇరువురు శ్రేయోదాయకంగా వర్ధిల్లడానికి అవకాశాలు ఉన్నట్లే విభిన్న స్వభావాల మూలంగా ఘర్షణలు బయలుదేరి పరిపాలనా నిర్వహణకు అంతరాయం కలిగే ప్రమాదమున్నది కూడా. అందువల్ల ఎదుటివారి అభిమతాన్ని గ్రహించి సర్దుకుపోయే నేర్పును ఉభయులు ప్రదర్శించాలి’- 1956 నవంబరు 1న అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగ పాఠం ‘ఆంధ్రమహాసభ’ దినపత్రిక నుంచి. నెహ్రూ రెండు ప్రాంతాల విలీనంలోని వైరుధ్యాలను గుర్తించే, కీడెంచి, మేలెంచారు. కానీ ఆయన ఊహించినట్టు కీడే జరిగింది. సీమాంధ్ర నాయకుల దాష్టీకానికి తెలంగాణ బలవుతూ వచ్చింది. సీమాంధ్ర నాయకత్వం హైదరాబాద్‌లో, సెక్రెటేరియట్‌లో తెలంగాణ వారిని పరాయిలను చేసింది. వివాహబంధంలో ఉద్దేశపూర్వక ఘర్షణను, అపనమ్మకాన్ని సృష్టించిన పాపం వారిదే.

447

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా