కరుణామయుడు


Sun,October 23, 2011 01:54 PM

జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం భారంగా అనిపిస్తున్నది. సంక్షోభాల్లో, ఆపత్కాలాల్లో ధైర్యం చెప్పి దిక్కును చూపిన పెద్దదిక్కు ఇప్పుడు లేరు..వరంగల్ మహాగర్జన సభ తర్వాత కొద్ది రోజులకు జయశంకర్ సార్‌కు ఫోను చేశాను.‘సార్ వరంగల్ సభకు అంతమంది జనం వచ్చా రు. ఆ జనాన్ని చూసి మీరు భావోద్వేగంతో బర్స్ట్ అయి మాట్లాడతారనుకున్నాను. మీరు మృత్యువు సరిహద్దులో ఉండి వరంగల్ సభలో మాట్లాడారు. అయినా ఎప్పటిలాగే గంభీరంగా మాట్లాడి కూర్చున్నారు. ఎందుకు సార్’ అని అడిగాను. ‘బాబూ...తెలంగాణ ఇప్పటి దాకా అనుభవించిన గర్భశోకం చాలు. ఇప్పటి వరకు బలైన పిల్లలు ఎప్పుడూ నా కళ్లలో మెదలుతూ ఉంటారు.

నేను ఎమోషనలైజ్ అయి మాట్లాడితే ఈ తరం తెలంగాణ పిల్లలు భరించే స్థితిలో లేరని నాకు తెలుసు. మేమెవరమూ ఆవేశపడకుండా మాట్లాడినా సభా వేదిక వద్దే ఒక యువకుడు ఆత్మత్యాగం చేశాడు. ఇక నేను కూడా ఆవేశపడితే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకో...మనకు బేల తనం వద్దు. ధైర్యంగా పోరాడాలన్నదే నా ఆకాంక్ష’ అన్నారు. మృత్యుద్వారం చివరి మెట్టుపై నిలబడి తెలంగాణ పిల్లల గురించి అంతటి కరుణతో, అంతటి లోతుగా, ధీరోదాత్తంగా మాట్లాడగలిగిన శక్తి ఎందరికి ఉంటుంది? కానీ ఆయన చివరి నిమిషం వరకు అంతే గంభీరంగా ఉన్నారు. దవాఖాన నుంచి చివరిసారిగా ఇంటికి తీసుకెళ్లేరోజు ఫొటోక్షిగాఫర్‌ను ఫొటోలు తీసుకు రమ్మని పంపాం. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ‘నమస్తే తెలంగాణ’ దినపవూతిక ఆవిష్కరణ రోజు పోడియం వద్ద కు తీసుకెళ్లడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా ఆయన అయిష్టంగానే చేయి అందుకున్నారు. తను దీనంగా కనిపించ డం, ఒకరిపై ఆధారపడే విధంగా కనిపించడం ఆయనకు నచ్చే ది కాదు. కడనిమిషం దాకా ఆయన అస్తిత్వ స్పృహ అటువంటిది. సార్‌కు జోహార్!

నిజాం నవాబుల కాలంలో గుర్రం గడ్డి మేసే భూములకు కోట్ల రూపాయల విలువ తీసుకువచ్చింది మేమే. టీడీపీ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగింది.

-టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు


నిజమే-అప్పుడు గుర్రాలు గడ్డి మేశాయి. మీ హయాంలో, ఆ తర్వాత మీ మిత్రుడి హయాంలో, మీమీ కనుసన్నలలో ఒదిగి ఎదిగిన రియల్టర్లు గడ్డి మేశారు. భూములు కోల్పోయింది మాత్రం తెలంగా ణ. విలువ తెచ్చిందీ నిజమే. కోట్లాది రూపాయల విలువ చేసే వందలాది ఎకరాలను కాజేసిందీ నిజ మే. అంతా మీ హయాంలోనే జరిగింది.(మీ మిత్రు డు రాజశేఖర్‌డ్డి మీరు ప్రారంభించిన దానిని రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించారు). ఇవ్వాళ హైదరాబాద్‌లో ప్రభుత్వానికి, అంటే ప్రజల భవిష్యత్తు అవసరాలకు భూములు లేకుండా చేసిందీ మీరే.

మీ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఎంత చెప్పినా తరగదు. పదివేల మందికి పైగా రైతు లు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుందీ అప్పుడే. ఆకలి చావులు సంభవించిన స్వర్ణయుగమూ మీదే సార్. విద్యుత్ ఉద్యమకారులపై కాల్పు లు జరిపి ముగ్గురు తెలంగాణ బిడ్డలను బలితీసుకుందీ అప్పుడే. ఒక్క ప్రాజెక్టూ ప్రారంభించనిదీ ఘనత వహించిన మీ పాలనలోనే. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే హెలికాప్టర్‌లో మేస్త్రీనీ, పంతులుగారిని తీసుకెళ్లి దేవాదులకు తూతూమంత్రం శంకుస్థాపన చేసిందీ తమరే. మీ గురించి తెలంగాణ ప్రజలకు తెలియకపోవడం ఏమి టి? మీరు లేస్తే మనుషులు కారు. కాని లేవరు. చర్చ కు సిద్ధం అని తొడలు కొడతారు. కానీ సవాలుకు నిలబడరు.

రాష్ట్రం విడిపోతే అల్లకల్లోలం జరుగుతుంది. మతశక్తులు, విచ్ఛిన్నకర శక్తులు విలయతాండవం చేస్తాయి. ఛాందసవాదులు, వేర్పాటువాదులు భయానక పరిస్థితులు సృష్టిస్తారు....రాష్ట్రంలో ఇప్పటి నుంచి 2014 లోపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సమైక్యవాదులకు 245 సీట్లు రావడం ఖాయం.

- విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్


-అబద్ధాల పంచాంగం /ఎన్నాళ్లని చెబుతావు
-ధనరాసులు ఢిల్లీకి/ఎన్నేళ్లని మోస్తావు
-సర్వేలు, నివేదికలు/ఎన్నని పుట్టిస్తావు
-అమాయకపు విద్యార్థుల/ ఉసురుపోసుకుంటావు
నిజమే రాజగోపాల్...పెట్టుబడికి, కట్టుకథకు పుట్టి న ముద్దుబిడ్డవు నీవు. నీకు దోచుకునే అవకాశం లేకపోతే తెలంగాణ అల్లకల్లోలం అవుతుంది. కొల్లగొట్టే అవకాశం పోతుందంటే నీకు వేర్పాటువాదం వణుకు పుట్టిస్తుంది. దోచుకునే అవకాశం ఉన్నంతకాలం మతశక్తులతో, ఛాందసవాదులతో, విచ్ఛిన్నకర శక్తులతో తమరే సహవాసం చేశారు, చేస్తున్నారు-మరచిపోయావా రాజగోపాల్. ప్రభుత్వాన్ని, వ్యవస్థల ను, వనరులను దోచుకోవడం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మ్యానిపులేట్ చేయడం, మేనేజ్ చేయడమే కదా నీ పారిక్షిశామిక విధానం. తెలంగాణ నాయకులకు ఆ అవకాశం లేదు. తెలంగాణ ప్రజలది ప్రజాస్వామిక ఉద్యమం. నీది మాకరీస్వామ్యం. నీవిలాగే పదేపదే మాట్లాడాలని, ‘ఆంధ్ర నాయకుల మూతులు నాకి, అహహాయని తోకలూపుతున్న’ మా తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలకు రేషం పుట్టుకురావాలని కోరుకుంటున్నాం.

తెలంగాణ రాష్ట్ర సాధనకు డెడ్‌లైన్‌లు అంటూ ఏమీ లేవు. రాష్ట్రాన్ని సాధించేది కాంగ్రెసే. పదకొండేళ్లుగా టీఆర్‌ఎస్ ఏమి సాధించిందనే విషయాన్ని ప్రజ లు గమనిస్తున్నారు.

- రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె.జానాడ్డిఅధికారం లేనప్పుడు తెలంగాణ కావాలి. మంత్రిపదవి లేకుంటే...డెడ్‌లైన్లు ఉండేవి. మహారాజ పోష ణ లేకుంటే...తెలంగాణ కోసం ఆత్రం ఉండేది. కడు పు నిండినవారికి డెడ్‌లైన్లు అసాధ్యమే. టీఆర్‌ఎస్ లేకుంటే మీరంతా ఎప్పుడో తెలంగాణ జెండా దింపే సి, సమైక్యవాదుల ఛత్రఛాయలో ఎంతో హాయిగా సేద తీరేవారని తెలంగాణ ప్రజలకు తెలుసన్నా! 2000 సంవత్సరంలో ఉరుకులు పరుగుల మీద ఢిల్లీ కి తెలంగాణ యాత్రలు చేసిన తమరికి, పదేళ్ల ఉద్య మ ప్రస్థానం తర్వాత, 600 మంది విద్యార్థి, యువకులు బలిదానం చేసిన తర్వాత, కేంద్రం రాష్ట్ర ఏర్పా టు ప్రక్రియను ప్రకటించి వెనుకకుపోయిన తర్వా త.....కూడా మీకు తొందర లేదంటే అది తెలంగాణ ప్రజల తప్పు కాదన్నా! అది అధికార చేలాంచలాల మత్తు కదన్నా!

ప్రధాన మంత్రి ఒక వ్యక్తి కాదు...వ్యవస్థ. ప్రపంచంలో ఏదేశంలోనైనా ప్రధానిని విచారించిన సంఘటనలున్నాయా?

-లోక్‌పాల్ బిల్లుపై కేంద్ర మానవ వనరుల మంత్రి కపిల్‌సిబాల్కొత్త నీతి సూత్రం-వ్యవస్థలు తప్పుచేయవచ్చు, తప్పించుకోవచ్చు. వ్యవస్థకు నాయకత్వం వహించేవారిని మాత్రం తప్పు పట్టవద్దు. అవినీతిపై కేంద్రం ఆడి తప్పుతోంది. కపిల్ సిబాల్ తెలిసి బొంకుతున్నా డు. అమెరికాలో వాటర్ గేట్, లెవిన్స్కీ గేటు, జపాన్, థాయ్‌లాండ్, పనామాలలో దేశాధ్యక్షులు, ప్రధాను లే బోనులో నిలబడ్డారు-మైలార్డ్!

-కట్టా శేఖర్‌రెడ్డి,


385

KATTA SHEKAR REDDY

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన