మేలుకుంటారా...కూలిపోతారా...


Fri,March 1, 2013 11:23 PM


గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే, వర్తమానాన్నీ జయించలేము. ఉద్యమాన్ని క్రమంగా గొంతు నులుమడం ఎలాగో సూచిస్తూ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చి న నివేదికను కేంద్రం అమలు చేస్తోంది. ఒకవైపు తెలంగాణ ఇస్తున్నాం, వస్తోంది అన్న ఆశలను, భ్రమలను సజీవంగా ఉంచుతూనే మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే సకల సన్నాహాలూ చేస్తోంది. ఒక చేత ఉద్యమాన్ని ఉధృతం కాకుండా చూడడం, తెలంగాణలో రాజకీయశక్తుల ఏకీకరణను నిలువరించడం చేస్తూనే, మరోచేత తెలంగా ణ రాజకీయ సమాజాన్ని ఎన్నికల చదరంగంలో దింపి ఛిద్రం చేసేందుకు పాచికలు కదుపుతూ ఉంది. ఏ దశలో ఏ దిశగానైనా నడవడానికి వీలుగా కాంగ్రెస్ వ్యూహం అమలవుతోంది. ఈ వ్యూహాన్ని గుర్తించి, ఎదుర్కొనేందుకు తెలంగాణ రాజకీయ, ఉద్యమ శక్తులే సిద్ధంగా లేవు. ఒకే అస్త్రాన్ని పదేపదే ఉపయోగిస్తే అది ఆశించిన ఫలితాలను సాధించదు. ఏ అస్త్రాన్ని అయినా అరుదుగా ఉపయోగించాలి. అదను చూసి ఉపయోగించాలి. ఎన్నికల అస్త్రాన్ని ఆఖరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించాలి. ఆ అస్త్రాన్ని బలహీనపర్చడానికే ఇప్పుడు ప్రభుత్వం వరుసగా ఎన్నికలను ముందుపెట్టింది. సహకార ఎన్నికలు అయిపోయాయి. సహకార ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించలేదు. సహకార ఎన్నికలు తెలంగాణ ఎన్నికల ఆకాంక్షకు ప్రతిబింబం కాదని మనం చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం ఎందుకు చెబుతుంది? తెలంగాణ వ్యతిరేకులు ఎందుకు చెబుతారు? ఎమ్మె ల్సీ ఎన్నికల్లో కూడా పాక్షిక విజయమే లభించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో కూడా ముందుగా సర్పంచి ఎన్నికలు జరుపుతారు. ఒక నాడు ఊర్లు ఊర్లన్నీ జేఏసీలుగా ఏర్పడి పోరాటం చేసిన తెలంగాణ ఇప్పుడు రకరకాల రాజకీయ ఇరుకుగదులుగా చీలిపోతుంది. అన్ని జెండాలు, ఎజెండాలు ఒక్కటిగా కొట్లాడిన తెలంగాణ ఎన్నికల వేళ వేర్వేరు జెండాలు, ఎజెండాల కింద చీలిపోతుంది. ‘తెలంగాణ సాధించాలన్న ఆకాంక్ష ముందు సర్పంచిగా, ఎంపీటీసీగా, జడ్‌పీటీసీగా గెలవాలన్న ఆకాంక్ష పై చేయి సాధిస్తుంది. యావత్ సమాజం ఎన్నికల రంధిలో మునిగిపోతుంది. తెలంగాణ ఉద్య మ వేడి చల్లారిపోతుంది. ప్రతి ఎన్నికను తెలంగాణపై రెఫండం అని చెప్పడం సాధ్యం కాదు. చెప్పినా ఫలితాలు రావు. స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పూర్త య్యే సరికి తెలంగాణ సమాజం రాజకీయ సమూహాలకింద చీలిపోతుంది. ఉమ్మడి లక్ష్యం తెలంగాణ సాధన బలహీనపడిపోతుంది. వరుస ఎన్నికల ద్వారా ఒక తటస్థ వాతావరణాన్ని తీసుకొచ్చి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు వెళితే తెలంగాణలో ఏకపక్ష తీర్పు రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. అప్పటికల్లా తెలంగాణ డిమాండు పాతబడుతుందని, మొద్దుబారిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు వివరించారు.

2008 మేలో 16 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఎటువంటి ‘తటస్థ వాతావరణం’ ఉందో, ఇప్పుడు అటువంటి పరిస్థితిని సృష్టించడానికి ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తున్న ది. ఆ ఎన్నికలు తెలంగాణ ఉద్యమానికే గొప్ప చేదు అనుభవం. టీఆస్ అధినేత కేసీఆర్ 2006లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసినప్పుడు తెలంగాణ ఉద్యమశక్తులు, ప్రజలు ఏకోన్ముఖంగా ఆయనను అసాధారణ మెజారిటీతో తిరిగి గెలిపించా రు. ఆయనను వ్యతిరేకించే వారు సైతం కరీంనగర్ పల్లెలకు వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. తెలంగాణ ఆకాంక్షను ప్రబలంగా చాటారు. అదే 2008 మేలో 16 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్‌సభ స్థానాల ఎన్నికల సందర్భంగా ఏం జరిగింది? ఎందుకు చెమటోడ్చా ము? సగం స్థానాల్లో ఎందుకు ఓడిపోయాము? రాజీనామాలు, ఎన్నికల అస్త్రం అప్పటికే పాతబడిపోయింది. ఉద్యమం లేదు. తెలంగాణ సమస్యను ఏకైక ఎజెండా భావించడానికి అవసరమైన పరిస్థితులేవీ ఆరోజు కల్పించలేదు. ఎన్నికలనే ఉద్యమంగా భావిం చి కేసీఆర్ ఈ సమరానికి దిగారు. పైగా అప్పటికి అన్ని పార్టీలూ తెలంగాణ జపం చేస్తూ ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ కొన్ని, టీడీపీ కొన్ని స్థానాలు గెలిచాయి. అంత దూరం ఎందుకు? 2010లో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎంత సులువుగా గెలిచాయి? టీఆస్, బిజెపి. పరకాల ఎన్నికలు వచ్చే నాటికి ఎంత పోరాడాల్సి వచ్చింది? తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు దెబ్బతినాల్సి వచ్చింది? తెలంగాణ ఉద్యమాన్ని కానీ, నాయకత్వాన్ని గానీ మనం అర్థం చేసుకున్నట్టు జనం అర్థం చేసుకోకపోతే అది జనం తప్పు కాదు, మన తప్పే. టీఆస్ వంటి పార్టీకి ఉద్యమం లేకుండా ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని మరోసారి రుజువయింది. ఉద్యమం జరగాలి. ఉద్యమం కూడా విశాల వేదికగా మారాలి. దూరమైన శక్తులన్నింటినీ ఒక్కచోటికి తీసుకురావాలి. ఒంటెద్దు పోకడలను, పంతాలు పట్టింపులను వీడాలి. చీటికిమాటికి చీలిపోయి తప్పుపూన్నుకునే తత్వం నుంచి ముందు బయటపడాలి.

తెలంగాణ రాజకీయ నాయకుల్లో స్వభావగతంగానే చీలిక మనస్తత్వం(Split mentality) ఉందేమో. ఏ నాయకుడూ మరో నాయకుడిని సహించడు. ఎవరికి వారే గొప్ప. ఉమ్మడి ప్రయోజనం, ఉమ్మడి లక్ష్యాలకోసం కలసి కొట్లాడడం అరుదు. వెంట ఒక్కడున్నవాడూ అంతే గీరగా మాట్లాడతాడు, వందమంది ఉన్నవాడూ అలాగే మాట్లాడతాడు. తెలంగాణ సమాజం విషాదం ఇది. సహజంగానే ఉద్యమం చల్లబడితే రాజకీ య ఎజెండాలు ముందుకు వస్తాయి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శక్తులు కొన్ని ఉద్యమ పార్టీకి క్రమంగా దూరంగా జరుగుతున్నాయి. వేర్వేరు పార్టీల మధ్య, ఒకే పార్టీలోని వివిధ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పురివిప్పుకుంటున్నాయి. ఉద్యమ పార్టీలోని కొందరు నాయకులు సొంత పార్టీలోని నాయకులకు వ్యతిరేకంగా పత్రికలకు, చానెళ్లకు లీకులు ఇచ్చి, రాజకీయంగా బలహీనపర్చే దాకా వెళుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు ఇటువంటి అస్త్రాన్ని ఉపయోగించే ప్రత్యర్థులను దెబ్బకొ ఇప్పుడు ఉద్యమ పార్టీలోనూ అదే క్రీడను కొందరు ఉపయోగిస్తున్నారు. ఉద్యమ సంఘాల మధ్య కూడా ఇటువంటి ఎత్తులే నడుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరి వెంట ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి తలెత్తింది. మాటలు లేవు. చేతలు లేవు. అంతా స్తబ్దుగా ఉంది. సభలు, సమావేశాలకు కూడా వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణవాదు ల్లో అసంతృప్తి, నిరాశానిస్పృహ (Disillusionment) పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ లోకంలో చీలిక తెచ్చాయి. ఇంతకుముందులా సంఘటితంగా కలసి కొట్లాడే స్ఫూర్తిని ఈ ఎన్నికలు కొంత దెబ్బతీశాయి. వరదాడ్డిని పోటీలో దింపకుండా ఉండాల్సింది. పూల రవీందర్ టీచర్స్ జేయేసీకి నాయకునిగా సకల జనుల సమ్మె లో ముందున్నారు. ఆయన విజయం తెలంగాణవాదానికి వ్యతిరేకం కాదు కానీ, టీఆరె స్ ఎమ్మెల్సీ ఎన్నికలను తెలంగాణవాదంపై రెఫండంగా ప్రకటించి చేతులు కాల్చుకుం ది. ఉద్యమ పార్టీ, ఉద్యమ శక్తులు అన్నీ ఏకోన్ముఖం గా ఎదిరించి పోరాడిన రోజులను, ఇప్పటి పరిస్థితిని పోల్చుకుంటే తేడా ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ సాధించడానికయినా, ఎన్నికల్లో గెలవడానికయినా ఇటువంటి పరిస్థితి ఏవిధంగానూ ఉపయోగపడదు.

‘కానీ కేసీఆర్ వీధుల్లోకి వస్తే వారం రోజుల్లో పరిస్థితి మారిపోతుంది. 2009 నవంబరు దీక్షకు ముందు పరిస్థితి ఏమిటి? ఆ తర్వాత పరిస్థితి ఏమి టి? ఉద్యమాలు, రాజకీయాలు మీరు చెప్పే సిద్ధాంతాల ప్రకారం జరుగవు’ అని ఒక టీఆస్ నాయకుడు వాదించారు. కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసినా, దానిని ఉపయోగించుకునే యంత్రాంగం పార్టీకి ఉందా? తెలంగాణలోని 433 మండలాల్లో సగం మండలాల్లోనే పార్టీ బలంగా ఉంది. అక్కడ కూడా గాలితో గెలవాల్సిందే. యం త్రాంగంతో కాదు. మిగిలిన మండలాల్లో యంత్రాంగమూ లేదు. గాలి వీచే అవకాశమూ లేదు. సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆస్‌కు దీటైన అభ్యర్థులు లేరు. మందీ మార్బలం లేదు.ధన బల మూ లేదు. ఇప్పటి నుంచి ఉద్యమ శక్తులను తిరిగి ఏకోన్ముఖం చేసి, ఉద్యమాన్ని ఉధృతం చేసి, రాజకీయ శక్తులను ఏకీకృతం చేసి, తెలంగాణ ఆకాంక్షను ఒక తుపానుగా మార్చితే తప్ప ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం లేదు. ఉద్యమంలో ఇంతకాలం సందిగ్ధావస్థను కొనసాగించడం మంచిది కాదు. ఉద్యమ శక్తులు, రాజకీయ పక్షాలు ఎందుకు సందిగ్ధంలో ఉండాలి? ఉద్యమాలు, రాజకీయ నిర్మాణం ఏకకాలంలో కొనసాగించవచ్చు. న్యూడెమొక్షికసీ, సీపీఐ, బిజెపి వంటి పార్టీలలో కొన్నింటితోనయినా ఒక అవగాహనకు రావచ్చు. ఉద్యమాలు, రాజకీయ నిర్మాణం ఏకకాలంలో కొనసాగించడం ఇప్పటి అవసరం. కాంగ్రెస్‌ను సవా లు చేయకపోతే, రాజకీయంగా నూకలు చెల్లిపోతాయని భయపెట్టకపోతే ఈ సమస్య తేలడం కష్టం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలు తెలంగాణ ఉద్యమ సందర్భానికీ వర్తిస్తాయి. మనం కర్మలు నిర్వర్తిస్తూ పోతే, ఫలితాలు అవే వస్తాయి. తెలంగాణకోసం కొట్లాడుతూ పోతే ఎన్నికల విజయాలు అవే వస్తాయి. అంతే తప్ప కర్మలను వాయిదావేసి, ఫలితాలకోసం నిరీక్షిస్తే భంగపాటు తప్పదు. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితులు కల్పించకుండా(Political compulsion) సృష్టించకుండా కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరించే అవకాశం లేదు.

[email protected]

396

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా