అభద్రతా నగరం, అసమర్థ యంత్రాంగం


Thu,February 28, 2013 11:56 AM

నగరంలో జీవితాలు గాలిలో దీపాలు. ఇక్కడ బతకడం మన చేతిలో ఉండదు. చావడం మన చేతిలో ఉండదు’-బాంబు పేలుడు ఘటన దృశ్యాలు చూసి చలించిన ఒక సీనియర్ జర్నలిస్టు నిర్వేదం ఇది. అంతకుముందే ఔటర్‌రింగ్ రోడ్డులో కారు ఢీకొని నలుగురు కూలీలు మరణించిన వార్త తెలిసింది. ‘ఎంత సంకటభరితంగా(వల్నరబుల్)గా తయారయింది జీవితం? కేంద్ర హోం మంత్రి ఏం మాట్లాడుతున్నారో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో చూశాం కదా. ముందే హెచ్చరించామని ఆయన చెబుతారు. అది రొటీనే అని ఈయన చెబుతారు. ఎవరికీ సీరియస్‌నెస్ లేదు. నాకయితే బాంబు పేల్చినవాడికీ, కారుతో ఢీకొట్టి చంపినవాడికి పెద్ద తేడా కనిపించడం లేదు. వీడూ దొరకడు, వాడూ దొరకడు. నాలుగు రోజులు హడావిడి, అప్రమత్తత, శోధన, దర్యాప్తు...కేసు మూతపడుతుంది. జనానికి మాత్రం భరోసా లభించదు’ అని ఆ జర్నలిస్టు ఆవేశంగా అన్నారు. పేలుళ్లు ఒక్క దిల్‌సుఖ్‌నగర్‌కే పరిమితమా లేక ఉగ్రవాదులు ముంబైలో మాదిరిగా వరుస పేలుళ్లకు ప్లాన్ చేశారా? నగ రం ఒక్కసారి స్థాణువు అయిపోయింది. ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. కొన్ని ఆఫీసులు తమ సిబ్బందిని ఇప్పుడే బయటికి వెళ్లవద్దని ఆపేశాయి. ఎవరు ఎక్కడ ఉన్నారో, క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుందామని ప్రయత్నం. ఫోన్లు పనిచేయలేదు. ట్రాఫిక్ స్తంభించిపోయింది.

టీవీలే ఆధారం. పనులు, ఉద్యోగాలు ముగించుకుని ఇంటిబాట పట్టినవాళ్లు, స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులు, రకరకాల కోచింగ్ సెంటర్లకు వెళ్లి క్లాసులు పూర్తి చేసుకుని వస్తున్నవాళ్లు, ఏదో షాపింగ్‌కోసం వచ్చి అటునుంచి వెళుతున్నవాళ్లు, రోజంతా కష్టపడి సాయంత్రం అల్పాహారంకోసం మిర్చీ బండీవద్ద చేరిన పేద మధ్యతరగతి జనం, పసి పిల్లలు, స్త్రీలు మొదలు వృద్ధుల వరకు అందరినీ అర్ధాంతరంగా మృత్యుపాశం తీసుకుపోయింది. ఒక్క ప్రాంతం కాదు, ఒక్క జిల్లా కాదు, ఒక్క మతం కాదు, ఒక్క కులం కాదు...పేలుళ్ల ధాటికి మాడి మసైపోయిన వారిలో అందరూ ఉన్నారు. అంతా సాధారణ ప్రజానీకం. మతాధిపత్యాలతో, రాజకీయాధిపత్యాలతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లు. ఏ లక్ష్యాలకోసం ఈ ఉన్మాదకాండ? ఎవరు చేసినా ఇది పవిత్ర యుద్ధం కాదు. మానవత్వంపై సాగించిన విధ్వంసకాండ. వీళ్లను దేవుడు క్షమించ డు. అల్లా కరుణించడు. ప్రభువు దీవించడు. ‘ఇదిగో టిఫిన్ తీసుకుని ఇప్పుడే వస్తున్నాను’ అని ఇంటికి ఫోను చేసి చెప్పిన భర్త ఇంటికి రాలేదు. రాత్రి ఎనిమిది దాకా ఏమైందో ఎక్కడ ఉన్నాడో తెలియదు. చివరికి ఆస్పవూతిలో స్ట్రెచర్‌పై చిద్రుపలైన దేహం! ఆమె దుఃఖాన్ని ఎవరు ఆపగలరు? ‘చెల్లి పేలుడు జరిగినచోటుకు వంద గజాల దూరంలో హాస్టల్‌లో ఉంటుం ది. టిఫిన్‌కోసం రోజూ సాయంత్రం ఆనంద్ టిఫిన్ సెంటర్‌కే వెళ్లివస్తుంది. ఇప్పుడు అక్కడే పేలుడు జరిగింది. చెల్లి ఎక్కడ ఉందో? ఏమైందో?’-పేలుళ్ల సంగ తి తెలియగానే కంపెనీ నుంచి బయలుదేరిన ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఫోన్లు కలవడం లేదు. నో కమ్యూనికేషన్. ఎప్పుడూ ధైర్యం గా ఉండే ఆ ఇంజనీరు కకావికలవుతున్నాడు. చివరికెప్పుడో గంటన్నర తర్వాత చెల్లి నుంచి ఫోను. ‘పొద్దున తార్నాక మామయ్యవాళ్లింటికి వచ్చాను. నేను క్షేమం. హాస్టల్‌లో ఉండే మా ఫ్రెండ్స్ పరిస్థితి తెలియదు. తలుచుకుం భయమేస్తోంది’ అని ఆ యువతి వణికిపోయింది. ఈ నగరానికి ఎప్పుడు భరోసా ఇవ్వగలం? ఈ భయాన్ని ఎప్పుడు పోగొట్టగలం?

విషాదం ఏమంటే, పేలుళ్ల పాపం ఇంతకుముందయితే నేరుగా ఇస్లామిక్ ఉగ్రవాదుల మీదికి వెళ్లేది. మాలెగాం, మక్కా మసీదు పేలుళ్ల తర్వాత హిందూ ఉగ్రవాద సంస్థలు కూడా ఇటువంటి ఘాతుకాలు చేస్తున్నాయని తెలిసివచ్చింది. వెంటనే సూత్రీకరణలు చేయలేని పరిస్థితి. కాకపోతే కసబ్, అఫ్జల్‌గురుల ‘ఉరి’కి ప్రతీకారం తీర్చుకుంటామని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు బాహాటంగానే హెచ్చరికలు చేయడం, హైదరాబాద్‌లో రెక్కీలు నిర్వహించినట్టు సమాచారం ఉండడం, కేంద్ర నిఘా సంస్థలు ఈ మేరకు హెచ్చరికలు చేయడం...ఈ వివరాలన్నీ తక్షణం ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలనే దోషులుగా నిలబెడుతున్నాయి. హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని అన్ని పత్రికల క్రైమ్ రిపోర్టర్లూ మూడునెల్లకో, ఆరునెల్లకో ఒకసారి వార్తలు రాస్తూనే ఉన్నా రు. సుమారు 1500 మంది బంగ్లాదేశీలు, కొన్ని వందల మంది పాకిస్తానీలు అనుమతి లేకుండా నగరంలో ఉంటున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. పోలీసు యంత్రాంగం వద్ద, నిఘా విభాగంవద్ద ఈ వివరాలు లేవని అనుకోలేము. వాళ్లకు ఇంతకంటే ఎక్కువ వివరాలే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయినా ఎందు కో కనెక్టివిటీ కుదరడం లేదు. చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదు. ఏ శక్తులు వారికి అడ్డుపడుతున్నాయో తెలియదు. ఈలోగా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. ఎన్ని సిద్ధాంతాలు ముందుకు వస్తాయో తెలియదు. ‘తెలంగాణవాదం నుంచి దృష్టి మళ్లించడానికి ఆంధ్ర పెత్తందారులు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడినట్టుగా అనిపిస్తోంది’ అని ఒక తెలంగాణ వాది మెసేజ్. అలా జరిగే అవకాశం లేదని సమాధానం ఇచ్చాను. ‘వెనుకటికి హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించి అనేక మందిని బలిగొన్న చరిత్ర వారికి ఉంది’ అని మరో మెసేజ్. ‘ఇంత పెద్ద పేలుడు వాళ్లు ఎలా ప్లాన్ చేయగలరు?’ అని సమాధానం ఇచ్చాను. ‘అన్నా, మరిచిపోయారా? జూబ్లీహిల్స్ కారు బాంబు పేలుడు ఎవరు ప్లాన్ చేశారు?’ ఇంకో మెసేజ్. అతని ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ ‘ప్లీజ్. ఇప్పుడలా జరిగి ఉండదు. తొందరపడకండి’ అని ఆ సంభాషణ అక్కడి తో ముగించాను. ‘అక్బర్ అరెస్టు నేపథ్యంలో ఎంఐఎంను బద్నాం చేయడానికి, నరేంద్ర మోడి అవసరాన్ని రాజకీయ ఎజెండాలో పెట్టడానికి హిందుత్వ ఉగ్రవాదులే ఈ పని చేసి ఉండవచ్చు కదా’ అని మరొక లౌకికవాది సూత్రీకరించాడు. విశ్లేషణకు, ఊహకు అంతం లేదు. కల్పనకు ఏదీ అతీతం కాదు. రుజువయ్యేవరకు ఏదీ సత్యం కాదు.

ఒకటి మాత్రం వాస్తవం, మన చట్టపాలనా వ్యవస్థలకు ఫొకస్ లేదు, శ్రద్ధ లేదు, నిజాయితీ లేదు. మనదంతా ఆశ్రీత పోలీసు వ్యవస్థ. చట్టం తనపని తాను చేసుకుపోతుందని మన ప్రభువులంటుంటారు. కానీ తనపని తాను చేసుకుపోదు. ఏలినవారి చూపుడువేలు సంకేతాలను బట్టి నడుస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు చెబితేనో, ఏదో ఒక ప్రయోజనం ఉంటేనో తప్ప చట్టం కదలడం లేదు. సెలెక్టివ్ లా అండ్ ఆర్డర్ పర్సెప్షన్. సెలెక్టివ్ పర్‌సెక్యూషన్. సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. సెలెక్టివ్ ప్రాసిక్యూషన్. రాత్రి ఒక మిత్రుడు పంపిన మెసేజ్ నాకు నిజమనిపించింది. ‘ఉద్యమాలను అణచివేయడంపై ఉన్న శ్రద్ధ నగర శాంతిభవూదతలపైన పెడితే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఉద్యమకారు లు ఎప్పుడూ ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడలేదు’ అని ఆయన బాధపడ్డారు. పొలిటికల్ టార్గెట్స్ మీద ఉన్న శ్రద్ధ నేరస్థులను పట్టుకోవడంపై ఎక్కడ ఉంది? తెలంగాణ ఉద్యమంపై నివేదికల మీద నివేదికలు పంపే ప్రభుత్వానికి నగరంలో ఎటువంటి విష సర్పాలు విహరిస్తున్నాయో కనిపెట్టే ధ్యాస ఎక్కడిది? ఉగ్రవాదుల సంగతి దేవుడెరుగు? పేలుళ్లలో ఒకేసారి ఇంత మంది చనిపోయేసరికి నగరం ఉలిక్కి పడింది. నిర్ఘాంతపోయింది. నిజమే కానీ ఈ నగరంలో రోజూ ఇంత కంటే ఎక్కువ మంది ఏదో ఒక కారణం చేత మృత్యువు ఒడిలోకి చేరుతూనే ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో, హత్యలు చేయబడి, అత్యాచారాలకు గురై...పత్రికల క్రైమ్ పేజీల నిండా మృత్యుఘోషలు వినిపిస్తూనే ఉంటా యి. కానీ ఎంతమంది దోషులు బోనులో నిలబడ్డారు? ఎంతమందికి శిక్షలు పడ్డాయి? కోర్టులకు వెళ్లిన కేసుల్లో సుమారు 70 శాతం కేసులు పోలీసు లు సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల కొట్టివేయబడుతున్నాయి. అంటే 70 శాతం మంది నేరస్థులు స్వేచ్ఛగా మళ్లీ వీధుల్లోకి వస్తున్నారని అర్థం. పేలుళ్లను చూసినంత సీరియస్‌గా ఇతర నేరాలను చూడడం లేదు. ఔటర్ రింగురోడ్డుపై నలుగురు కూలీలను చంపి వెళ్లిన కారును మన పోలీసులు పట్టుకుంటారా? టోల్‌గేట్‌ల వద్ద వాళ్ల ఆనవాళ్లు పట్టుకుంటారా? నేరాలను పోలీసులు సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితి నానాటికీ ఇంతగా దిగజారదు? నగర పౌరుల భద్రతకోసం ఇప్పటికయినా ఒక సమక్షిగమైన ప్రణాళికను ఏదయినా రూపొందిస్తారా? ఈ ప్రణాళిక రూపకల్పనలో పౌర సమాజం తోడు తీసుకుంటారా?

నగరానికి చెందిన ఒక బుద్ధిజీవి పంపిన మెసేజ్, పౌరుల ధర్మాక్షిగహాన్ని తెలియజేస్తుంది. ‘ఈ దేశం లో ఉగ్రవాదులకు అమాయకులను చంపే హక్కు ఉంది. రాజకీయ నాయకులకు ప్రజాధనాన్ని లూటీ చేసే హక్కు ఉంది. రాజకీయ పక్షాలకు సమ్మెలు, బంద్‌లు చేసే హక్కు ఉంది. మేధావులకు ఉగ్రవాదులను సమర్థించే హక్కూ ఉంది. తమ పనులు తాము చేసుకునే సాధారణ మనుషులకు మాత్రం ఏ హక్కులూ లేవు, బాధ్యతలు తప్ప’ అన్నది ఆ మెసేజ్ సారాంశం. రాజకీయ వ్యవస్థను, చట్టాన్ని, మేధావులను...అందరినీ పౌరులు నిరాకరించే పరిస్థితి ఏ సమాజానికీ రాకూడదు. దీనిని హెచ్చరికగా భావించాలి. పోలీసు యంత్రాంగం, నాయకులు గుర్తించినా గుర్తించకపోయినా, సమాజం మాత్రం చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నదని అనేకసార్లు రుజువయింది. ఎంతటి ఆపత్కాలంలోనూ ఇక్కడి ప్రజలు సంయమనం కోల్పోలేదు. పుకార్లను, విద్వేష ప్రచారాలను నమ్మలేదు. చేయి చేయి కలిపి తక్షణ సహాయం చేశారు. అనేక ఘటనల తర్వాత పదేపదే అర్థం అవుతున్నదేమంటే, చంపేవాడిది మతం కాదు. చనిపోయేవారికీ మతం లేదు. చంపేవాడు ఎవడయినా కానీ, చనిపోతున్నవారిలో రాముడు, రహీము అందరూ ఉన్నారు. మతం మానవత్వాన్ని కమ్మివేయనంతవరకు సమాజం సామరస్యంతో మనుగడ సాగిస్తుంది. మతం జీవన విధానంగా ఉన్నంతవరకు ఎవరికీ ఇబ్బంది కలిగించదు. మతం ఉన్మాదంగా మారితేనే సమాజానికి ప్రమాదం. హైదరాబాద్ అటువంటి ఉన్మాదులపై ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటుంది. కనీసం ఇటువంటి సందర్భాల్లో రాజకీయ ఓట్లాట ఆపేస్తే మంచిది. నిందలు, ఆరోపణలు తర్వాత చేసుకోవచ్చు. నగరం ఇప్పుడు గాయపడి ఉంది. ప్రజలు కలత చెందుతున్నారు. వారిలో విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్య త పోలీసులపైన, రాజకీయ యంత్రాంగంపైన ఉంది. మెట్రో రైళ్లు, మాస్టర్ ప్లాన్లు తరువాత, భద్రత లేని చోట ఎంత అభివృద్ధి ఉన్నా నిష్ఫలం.

[email protected]

407

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా