మృత్యువును కాదు, విజయాన్ని ముద్దాడాలి!


Sat,February 9, 2013 07:48 PM

మనం గెలుస్తాం! మనం గెలుస్తున్నాం!
మనమే గెలిచి తీరతాం! మనం ఓడిపోవడం లేదు!
సాధన సరిహద్దుల్లో నిలబడ్డాం!
మనమంతా విజయాన్ని ముద్దాడాలి!
సత్యం మనవైపు ఉంది,
అన్ని ప్రజాస్వామిక విలువలూ మనవైపే ఉన్నాయి
ఏకాభివూపాయం ఎప్పుడో సాధించి ఉన్నాం
తెలంగాణ ఇవ్వడానికి వంద కారణాలున్నాయి
నిరాకరించడానికి ఒక్క కారణం లేదు
మనం ఇప్పటికే గెలిచాం!
నిజమే! నమ్మకం కలగడం లేదు కదూ!
గమ్యం అనేకసార్లు మనకు ఇలా కనిపించి అలా మాయమైంది
లెక్కకుమించి ఎదురుదెబ్బలు తిన్నాం,
డెడ్‌లైన్లు దాటిపోయాయి, క్యాలెండర్లు మారిపోయాయి
ఇచ్చేవాడు మాటిమాటికి నాలిక తిప్పేస్తున్నాడు
శత్రువు వికటాట్టహాసం చేస్తున్నాడు
అయినా విజయం మనవైపే ఉంది
ద్రోహులను రాజకీయంగా చంపే శక్తి మన చేతుల్లోనే ఉంది
నవతెలంగాణ నిర్మాతల్లారా!
తెలంగాణ చరిత్ర అంతా యుద్ధాలే!
మనది వీర తెలంగాణ, పోరు తెలంగాణ
తెగించి నిలబడిందే తప్ప శత్రువుకు లొంగలేదు
ఆత్మహత్య పరాజయాన్ని అంగీకరించడం!
మీరు బతకాలి, బంగారు తెలంగాణ నిర్మించాలి!
మన మంత్రులు వానపాముల్లా వాలిపోవచ్చు
మన ఎమ్మెల్యేలు పైరవీల్లో మునిగితేలవచ్చు
పార్టీలు ప్రయోజనాల వేటలో తరించవచ్చు
నాయకులూ నాటకాలాడవచ్చు
కానీ ఉద్యమం మాత్రం సజీవం
మంటలు కనిపించకపోవచ్చు
తెలంగాణ సమాజం మాత్రం జ్వలిస్తూ ఉంది
అది దగ్ధం చేయాలే తప్ప, దగ్ధం కావద్దు!

తెలంగాణ పేరెత్తలేని స్థితి నుంచి తెలంగాణ జపం చేయక తప్పని పరిస్థితిదాకా...ఇదంతా మీ అందరి కృషే! ఇచ్చుడో, తెచ్చుడో, చచ్చుడో తేల్చుకోవాల్సిన పరిస్థితి పార్టీలది, ప్రధానంగా కాంగ్రెస్‌ది. ఒక్క కాంగ్రెసేకాదు తెలంగాణకు అడ్డంపడుతున్న వారిని, తెలంగాణ కోసం కొట్లాడని వారిని రాజకీయంగా పాతరవేసే శక్తి ఇవ్వాళ తెలంగాణకు వచ్చింది. రాజకీయంగా మరణించాల్సినవారు అనేకమంది ఉన్నారు, మీరెవ్వరూ మరణించాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏ వాదాలు, ఏ ప్రచారాలు, ఏ అబద్ధాలు తెలంగాణవాదాన్ని మాయ చేయలేవు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో ఏం మాయలైనా చేయనీయండి. అవేవీ నిలబడేవి కాదు. అవన్నీ చాలా పాతవాదనలు. ఎప్పుడో వీగిపోయిన మాటలు. ఇవ్వడం ఇవ్వకపోవడం, రాజకీయంగా చావ డం....ఇదంతా కాంగ్రెస్ చేతుల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చేతుల్లో ఉంది. మధ్యలో ఉన్నవాళ్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇవ్వాలనుకుంటే మధ్యలో ఉన్నవారిని దారిలో పెట్టడం పెద్ద పనికాదు. సమస్య తేల్చాల్సింది వారిరువురిదే. ఇప్పుడు వారు తప్పించుకోవడానికి కారణాలు ఏమీ లేవు. తెలంగాణపై రాజకీయ ఏకాభిప్రాయం ఇప్పటికే పూర్తయింది. ముప్పైకిపైగా రాజకీయపక్షాలు చాన్నాళ్ల క్రితమే కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలంగాణ ఇవ్వాలని రాశాయి. ప్రధాన ప్రతిపక్షం బిజెపి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఇప్పటికి వందసార్లు చెప్పింది. శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీతో సహా యూపీఏలోని ప్రధాన రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరాయి. ఇక నిర్ణయించుకోవలసింది కాంగ్రెసే.


కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు 400 మందికి పైగా సభ్యుల మద్దతు లభిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర విభజన బిల్లుకు సాధారణ మెజారిటీ చాలు. బోడో లేక గూర్ఖాలాండ్ తరహా మండలి ఏర్పాటు అన్నది కేవలం సీమాంధ్రుల విష్‌ఫుల్ థింకింగ్ నుంచి ప్రచారంలోకి వచ్చింది. అటువంటి మండలి ఏది ఏర్పాటు చేయాలన్నా రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ సవరణకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మద్దతు లభించాలి. ఎన్‌డీఏ మద్దతు ఇవ్వకుండా ఏ బిల్లుకూ మూడింట రెండొంతుల మద్దతు లభించే అవకాశమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం తప్ప, మరే ఆలోచన చేసినా తెలంగాణ ఇవ్వనట్టే పరిగణించాలి. రాష్ట్ర ఏర్పాటు కాకుండా ఇంకెటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇప్పుడు తెలంగాణ సమాజం అంగీకరించదు. ఈ ప్రాంతంలో రాజకీయంగా లబ్ధి పొందాలన్నా రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే శరణ్యం. ఇన్నేళ్ల ఉద్యమం తర్వాత, ఇంత రాజకీయ ప్రస్థానం తర్వాత, ఇన్ని వందలమంది త్యాగాల తర్వాత ఎటువంటి మధ్యే మార్గాలూ ఇప్పుడు కాంగ్రెస్‌ను కాపాడలేవు. ఆంధ్రప్రదేశ్ లో ఏకాభిప్రాయం లేకుండా ఎలా అని కొందరు అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేప్పుడు తమిళుల అంగీకారం అడగలేదు. 1960లలో గుజరాత్‌ను విడదీసేప్పుడు మరాఠీల ఏకాభిప్రాయం అడగలేదు. రాష్ట్రాల విభజన అధికారం పార్లమెంటు చేతిలో పెట్టడం అందుకే. శాసనసభ చేతిలో పెడితే ఏరాష్ట్రంలోనైనా మెజారిటీ ప్రాంతాలు, మైనారిటీ ప్రాంతాలపై దాష్టీకం చెలాయిస్తాయని భావించే రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్ర విభజన లోక్‌సభకు అప్పగించారు. ఏకాభిప్రాయం ఉండాల్సింది లోక్‌సభలో, జాతీయస్థాయిలో తప్ప, రాష్ట్రంలో కాదు. అయినా తెలంగాణ విషయంలో రాష్ట్రంలో కూడా ఏకాభిప్రాయం వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, అంతర్ధానమైన పీఆర్‌పీతో సహా అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించినవే. అందువల్ల ఏకాభిప్రాయం అన్నది ఇక ఇప్పుడు అప్రస్తుతం.


తెలంగాణకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకులు చేస్తున్న వాదనలు పూర్తిగా పనికిమాలినవి. సహకార ఎన్నికల్లో గెలిచాం కాబట్టి తెలంగాణ లేదని ఒకాయన వాదిస్తున్నారు. అది వారి లేకితనం. సహకార ఎన్నికలు ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండడం గతం నుంచీ చూస్తున్నదే. ఇప్పుడూ అదే జరిగింది. పార్టీల ప్రత్యక్ష ప్రమేయం, గుర్తు లేకుండా, విచ్చలవిడి డబ్బు, మద్యం పంపిణీల మధ్య జరిగే ఆ ఎన్నికలు తెలంగాణపై తీర్పు ఎలా అవుతాయి? ఇదంతా ఎందుకు? తెలంగాణలో రెండు టీచర్ల నియోజకవర్గాల నుంచి, ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి.... మూడు ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలవండి చూద్దాం! తెలంగాణ ఎన్నిసార్లు ఎన్ని పరీక్షలకు నిలబడింది? ఎన్ని ఎన్నికల్లో తన అస్తిత్వకాంక్షను రుజు వు చేసుకుంది? అయినా మళ్లీ మళ్లీ అవే కాలం చెల్లిన వాదనలు. అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో అన్ని ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ఇటువంటి వాదనలు చేయడం హాస్యాస్పదం. తెలంగాణపై నిర్ణయం జరుగుతుందనుకుంటున్న ప్రతిసారీ ఇటువంటి వాదనలేవో ముందుకు తేవడం వారికి అలవాటే. అందుకే ప్రతి సందర్భం మనకు తీర్పు సందర్భమే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలనూ తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికల్లో తెలంగాణవాదానికి ప్రతినిధులుగా నిలిచినవారిని గెలిపించుకోవడం మనకు మరో పరీక్ష.


సీమాంధ్ర నాయకత్వం పదేపదే చేసే మరికొన్ని వాదనలు - తెలంగాణ ఇస్తే నక్సలిజం బలపడుతుంద ని, మత ఘర్షణలు జరుగుతాయని. నక్సలిజం పుట్టి, పెరిగి, నశించింది సమైక్యాంధ్రలోనే. నక్సల్బరీ వసంతకాల మేఘగర్జనలు తొలుత ప్రతిధ్వనించింది శ్రీకాకు ళం, విజయనగరం ఏజెన్సీల్లోనే. ఇటు తెలంగాణ, అటు సీమాంవూధలో వేలాదిమంది యువకులను కోల్పోయిం దీ సమైక్యాంధ్రలోనే. మత ఘర్షణలను రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంది కూడా సమైక్యాంధ్రలోనే. సీమాంధ్ర నాయకులే. ఈ సమస్యల నుంచి సీమాంధ్ర నాయకత్వమేదో తెలంగాణ ప్రజలను కాపాడుతున్నట్టు పోజు పెట్టడం మరీ విడ్డూరం. మతాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడంలో సీమాంధ్ర కాంగ్రెస్‌కు ఉన్నంత అనుభవం ఎవరికీ లేదు. 1990లో మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపడానికి హైదరాబాద్‌లో మతకల్లోలాలు రేపిన దుర్మార్గులు ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు సీమాంధ్ర నాయకులు చేసే వాదనలన్నీ ఎప్పుడో పూర్వపక్షమైపోయాయి. వాస్తవాలకు వారెప్పుడో దూరమయ్యారు. చివరికిప్పుడు అబద్ధాలకు, రెచ్చగొట్టే దాడులకు దిగుతున్నారు. అదంతా ఆంధ్రాలో ప్రాపకం సంపాదించడం కోసమే. అక్కడ రాజకీయంగా బతికి బట్టకట్టడం కోసమే. సమైక్యవాదిగా ఉండాలనుకునే వారెవరూ లగడపాటి రాజగోపాల్, పరకాల ప్రభాకర్‌లలా మాట్లాడరు. తెలంగాణవాదంపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని ఉన్మాదస్థాయిలో మాట్లాడేవారు తెలంగాణ ప్రజలను తమతో కలసి ఉండాలని ఎలా కోరగలరు? తెలంగాణ బిడ్డలెవరూ వారిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోయేవాడి మానసికస్థితి వారిది.

మనం నిబ్బరంగా నిలబడి కొట్లాడాల్సిన తరుణం ఇది. బేలతనం, నిరాశనిస్పృహలు వద్దు. తెలంగాణ ఉద్యమశక్తులు, రాజకీయపక్షాలు ఒక సంఘటిత శక్తిగా అంతిమ సమరానికి సిద్ధం కావాలి. మనం ఏకకాలంలో మూడు వైపులా కొట్లాడాల్సిన అవసరం ఉంది. సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తున్న అబద్ధాల ప్రచార యుద్ధాన్ని తిప్పికొట్టడంతోపాటు, కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేయవలసిన అవసరం ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంతో కలిసిరాకుండా పదవులవైపు, సీమాంధ్ర పార్టీలవైపు దొంగచూపులు చూస్తున్న ఇంటిదొంగలను రాజకీయంగా వెలివేయవలసిన అవసరమూ ఉంది. ఇది జరగాలంటే- ఇప్పటి నుంచే ఉద్యమశక్తులన్నీ కత్తుకట్టాలి. ఈ రెండు మాసాలకాలం చాలా కీలకం. అటు కేంద్ర బడ్జెట్, ఇటు రాష్ట్ర బడ్జెట్ ఆమోదింపజేసుకునేదాకా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. మార్చి 25లోపు రెండు బడ్జెట్‌లూ ఆమోదం పొందాలి. ఆ తర్వాతే కేంద్రం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా నిర్ణయం రాకపోతే, కాంగ్రెస్‌ను, తెలంగాణకు ద్రోహం చేసిన సకల రాజకీయ పక్షాలను శంకరగిరి మాన్యాలు పట్టించే ఆఖరు అస్త్రం మనవద్దే ఉంటుంది. ఎప్పటికైనా మనమే గెలిచి తీరతాం.

[email protected]

344

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా