ఆ పని మనం చేయలేమా?


Sat,January 26, 2013 12:48 AM

kata-mitaసీమాంధ్ర రాజకీయశక్తులు, ‘మేతా’వులు మనపై చేస్తున్న యుద్ధాన్ని ఇప్పుడు తిప్పికొట్టలేకపోతే ఇంకెప్పుడూ చేయలేం. ఆధిపత్యం చెలాయిస్తున్నవాడు యుద్ధం గెలవడానికి అబద్ధాలను ఆయుధంగా ఉపయోగించు కుంటాడు. ఇప్పుడు సీమాంధ్ర నాయకులు, ‘మేతా’వులు చేస్తున్నది అదే. వాళ్లు చేస్తున్న వాదనలన్నీ పాతవే. మద్రాసు నుంచి విడిపోయే ముందు తమిళతంబిలు ఆంధ్రా వాళ్లకు వ్యతిరేకంగా ఏమైతే మాట్లాడారో ఇప్పుడు లగడపాటీలు, కావూరీలు, పరకాల ప్రభాకర్‌లూ, ఉండవల్లిలూ అవే మాట్లాడుతున్నారు.

తెలంగాణ ఇస్తే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు పడిపోతాయి. తెలంగాణ ఇవ్వకపోయినా రాష్ట్రం నుంచి వచ్చే ఎన్నికల్లో 30 స్థానాల మద్దతు తీసుకొస్తాం. జగన్ మనకే మద్దతు ఇస్తాడు’ అని సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రాన్ని బెదిరిస్తున్నారు. బుజ్జగిస్తున్నారు. జగన్‌మోహన్‌డ్డి కాంగ్రెస్‌తో ఇప్పుడు చేతులు కలపడానికి నిరాకరిస్తున్నా, తెలంగాణను ఆపడానికి ఎన్నికల తర్వాత మద్దతు ఇచ్చే ప్రతిపాదన పదేపదే ఢిల్లీ పెద్దల వద్ద చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలకు ప్రధాన కారణం ఇదే. ‘ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా’ అని ప్రశ్నిస్తున్న సీమాంధ్ర నాయకులు, అవే ఓట్లు, సీట్లతో కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అవే ఓట్లు, సీట్లను చూపి కేంద్రాన్ని లొంగదీయడానికి ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర నాయకులు ఈ అస్త్రాన్ని ఇప్పుడే కాదు ఎప్పుడయినా ఉపయోగిస్తారు. ఎందుకంటే సీమాంవూధలో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఉంటారు. 2014 ఎన్నికల తర్వాతయి నా వారికి ఆ అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఉండేది 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునే వారికి 25 మంది ఎంపీల మద్దతే ముఖ్యమవుతుంది. కేంద్రం మెడలు వంచడానికి ఇప్పుడున్న అవకాశం ఎన్నికల తర్వాత ఉంటుందన్న నమ్మకం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎటూ సంకీర్ణ ఫలితాలే వస్తాయి. ఏ కూటమికయినా ఇటు టీఆస్ మద్దతు, అటు జగన్ మద్దతు అవసరం అవుతాయి. అప్పుడు కూడా జగన్ వద్దే ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు.ఇప్పుడు జగన్‌కు ఏ బలం లేకుండానే, ఆయనను చూపి తెలంగాణను అడ్డుకుంటున్నా రు. రేపు ఎన్నికల తర్వాత ఆయన ఒక శక్తిగా ఎదిగిన తర్వా త అడ్డుకోరన్న గ్యారెంటీ ఏమీ లేదు. మనకు ఇప్పుడున్న బార్గెయినింగ్ శక్తి కూడా అప్పుడు ఉంటుందన్న నమ్మకం లేదు. సీమాంధ్ర నాయకులు ఇప్పుడు ఏ అస్త్రాన్ని ఉపయోగించి కేంద్రాన్ని వణికిస్తున్నారో అదే అస్త్రం ఇప్పుడు కూడా మన చేతిలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌కు 11 మంది ఎంపీ20 లు ఉన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లు గట్టిగా నిలబడితే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు పడిపోతాయి. మనవాళ్లు అలా ఎందుకు చేయడం లేదన్నదే తెలంగాణ ప్రజలను వేధిస్తున్న ప్రశ్న.

‘అన్నా! మన వాళ్లు ఎందుకు తెగించరు?ఎంతకాలం ఇలా? పన్నెండేళ్లుగా కొట్లాడుతున్నాం. అన్ని పార్టీలు మద్ద తు ఇచ్చాయి. అన్ని ఎన్నికల్లోనూ అంద రూ తెలంగాణ పేరు చెప్పే ఓట్లు సంపాదించారు. ఏకాభివూపాయం సాధించాం. అఖిలపక్ష సమావేశంలో, అసెంబ్లీలో, పార్లమెంటులో అంద రూ జై తెలంగాణ అన్నారు. కేసీఆర్ దీక్ష చేశారు. విద్యార్థులు వీరోచిత పోరాటాలు చేశారు. కేంద్రం దిగివచ్చి డిసెంబరు 9, 2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిం ది... మళ్లీ వెనుకకుపోయింది...సకల జనులు చరివూతాత్మక సమ్మె చేశారు. వెయ్యిమంది విద్యార్థులు బలిదానాలు చేశా రు... చేస్తూనే ఉన్నారు...సమైక్యవాదంకోసం సీమాంవూధులు ఏంచేశారు? సమైక్యవాదం ఎప్పుడు పుట్టింది? ఎన్ని ఉద్యమాలు చేశారు? ఏం త్యాగాలు చేశారు? అయినా వారు పైచే యి సాధించడమేమిటి? లోపం మనవాళ్ల దగ్గరే ఉంది. మంత్రులు, ఎంపీలు రాజీనామాచేస్తే ఈ ప్రభుత్వాలు ఉంటాయా? మన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి వీధుల్లోకి వస్తే ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వం నడువగలుగుతుం దా? సీమాంవూధులకు ఉన్నపాటి రోషం కూడా మనవాళ్లకు లేదా? అన్నా పిల్లలు చచ్చిపోతున్నరు. గుండె తరుక్కుపోతున్నది. ఏదో ఒకటి చేయాలనిపిస్తున్నది’- ఒక విద్యార్థి నాయకుని ఆవేదన ఇది. ఒక్క విద్యార్థి నాయకుడేమిటి? ఆజాద్ ప్రకటన చేసిన రోజు నుంచి ఎన్ని గుండెలు మండుతున్నాయో? ‘అన్నా! నేను మానవబాంబుగా మారతా? మా అమ్మానాన్నల ను చూసుకుంటారా? ఈ అవమానం, ఈ నిరీక్షణ భరించడం కష్టంగా ఉంది’ అని మరో విద్యార్థి నాయకుడు ఆక్రోశంతో ఫోను చేశారు.

kata‘కేంవూదంలో ఇంత జరిగిన తర్వాత కూడా తెలంగాణలో ఏమీ జరుగకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రాంతంలో రాజీవ్ విగ్రహాలు, కాంగ్రెస్ దిమ్మెలు ఇంకా ఎందుకుండాలి? రక్తం సలసల కాగుతున్నది’ అని మరో రాజకీయ నాయకుడు మాట్లాడాడు. ‘నాకు మావోయిస్టులే కరెక్టు అనిపిస్తున్నది. వీళ్లకు వాళ్లే కరెక్టు మొగుళ్లు...వాళ్లు లేకుండా పోయారు...

వీళ్లు చెలరేగుతున్నారు’ అని మరో విద్యార్థి నాయకుడు ఆగ్రహంగా మాట్లాడా డు. ‘రావూతంతా నిద్ర పట్టలేదు. ఏదో ఒకటి చేయాలనిపించింది. రాత్రి ఒంటిగంట దాకా రోడ్ల వెంట తిరిగాను. ఒక చోట రాజీవ్ విగ్రహం కనిపించింది. ఏదైనా చేస్తే! ఒక్కడ్ని చేయగలనా? సంస్కారం అడ్డం వచ్చింది. వెనుకకు వచ్చేశాను’ అని ఒక మేధావి ఆ రోజు రాత్రి పడిన అంతర్మథనా న్ని బయటపెట్టాడు. ఇవన్నీ చేయవచ్చా? తప్పా ఒప్పా? ఆవేదన, ఆక్రో షం, ఆగ్రహం నిజం. కొన్ని మార్గాలు అనుసరించదగినవి. కొన్ని అవాంఛనీయమైనవి. ఇంకొన్ని ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమానికి ఉన్న ప్రజాస్వామిక స్ఫూర్తిని దెబ్బతీసేవి. మన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకున్న బలాన్ని సద్వినియోగం చేసుకుంటే, తమ ప్రాంత ప్రజలకోసం గట్టిగా నిలబడి కొట్లాడితే ఇంతమంది ఇన్ని ఆలోచన లు చేయాల్సిన పనిలేదు. ఎంపీలు కొంత పర్వాలేదు. వాళ్లు కూడాకాంక్షిగెస్‌తో తెంచుకునే సాహసాన్ని ప్రదర్శించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలే చెంచాగిరి నుంచి, బానిసబుద్ధి నుంచి బయటపడడం లేదు. సీమాంధ్ర రాజకీయ బంధనాల నుంచి బయటపడాలన్న తపనగానీ, కృషిగానీ మన వాళ్లకు లేకపోవడమే మనకు శాపం. వీళ్లెందుకు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించరు? ప్రజల ఆకాంక్షలను ప్రజావూపతినిధులు ప్రతిబింబించనప్పుడే ప్రజలు పక్కదారి పడతారు. ఉద్యమాలు చేస్తారు. నిరాశా నిస్పృహలతో బలిదానాలు చేస్తారు. కొందరు ఆయుధాలు పడతారు. హింసామార్గంలోకి వెళతారు. ప్రజలు హింసాత్మకమార్గంలోకి వెళితే అక్కడి నాయకులది తప్పు. ఇప్పుడు తెలంగాణ రాకపోతే పూర్తి బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధులదే. తెలంగాణ తెచ్చుడో రాజకీయంగా చచ్చుడో...ఏదో ఒకటి తేల్చుకోవలసిన తరుణం ఆసన్నమైంది.


ఉద్యమశక్తులు, పార్టీలు కూడాఎన్నికల తర్వాత ఏదో చేస్తామని చెప్పడం కాకుండా, ఇప్పుడే ఏం చేయాలో ఆలోచించాలి. ఇది చాలా విలువైన కాలం. మరొక్కసారి సర్వశక్తులూ ఒడ్డి తెలంగాణ సత్తా చూపించాలి. అసెం బ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. తెలంగాణవాదానికి మద్దతుగా ఉన్న శక్తులను, పార్టీలను కలుపుకుని అక్కడ తాడోపేడో తేల్చుకోవలసిన అవసరం ఉంది. ఓట్లు, సీట్ల గురించి పక్కనబెట్టి, మన ప్రజాస్వామిక హక్కును గురించి మాత్రమే మాట్లాడదాం. కొట్లాడదాం. తప్పు కాంగ్రెస్ వైపు ఉంది. ప్రభుత్వం వైపు ఉంది. వాగ్దానాలు, హామీలు, ప్రకటనలు ఇచ్చి మోసం చేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది. సీమాంధ్ర నాయకత్వానిది. మనకున్న నైతికబలం అదే. ఆ నైతికబలం విశ్వరూపం ఒకసారి చూపించా లి. రాజకీయ ప్రయోజనాలు, భేషజాలు, పంతాలు కాసేపు పక్కనబెడ దాం. తెలంగాణ సమాజం నిరంతర దిగులుతో మథనపడుతున్నది. మన నాయకుల మార్గదర్శకత్వంకోసం ఎదురుచూస్తున్నది. మన ప్రజలు, మన యువకులు ధైర్యం కోల్పోకుండా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన నాయకులదే. తెలంగాణ సాధించుకుని తీరతామన్న ధీమాను వారికి కల్పించాలి. పరస్పర రాజకీయ హననాలు తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మాత్రం ఒక్కటిగా నిలబడదాం.

సీమాంధ్ర రాజకీయ శక్తులు, ‘మేతా’వులు మనపై చేస్తున్న యుద్ధాన్ని ఇప్పుడు తిప్పికొట్టలేకపోతే ఇంకెప్పుడూ చేయలేం. ఆధిపత్యం చెలాయిస్తున్నవాడు యుద్ధం గెలవడానికి అబద్ధాలను ఆయుధంగా ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు సీమాంధ్ర నాయకులు, ‘మేతా’వు లు చేస్తున్నది అదే. వాళ్లు చేస్తున్న వాదనలన్నీ పాతవే. మద్రాసు నుంచి విడిపోయే ముందు తమిళతంబిలు ఆంధ్రా వాళ్లకు వ్యతిరేకంగా ఏమైతే మాట్లాడారో ఇప్పుడు లగడపాటీలు, కావూరీలు, పరకాల ప్రభాకర్‌లూ, ఉండవల్లిలూ అవే మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని మాట్లాడే భాష కాదది. విద్వేషోన్మాదం వెన్ను నిండా నింపుకున్న ఆధిపత్య భాష. మద్రాసు విభజనపై వేసిన వాంఛూ కమిటీ ముందు తమిళతంబిలు కూడా-‘తమిళ ప్రాంతాల్లో వచ్చిన అదనపు ఆదాయంతోనే ఆంధ్రను అభివృద్ధి చేశాం’ అని వాదించా రు. ఇప్పుడు ఆంధ్రా నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఆంధ్రా సొమ్ముతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ‘మా రక్తం, చెమట ధారబోసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం’ అంటాడో మంత్రి. హైదరాబాద్‌లో ఆయన సంపాదించిందంతా తెలంగాణకు వదిలిపోతున్నట్టు పోజు పెడుతున్నాడాయన.

నిజమే. హైదరాబాద్‌లో లాంకోహిల్స్ వచ్చినా, హైటెక్‌సిటీ వచ్చినా అవి వారివారి ఆస్తులుగానే ఉండిపోతాయి తప్ప, తెలంగాణ ప్రజల ఆస్తులు కాబోవు. ఆంధ్ర నాయకులు అభివృద్ధి చేసింది హైదరాబాద్‌ను, తెలంగాణ ప్రజలను కాదు, తమను తాము అభివృద్ధి చేసుకున్నారు. మిలియనీర్లు బిలియనీర్లు అయ్యారు. లక్షాధికారులు కోటీశ్వరులయ్యారు. ఆ బిలియన్లు, ఆ కోట్లు తెలంగాణ ప్రజల కు అక్కరలేదు. అది తెలంగాణ అభివృద్ధి కాదు. ఆ లెక్కలు తెలంగాణ లెక్కలో వేసి ‘నాది కోటి, నీది లక్ష కలిపితే కోటి లక్ష. ఇద్దరి తలసరి ఆదాయం 50.5 లక్షలు’ అని మనల్ని నమ్మమంటారు. హైదరాబాద్, రంగాడ్డి, మెద క్ జిల్లాల సంపదను లెక్కవేసి చెప్పడంలోని మతలబు ఇదే. ఆ కంపెనీలు మావి కాదు. ఆ సంపద మాది కాదు. అక్కడ మెజారిటీ ఉద్యోగుల ఆదాయమూ మాది కాదు. మాది కాని సంపదను మా ఖాతాలో చూపించి, ఇదిగో మీ ఆదాయం పెరిగింది, మీరు అభివృద్ధి చెందారని చూపితే వీళ్లను ఏమనాలి? ఇక చాలు మీ అభివృద్ధీ వద్దు. మీ పాలనా వద్దు. మీ పెత్తనమూ వద్దు. మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకోనివ్వండి. మమ్మల్ని మేము పరిపాలించుకోనివ్వండి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మా తెలంగాణను న్యాయంగా, ధర్మంగా రానివ్వండి అది చాలు.

నెహ్రూ మాటలను వక్రీకరించిందెవడు?
వివాహం వంటిది

‘ఆంధ్ర తెలంగాణల విలీనం ఒక వివాహం వంటిదని చెప్పవచ్చును. అన్ని వివాహాల వలెనే ఇందులో కొన్ని మంచి లక్షణాలున్నాయి. కొన్ని చెడులక్షణాలున్నాయి. భయం, అమాయకంగా ఉండే పిల్లకి ఆధునిక స్వభావాలున్న పిల్లవాడికి వివాహం. పరిపాలనా సౌలభ్యంకోసం....(పాత ప్రతిలో మిగిలిన అక్షరాలు పోయాయి)’...
‘హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఇతరుల విశ్వాసాన్ని చూరగొనడానికి అందరూ ప్రయత్నించడం అవసరం. మంత్రులు, శాసనసభ్యులు విశాలదృక్పథంతో వ్యవహరించాలి. సంకుచితంగా వ్యవహరించకూడదు...’
-ఆంవూధవూపభ, 3.11.1956 మొదటి పేజీ

వివాహం వంటిది
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలసి పోయినాయి. ఇదోరకం వివాహం వంటి ఏర్పాటు. వివాహం ఎంత సంతోషవూపదమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. మానవ సంబంధాలకు మూలమైన మనస్తత్వ సమస్యలన్నింటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖహేతువవుతుంది.’
-ఆంవూధపవూతిక, 1956 నవంబరు 3, ఐదవ పేజీ
[email protected]

405

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles