ఆంధ్రా నేతల అధర్మవాదం


Sat,January 19, 2013 05:31 PM

andhraaచ రిత్ర పునరావృత్తమవుతున్నది. అవే వాదనలు, అవే పేచీలు, అవే సంఘర్షణలు. కాకపోతే నేతలు మారారు. ప్రాంతాలు మారా యి. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే ముందు ఆంధ్ర ప్రాంతం పడిన బాధలన్నీ ఇప్పుడు తెలంగాణ అనుభవిస్తున్నది. బొంబాయి నుంచి గుజరాత్ వేరుపడినప్పుడు జరిగిన సంఘర్షణ ఇప్పుడు మళ్లీ ఆంధ్ర, తెలంగాణల మధ్య జరుగుతున్నది. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోవడానికి అంతపోరాటం ఎందుకు చేయవలసి వచ్చింది? పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసేదాకా సమస్య ఎందుకు తేలలేదు? ఇప్పుడు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యనే నాడు ఆంధ్ర ప్రాంతం ఎదుర్కొంది.

నాడు మద్రాసు రాష్ట్రంలో అధిక సంఖ్యాకులు, బలవంతులు అయిన తమిళ, మళయాల, కన్నడ నేతలు వ్యతిరేకించడం వల్ల రాష్ట్ర విభజన ఆలస్యమైంది. మద్రాసు రాష్ట్రంలో మొత్తం 62 మంది ఎంపీలు ఉంటే, సీమాంధ్రలో అప్పుడున్న ఎంపీలు 24 మంది మాత్రమే. మద్రాసు అసెంబ్లీలో 309 మంది శాసనసభ్యులు ఉంటే సీమాంధ్రలో అప్పుడున్నవారు 123 మంది మాత్రమే. తమిళ ఆధిపత్యంలోని మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తరచూ రాజీనామాలు చేస్తామని బెదిరించడం వల్ల ఆంధ్రులు అవమానాలపాలయ్యారు. స్వరాష్ట్ర కాంక్ష అనేక ఎదురుదెబ్బలు తిన్నది. రాజగోపాలచారి నాయకత్వంలోని తమిళ లాబీ నెహ్రూను, ఇతర కేంద్ర నాయకులను ప్రభావితం చేయడం వల్ల కేంద్రం విభజనకు అంత తేలికగా సిద్ధపడలేదు.

చివరకు పొట్టి శ్రీరాములు త్యాగం కేంద్రం మెడలు వంచింది. మద్రాసును తమిళులకు వదిలే షరతుపై రాజగోపాలచారిని, ఇతర తమిళ నాయకులను ఒప్పించి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విభజన నిర్ణయం ఆలస్యం కావడానికి అప్పుడు కూడా ప్రధాన అడ్డంకి రాజధాని వ్యవహారమే. పొట్టి శ్రీరాములు చెన్నపట్నాన్ని ఆంధ్రకు రాజధానిగా అంగీకరించేదాకా దీక్ష విరమించబోనని ప్రకటించడం వల్లనే ఆయన ప్రాణాల మీదకు వచ్చిందని కొందరు చరివూతకారులు చెబుతారు. ఆయన చివరి రోజుల్లో ప్రభుత్వానికి రాసిన లేఖలు కూడా అదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తమిళులకు, ఆంధ్రులకు మధ్య ఎక్కువ వివాదం నడిచింది చెన్నపట్నం విషయంలోనే.

‘చెన్నపట్నం మనదే. మా పూర్వీకులు నిర్మించిందే. ఇక్కడ ఎక్కువ జనాభా తెలుగువారే. ఇక్కడ మా కంపెనీలు, వ్యాపారాలు, పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి.

మేము చెన్నపట్నం వదలం. అది మా ప్రాణం’ అని ఆరోజు పొట్టి శ్రీరాములు, బులుసు సాంబమూర్తితో సహా ఆంధ్ర నాయకులు వాదించారు. ఆంధ్ర నాయకుల మధ్య విభజన తేవడానికి రాజాజీ రాయలసీమ నాయకులను ఎగదోస్తూ వచ్చారు. ‘మీకు చెన్నపట్నమే దగ్గర. అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది. వాళ్లతో మీరు వేగలేరు. మీకు మద్రాసు రాష్ట్రంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది’ అని రాజాజీ సీమ నాయకులకు ఆశపెట్టి ఆంధ్ర నాయకులతో కలువకుండా చేశారు. పదవులిచ్చి ఆంధ్ర నాయకులపై ఉసిగొల్పారు. నిజానికి చెన్నపట్నంపై ఆంధ్ర ప్రజలకు చారిత్రక వారసత్వ హక్కు ఉంది. చెన్నపట్నం భూములు అత్యధికం చంద్రగిరి రాజులవి. చంద్రగిరి రాజులతో ముందుగా భూములు రాయించుకునే బ్రిటిష్‌వారు ఓడరేవు కట్టారు. ఆ తర్వాత కోట కట్టారు. చివరకు చెన్నపట్నాన్నే కాజేశారు.

చెన్నపట్నంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు, సినీ తారలు సంపాదించుకుంది స్వార్జితమే. అక్కడి ప్రభుత్వం వీళ్లకు పెద్దగా చేసిందేమీ లేదు. చెన్నపట్నం నుంచి ఆంధ్ర ప్రజలు తీసుకున్నదానికంటే ఆ పట్నానికి ఇచ్చిందే ఎక్కువ. ఆ మమకారంతోనే, ఆ హక్కుతోనే ‘చెన్నపట్నాన్ని ఆంధ్ర రాజధాని చేయాలి, లేదంటే కనీసం ఉమ్మడి రాజధాని చేయాలి. అలా కుదరకపోతే చెన్నపట్నం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి. అదీ సాధ్యం కాకపోతే మద్రాసు నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న కోవం నదికి ఉత్తరంవైపు ఆంధ్ర రాజధాని, దక్షిణం వైపు తమిళ రాజధాని ఏర్పాటు చేయాలి.

అందుకూ ఒప్పుకోకపోతే చెన్నపట్నాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి’ అని ఆరోజు ఆంధ్ర నాయకులు డిమాండు చేశారు. అయినా ఎన్ని కమిటీలు వేసినా ఏ కమిటీ ఆంధ్ర నాయకుల వాదన వినిపించుకోలేదు. ఎందుకంటే చెన్నపట్నం మద్రాసుగా పరిణమించిన తర్వాత దాని స్వభావ స్వరూపాలు మారిపోయాయి. మద్రాసులో తమిళ జనాభా 1951 నాటికి 61 శాతానికి పెరిగింది. రాజకీయంగా తమిళుల ఆధిపత్యం వ్యవస్థితం అయింది. అందుకే మద్రాసును తమిళ రాజధానిగానే గుర్తించాయి అన్ని కమిటీలు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రులు చివరకు చెన్నపట్నాన్ని వదలుకుని ఉన్నపళంగా కర్నూలుకు రావలసి వచ్చింది. చెన్నపట్నాన్ని తాత్కాలిక సంయుక్త రాజధానిగా కూడా రాజాజీ ఒప్పుకోలేదు. ఈ పేచీలు మాకొద్దు వెంటనే మద్రాసు ఖాళీ చేయండి అని ఆరోజు రాజాజీ స్పష్టం చేశారని చెబుతారు.

మహారాష్ట్ర నుంచి గుజరాత్ వేరుపడినప్పుడు ఇవే వాదనలు వచ్చాయి. బొంబాయిలోని గుజరాతీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సమావేశమై రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సమావేశానికి హాజరైనవారంతా మహారాష్ట్రియన్స్‌కు వ్యతిరేకంగా చాలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. వారికి అనుకూలంగా ఉండే పత్రికలు పతాక శీర్షికల్లో ఆ సమావేశం వివరాలు ప్రకటించాయి. ‘ఒకవేళ విభజన చేయడం అనివార్యమైతే బొంబాయిని ప్రత్యేక రాష్ట్రం చేయాలని వారు వాదించారు. బొంబాయి రాజధానిగా కొంకణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కొందరు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు పెద్దగా మద్దతు లభించలేదు. బొంబాయి గుజరాతీలతో ఎందుకు ఉండాలో వారు సవివరంగా ఒక తీర్మానంలో పొందుపరిచారు. ‘బొంబాయిలో అందరికంటే ముందు నివాసం ఏర్పరచుకున్నవారు గుజరాతీలే. బొంబాయి ఎప్పుడూ మహారాష్ట్రలో భాగంగా లేదు.

బొంబాయిలో మరాఠీ మాట్లాడేవారు మెజారిటీగా లేరు. బొంబాయిలో అన్ని ప్రాంతాలవారు పెట్టుబడులు పెట్టారు. దేశానికే వ్యాపారకేంద్రం. అందువల్ల దీనిని మహారాష్ట్రతో సంబంధం లేకుండా ఉంచాలి. బొంబాయిలో వ్యాపార, పారిశ్రామిక సంస్థలను నెలకొల్పింది మేమే. మహారాష్ట్రియన్లు అందులో కూలీలు, క్లర్కులు మాత్రమే. యజమానులను కూలీల చేతుల్లో పెట్టడం సమంజసం కాదు. బొంబాయి అదనపు ఆదాయం మీద ఆధారపడి బతకడం కోసమే మహారాష్ట్ర బొంబాయి కోసం పట్టుబడుతున్నది....’ ఇలా ఎన్ని వాదనలు చేశారో.

కానీ చరిత్ర, భౌగోళిక వాస్తవికతలు, భాషా సాంస్కృతిక భూమికలను పరిశీలించిన రాజ్యాంగ నిపుణులు బొంబాయి మహారాష్ట్రియన్లదే అని నిర్ధారించారు. తుది నిర్ణ యంచేశారు. ఒక్క బొంబాయి, మద్రాసుల విషయంలోనే కాదు, పంజా బ్, అస్సాంల విభజన సందర్భంలోనూ ఈ వివాదాలు వచ్చాయి. పంజాబ్ అప్పటిదాకా తమకు రాజధానిగా ఉన్న సిమ్లాను హిమాచల్‌కు వదిలేసి, చండీగఢ్‌కు మారవలసి వచ్చింది. అస్సాం తమకు రాజధానిగా ఉన్న షిల్లాంగ్‌ను మేఘాలయకు వదిలేసి దిస్‌పూర్‌కు మారవలసి వచ్చింది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం ఆంధ్ర నాయకులకు అలవాటుగా మారింది. అందుకే హైదరాబాద్‌పై కాలం చెల్లిన వాదనలు చేస్తున్నారు..

నిజానికి హైదరాబాద్‌లో జరిగింది వేరు. ఇక్కడ మాత్రం ప్రభుత్వమే ఆంధ్ర కంపెనీలకు భూములు, పన్ను రాయితీలు, సకల సౌకర్యాలు కల్పించింది. చెన్నారెడ్డి హయాంలో సినీ తారలకు ఇళ్ల స్థలాలు, స్టూడియో స్థలాలు, రాయితీలు అనేకం ఇచ్చారు. హైదరాబాద్‌కు ఆంధ్ర వ్యాపారులు, సినీతారలు ఇచ్చినదానికంటే, హైదరాబాద్ వారికి ఇచ్చిందే ఎక్కువ. కానీ 1952-53లలో మద్రాసులో ఏం జరిగిందో ఇప్పుడు హైదరాబాద్‌లో అదే జరుగుతున్నది. అప్పుడు తమిళులు అధిక సంఖ్యాకులు. ఆ బలంతోనే ఆంధ్రులను ఏడిపించారు. ఆంధ్రులు అల్పసంఖ్యాకులు. స్వరాష్ట్రంకోసం అరచిగోల పెట్టాల్సివచ్చింది. ఇప్పుడు సీమాంధ్ర నేతలు అదే మందబలంతో తెలంగాణను ఏడిపిస్తున్నారు. నాడు రాజాజీ రాయలసీమ నాయకులను అడ్డం పెట్టి ఆంధ్ర నాయకులను ఆటపట్టిస్తే, ఇప్పుడు సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌కు చెందిన దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి వంటి సైంధవులను అడ్డంపెట్టి తెలంగాణను అడ్డంకొట్టాలని చూస్తున్నారు.

చెన్నపట్నంకోసం చేసినవాదనలే ఇప్పుడు హైదరాబాద్ విషయంలోనూ చేస్తున్నారు. ‘తొండలు గుడ్లు పెట్టే హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం. మా పెట్టుబడులు ఇక్కడ కుమ్మరించాం. కంపెనీలు పెట్టాం. పదకొండు గంటలదాకా లేచే అలవాటులేని హైదరాబాదీలకు పొద్దున్నే లేవడం నేర్పాం. ఇప్పుడు వెళ్లిపొమ్మంటే ఎలాపోతాం’ అని వాదిస్తున్నారు. వీళ్లు పెట్టుబడులు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, దేశమంతటా పెడుతున్నారు. లగడపాటి రాజగోపాల్ మంగుళూరు, నోయిడా, ఉత్తరవూపదేశ్, రాజస్థాన్...ఇంకా ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారు. కావూరీ అంతే. జీఎమ్‌ఆర్, జీవీకేలూ అంతే...దేశమంతటా రెక్కలు చాపుకున్న కంపెనీలు ఇవి. ఆ నగరాలన్నింటిపై వీళ్లు క్లెయిమ్ పెట్టగలరా?

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసి, ఉమ్మడి రాజధాని చేయాలట. ఇంకొకాయన మరో అడుగు ముందుకు వేసి హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాల ని కోరతాడు. హైదరాబాద్‌లో మాకు ప్రత్యేక హక్కులు కల్పించాలని ఇంకో పండితుడు వాదిస్తాడు. చెన్నపట్నం వదులుకుని వచ్చినప్పుడు వీరికి ఏమి హక్కులు కల్పించారు? ఇప్పటిలాగే అనేక గొంతెమ్మకోరికలు కోరి చివరికి ‘గెట్ లాస్ట్’ అనిపించుకుని మరీ బయటపడవలసి వచ్చింది.

అన్నీ నిర్మించామని చెప్పే ఆంధ్ర నాయకత్వం సొంత రాజధానిని ఎందుకు నిర్మించుకోలేకపోయారు? ఎప్పుడూ పరాధీన మనస్తత్వంతో ఎందుకు కొట్లాడుతున్నారు? అటు చెన్నపట్నాన్ని, ఇటు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయగలిగిన సీమాంధ్ర నాయకులు సొంత రాజధానిని ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారో ఇప్పటికీ చెప్పలేరు. మూడేళ్లపాటు కర్నూలులో గుడారాల్లో ఎందుకు ఉండవలసి వచ్చిందో వివరించలేరు. విశాలాంధ్ర వాదాన్ని ప్రచారంలో పెట్టి తెలంగాణ నాయకులను ఒక్కొక్కరినే ఎందుకు మేనేజ్ చేయవలసి వచ్చిందో సమాధానం చెప్పరు. ‘రెడ్స్, రజాకార్స్, రెడ్డీస్‌-త్రీ ఆర్స్‌తో నువ్వు తట్టుకోలేవు. ఆంధ్రలో కలిపితే అందరికీ క్షేమం’ అని బూర్గుల రామకృష్ణారావును ఒక సామాజిక వర్గం ఎందుకు భయపెట్టి ఒప్పించవలసివచ్చిందో ఎక్కడా చర్చ జరగదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఈ అనుభవాలన్నింటినీ కలబోసుకుని, పరిణతితో ముందుకు సాగుతున్నది. అన్నదమ్ముల్లా విడిపోవడానికి ఉన్న అవకాశాలను ఆంధ్ర నాయకత్వమే వమ్ముచేస్తున్నది. హైదరాబాద్‌ను చర్చకు పెట్టడడం ద్వారా మరింత మంటను రాజేస్తున్నది.

ఇది ఎవరికీ మంచిది కాదు. ఆంధ్ర నాయకులారా! మీ ఆటలు, మాటలు, ఎత్తులు జిత్తులు చాలా పాతవి. అవి ఇప్పుడు చెల్లవు. ఇప్పటివరకు చేసిన అధర్మ యుద్ధాలు చాలు. కనీసం ఇప్పుడయినా నిజాయితీని ప్రదర్శించండి. సగర్వంగా స్వరాష్ట్ర నిర్మాణానికి అంకితం కండి. హైదరాబాద్‌లో ఏదో బంగారు గని ఉందని ఆంధ్రా యువతను నమ్మించి, విచ్ఛిన్న చర్యలకు దిగకండి. రెండు ప్రాంతాల ప్రజల మధ్య కనీస ఆప్యాయతల్ని మిగలనివ్వండి. ఇప్పటిదాకా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించకండి. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉన్నా అది విశ్వనగరంగానే ఉంటుంది. మినీ ఇండియాగానే ఉంటుంది.

కొసమెరుపు
‘ఆంధ్రలో లక్ష మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రోడ్డు చూసినా మనవాళ్లే నిర్మిస్తున్నారు. ఆకాశ హర్మ్యాలు, రిజర్వాయర్లు, విమానాశ్రయాలు....ఒక మనవాళ్ల ప్రమేయంలేని పనులు లేవు. ఇంతెందుకు ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు కూడానెల్లూరు వారే. మనవాళ్లు తలుచుకుంటే ఆంధ్రను మరో ఆధునిక అద్భుతంగా తీర్చిదిద్దగలరు. ఎటొచ్చీ హైదరాబాద్ మీది వ్యామోహమే మా కొంపలు ముంచుతోంది. 1969 లోనో, 1972లో రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఇంత క్షోభ ఉండేది కాదు. బ్రహ్మాండమైన రాజధాని వచ్చి ఉండేది. అస్తమానం తెలంగాణవాళ్ల శాపనార్థాలు వినాల్సిన దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటికయినా మేలుకోకపోతే అనుమానాలు, అవమానాలు ఇంకా పెరుగుతాయి’ అని సీమాంధ్రకు చెందిన వామపక్ష నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

[email protected]

417

KATTA SHEKAR REDDY

Published: Sat,October 5, 2019 11:39 PM

దొరతనం వదిలించింది ఎవరు?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల విజ్ఞతకు మరో పరీక్ష పెట్టింది. తెలంగాణ పురోగతి ని జీర్ణించుకోలేని శక్తులు వీలైనంత రాజకీయ కాల

Published: Mon,September 16, 2019 01:05 PM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు        


Featured Articles