పలికినవాడు ప్రధాని


Fri,August 19, 2011 11:27 PM

-కట్టా శేఖర్‌రెడ్డి


లోక్‌పాల్ బిల్లును సాధ్యమైనంత త్వరగా అమోదించాలని సభలో అందర మూ అంగీకారానికి వచ్చాము. అసలు సమస్య ఏమంటే, చట్టాన్ని ఎవరు రూపొందించాలి? ఎవరు ఆమోదించాలి? సంప్రదాయం ప్రకారం ఎగ్జిక్యూటి వ్ ముసాయిదా బిల్లును రూపొందిస్తుంది, శాసనకర్తలు దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారు, పార్లమెంటు దానిపై చర్చించి, అవసరమైతే సవరణలతో ఆమోదిస్తుంది.

-ప్రధాని మన్‌మోహన్‌సింగ్katta-cartoon-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకదా! భలే చెప్పారు! మరి తెలంగాణపై హోం మంత్రి చిదంబరం ఎందుకు సార్-అలా చెప్పారు? పార్లమెంటుకేం సంబంధం లేదని, మీరూ మీరూ తేల్చుకోవాలని ఎందుకు చెప్పారు సర్? పార్లమెంటు అధికారం అప్పుడు గుర్తుకు రాలేదెందుకు సార్? తెలంగాణపై ముసాయిదా బిల్లు తయారు చేయవలసింది ఎగ్జిక్యూటివ్, అంటే హోం మంత్రిత్వశాఖ, న్యాయశాఖ. దానిని పార్లమెంటు లో ప్రవేశపెట్టవలసింది హోంమంత్రి చిదంబరం. దానిపై చర్చించి, అవసరమైతే సవరణలు చేసి ఆమోదించవలసింది పార్లమెంటు. కానీ తప్పించుకోవడం కోసం, బాధ్యతల నుంచి తప్పుకోవడం కోసం అప్పుడేమో పార్లమెంటుకు బాధ్యతే లేదన్నట్టు మాట్లాడారు.

ఇప్పుడేమో పార్లమెంటు ఉండగా అన్నా హజారే ఎవరు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలవి కాకపోతే ఒక మాట. అలవి అయితే మరో మాట. ఎంత అవకాశవాదం?
మీరు ప్రతిపాదించదల్చుకున్న లోక్‌పాల్ బిల్లుపై ఎక్కడ ఏకాభివూపాయం సాధించారు? ఎవరితో చర్చలు జరిపి ఒప్పించారు? సంప్రదింపుల ప్రక్రియ పూర్తికాకుండానే లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ముందుకు తేవడానికి ఎందు కు ఉరుకులుబెడుతున్నారు? ప్రజలు కోరుతున్నది పనికొచ్చే చట్టాలను, పనికిరాని, పనిచేయని చట్టాలను కాదు. చట్టం ధర్మరక్షణకోసం కావాలి, ఆపద్ధర్మం కోసం, ఆత్మరక్షణ కోసం కాదు. కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లు ఆపద్ధర్మానికి ఉపయోగపడుతుందే తప్ప, ఆచరణలో అవినీతి నిర్మూలనకు ఉపయోగపడదు.

అందుకే పౌరసమా జం ప్రత్యామ్నాయ బిల్లును ముందుకు తెచ్చిం ది. అనేక చట్టాలు పౌర సమాజం నిర్వహించిన ఉద్యమాలు, కాంపెయిన్‌ల కారణంగా రూపుదాల్చినవే. సమాచారహక్కు చట్టం తాజా ఉదాహర ణ. ఢిల్లీ కాలుష్య నియంవూతణ చట్టం మరో ఉదాహరణ. పౌరసమాజం ప్రతిపాదనలకు కేంద్రం నిజాయితీ గా స్పందించాల్సింది పోయి, అన్నా హజారేపై అధికార మదాంధతతో కళ్లుమూసుకుపోయిన పిచ్చి కుక్కల ను ఉసిగొల్పింది.

అన్నా హజారే మరో మహాత్మాగాంధీ కాకపోవచ్చు, జయవూపకాశ్ నారాయణ్ కాకపోవచ్చు. కానీ ఆయన నిజాయితీని శంకించాల్సిన పనిలేదు. గాంధీ స్వాతంవూత్యోద్యమం ప్రారంభించినప్పుడు బ్రిటిష్ పాలకులు ఆయనపై ఎంత చులకనగా మాట్లాడారో, ఎంత వికృతమైన వ్యాఖ్యలు చేశారో చరివూతలో పదిలంగా ఉంది. జయవూపకాశ్‌నారాయణ్‌పై ఇందిరాగాంధీ, ఆమె అంతేవాసులు ఎలా విరుచుకుపడ్డారో ఇప్పటికీ చాలా మందికి గుర్తే. జయవూపకాశ్ ఉద్యమం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఆరోపణలు చేశారు. ‘దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలను విచ్ఛిన్నం చేయడానికి దేశం లోపలి శక్తులు, వెలుపలి శక్తులు చేస్తున్న కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఇందిరాగాంధీ 1976 జనవరిలో విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆరోపించారు.

ఇప్పుడు కాంగ్రెస్ నేతలు, ప్రధాని స్వయంగా అన్నా హజారేపై అలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఆది నుంచి కాంగ్రెస్ సంస్కృతే అటువంటిది. ఎదుటివారిని నిజాయితీతో, నిజాలతో ఎదుర్కోవడం సాధ్యం కానప్పుడు అబద్ధాలతో, కట్టుకథలతో దాడి చేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. హజారే ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్యక్షుడు శ్రీరవిశంకర్‌ను కూడా కేంద్రం సిబిఐ దాడుల బూచితో బెదిరించిందంటే కేంద్రం రోజురోజుకు ఎంతగా పతనమవుతున్నదో తెలుస్తున్నది. ఇవేవీ అవినీతి వ్యతిరేక ఉద్యమం విలువను, అవసరాన్ని తగ్గించవు. ఉద్యమం మొదలు పెట్టేప్పుడు హజారే కూడా చిన్నగానే కనిపించవచ్చు. కానీ ఆయన ఎత్తుకున్న నినాదం ఆయనను ఉన్నతుడిని చేస్తుంది.
అవినీతి దేవత
ఆ మధ్య కమేడియన్ జస్పాల్ భట్టి నాయకత్వంలో నాన్‌సెన్స్ క్లబ్ ‘అవినీతి దేవత’ను ఒక దానిని రూపొందించి, ఆ దేవతకు అవినీతి మంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించింది. ఆ అవినీతి దేవతను పార్లమెంటు ముందు ప్రతిష్ఠించాలని ప్రయత్నించింది. అవినీతిని అదుపు చేయలేకపోతే త్వరలోనే అవినీతి దేవతలు ఊరూరా అవతరిస్తారని, వారి ‘అవినీతి దేవాలయాలు’ నిర్మించాల్సి వస్తుందని ఆయన ఆ సందర్భంగా చెప్పారు.

నిరసన
అవినీతి నన్ను చలింపజేయదు
దిగులుతో తల దించుకోవాలనిపించడం లేదు
ఫలానా రాజకీయ నాయకుడు అవినీతి కుంభకోణంలో
దొరికిపోయాడని తెలిసినప్పుడు కూడా ఏమైందో తెలియదు
నాకు నిద్రలో ఉన్న ఫీలింగే కలుగుతోంది
గుండె, మెదడు, జ్ఞానేంవూదియాలన్నీ మొద్దుబారిపోయాయి
ధరలు పెరిగితే పెరగనీ, అవినీతి వ్యాపిస్తే వ్యాపించనీ
అలసిపోయాను వీటిపై రాసీ రాసీ, మాట్లాడి మాట్లాడి
ఎంతకాలమని? మెదడును శాంతపరిచాను.
ఉదరాన్ని చల్లబరిచాను. బుద్ధికి సహనం నేర్పాను.
ఇక ఏం జరిగినా చెలించను....
-అంశుమాలి రస్తోగి ‘నయీ దునియా’లో రాసిన వ్యంగ్య రచన ఇది.


దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆకాశం నుంచి చూసి గర్వపడేలా రాష్ట్రంలో త్వరలో స్వర్ణయుగం రాబోతున్నది.

-వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్‌మోహన్‌డ్డి


తండ్రి స్వర్ణయుగం నాటి ధగధగల నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోనే లేదు. అప్పుడే మరో స్వర్ణయుగం ఎందు కు బాబూ. స్వర్ణయుగం వస్తుందో రాదో, ఆయనపై నుంచి చూసి ఆనందిస్తారో లేదో కానీ, ఇప్పుడు తమరి యాతన చూసి మాత్రం ఆయన ఆత్మ క్షోభిస్తుంటుంది.

అన్నా చంద్రబాబు!
అన్నా హజారే మహాత్మాగాంధీ కావచ్చు, కానీ చంద్రబాబు అన్నా హజారే కాలేడు. అన్నా హజారే జయవూపకాశ్ నారాయణ్ కావచ్చు, కానీ జగన్‌మోహన్‌డ్డి పవివూతుడు కాలేడు. బండెడు అవినీతి చరివూతను మూటగట్టుకున్న వారు, రెండెకరా ల వాళ్లు, రెండు కోట్లవాళ్లు కళ్లు మూసి తెరిచేలోగా వందల కోట్ల సంపదకు అధిపతులై..... ఉన్నట్టుండి జాతీయ జెండాలు భుజాన వేసుకుని, వందేమాతర గీతాలు ఆలపిస్తే ఎలా ఉంటుంది? అనేక కుంభకోణాలకు మూలపురుషు లు, అవినీతి సంస్కరణలకు ద్వారాలు తెరిచినవారు అవినీతి వ్యతిరేక పోరాటంలో ముందువరుసలో నిలబడి నినాదాలిస్తే ఏమవుతుంది? చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌డ్డి, మధుకోడా, లాలూవూపసాద్, అమర్‌సింగ్, ఎ.రాజా, కనిమొళి, కల్మాడి.....వంటి వాళ్లంతా అన్నా హజారేకు మద్దతు ప్రకటిస్తే చాలు, ఆయన ఉద్యమ ప్రతిష్ఠ దెబ్బతినడానికి! విద్యుత్ పీపీఏలు మొదలుకుని ఏలేరు, ఎకె్సైజు, ఐఎంజీ, ఎమ్మార్ వంటి కుంభకోణాలవరకు అన్నింటిలోనూ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబునాయుడే. చంద్రబాబు ప్రారంభించిన అవినీతి ప్రస్థానాన్ని రాజశేఖర్‌డ్డి కొనసాగించారు.

పీపీఏలు రద్దు చేస్తామని బెదిరించి, వారితో సెటిల్‌మెంటు చేసుకుని, తిరిగి వాటిని యథాతథంగా కొనసాగించారు. ఎమ్మార్ భూతంవూతాన్ని చంద్రబాబు మొదలుపెడితే ఈయన కొనసాగించారు. ఇందూ ప్రాజెక్టుకు తొలుత భూములు ఇచ్చింది చంద్రబాబే. భూముల పంపిణీ చంద్రబాబు ప్రారంభిస్తే రాజశేఖర్‌డ్డి పతాక సన్నివేశానికి తీసుకెళ్లారు. ఎకె్సైజు కుంభకోణంలో ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి నిలిపివేయించుకున్న నీతిమంతుడు చంద్రబాబు. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి అక్రమ ఆస్తుల కేసు వేస్తే ఆ కేసునూ ముందుకు నడవకుండా అడ్డుకున్న ఘనత ఆయనది. చంద్రబాబు నీతి చరిత్ర అంతా హజారేకు కూడా తెలుసునని, ఏలేరు కుంభకోణంపై ఒక పోస్టర్‌ను హజారే విడుదల చేశారని ఓ మిత్రుడు మెయిల్ పంపారు. అదెంతవరకు నిజమో కానీ, చంద్రబాబు, వైఎస్ జగన్ దొందూదొందే! వీరి నుంచి అన్నా హజారేను ఆ దేవుడే కాపాడు గాక.

392

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా