కాంగ్రెస్‌ను అర్థం చేసుకుందాం!


Sun,December 9, 2012 12:34 AM

kattaకాంగ్రెస్ ఎప్పుడు ఏ పని ఎందుకు చేస్తుందో ఇప్పటికయినా అర్థం చేసుకోవాలి. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఈ తొమ్మిదేళ్లుగా కాంగ్రెసే పరిపాలిస్తున్నది. ఇన్నేళ్ల కాలం లో కాంగ్రెస్ చేయాలనుకున్నదేదీ చేయకుండా ఉండలేదు. చేయకూడదనుకున్నదేదీ చేయలేదు. చర్చలు, ఏకాభివూపాయం అన్నవి తురుపుముక్కలు. తెలంగాణ ఈ పరీక్షలన్నింటినీ దాటి ముందుకు వచ్చింది. అయినా కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం చేయలేదు. చర్చలు, ఏకాభివూపాయంతో నిమిత్తం లేకుండానే అనేక నిర్ణయాలు చేసింది. అనేక చట్టాలు చేసింది. తొమ్మిది బడ్జెట్‌లకు ఆమోదం పొందింది. 2009కి ముందు అణుఒప్పందంపై యుద్ధమే జరిగింది. దేశ ప్రయోజనాలను బలిపెట్టే అణుఒప్పందంపై సంతకాలు చేయరాదని అప్పట్లో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు పట్టుబట్టాయి. ఆ అంశంపై పార్లమెంటులో విస్తృతాంగీకారం లేదు. కానీ వామపక్షాలతో తెగదెంపులు చేసుకుని అయినా అణు ఒప్పందం బిల్లును పార్లమెంటులో నెగ్గించింది కాంగ్రెస్. చిల్లరవర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)పై విస్తృతాంగీకారం కూడా లేదు. మెజారిటీ పార్టీలు ఎఫ్‌డిఐలు అనర్థదాయకమని నెత్తిన నోరుపెట్టుకుని చెప్పాయి. లక్షలాది మం ది చిల్లర వర్తకులు వీధులపాలవుతారని, బహుళజాతి కంపెనీలకోసం ఇటువంటి నిర్ణయాలు చేయవద్దని కోరాయి.

ఎస్‌పి, బిఎస్‌పిలు ఎఫ్‌డిఐలను వ్యతిరేకిస్తున్నందున లోక్‌సభలో ప్రభుత్వ విధానం వీగిపోతుందని, అది జరిగితే యూపీ ఏ ప్రభుత్వం పతనమవుతుందని భావించారు. అయినా వెనుకకు తగ్గేది లేదని కాంగ్రెస్ పట్టుబట్టింది. సంస్కరణల విధానాలకు కట్టుబడి ఉండడమే అవసరమని కాంగ్రెస్ భావించింది. చివరకు ఎస్‌పి, బిఎస్‌పిలతో అవగాహనకు వచ్చి, ఆ రెండు పార్టీలు హాజరుకాకుండా చూసుకుని ఓటింగ్ పెట్టింది. ఫలితం, 544 మంది సభ్యులు కలిగిన లోక్‌సభలో కేవలం 254 మంది మాత్రమే ఎఫ్‌డిఐలకు మద్దతు ప్రకటించారు. అంటే మైనారిటీ బలంతోనే కాంగ్రెస్ ఈ విధానాన్ని నెగ్గించుకుంది. కాన్సెన్సస్ అంటే విస్తృతాంగీకారం సాధించడం. విస్తృతాంగీకారం అంటే మెజారిటీ అంగీకారం పొందడం. లోక్‌సభలో 273 మంది మద్దతు పొందడం. ఇటువంటి అంగీకారం లేకుండానే కాంగ్రెస్ ఈ రెండు నిర్ణయాలను అమలు చేసింది. అంటే కాంగ్రెస్ తన కు అవసరమైతే ఎంత దూరమయినా వెళుతుందని, దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలకంటే తన విధానాన్ని నెగ్గించుకోవడానికే సిద్ధపడుతుందని ఈ రెండు సందర్భాలు స్పష్టం చేశాయి. ఏకాభివూపాయం అన్నది ఒక తురుపుముక్క. దానిని సమయానుకూలంగా వాడుకోవ డం కాంగ్రెస్ నేర్చిన విద్య.

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ ఇదే జరుగుతున్నది. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లు కూడా ఈ పాటికే ఆమోదం పొంది ఉండేది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏది అనుకోదో అది జరగదు. ఏది అనుకుంటుందో అది జరుగుతుంది. కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకోదలిస్తే ఇన్ని కుప్పిగంతులు అవసరం లేదు. నిర్ణయం తీసుకోవడానికి అనేక మంచి అవకాశాలు, సందర్భాలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అవేవీ ఉపయోగించుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదల్చుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ చేరిన నాయకులను, కేంద్ర మంత్రులను సీమాంధ్ర పెత్తందారులు ప్రభావితం చేస్తున్నారని అనేక సందర్భాల్లో రుజువయింది.

కాంగ్రెస్ నిర్ణయం అంటూ తీసుకోదలిస్తే శ్రీకృష్ణ కమిటీ నుంచి అంత దివాలాకోరు, చౌకబారు నివేదికను తెప్పించుకునేది కాదు. నివేదిక మొత్తం సీమాంధ్ర పెత్తందారులు కోరితే రాసిచ్చినట్టు చదివినవాళ్లకు స్పష్టంగానే అర్థం అవుతుంది. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ‘రహస్య అధ్యాయం’ పేరుతో ఒక అక్రమ అధ్యాయాన్ని అనుమతించి ఉండేది కాదు. ఈ మొత్తం విన్యాసంలో అంతకుముందే పదవీ విరమణ చేసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి దుగ్గల్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడన్న సంగతిని మనం మరువకూడదు. రహస్య అధ్యాయం రచనలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆయన అలా ఎందుకు చేశారు? ఎవరికోసం చేశారు? తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎలా మేనేజ్ చేయాలో, మీడియాను ఎలా దారికి తెచ్చుకోవాలో, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నీరుగార్చాలో, ప్రతిపక్షాలతో కుమ్మక్కయి ఎలా చర్చల రాజకీయం నడిపించాలో ఆ రహస్య అధ్యాయం సూచించింది. ఆంధ్రా ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎలా మేనేజ్ చేయాలో ఆ నివేదిక చెప్పలేదు. సీమాంవూధలో జరిగిన ఝాటా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎలా నీరుగార్చాలో ఆ నివేదిక సూచించలేదు.

ఢిల్లీ మనసునెరిగి ఈ కమిటీ ఇటువంటి అప్రజాస్వామిక, అనాగరిక నివేదికను సమర్పించిందన్నది వాస్తవం. అంత పనికిమాలిన నివేదిక లో కూడా ఒకానొక పరిష్కారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉంది. నిర్ణయం తీసుకోదల్చుకుంటే నివేదిక వచ్చిన వెంటనే ఆ ఒక్క పరిష్కారాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ తల్చుకోలేదు. ఇవ్వాలనుకోలేదు. తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న సందర్భం సకల జనుల సమ్మె. అప్పుడయినా నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ అదీ జరగలేదు. కేసీఆర్‌ను చర్చలకు పిలిచినప్పుడయినా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ అప్పుడు కూడా దొంగనాటకాలే ఆడింది. చర్చల పేరుతో కేసీఆర్‌ను బలహీనపర్చడానికి, కాలయాపన చేయడానికి ప్రయత్నించింది. నిర్ణయం తీసుకోదల్చుకుని ఉంటే కాంగ్రెస్ ఇన్ని అవకాశాలను చేజార్చుకుని ఉండేది కాదు.

తెలంగాణపై మళ్లీ చర్చలు జరపాలనడమే ఒక బూటకం. ఇంతకాలం జరిగిన దానిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం. ఈ దేశంలో గత పదేళ్లలో తెలంగాణపై జరిగినంత చర్చ ఏ అంశంపైనా జరగలేదు. తెలంగాణపై వచ్చినంత ఏకాభివూపాయం ఏ అంశంపైనా రాలేదు. 2004 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధానాంశం. 2009 సాధారణ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన నినాదం. కాంగ్రెస్, టిడిపి, అప్పటి పీఆర్పీ, సిపిఐ, బిజెపి... ఇలా అన్ని పార్టీలూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించినవే. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర్‌డ్డి కూడా తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కాంగ్రెస్-టీఆస్‌లను గెలిపించాలని పిలుపునిచ్చినవాడే. ఆ తర్వాత ఆయనే ఆడ్డం తిరిగాడు. అయినా అప్పట్లోనే కేంద్రంలో 27 రాజకీయ పక్షాలు లిఖితపూర్వకంగా తెలంగాణకు మద్దతు ప్రకటించాయి. డిఎంకె కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సమర్థిస్తామని చెప్పింది. బిజెడి, శివసేన ఎన్‌డిఏ నిర్ణయాన్ని సమర్థిస్తామని ప్రకటించింది. ఈ పార్టీలన్నింటికీ కలిపి అప్పటి లోక్‌సభలోనే 267 మంది సభ్యులు ఉండేవారు.

కాంగ్రె స్‌కు అప్పటి లోక్‌సభలో బలం 145. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదల్చుకుంటే అప్పుడే 411 మంది సభ్యుల మద్దతు లభించి ఉండేది. కానీ వైఎస్ రాజశేఖర్‌డ్డి అడ్డుపడుతున్నాడంటూ అప్పట్లో మోసం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇంతటి మద్దతు లభించిన తర్వాతనే 2009 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, చిరంజీవి ఇద్దరూ పోటీపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. ఎన్నికల మానిఫెస్టోల్లో అచ్చుగుద్ది పంచారు. 2009 డిసెంబరులో కేసీఆర్ దీక్ష చేస్తున్నప్పుడు అసెంబ్లీ లోపలా బయటా చంద్రబాబు, చిరంజీవి తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. డిసెంబరు 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని చంద్రబాబు, చిరంజీవి ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం తెలంగాణపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సోనియాగాంధీకి అప్పగిస్తూ తీర్మానం చేసిపంపింది. లోక్‌సభలో అన్ని పక్షాలు తెలంగాణపై తక్షణమే నిర్ణయం చేయాలని డిమాండు చేశాయి. డిసెంబరు మొదటివారంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశమై మూడు రోజులపాటు తెలంగాణ అంశంపై చర్చలు జరిపింది.

కేసీఆర్ ఆరోగ్యం విషమిస్తున్న తరుణంలో, తెలంగాణ అగ్నిగుండంగా కాగుతున్న వేళ లోక్‌సభలో అన్ని పక్షాల డిమాండు, రాష్ట్రంలో అఖిలపక్ష తీర్మానం, కోర్‌కమిటీ చర్చల పర్యవసానంగా డిసెంబరు 9న ‘కేంద్ర ప్రభుత్వం’ తరఫున హోంమంత్రి చిదంబరం ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్న’ట్టు ప్రకటించారు. అనేక పరాజయాలు, అనేక విద్రోహాలు చూసిచూసి రోసిపోయిన తెలంగాణ ప్రజలకు ఒక విజయం లభించిన తొలిరోజు డిసెంబరు 9. ఆరు దశాబ్దాల తెలంగాణ చేదు అనుభవాలకు తార్కిక ముగింపు డిసెంబరు 9 ప్రకటన. కానీ విచిత్రం ఏమంటే, రాత్రికిరాత్రే చంద్రబాబు, రోశయ్య, చిరంజీవి, జగన్ అందరూ కట్టగట్టుకున్నట్టు, కూడబలుక్కున్నట్టు అడ్డం తిరగడం, తెలంగాణ పదం తొలిసారిగా వింటున్నట్టు ఉలిక్కిపడడం. ‘ఎవరితోనూ చర్చించకుండా ఇంత కీలకమైన నిర్ణయం ఎలా తీసుకుంటారం’టూ అర్ధరాత్రి టీవీ తెరలముందు చంద్రబాబు గాండ్రింపులు. లోక్‌సభలో జగన్‌బాబు సమైక్యాంధ్ర పోరాటం. తెర రోశయ్య రాజకీయాలు. చిరంజీవయితే మొత్తం ప్లేటు ఫిరాయించారు. పదేళ్లు జరిగిన చర్చలు గాలికిపోయాయి. తెలంగాణవాదులు ఎన్నిక ఎన్నికకూ ఎంతో రాజీపడి సాధించిన రాజకీయ ఏకాభివూపాయమూ గంగలో కలిసింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతకుముందెన్నడూ తెలంగాణ పదమే విననట్టు, కేంద్రం నిర్ణయంపై విరుచుకుపడడం... ఇవన్నీ కాకతాళీయంగా జరగలేదు. తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని వదులుకోవడం జీర్ణించుకోలేక అందరూ కలసి కుట్రచేసి తెలంగాణను అడ్డుకున్నారు. చెప్పొచ్చే విషయం ఏమం కావలసినంత చర్చ జరిగింది.

అవసరమైన రాజకీయ ఏకాభివూపాయం ఎప్పుడో వచ్చింది. అన్ని పార్టీలకూ, అన్ని ప్రాంతాల నాయకులకూ తెలి సే తెలంగాణపై నిర్ణయం జరిగింది. సీమాంధ్ర ఆధిపత్యంలోని పార్టీల నీతిబాహ్య చేష్టలు, దొంగనాటకాలవల్లనే వచ్చిన తెలంగాణ వెనుకకుపోయింది. ఇప్పుడు రాజకీయ పక్షాల నుంచి కావలసింది చిత్తశుద్ధి, నిజాయితీ. ఏకాభివూపాయం కాదు.

సీమాంధ్ర మెజారిటీ ప్రాంతం. తెలంగాణ మైనారిటీ ప్రాంతం. అక్కడ 175 మంది ఎమ్మెల్యేలు. ఇక్కడ 119 మంది ఎమ్మెల్యేలు. రెండు ప్రాంతా లు విభజనకు ఒప్పుకోవడం అన్నది ఆచరణసాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే, రాష్ట్ర విభజన కోసం రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలన్న నిబంధనను రాజ్యాంగంలో విధించలేదు. రాష్ట్ర విభజనకు లోక్‌సభలో కూడా సాధారణ మెజారిటీ ఉంటే చాలునని రాజ్యాంగం నిర్దేశించింది. బంతి కేంద్రం కోర్టులోనే ఉంది. ఇప్పుడు కూడా లోక్‌సభలో 240 మంది సభ్యులు కలిగిన 25 రాజకీయ పక్షాలు తెలంగాణకు తమ మద్దతు కొనసాగిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ఇదివరకే కేంద్రానికి లేఖలు రాశాయి. ఇందులో ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాల బలం 168. సిపిఐ, ఫార్వర్డు బ్లాక్, బిఎస్‌పి, జనతాదళ్ ఎస్, ఎస్‌డిఎఫ్‌ల బలం 27. తెలంగాణకు బాహాటంగా మద్దతు ప్రకటించిన యూపీఏ భాగస్వామ్య పక్షాల బలం 45. సభలో 206 మంది సభ్యులు కలిగిన కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటే లోక్‌సభలో ఆ బలం 446కు చేరుతుంది. ఇది కూడా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్‌ల మద్దతు లేకుండానే. మళ్లీ అదేమాట. కేంద్రం అనుకుంటే తెలంగాణ తీర్మానం చేయడం వారం రోజుల పని. ఇవ్వదల్చుకోనప్పుడే ఇన్ని వేషాలు, ఇన్ని నాటకాలు. ‘చర్చల పేరుతో సాగదీయాల’న్న శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలు చేయడం తప్ప మరొక మంచి ఏదీ ఈ చర్చల నాటకంలో కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను ఇప్పటికయినా అర్థం చేసుకోకపోతే పదే పదే మోసపోతూనే ఉంటాం. పదే పదే ఎదురుదెబ్బలు తింటూనే ఉంటాం. మన ముఖం మీద లగడపాటి పగలబడి నవ్వుతూనే ఉంటాడు.

కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్....సీమాంధ్ర ఆధిపత్యంలోని ఏ పార్టీ అయినా మౌలికంగా సమైక్యాంధ్ర పార్టీయేన ని ఇప్పటికి అనేకసార్లు రుజువయింది. సీమాంవూధలో రాజకీయ ప్రయోజనాలు కలిగిన ఏ పార్టీ అయినా తెలంగాణపై ఇలాగే దొంగవేషాలు వేస్తుందని తేటతెల్లమవుతున్నది. వీళ్లందరి నీ లొంగదీయగలిగిన మంత్రం- తెలంగాణను ఒక సంఘటిత రాజకీయ శక్తిగా నిలబెట్టడం ఒక్కటే. ఉద్యమశక్తులు, రాజకీయ శక్తులు సమీకృతులై రాజీలేని ఒక రాజకీయ శక్తిగా బలపడడం. రాజకీయంగా చావుదెబ్బతింటామని తెలిస్తే తప్ప కాంగ్రెసే కాదు, ఏ పార్టీ లొంగదు. తెలంగాణ ఇప్పుడు అటువంటి దెబ్బను ఈ పార్టీలకు రుచిచూపించవలసి ఉంది.

[email protected]

318

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా