గోబెల్స్‌కు పెద్దన్నలు


Sat,August 13, 2011 12:24 PM

mataku-telangana-News అధికారం శాశ్వతం చేసుకోవాలంటే
ఆధిపత్యాన్ని సుస్థిర పరచుకోవాలంటే
సత్యాన్ని సమాధి చేయాలి
అధికారాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే
డబ్బు సంచులు ఎరవేయాలి
అమలుకు సాధ్యంకాని వాగ్దానాలివ్వాలి
అవీ పనిచేయకపోతే, తుపాకులకు పనిచెప్పడానికీ వెనుకాడొద్దు
ఇక లాభం లేదనుకుంటే ఆఖరి అస్త్రంగా
అబద్ధాలను, వక్రీకరణలను, వక్రభాష్యాలను
కుండపోతగా కుమ్మరించాలిedit
ఒకే అబద్ధ్ధాన్ని వందసార్లు రిపీట్ చేయాలి
ప్రజలు నమ్మేదాకా చెబుతూ ఉండాలి
వంద తుపాకులు చేయలేని పని ఒక అబద్ధం చేస్తుంది
సిగ్గువద్దు, జాలివద్దు, దయ అసలే వద్దు
అధికారాన్ని కాపాడుకోవడమే ముఖ్యం
అధికారమే జీవితం, అదే పరమావధి
అధికారం కోసం చేసేది ఏదైనా యుద్ధమే
యుద్ధంలో నీతి ఉండదు-
నాజీ నియంత హిట్లర్ మంత్రి జోసెఫ్ గోబెల్స్, ఇటలీ రాజకీయవేత్త మాకియ సిద్ధాంతం ఇది. వాళ్లు బతికుంటే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టిజి వెంక చూసి విస్తుపోయేవారు. వీళ్ల అబద్ధాల ముందు వాళ్లు వెల

అబద్ధం-1
తెలంగాణలో 62 లక్షల మంది సీమాంవూధులు ఉన్నారట!
యథార్థంగా ఇది పచ్చి అబద్ధం. కానీ ఈ అబద్ధంతోనైనా, ఇంతమంది తెలంగాణలో ఉన్నారని చెప్పడం ద్వారా తెలంగాణను ‘ఆంధ్రా కాలనీ’గా మార్చామని స్వయంగా సీమాంధ్ర నేతలే ఒప్పుకున్నారు. ఇక్కడి వనరుల ను, వసతులను, భూములను యథేచ్ఛగా అనుభవిస్తున్నామని అంగీకరించారు. అబద్ధం ఎందుకంటే, తెలంగాణలో 62 లక్షలు కాదు కదా ఆరు లక్షల మంది కూడా ఉండరని సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. 2001 సెన్సస్ ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు వలస వెళ్లి ఉంటున్నవారి శాతం 6.4 శాతం. అంటే అప్పటి జనాభా లెక్కల ప్రకా రం 48.8లక్షల మంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌కు వచ్చిన వారే కాదు, గుంటూరు నుంచి బెజవాడకు వెళ్లినవారు, విశాఖకు వెళ్లినవారు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వచ్చినవారు, నెల్లూరు నుంచి చిత్తూరు వెళ్లినవారు, అనంతపురం నుంచి కర్నూలు వచ్చినవారు, ఖమ్మం నుంచి విజయవాడ వచ్చినవారు....ఇలా అన్ని వైపుల వెళ్లినావారే 48.8 లక్షలు. అదే నిష్పత్తిలో లెక్కవేసినా ఈ పదేళ్లలో రాష్ట్రంలోనే ఇతర జిల్లాలకు వలస వెళ్లినవారి సంఖ్య 53.7 లక్షలకు మించదు. అందులో హైదరాబాద్‌కు వచ్చిన వారి శాతం గరిష్ఠంగా పది, పన్నెండు శాతానికి మించదు. అందులోనూ అత్యధికులు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినవారే ఉంటారు. ఇదంతా సెన్సస్ పుస్తకాల్లో భద్రం గా ఉంది. ఇక ఇప్పుడు ఎవరూ ఎవరిని మోసం చేయలేరు. మరి ఈ అభినవ గోబెల్స్ ఈ 62 లక్షలు ఎలాపుట్టించారు? 1956 నాటి తెలంగాణ జనాభాను, నేటి జనాభాను పోల్చి లెక్కలు తీశారట.

ఈ అజ్ఞానులకు తెలియనిది ఏమంటే గత మూడు దశాబ్దాలుగా కోస్తా జిల్లాల కంటే జనాభా పెరుగుదల రేటు తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంది.1991-2001లో తెలంగాణ జిల్లాల్లో జనాభా వృద్ధిరేటు రాష్ట్ర సగటు కంటే 4.27 శాతం ఎక్కువ. ఇదే కాలంలో కోస్తాంధ్ర తొమ్మిది జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే 4.26 శాతం తక్కువ. అంటే తెలంగాణ జిల్లాల్లో ఆ పదేళ్లలో 18.86 శాతం చొప్పున జనాభా పెరిగితే, కోస్తా జిల్లాల్లో 10.33 శాతం చొప్పున జనాభా పెరిగింది. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, గర్భనిరోధక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలవల్ల 1961-71, 1971-81, 1981-91 సెన్సస్‌లలో తెలంగాణలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు గణాంక నిపుణులు విశ్లేషించారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉంటే ఆధిపత్యం రుచి మరిగిన సీమాంధ్ర పెట్టుబడిదారీ శక్తులు కేంద్రాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అబద్ధం-2
తెలుగు ప్రజలు 150 యేళ్లు తప్ప మిగిలిన మూడువేల సంవత్సరాలూ కలిసే ఉన్నారట.
అధికారం కోసం రాజకీయ నాయకులు దేశభక్తులవుతారు...భాషాభక్తు లు అవుతారు. అది దేశభక్తితో కాదు, భాషభక్తితో కాదు. అధికారం మీద భక్తితో! వారికి భాషా తెలియదు. చరిత్రా తెలియదు. పెట్టుబడి, లాభాలు తప్ప మరో లాంగ్వేజీ తెలియదు. మిగిలినదంతా నాటకం, బూటకం...
తెలుగుకు మూడువేల ఏళ్ల చరిత్ర ఉందా? ఉంటే మనకు ప్రాచీన భాష హోదా ఎందుకు రాలేదు? తెలుగుకు మూడువేల ఏళ్ల చరిత్ర ఉంటే రాజరాజనరేంవూదుని ఆస్థానంలో క్రీస్తు శకం 1040లో రాసిన మహాభారతం తెలుగు ఆదికావ్యం ఎందుకయింది? నన్నయ భట్టారకుడు ఆదికవి ఎలా అయ్యారు? రాజరాజనరేంవూదుడికి ముందు ఈనేలను ఏలిన వారు తెలుగు రాజులు కాదా? మహారాష్ట్రులు, హైహయులు(మధ్యవూపదేశ్), కన్నడిగులు, పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిపాలన చేశారా? అంతకు ముందు తెలుగుభాష చలామణిలో లేదా? ఇప్పుడు తెలుగునేలగా చెబుతున్న ప్రాంతాన్ని చరివూతలో ఎప్పుడూ ఏరాజూ అఖండంగా పరిపాలించలేదు. శాతవాహనులు పరిపాలించినా వారిని తెలుగు రాజులుగా ఇప్పటికీ నిర్ధారించలేదు. వారిని గురించి కథలు గాథల ద్వారా తెలుసుకోవడం తప్ప లిఖిత ఆధారాలేవీ లభించలేదు. వారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో, వారి వంశక్షికమణిక ఏమిటో చరివూతకారులకే తెలియదు. ఎందుకంటే అప్పటికి తెలుగు ఒక భాషగా అవతరించలేదు. తెలుగు లిపి రూపు దాల్చడానికే శాతవాహను ల తర్వాత 800 ఏళ్లు పట్టింది. క్రీస్తు శకం 200 నుంచి 600 వరకు ఇప్పటి తెలుగునేలను ఇక్ష్వాకులు, ప్రాచీన పల్లవులు, ఆనందగోవూతజులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు వేర్వేరు ముక్కలుగా పరిపాలించారు.

ఆ తర్వాత క్రీస్తు శకం 624 నుంచి1076 వారకు తూర్పు చాళుక్యులు, పల్లవులు, కళ్యాణి చాళుక్యులు, గాంగులు వేర్వేరుగా తెలుగునేలను ఏలారు. కాకతీయుల కాలం క్రీస్తుశకం 995 నుంచి 1323 వరకు కూడా తెలుగు నేల అఖండంగా లేదు. గోదావరి ఉత్తరాన కాళింగులు, గాంగులు ఏలారు. రాయలసీమ విజయనగర రాజుల ఏలుబడిలో ఉంది. కాకతీయ రాజ్యంలో కూడా 72 సామంత రాజ్యాలు దేనికవి స్వతంవూతంగా పరిపాలించుకుంటూ కాకతీయులకు కప్పం కడుతూ వచ్చాయి. ఆ తర్వాత క్రీస్తుశకం 1323 నుంచి 1475 వరకు తెలుగు నేల ఒక్కటిగా లేదు. ముస్లింల వశమైన కాకతీయ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి 72 మంది సామంత రాజులు ఏకమై పోరాడి విజయం సాధించినా ఆ తర్వాత ఎవరి ప్రాంతాన్ని వారే పాలించుకున్నారు. ఓరుగల్లును కాపయ పాలిస్తే, రాచకొండను సింగభూపాలుడు పాలించాడు. కొండవీటిని రెడ్డిరాజులు, నెల్లూరును మనుమసిద్ధి వారసులు, రాయలసీమను విజయనగరరాజులు, తెలంగాణలో కొంతభాగాన్ని బహమనీ సుల్తానులు పాలించారు. గోదావరి ఉత్తర ప్రాంతం ఈసారీ విడిగానే ఉంది.

1475 నుంచి 1680 దాకా రాయలసీమ కొంత విజయనగర రాజులు, కొంత బహమనీ నవాబుల ఏలుబడిలో ఉంది. 1512 నుంచి 1687 వరకు కుతుబ్‌షాహీల పాలనసాగింది. 1572లో కుతుబ్‌షాహీలు సర్కారు జిల్లాలను ఆక్రమించారు. అప్పుడు కూడా ఉత్తరాన విజయనగరరాజులు అధికారంలో ఉన్నారు. దక్షిణాన వెంకటగిరి రాజా ఏలుబడిలో ఉన్నారు. 1611 నాటికి భీమునిపట్నం, కాకినాడ, మచిలీపట్నం, యానాంలలో డచ్చి, బ్రిటిష్ కంపెనీలు వచ్చేశాయి. చంద్రగిరిలో వెంకటపతిరాయలు అధికారంలో ఉన్నా రు. అసఫ్‌జాహీలు అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే అంటే 1766లో గుంటూరు మినహా మిగిలిన సర్కారు జిల్లాలు ఆంగ్లేయుల పరమయ్యాయి. ఆతర్వాత 22 ఏళ్లకు గుంటూరు చేజారింది. 1800లో రాయలసీమ జిల్లా లూ ఆంగ్లేయుల పాలనలోకి వెళ్లాయి. సుదీర్ఘకాలంపాటు తెలుగు ప్రజలు కలసి ఉన్నారని చెప్పడం ఎంత అబద్ధమో, ముస్లింలపాలనలో కోస్తా నిధులు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టారన్నది అంతకంటే అబద్ధం.

అబద్ధం-3
హైదరాబాద్‌లో 30 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని, విశాఖలో స్టీల్‌ప్లాంట్ ఒకటే ఉందని సీమాంధ్ర నేతలు చేసిన మరో వాదన.
హైదరాబాద్ రక్షణపరమైన వ్య్వూహాత్మక ప్రాంతం కావడం వల్ల రక్షణ రంగానికి సంబంధించిన అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇక్కడికి వచ్చా యి. అది సీమాంవూధుల దయకాదు. హైదరాబాద్ ఆంధ్రవూపదేశ్‌కు రాజధాని కావడం వల్ల ఈ సంస్థలు రాలేదు. కేంద్రం అవసరార్థం ఈ సంస్థలు వచ్చా యి. ఇక్కడ స్థలం సులభంగా దొరుకుతుందని, శత్రుదేశాల లక్ష్యాలకు దూరంగా హైదరాబాద్ ఉంటుందని భావించి ఈ సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో కూడా తొంభైశాతం ఉద్యోగాలను కొల్లగొట్టింది ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంటే. మా భూములూ పోయాయి, మావాళ్లకు ఉద్యోగాలూ రాలేదు.

అబద్ధం-4
రాష్ట్రంలోని అతిపెద్ద మూడు సాగునీటి ప్రాజెక్టుల(నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల) నుంచీ తెలంగాణ లబ్ధి పొందుతోందట.
నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు 130 టీఎంసీలు రావాలి. ఎన్ని టీఎంసీలు ఇస్తున్నారు? జూరాల నుంచి 18 టీఎంసీల నీరు వినియోగించుకోవాలి. ఈ ఇరవై ఏళ్లలో ఎన్ని నీళ్లు వచ్చాయి మహబూబ్‌నగర్‌కు? శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువను, కుడికాలువను ఒకేసారి మొదలు పెట్టాల ని, రెండు ప్రాంతాలకు సమానంగా నీళ్లివ్వాలని 1985లో ఎన్‌టిఆర్, గౌతులచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, నల్లమల గిరివూపసాద్‌ల సమక్షంలో తీర్మానించారు. ఇప్పుడెన్నేళ్లయింది? కుడికాలువ, తెలుగు గంగ కాలువ, కేసీ కాలువలు పూర్తయి ఎన్నేళ్లుగా ఎన్ని నీళ్లు తరలించుకుపోతున్నారు? ఎడమ కాలువ ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? కృష్ణానదిలో తెలంగాణ హక్కు జలా లు 360 టీఎంసీలని చంద్రబాబు ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. కానీ వంద టీఎంసీలు కూడా తెలంగాణ నేలను ఎందుకు తడపడం లేదు?

అబద్ధం-5
తెలంగాణలో మావోయిస్టులతో ముడిపడిన రాజకీయ అనిశ్చితి, మతఛాందసవాదం ప్రబలడానికి బీజమవుతుందట.

నక్సలైట్లు పుట్టి, పెరిగి, ప్రవర్ధిల్లింది సమైక్యాంవూధలోనే. నక్సల్బరీ వసంతకాల మేఘగర్జనలకు ఉలిక్కిపడి, ఎర్రజెండా అందుకుంది ముందుగా శ్రీకాకుళం కొండలే. జగిత్యాల జైత్రయావూతలు, గోదావరి లోయ విముక్తిపోరాటా లు, నల్లమల సాయుధ పోరాటాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించిం ది సమైక్యాంవూధలోనే. హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించిన చరిత్ర సీమాంధ్ర నాయకులదే. ఫ్యాక్షనిస్టు సంస్కృతిని హైదరాబాద్‌కు దిగుమతి చేసి రక్తపుటేరులు పారించిన హీన సంస్కృతి సీమాంధ్ర పెద్దమనుషులదే.

అబద్ధం-6
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విలీనం సందర్భంగా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదట.
1956 నవంబరు 1వ తేదీన గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశంలో నెహ్రూ ప్రసంగాన్ని ఆంధ్రపవూతిక ప్రచురించిది. ఆయన ఏమన్నారో చూడండి- ‘తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలసిపోయినాయి. ఇదోరకం వివాహం వంటి ఏర్పాటు. వివాహం ఎంత సంతోషవూపదమైనదో, అంత ప్రమాదకరమైనది కూడా.మానవ సంబంధాలకు మూలమైన మనస్తత్వ సమస్యలన్నింటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖహేతువవుతుంది. కొత్త ఆంధ్ర మంత్రులు, శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఇది పరీక్షా సమయం.

ఉదారంగా వ్యవహరిస్తారో సంకుచితంగా వ్యవహరిస్తారో గమనించవలసి ఉంది. అందరినీ కూడగట్టుకునిపోతారో, దురహంకారంతో వ్యవహరిస్తారో చూడవలసి ఉంది. అందరి భయాలనూ తొలగించి అందరికీ న్యాయం చేకూర్చి రక్షణ సమకూరడానికి అనుగుణంగా పరిపాలించి ప్రజల విశ్వాసాన్ని పొందుతారో లేదో చూడవలసి ఉంది. శత్రువుతో కూడా మైత్రిని కాంక్షించినవాడే ఘనమైన వ్యక్తి. హైదరాబాద్‌లో ఇకముందు ఏం జరుగుతుందో కేవలం హైదరాబాద్ వాసులే కాదు ఇతర ప్రాంతాలవాందరో శ్రద్ధగా గమనిస్తుంటారు. మనం విశాల హృదయంతో వ్యవహరిస్తేనే దేశం అభ్యున్నతి చెందడమే కాక, మన కీర్తి ప్రతిష్ఠలూ, గౌరవమూ పెరుగుతాయి. ఆంధ్ర శాసనసభ్యులు, మంత్రులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.’ ఇదే వార్త ఇండియన్ ఎక్స్‌వూపెస్‌లో నూ, ఆంధ్రవూపభలోనూ ప్రచురితమయింది.

TOP News

377

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా