మబ్బులు చెదరిపోతున్నాయి. తెలంగాణవాదులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పష్టత క్రమంగా సమీపిస్తున్నది. కర్తవ్యం బోధపడుతున్నది. టీఆస్ కరీంనగర్ సమావేశాల అనంతరం కేసీఆర్ చేసి న ప్రకటన తెలంగాణవాదుల మనసులను తేలికపర్చింది. చీలికలు పేలికలైన తెలంగాణ రాజకీయోద్యమ శ్రేణుల్లో ఇంతకాలంగా నెలకొన్న అయోమయం, అనుమానాలు తొలగిపోతాయన్న నమ్మకం కలుగుతున్నది. చేరాల్సిన గమ్యం, చేయాల్సిన కృషి, నడవాల్సిన బాట ఇప్పుడు కొంత స్పష్టం గా కనిపిస్తున్నది. ‘కాంక్షిగెస్లో విలీనం’ మాట తెలంగాణవాదుల్లో సృష్టించిన స్తబ్దత, నిర్లిప్తత ఈ సమావేశాలు పటాపంచలు చేశాయి. కాంగ్రెస్‌తో చర్చలు తప్పు కాదు. చర్చల ద్వారాన్ని మూసేయడం కూడా సమంజసం కాదు. కానీ కాంగ్రెస్ మనసులో మాట చెప్పకుండా, అధికారికంగా చర్చలకు ఆహ్వానించకుండా వారి గడపలోకి మనం వెళ్లడమే విమర్శలకు కారణమైంది. కాంగ్రెస్ ఎప్పటిలాగే మోసపూరితంగా వ్యవహరించింది. ఒకవైపు ఢిల్లీలో చర్చలు జరుగుతుండగానే, టీఆస్ తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ సంఘాలకు దూరమైపోయిందని కాంగ్రెస్‌కు ప్రత్యర్థులు నూరిపోశారు. ఉద్యమసంఘాలు, టీఆస్ వేరైతే తెలంగాణ ఇవ్వకుండానే రాజకీయంగా ఆడుకోవచ్చునని మరోసారి కాంగ్రెస్ భావించింది. అందుకే కేసీఆర్‌తో చర్చల్లో అన్ని మలుపులు. కేసీఆర్ ఉద్యమంతో ఉంటూనే చర్చల కు వెళితే పర్యవసానం మరోలా ఉండేది. 2004 ఎన్నికలకు ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. టీఆస్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ భూమీ ఆకాశాలూ ఏకం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చుట్టూ ఎన్నిసార్లు పరివూభమించారో చూశాం. రాజశేఖర్‌డ్డి అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం నేరుగా టీఆస్‌తో చర్చలకు వచ్చింది. చివరికి గులాంనబీ ఆజాద్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి ఒప్పందంపై సంతకాలు చేయించుకుని వెళ్లారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూశాం. కాంగ్రెస్ మోసం చేయకపోతే ఆశ్చర్యపడాలి. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి అన్ని రోజులు వారితో చర్చలు జరుపడం, కాంగ్రెస్ ఆ చర్చలకు విశ్వసనీయత ఇవ్వకపోవడం టీఆస్ శ్రేణులను, తెలంగాణవాదులను నైతికంగా దెబ్బతీసింది.
నిజానికి కేసీఆర్ క్షేత్రంలో బలపడితే, తెలంగాణ ఉద్యమం బలంగా ఉంటే ఢిల్లీ ఇక్కడికే వస్తుంది. చర్చలు ఇక్కడే జరుగుతాయి. ఆంటోనీ చిరంజీవి ఇంటికి వచ్చి ఆహ్వానించిన విషయం మనం మరచిపోకూడదు. ఎన్నికలు ఆఖరి అస్త్రం. అందుకు. సన్నాహాలు చేస్తూనే ఉద్యమ కాకను పెంచడం అవసరం. తెలంగాణ 2014 ఎన్నికలకు ముందు వస్తుందా తర్వాత వస్తుందా అన్న చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. రాజకీయ పార్టీల బలం ప్రజా పునాదుల్లోనే ఉంటుంది. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ అయినా తెలంగాణలో ఇంకా ఈ మాత్రం రాజకీయాలు చేస్తున్నాయీ అంటే ఎంతో కొంత మంది ఆ పార్టీల వెంట ఉండడంవల్లనే సాధ్యమవుతుంది. తెలంగాణలో సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యానికి ప్రతిరూపాలుగా వ్యవహరించిన కాంగ్రె స్, తెలుగుదేశం ఇక్కడి ప్రజలను పదేపదే మోసం చేసి ఇప్పుడు పతనమయిపోయాయి. పాతబడిపోయాయి. అందుకే ఇక్క డి బానిస రాజకీయ నాయకత్వం కొత్త అవతారాల కోసం, మారువేషాల కోసం ఎదురుచూస్తున్నది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాజకీయ నాయకులు జగన్మోహన్డ్డిలో ఆ కొత్త అవతారా న్ని చూస్తున్నారు. విషా దం ఏమంటే కాంగ్రెస్‌లో ఆధిపత్యం చెలాయిస్తు న్న ఈ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు తెలంగాణ ఉద్యమానికి ముందుండి నాయకత్వం వహించడానికి బదులు పదేపదే వంచనకు పాల్పడుతూ వచ్చారు. నిజానికి చంద్రబాబు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం 41 మంది ఎమ్మెల్యేలను సమీకరించి సోనియాగాంధీకి మహజరు సమర్పించింది ప్రధానంగా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులే. కానీ ఆ తర్వాత ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మసలుకోవడంలో వీరు విఫలమయ్యారు. నిజానికి ఈ సామాజికి వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూనుకుని బరిగీసి నిలబడితే తెలంగాణ ఎప్పుడో వచ్చేది. రాజీపడిపోవడాలు, అమ్ముడుపోవడాలు, చివరికి ఫార్చూనర్ కార్లకు కూడా పడిపోవడాలు ఈ నాయత్వాన్ని తెలంగాణ ప్రజ ల ముందు పలుచన చేశాయి. ఇప్పుడు జానాడ్డి ఏకంగా చేతుపూత్తేశారు. మా కన్నా ఎక్స్పర్ట్ ఉంటే చూసుకోండని ఆయన తెలంగాణ ప్రజలను బెదిరిస్తున్నారు. కోమటిడ్డి వెంకట్‌డ్డి గోడమీద కూర్చోని కేసీఆర్ ఏం చేయా లో చెబుతున్నారు. ఇంద్రకరణ్‌డ్డి ఇప్పటికే జగన్మోహన్డ్డి పంచన చేరిపోయారు. తెలంగాణ జాతరలు నిర్వహించిన జిట్టా బాలకృష్ణాడ్డి భువనగిరిలో విజయమ్మను ఊరేగించారు. సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న నేత ను, డిసెంబరు 10న తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన సీమాంధ్ర కుట్రలో భాగాస్వాములైన వారిని రెడ్డిజన ఉద్ధారకుడిగానో, తెలంగాణ ప్రజాబంధుగానో నమ్మించాలని చూడడం విచిత్రం.
ఎంతోదూరం ఎందుకు- చరివూతాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్సు కళాశాల భవనానికి ఎదురుగా చెట్టుకు ఉరివేసుకుని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎన్ని హామీలు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని ఆశాభంగాలు, ఎంత గుండెకోత- అయినా తెలంగాణ రాలేదు! తెలంగాణపై భరోసా ఇవ్వని ఈ వ్యవస్థల్ని చూసి గుండెపగిలిన ఆ పసిహృదయం ఆత్మబలిదానానికి సిద్ధపడింది. యూనివర్సిటీ విద్యార్థులు గుండెలవిసేలా దుఃఖిస్తున్నారు. నినదిస్తున్నారు. అంతిమయాత్ర కోసం బాష్పవాయుగోళాలను ఎదుర్కొంటున్నారు. వీధి పోరాటాలకు సిద్ధపడుతున్నారు. ఒకవైపు ఇదంతా జరుగుతుంటే ఉదయం ఒక సీమాంధ్ర టీవీలో ‘మీరు ఎంత గింజుకున్నా తెలంగాణ రాదు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు. వాళ్లు ఇస్తే మేం అడ్డంపడం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నేత టెలివిజన్ తెరపై వికటాట్టహాసం చేస్తుంటాడు. ‘భలే చెప్పావ’న్నట్టు సీనియరు యాంకరు, జర్నలిస్టు స్క్రీనంతా నవ్వు పులుముకుని ఆ ప్రకటనకు ముక్తాయింపు ఇస్తుంటాడు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడానికి తెలంగాణ కాంగ్రెస్ పాత ముత్తయిదువలంతా క్యూకడతారు. తెలంగాణకు, హైదరాబాద్‌కు వైఎస్సార్ చేసిన నష్టం మరెవరూ చేయలేదు. 2004 ఎన్నికల్లో గెలిచింది మొదలు 2009 సెప్టెంబరులో మరణించే వరకు తెలంగాణ రాకుండా అడ్డుపడింది రాజశేఖర్డ్డే. పదిమంది టీఆస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించాలని చూసింది రాజశేఖర్డ్డే. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూసిందీ ఆయనే. 2007లో అధిష్ఠానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తే, తాను రాజీనామా చేసి ఇటునుంచి ఇటే బెంగుళూరు వెళతానని, ఆ తర్వాత జరిగే పర్యవసానాలకు మీరే బాధ్య త వహించాల్సి ఉంటుందని రాజశేఖర్‌డ్డి బెదిరించారని సీనియర్ కాంగ్రె స్ నాయకుడొకరు చెప్పారు. 2009 ఎన్నికల ముగింపు సన్నివేశంలో హైదరాబాద్‌కు రావాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందేమోనని బెదిరించిన పెద్దమనిషీ ఆయనే. పోతిడ్డిపాడు ద్వారా కృష్ణానదిని రాయలసీమకు మళ్లించుకుపోయిన మహానుభావుడు రాజశేఖర్‌డ్డి. ఆయన వారసుడు జగన్మోహన్డ్డి. అందుకే ఆయన పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డును టీడీపీ వాళ్ల చేతుల్లోంచి లాక్కొని మరీ ప్రదర్శించారు. పైకి ఎన్నిమాటలయినా చెప్పనీయండి- తెలంగాణకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి, జగన్మోహన్డ్డి ఎప్పటికీ వ్యతిరేకులే. తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడయినా కుట్రలు చేసేవారే. వీళ్ల నాయకత్వాలను, వీళ్ల పార్టీలను వదిలించుకోకుండా తెలంగాణకు విముక్తి లేదు, రాదు.
ఎన్నికల సంగతి తర్వాత. తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ ఏ పార్టీ బతకలేదన్న భయం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల్లో పుట్టించాలి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తూ లేఖలు ఇస్తే తప్ప ఆ పార్టీల్లో ఉండడానికి, చేరడానికి తెలంగాణ రాజకీయ నేతపూవరూ అంగీకరించరాదు. తెలంగాణపై నిర్ణయం చేయకపోతే కాంగ్రెస్‌లో ఉండలేమని తెలంగాణ కాంగ్రెస్ నేతలూ స్పష్టం చేయాలి. తెలంగాణలో సర్వనాశనం అవుతామన్న వెరపు ఒక్కటే అన్ని పార్టీలను లొంగదీయగలుగు తుంది. అడుగులూడిపోవడం, పునాదులు కదలిపోవడం మొదలయితే అన్ని పార్టీలూ దారికి వస్తాయి. గ్రామస్థాయి నాయకులు మొదలు ఎంపీ, ఎమ్మెల్యేల వరకు అందరూ ఆ పార్టీలను వదిలిపెట్టడం మొదలు పెడితే తెలంగాణ సాధన కోసం 2014వరకు వేచి చూడనవసరం లేదు. ఆ పార్టీలలో ఆ భయం, ఆ వెరపు పుట్టించవలసింది తెలంగాణ ఉద్యమానికి సార థ్యం వహిస్తున్న టీఆస్, టీజేయేసీలే. తెలంగాణ వ్యతిరేకుల్లో భయం పుట్టించడం ఎంత అవసరమో, సంప్రదింపుల ప్రయత్నాల్లో, సంధికాలాల్లో తెలంగాణవాదులను ఆవరించిన నిర్లిప్తతను తొలగించడం కూడా అంతే అవసరం.
తెలంగాణవాదుల్లో కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్య త ఈ రెండు శక్తులదే. అందుకు కరీంనగర్ సమావేశాల్లో కేసీఆర్ చెప్పినట్టు ఒకటే మార్గం- ఒకవైపు రాజకీయ సమీకరణ, మరోవైపు ఉద్యమ కార్యాచరణ. ఇవి రెండూ సమాంతరంగా, పరస్పరాక్షిశితంగా సాగాలి. రాజకీయ శక్తులు ఒక గొడుగుకింద సమీకృతం కావాలి. తెలంగాణ ఉద్యమ శక్తుల సంఘటిత వేదికలను మళ్లీ తెలంగాణ ప్రజలముందు ఆవిష్కరించాలి. ఆ వేదికలపై కేసీఆర్, కోదండరాం, స్వామిగౌడ్, గద్దర్, బాల్కిషన్...అందరూ కనిపించాలి. ఊరూవాడా ధూం ధాంలతో మారుమోగి పోవాలి. తెలంగా ణ రాజకీయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకునే దిశగా సాగిపోవాలి. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు మన చేతుల్లో ఉండాలి. సీమాంధ్ర పార్టీల చేతుల్లో, సీమాంధ్ర నాయకత్వాల చేతుల్లో కాదు. కడుపుమండిన కొంతమంది తెలంగాణవాదులు మిలిటెంట్ పోరాటాలు చేయలేమా అని ప్రశ్నిస్తున్నారు. సాయుధ పోరాటాలు, వీధి పోరాటాలు ఎలా ముగుస్తాయో తెలంగాణ ప్రజల అనుభవంలోనే ఉన్నది. రెండు సాయుధ పోరాటాలు, అనేక వీధి పోరాటాలు వేలాది మంది తెలంగాణ బిడ్డలను బలితీసుకున్నాయి. ఆ పోరాటాల్లో కొన్ని మౌలిక ఫలితాలు సాధించారు. సామాజిక మార్పుకు పునాదులు వేశారు. కానీ అంతిమంగా ఎవరు విజయం సాధించారు? రాజ్యమే. రాజ్యం చేతికి మన ప్రాణాలు చిక్కకుం డా తెలంగాణ సాధించుకునే మార్గం ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి? సీట్లూ, ఓట్లూ సమీకరించడం ఉద్యమంలో భాగమే. ప్రజాస్వామ్యంలో అదే బలమైన ఆయుధం. రాజకీయంగా మనపై ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులను బొందపెట్టడానికి అంతకు మించిన అవకాశం మరొకటి ఏముంది?
kattashekar@gmail.com