జరిగింది చాలు, జరగాల్సింది చూద్దాం


Sat,October 20, 2012 12:53 AM

kattaఎనభై నాలుగేళ్ల పెద్దాయన ఒకరు సోమవారం అకస్మాత్తుగా ఆఫీసుకు వచ్చారు. చరిత్ర అధ్యాపకునిగా ఉద్యోగ విరమణ చేశారు. చరివూతపై అనేక పుస్తకాలు రాశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి. వణుకుతున్న చేతులతోనే ఒక వ్యాసం రాసుకువచ్చారు. ఎక్కడో ఎల్‌బి నగర్ కామినేని ఆస్పత్రి దగ్గరి నుంచి 250 రూపాయలు ఆటో చార్జీ పెట్టుకుని బంజారాహిల్స్‌లోని ‘నమస్తే తెలంగాణ’ ఆఫీసుకు వచ్చారు. ఆయన గళం మాత్రం వచ్చినప్పటి నుంచి ఆవేశంతో, బాధతో అనర్గళంగా మోగుతూనే ఉన్నది. ‘బాబూ నాకు చాలా ఆందోళనగా ఉంది. ఢిల్లీ ముందు కేసీఆర్ ఓడిపోతారేమోనని భయమేస్తున్నది. కోదండరామ్, కేసీఆర్ రచ్చకెక్కుతారేమోనని దిగులు కలుగుతున్నది. ఎవరి పద్ధతిలో వారు ఇద్దరూ తెలంగాణ కోసమే కొట్లాడుతున్నా రు.ఎందుకిలా తగవులాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. పెద్దవావ్లూవ రూ ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ల మధ్య ఎవరూ ఎందుకు సంధి కుదర్చడం లేదు?...’ ఆయన ఆవేదనకు అంతు లేదు. తనకు షుగర్ ఉంది. అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా ఏదో చేయాలన్న ఆరాటం. ఏదో చెప్పాలన్న తాపవూతయం.

గజిబిజిగా రాసుకువచ్చిన వ్యాసాన్ని ఆసాంతం డిక్టేట్ చేశారు. ఇక ఆకలేస్తున్నది, వెళ్లిపోతానన్నారు. భోజనం తెప్పిస్తానంటే వద్దన్నారు. కారులో దింపే ఏర్పాటు చేస్తానంటే ఒప్పుకోలేదు. మళ్లీ 250 రూపాయలకు ఆటో మాట్లాడుకుని వెళ్లిపోయారు. నాకైతే మనసు వికలమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆ ఫలాలు అనుభవించే వయసు కాదు. ఏ పార్టీలూ, పదవులతో సంబంధం లేదు. తెలంగాణ రావాలన్న ప్రగాఢ వాంఛ తప్ప మరో ధ్యాస ఏదీ లేదు. ఇది ఆయన ఒక్కడి బాధ కాదు. లక్షలాదిమంది తెలంగాణ ఉద్యమకారుల్లో మసలుతున్న బాధ. తేదీలు మారిపోతున్నాయి. నెలలు గడచిపోతున్నాయి. పరిస్థితులు చేజారి పోతున్నాయి. యూపీఏ ప్రభుత్వం నవంబరు చివర్లో ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనో లేక ఫిబ్రవరిలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోనో అవిశ్వాస గండం తప్పించుకుంటుందో లేదో తెలియదు. మధ్యంతర ఎన్నికల గాలులు ముమ్మరంగా వీస్తున్నాయి.మమత, మాయావతి, ములాయం... ఎవరి కారణాలవల్ల వారు ఎన్నికల అదనుకోసం ఎదు రు చూస్తున్నారు. ఆ ఎన్నికల జ్వరం మొదలయితే ఇక తెలంగాణ సమస్య మరికొంతకాలం అటకెక్కినట్టే.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పదేపదే అదేపనిగా చెబుతూ వచ్చిన ‘త్వరలో తెలంగాణ’ అన్నది గోడమీది రాతగా మిగిలిపోయింది. కేసీఆర్ ఎంత గట్టిగా చెప్పినా ఇప్పుడు ఎవరూ నమ్మని పరిస్థితి. ఇప్పటికి ఎన్ని వాయిదాలు చూశామో లెక్కే లేదు. ఎప్పటికప్పుడు ఆశోపహతులు కావడం తెలంగాణ ప్రజల వంతు అయింది.కాంగ్రెస్ కేసీఆర్‌తో ఏం మాట్లాడుతున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఆయన చెబుతూ వచ్చిన ‘అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ’ అన్న మాటలను మాత్రం తెలంగాణ ప్రజలు చాలాసార్లు సీరియస్‌గానే తీసుకున్నారు. కాంగ్రెస్ చర్చలంటూ జరిపితే ఆయనతోనే జరుపుతుందని, ఉద్యమపార్టీ నేతగా ఆయన నిజమే మాట్లాడుతూ ఉండవచ్చని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఇది నాన్నా పులి కథలాగా తయారైంది. ఇప్పుడు తెలంగాణ వస్తున్నదంటే కిందికి మీదికి చూసే పరిస్థితి దాపురించింది. ఆయన మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోని దుస్థితి ఎదురయింది.

తెలంగాణ ఇవ్వనందుకు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. అనవసరమైన ఆశలు కల్పించినందుకు కేసీఆర్‌పై అసంతృప్తి ప్రబలుతున్నది. కేసీఆర్ పాపులారిటీ గ్రాఫ్ గత మూడు మాసాల వ్యవధిలో 60 శాతం నుంచి 40 శాతానికి పడిపోయిందని నిత్యం సర్వేల్లో నిమగ్నమయ్యే ఒక విశ్లేషకుడు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలకు మించి రావని, ఆరేడు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఆరు మాసాల క్రితం ఇవే సర్వేలు టీఆస్‌కు 75 నుంచి 90 దాకా స్థానాలు రావచ్చని తెలిపాయి. పాపులారి టీ గ్రాఫ్ ఎప్పటికప్పుడు మారే మాట వాస్తవం. ఇవ్వాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చునన్నది నిజమే. కేసీఆర్ మళ్లీ జనంలోకి వచ్చి గళం విప్పితే పరిస్థితులు మారవచ్చు కూడా. కానీ ఇప్పటి పరిస్థితి మాత్రం ఇది. ఆయన ఇప్పుడయినా కాంగ్రెస్‌తో తాడో పేడో తేల్చుకోవాలన్నది తెలంగాణవాదుల ఆకాంక్ష. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదలిస్తే అక్టోబరు 31లోపు కేబినెట్‌లో నిర్ణయం చేయాలి. మధ్యంతర ఎన్నికలు వచ్చినా రాకపోయినా బడ్జెట్ సమావేశాల తర్వాత-అంటే మే 2013 తర్వాత, యూపీఏ తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే 2014 ఎన్నికలకు అప్పటికి సరిగ్గా ఏడాది మాత్రమే మిగిలి ఉంటుంది. ఏడాది కాలంలో రాష్ట్రం ఏర్పాటు చేయడం వంటి కీలకమైన నిర్ణయం తీసుకుని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడానికి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ కొద్ది సమయం చాలదు.

ఏం జరిగినా ఈ ఆరు మాసాల వ్యవధిలోనే జరగాలి. రాష్ట్ర విభజన ఆషామాషీ కాదు. కేబినెట్ తీర్మానం చేయాలి. రాష్ట్రపతికి నివేదించాలి. రాష్ట్రపతి ఆ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభకు(ఫర్ చేయాలి) అభివూపాయం కోసం పంపి, దాన్ని తిప్పి పంపడానికి నిర్దిష్ట సమయం ఇవ్వాలి. ఆ తీర్మానం వెనుకకు వచ్చిన తర్వాత శాసనసభ అభివూపాయంతో తిరిగి కేబినెట్‌కు పంపా లి. కేబినెట్ దానిని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపాదించాలి. సాధారణ మెజారిటీతో ఆ తీర్మాణం ఆమోదం పొందాలి. ఇవన్నీ జరగడానికి ముందు కేంద్రం సీమాంధ్ర నాయకులతో చర్చలు జరపాలి. సీమాంధ్ర రాజధాని ప్రదేశం గుర్తించడం, నిర్మాణాలు, ప్యాకేజీలు, ఒప్పందాల గురిం చి వారిని ఒప్పించాలి. ఇవేవీ జరుగకుండా కేంద్ర కేబినెట్ నేరుగా తీర్మానం చేయడం సాధ్యమేనా? ఇప్పటికయితే ఈ సూచనలేవీ లేవు. సీమాంధ్ర నాయకులతో చర్చలు జరుపుతున్న జాడలేవీ కనిపించడం లేదు. పైగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలు పూటకో మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మోసపూరితమైన ఎత్తుగడలతో, ఉత్తుత్తి చర్చలతో కేసీఆర్ విలువైన సమయాన్ని కాజేస్తున్నదేమోనన్న ఆందోళన తెలంగాణవాదులను పట్టిపీడిస్తున్నది. కేసీఆర్ చర్చలపై నమ్మకం పెట్టుకుని ఉద్యమానికి దూరంగా ఉండడం వల్ల తెలంగాణ సమాజంలో ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది. రాజకీయ శక్తుల పునరేకీకరణ ఆగిపోయింది. అక్కడక్క డా అరకొర ఉద్యమాలు తప్ప తెలంగాణ వ్యాప్తంగా శ్రేణులను కదిలించే కార్యాచరణ ఏదీ లేకుండాపోయింది. ఉద్యమ నిర్మాణం నిలిచిపోయింది. విలీనం మాట ముందుకు వచ్చింది మొదలు శ్రేణులు జావగారిపోయాయి. పొరపాటున మధ్యంతర ఎన్నికలు వస్తే ఎదుర్కొనే ఎన్నికల సన్నద్ధత ఆ పార్టీలో కొరవడింది. ఇంతకాలంగా టీఆస్‌లో చేరదామని ఉవ్విళ్లూరిన కాంగ్రెస్, టీడీపీ తమ్ముళ్లు కొందరు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎక్కడ రాజకీయ శూన్యత ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. 2010లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో ఉన్న ఊపు ఇప్పుడు తరిగిపోయింది. ఆరోజు ఒకేమాట ఒకే బాటగా టీఆస్ వెంట నడిచిన జేయేసీలు ఇప్పుడు నూటొక్క రాగాలు వినిపిస్తున్నాయి. మేధావులు, విద్యావంతులు, అధ్యాపకులు, ఉద్యోగుల్లో ఒక వర్గం ఉద్యమ స్రవంతి నుంచి దూరంగా జరిగిపోతున్నది. బహుశా కాంగ్రెస్ కోరుకుంటున్నది కూడా ఇదే కావచ్చు. కేసీఆర్‌ను బలహీనపరిచే దూరదృష్టితోనే చర్చల నాటకం నడిపిస్తున్నదన్న అనుమానమూ కొందరిలో లేకపోలేదు. ఉద్య మం ఇలాగే కునారిల్లి, 2008లో 17 నియోజకవర్గాల ఉప ఎన్నికల నాటి ‘తటస్థ వాతావరణమే’ ఇప్పుడు కూడా పునరావృతమయితే ఇక తెలంగాణను ఎవరూ కాపాడలేరు. ఆ ఎన్నికల్లో 17 స్థానాలను టీఆస్, కాంగ్రెస్, టీడీపీలు పంచుకున్నట్టే వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు పంపకానికెళ్తె తెలంగాణవాదం తెల్లారిపోయినట్టే.

ఇంకోవైపు తెలంగాణవాదం నుంచి దృష్టి మళ్లించేందుకు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, అధికార కాంగ్రెస్‌లు చేయని యాత్రలు లేవు, వేయని పాత్ర లు లేవు, విసరని వలలు లేవు, ఇవ్వని హామీలు లేవు. టీఆస్, తెలంగాణ ఉద్యమం ఇంకా దూకుడుగా ఉండవలసిన అవసరం మునుపటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. కానీ మబ్బుల్లో నీటిని చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకున్నట్టు టీఆస్ కాంగ్రెస్ మాయలో పడి తెలంగాణ శక్తులను ఏకం చేసే చొరవను వదిలేసుకుంటున్నది. తెలంగాణ వేదికలకు దూరమవుతున్నది. తెలంగాణ శక్తులకు కేంద్రబిందువుగా వ్యవహరించవలసిన పార్టీ ఎవరో పిలిచినట్టు పక్కకు జరిగిపోతున్నది. ఇది తెలంగాణకు నష్టదాయకం. తెలంగాణ కాంగ్రెస్‌మంత్రులు, నేతలు టీటీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వీళ్లెవరూ తెలంగాణకోసం చొరవ తీసుకునే అవకాశం లేదు. వాళ్లు కిరణ్‌కుమార్‌డ్డి చేతిలోనో, చంద్రబాబు చేతిలోనో లేక జగన్ మోహన్‌డ్డి చేతిలోనో కీలుబొమ్మలు.వాళ్లు మౌలికంగా సీమాంధ్ర నేతల వద్ద రాజకీయ బానిసత్వానికి అలవాటు పడినవాళ్లు. వాళ్లిచ్చే టిక్కెట్లు, వాళ్లు విదిల్చే ఎన్నికల నిధులపై ఆధారపడేవాళ్లు. వాళ్లు స్వతంవూతించి తెలంగాణకోసం చావోరేవో తేల్చుకుందామని సాహసించే అవకాశం లేదు. వాళ్ల ద్వారా తెలంగాణ వచ్చినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. ఎటొచ్చీ టీఆస్ ఒక్కటే నిలబడాలి. కొట్లాడాలి. అది వదిలేస్తే తెలంగాణకు తీరని నష్టం. తెలంగాణ నేలకున్న పాపమో శాపమో తెలియదు. ఇక్కడ ‘ఇగో’ల సంఘర్షణ ఎక్కువ. చీలికలు పేలికలు కాకుండా ఏ ఉద్యమమూ కొనసాగ లేదు. తొలుత కమ్యూనిస్టు ఉద్యమం చీలి చీలి, కూలిపోయింది. సిద్ధాంతాల కంటే నాయకుల అహంభావాలే కమ్యూనిస్టులను ఛిన్నాభిన్నం చేశాయి.

ఎన్ని పార్టీలు అవతరించాయో చెప్పలేం. తర్వాత 1969 నాటి తెలంగాణ ఉద్యమమూ అలాగే చీలి కూలి రాలిపోయింది. ఇప్పుడు పదేళ్లుగా జరుగుతున్న ఉద్యమంలోనూ తెలంగాణ నేతలు ఒక్కటయిన సందర్భాలు అరుదు. ఎవరికి వారే యము నా తీరే. ఎవరూ ఎవరినీ నమ్మరు. తెలంగాణకు ఇప్పుడు వందలు, వేలాది మంది నాయకులు. కానీ కలసి కొట్లాడరు. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలకంటే ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న తాపవూతయమే ఎక్కువ. రాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంవూతులమవుదామని కాంగ్రెస్ నాయకులు కాచుక్కూచుంటే, చంద్రబాబు, షర్మిల యాత్రల ద్వారా మోక్షం పొందాలని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కోసం ఏదైనా చేద్దామన్న తెగింపు వీళ్లెవరికీ లేదు. కేసీఆరే మళ్లీ అన్ని శక్తులను ఏకం చేసే పెద్దన్న పాత్ర పోషించాలి. తెలంగాణ ఇస్తారో చస్తారో తేల్చుకొమ్మని ఢిల్లీకి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలి. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చేదాకా అక్టోబరు 31 తర్వాత తిరిగి ఢిల్లీ గడప తొక్కబోమని స్పష్టం చేయాలి. కార్యక్షేవూతంలో దూకి తెలంగాణ శ్రేణులను కదిలించాలి. తెలంగాణ శక్తులను ఒకే తాటిపైకి తీసుకురావాలి. తెలంగాణ ఇవ్వడం ఇవ్వకపోవడం కాంగ్రెస్ సమస్య. కొట్లాడడం మన ధర్మం. విలీనం ఇక అప్రస్తుతం, అసంగతం. మొన్న 18 మంది ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీని నడవనివ్వలేదు. రేపు 70 మందో 80 మందో ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు తెలంగాణవాదులు గెలిస్తే హైదరాబాద్‌లో సీమాంధ్ర సర్కారు ఎలా నడుస్తుంది? తెలంగాణను అప్పుడెవరు ఆపగలరు? ఇక నుంచి ప్రతి అడుగూ ఆ దిశగా పడాలి.

[email protected]

387

KATTA SHEKAR REDDY

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,May 4, 2019 11:42 PM

ఒక్క పొద్దు కావాలి

భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడ

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ

Published: Mon,March 18, 2019 10:59 AM

అవినీతిలో దేశముదుర్లు

వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొత్త వివాదాన్ని జోడించింది. ఎవరు చే

Published: Mon,March 11, 2019 03:44 PM

ఎంత పతనం చంద్రబాబూ?

కేంద్రం, తెలంగాణ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు రాజకీయ భాషన

Published: Wed,March 6, 2019 12:50 PM

ఆర్భాట రాయుళ్లు, అబద్ధాల యుద్ధాలు

బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్ప డం వంటి లక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రధాని నరేంద్ర మోదీకి చాలా